Wednesday 3 June 2015

మొటిమలకు ఇంటి వైద్యం 

పొద్దున్నే ముఖాన్ని అద్దంలో చూసుకుంటే.. రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన మొటిమ వెక్కిరించిందనుకోండి.. చాలా కోపం వస్తుంది. ఒక్కోసారి నిర్లక్ష్యం చేస్తే ముఖం నిండా మొటిమలు వచ్చేస్తాయి. దీంతో బయటికి వెళ్లాలంటేనే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని సమస్యను పోగొట్టుకునేందుకు ఇలాంటి హోమ్‌రెమిడీలను పాటించండి..
 
తులసి: పచ్చటి తులసి ఆకులు, పుదీనా ఆకులు కలిపి.. గట్టిగా నలిపి పిండితే రసం వస్తుంది. ఆ రసానికి రెండు మూడు చుక్కల నిమ్మరసం కలపాలి. అలా తయారుచేసిన మిశ్రమాన్ని మొటిమల మీద రాస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
 
వేపాకు : ముదురు వేపాకు ఆకులు, తులసి ఆకులను మరిగే నీటిలో వేసి బాగా ఉడకబెట్టాలి. నీళ్లు తక్కువ ఉండేలా చూసుకుంటే మంచిది. బాగా ఉడికిన తరువాత ఆ నీటిని చల్లబరిచి.. దాంతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే.. మొటిమలు పెరగవు. ముఖం మీద కూడా ఎటువంటి అలర్జీలు రావు.
 
ఐస్‌: శుభ్రంగా ఉతికిన పొడిగుడ్డను తీసుకుని అందులో ఐస్‌ ముక్కల్ని వేసి మడత పెట్టి దాన్ని మొటిమల మీద కాసేపు ఉంచాలి. కొంచెం విరామం తరువాత మళ్లీ అలానే చేయాలి. అదే రోజు పడుకునేప్పుడు దూది ఉండలను నిమ్మరసంలో తడిపి.. ముఖాన్ని డీప్‌ క్లీన్‌ చేసుకోవాలి.

No comments:

Post a Comment