telugu Home making tips













































స్వచ్ఛమైన తేనెను గుర్తించాలంటే!
Description: http://www.prajasakti.com/images/line_content.jpg
Description: స్వచ్ఛమైన తేనెను గుర్తించాలంటే!

                  నిత్యజీవితంలో తేనె మనకు ఎంతగానో ఉపకరిస్తుంది. మార్కెట్లలో వివిధ రకాల బ్రాండ్లతో తేనె మనకు అందుబాటులో ఉంది. అయితే పేరుపొందిన బ్రాండ్లలో మాత్రమే స్వచ్ఛమైన తేనె దొరుకుందనుకోవడం తప్పు. అలాంటి వాటిలో కూడా స్వచ్ఛతలో తేడాలు వచ్చే అవకాశం లేకపోలేదు. అందుకే తేనెను ఉపయోగించే ముందు దాని స్వచ్ఛతను ఎలా తెలుసుకోవాలో చూద్దాం.
తేనె చుక్కలను గ్లాసు నీటిలో వేయాలి. స్వచ్ఛమైన తేనె అయితే నీటిలో వెంటనే కలవదు. గడ్డలుగా ఉండిపోతుంది.
దూదిని తేనెలో ముంచి దానిని కాల్చాలి. కాలితే తేనె స్వచ్ఛమైనది. లేకపోతే తేనెలో నీరు ఉందని అర్థం.
బ్లాటింగ్ పేపర్పైన తేనె చుక్క వేయాలి. మంచి తేనె అయితే కాగితం దానిని గ్రహించదు.
సాధారణంగా తేనె స్వచ్ఛమైనది కాకుంటే పుల్లటి వాసన వస్తుంది. అంతేకాదు అలా వాసన వచ్చే
వాటిలో వ్యర్థాలు స్పష్టంగా కనిపిస్తాయి. మంచి తేనె తేలికపాటి వాసనను కలిగి ఉంటుంది.
గులాబీల రక్షణ కోసం 


కావలసినవి: ఉల్లిపాయ ఒకటి , వెల్లుల్లి రెబ్బలు, రెండు కప్పుల నీరు, గరాటు, స్ర్పే బాటిల్‌, పాత నైలాన్‌ వస్త్రం.
తయారీ విధానం: ఒక గిన్నెలో ఉల్లిపాయ, వెల్లుల్లి, రెండు కప్పుల నీరు తీసుకొని కలపాలి. ఈ మిశ్రమాన్ని మరొక గిన్నెలోకి నైలాన్‌ వస్త్రం సహాయంతో వడపోయాలి. ఇలా వేరుచేసుకున్న ద్రావణాన్ని గరాటు ద్వారా స్ర్పే బాటిల్‌లో పోసుకోవాలి. ఆ తరువాత పురుగులపై చల్లాలి. అది కూడా ఆకులకు పైనా కింద స్ర్పే చేయాలి. చల్లే ముందు బాటిల్‌ని గట్టిగా ఊపాలి.
దోమలకు చెక్‌ 


కావలసినవి: పది చుక్కల సిట్రోనెల్లా ఎసెన్షియల్‌ ఆయిల్‌, పది చుక్కల లెమన్‌ గ్రాస్‌ ఆయిల్‌, ఐదు చుక్కల టీ మొక్కలనుంచి తీసిన ఆయిల్‌, ఐదు చుక్కల లావెండర్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌, గరాటు, పెద్ద కప్పు ఒకటి స్ర్పే బాటిల్‌.
తయారీ విధానం: పైన చెప్పిన అన్ని రకాల ద్రవాలను కప్పులోకి తీసుకొని బాగా కలపాలి. ఆ ద్రావణాన్ని గరాటు ద్వారా స్ర్పే బాటిల్‌లో పోసుకోవాలి. దీన్ని ఒక సారి పరీక్షించి, దాని వల్ల ఎటువంటి హానీ జరగదు అని నిర్ధారణ అయిన తరువాతే వాడుకోవాలి. ఈ ద్రావణాన్ని చేతులకు, కాళ్లకు కూడా రాసుకోవచ్చు. కానీ, కళ్లకు మాత్రం తగలనీయకూడదు.
ఇలా చేస్తే నల్లులు మాయం

కావలసినవి: ఉల్లిపాయ సగం, నాలుగు వెల్లుల్లి రెబ్బలు , రెండు కప్పుల నీరు, రెండు చెంచాల మిరియాల పొడి, సగం చెంచాడు ద్రవ రూపంలో ఉన్న గిన్నెల సబ్బు, గరాటు, స్ర్పే బాటిల్‌, పాత నైలాన్‌ వస్త్రం.
తయారీ విధానం: ఒక గిన్నెలో ఉల్లిపాయ, వెల్లుల్లి, నీరు, మిరియాల పొడి, గిన్నెలని కడిగే సబ్బు తీసుకొని కలపాలి. ఈ మిశ్రమాన్ని మరొక గిన్నెలోకి నైలాన్‌ వస్త్రం సహాయంతో వడపోయాలి. ఇలా వేరుచేసుకున్న ద్రావణాన్ని గారాటు ద్వారా స్ర్పే బాటిల్‌లో పోసుకోవాలి. నల్లులు ఎక్కువగా కనపడే ప్రదేశాలలో ఈ ద్రవాన్ని చల్లితే ఇట్టే మాయవుతాయి.

No comments:

Post a Comment