అరటితో ఆరోగ్యానికి మేలు!
ఇటాలియన్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో రోజూ మూడు అరటి పండ్లను తినేవారిలో హృద్రోగ సమస్యలు తగ్గుముఖం పట్టాయని తెలిసింది. రోజూ ఉదయం అల్పాహారం అయ్యాక, మధ్యాహ్నం భోజనానంతరం, రాత్రి భోజనం తర్వాత ఇలా రోజుకు మూడు అరటి పండ్లు తినడం వల్ల శరీరంలోని పొటాషియం శాతాన్ని తగ్గించుకోవచ్చు. మెదడు, రక్త సంబంధింత రోగాలను 21 శాతం వరకు నివారించవచ్చునని పరిశోధకులు వెల్లడించారు. నట్స్, పాలు, చేప వంటి పొటాషియంతో కూడిన ఆహారం తీసుకోవడం కంటే ఈ పద్ధతి పాటిస్తే మంచిదని చెబుతున్నారు. అలాగే గుండెపోటు, రక్తపోటు, వంటివాటిని చాలా వరకు తగ్గించుకోవచ్చుని తెలిపారు. శరీరంలో పొటాషియం శాతం తగ్గించి, గుండెపోటును నియంత్రించుకునేందుకు అరటి పండ్లు మంచి మార్గం అని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
No comments:
Post a Comment