Wednesday 3 June 2015

chintha chese melu

‘చింత’ తీరుస్తుంది ఇలా..! 

చింతచెట్టు వైపు చూడగానే నోరూరుతుంది... గుత్తులు గుత్తులుగా చెట్టునిండా వేలాడే చింతకాయలు పిందె దశ నుంచి పండిన కాయలుగా మారేదాకా ఒక్కో దశలో ఒక్కో రుచినిస్తుంటాయి. చింతకాయను పచ్చళ్లు, కూరల తయారీకి వాడుతుంటారు. చింత కాయలలో ఉండే గుణాలు, లాభాల గురించి తెలుసుకుందాం..
 
ఔషధ గుణాలు...
చింతచిగురు, పిందెలు, కాయలు గుల్ల(పండిన) కాయలు, ఎండు చింత అన్ని ఉపయోగమే. చింత గుజ్జులో జీర్ణక్రియ, కూలింగ్‌, లాక్సేటివ్‌, యాంటీసెప్టిక్‌ గుణాలుంటాయి. గ్యాస్ర్టిక్‌, జీర్ణసంబంధిత సమస్యలకు ఆయుర్వేదంలో చింతపండును వాడుతారు. ఉదరంలో ఉండే నులిపురుగుల్ని చింత ఆకు నశింప చేస్తుంది. జాండిస్‌ గలవారికి ఇదీ ఔషధం లాంటిది. చింత కలప గట్టిగా ఉండి, ఇళ్ల కట్టడాలకు, ఫర్నిచర్‌గా బాగా పనికొస్తుంది. గన్‌ పౌడర్‌కు బొగ్గుగా ఉపకరిస్తుంది.
 
జీర్ణ వ్యాధులు...
పండిన చింతకాయలు నుంచి పైపెంకు, గింజ తిసి ఎండబెట్టి చింతపండు తయారు చేస్తారు. గుజ్జు వికారం, మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలను నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నీటిలో నానబెట్గి గుజ్జు పిండుకోవాలి. ఆకలి మందగించినప్పుడు, ఆహారం తినాలన్న కోరిక నాశించినప్పుడు ఇది ఉపకరిస్తుంది.
 
కాలిన గాయాలకు...
చింతచిగురు కాలిన గాయాలకు ఉపయుక్తమైన చికిత్స. ఆకుల్ని సెగపై కాల్చి పొడి చేసి జల్లించి, నువ్వుల నూనెతో కలిపి కాలిన గాయాలపై రాయాలి. కొద్దీ రోజుల్లోనే గాయం మారుతుంది. చింత ఆకులు నలిపి నీటిలో వేసి, కషాయం తయారు చేసి జాయింట్లు మడమలపై రాస్తే నొప్పుల వాపు తగ్గుతాయి.
 
స్కర్వీ...
ఈ వ్యాధి మిటమిన్‌ సీ వల్ల కలుగుతుంది. చర్మంపై మచ్చలు ఏర్పడుతాయి.చిగర్లు మెత్తబడి, రక్తం వస్తుంది. మచ్చలు ఎక్కువగా తోడలు, కాళ్లపై కనిపిస్తాయి. ఈ వ్యాధి గల పేలవంగా, నిస్సత్తువగా ఉంటారు. చింతపండు గుజ్జులో మిటమిన్‌ సీ అధికంగా ఉండి స్కర్వీ నివారిస్తుంది.
 
సాధారణ జలుబు...
చింతపండు, మిరియాల రసం జలుబు, దగ్గులకు మంచి దక్షిణాది సూప్‌. దీనిని దక్షిణ భారతీయులు ఎక్కువగా తయారు చేసుకుంటారు. చింతపండు పిండిన నీరు పోసి టీ స్పూన్‌ మిరియాల పొడి వేసి తాలింపు పెడితే నోటికి రుచిగా ఉంటుంది. జ్వరం నుంచి కోలుకున్నప్పుడు జీర్ణశక్తినిస్తుంది.
 
విరేచనాలు...
పేగులు ముఖ్యంగా కలోన్‌కు ఇబ్బంది కలిగినప్పుడు బంక వీరేచనాలవుతాయి.ఒక్కోసారి రక్తం కూడా పడుతుంది. జ్వరం, కడుపు నొప్పి వస్తుంది.చికిత్స చేయకుండా వదిలిస్తే సమస్య పెరుగుతుంది. చింతపండు పానీయం చికిత్సగా ఉపకరిస్తుంది.
 
గొంతులో మంట...
గొంతులో గురగురలాడుతున్నట్టుంటే చింతపండు నీటిలో పుక్కిలిస్తే మంచి ఫలితం ఉంటుంది. నీటిలో చింతపండు వేసి బాగా మరిగించి తయారు చేసుకోవాలి. ఎండు చింత ఆకులు పొడిని కూడా పుక్కిలించుకోవడానికి వాడుకోవచ్చు. భారతీయ ఆహారంలో చింతకాయ పచ్చడి ప్రసిద్ది గాంచింది. చింతచిగురు పప్పు రుచి చూడాల్సిందే.
 
చింత గింజలు ఎంతో మేలు...
చింత పండు నుంచి తీసిన గింజలు సౌడు భూముల్లో పోస్తారు. దీంతో పంట దిగుబడి అధికంగా వస్తుంది. అంతేకాకుండా గింజల నుంచి మెదక్‌ జిల్లా సిద్దపేట లో రంగులను(కుంకుమ) తయారు చేస్తారు.

No comments:

Post a Comment