Saturday 13 June 2015

skipping - Weight control

బరువు నియంత్రణలో స్కిప్పింగ్‌


- శరీర బరువును తగ్గించాలన్నా, ఊబకాయాన్ని నివారించాలన్నా శరీరం మరింత దృఢతరంగా ఉండాలన్నా, చాలామంది డైట్‌ కంట్రోల్‌ చేస్తుంటారు. ఇలా చేసినంత మాత్రాన బరువు తగ్గటం లేదా ఊబకాయం తగ్గటం లాంటివి కొద్దిరోజుల వరకే తగ్గినట్లుగా అనిపించినా, మళ్లీ యధాస్థితికి చేరుకుంటుంది. కాబట్టి చిన్నప్పుడు ఆడుకున్న తాడాట ఆడితే తప్పనిసరిగా బరువ్ఞను నియంత్రించుకోవచ్చు. 
ఊబకాయాన్ని కూడా నివారించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.skipping
- వయసు పెరిగిపోయింది కదా ఇంకా చిన్నపిల్లలా గెంతడమెందుకుని ఏమరుపాటుగా ఉండకండి. స్కిప్పింగ్‌ చేస్తే శరీరం బరువు దానంతటదే తగ్గి చాలా నాజూకుగా తయారవుతారు.

- రోజూ స్కిప్పింగ్‌ చేయడం వల్ల శరీరం దృఢత్వాన్ని సంతరించుకోవడంతో పాటు పూర్తిస్థాయిలో ఫిట్‌గా తయారవ్ఞతుంది. ఎముకలు గట్టిపడడం, చర్మంపై ముడతలు తొలగిపోతాయి.

- పాదాలకు రక్షణ లేకుండా స్కిప్పింగ్‌ చేయడం వల్ల కాలు భాగం నొప్పి చేయడంతో పాటు పగుళ్లు ఏర్పడతాయి. 

ముఖ్యంగా కాంక్రీట్‌ నేలపై స్కిప్పింగ్‌ చేసే సందర్భంలో బూట్లు వేసుకోవడం మంచిది. బరువు తగ్గించడంలో స్కిప్పింగ్‌ కీలక పాత్ర పోషిస్తుంది. స్కిప్పింగ్‌ ప్రారంభించే ముందు 5 నిమిషాల పాటు వార్మ్‌అప్‌ చేయటం వల్ల శరీరం ఉల్లాసంగా ఉంటుంది.

No comments:

Post a Comment