Tuesday 30 June 2015

Indian mutton curry recopies

బెండకాయ మటన్‌



కావలసిన పదార్థాలు
బెండకాయలు-అర కిలో
మటన్‌-అరకిలో, నెయ్యి-2 టేబుల్‌ స్పూన్లు,
జీలకర్ర- టీ స్పూను, దాల్చిన చెక్క-2 అంగుళాల ముక్క, నల్ల యాలకులు-నాలుగు
మిరియాలు-పది, ఉల్లిపాయలు-రెండు 
పచ్చి మిర్చి-నాలుగు, అల్లం వెల్లుల్లి-2 టీ స్పూన్లు, పసుపు-అర టీ స్పూను, ఉప్పు-రుచికి సరిపడా, ధనియాల పొడి-2 టీ స్పూన్లు
కొత్తిమీర తురుము-4 టేబుల్‌ స్పూన్లు
టొమాటోలు- రెండు,నూనె-2 టేబుల్‌ స్పూన్లు
కారం- టీ స్పూను, గరం మసాల పొడి-టీ స్పూన్లు, కొత్తిమీర తురుము- 4 టేబుల్‌ స్పూను
తయారు చేయి విధానం
బెండకాయలు కడిగి తొడిమలూ, చివర్లూ తీసేసి ఒకవైపున చీల్చినట్లుగా గాటు పెట్టాలి. ఓ బాణలిలో నూనె వేసి మిగిలిన జీలకర్ర వేసి వేగాక బెండకాయలు వేసి వేయించి ఉంచాలి. ప్రెషర్‌ కుక్కర్‌లో నెయ్యి వేసి కాగాక అర టీ స్పూను జీలకర్ర దాల్చిన చెక్క, నల్ల యాలకులు, మిరియాలు, ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరువాత చీల్చిన పచ్చిమిర్చి, మటన్‌ ముక్కలు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి ,ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి. మంచినీళ్ళు పోసి ఓ సారి కలిపి ఓ పది నిమిషాలు ఉడికించాలి. తరువాత టొమాటో గుజ్జు, కారం, గరం మసాలా వేసి కలపాలి. ఇప్పుడు కొత్తిమీర తురుము వేసి ఉప్పు సరిచూసి కుక్కర్‌ మూత పెట్టి ఓ విజిల్‌ రానివ్వాలి. మంట తగ్గించి సిమ్‌లో ఇరవై నిమిషాల పాటు ఉడికించి దించాలి.


చైనీస్‌ మటన్‌ బాల్స్‌
కావలసిన పదార్థాలు
బోన్‌లెస్‌ మటన్‌ కీమా- అరకిలో
కోడిగుడ్లు-రెండు, సోయా సాస్‌-టేబుల్‌ స్పూను, పంచదార-టీ స్పూను
ఉప్పు-టీ స్పూను, పచ్చి మిర్చి-ఆరు
చైనీస్‌ క్యాబేజీ తురుము- అర కప్పు
మైదా పిండి-పావు కప్పు,
చైనీస్‌ సాల్ట్‌-పావు టీ స్పూను
తయారు చేయి విధానం
కీమాను ఉడికించి ఉంచాలి. కోడిగుడ్ల సొనను బాగా గిలకొట్టాలి. అందులో సోయా సాస్‌, పంచదార వేసి బాగా కలపాలి. తరువాత ఉడికించిన కీమా, పచ్చిమిర్చి తురుము, క్యాబేజీ తురుము వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఉప్పు చైనీస్‌ సాల్ట్‌, మైదాపిండి వేసి కలిపి ఉండలుగా చేయాలి. బాణలిలో నూనె పోసి కాగాక ఈ ఉండల్ని వేసి వేయించి తీయాలి. వీటిల్లోకి కాస్త గ్రేవీ కావాలనుకుంటే విడిగా బాణలిలో కొద్దిగా నూనె వేసి ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరువాత చిల్లీ సాస్‌, కొత్తిమీర తురుము వేసి అందులోమటన్‌ బాల్స్‌ కలిపి అందించాలి.


కొల్హాపురీ మటన్‌ తంబడా రస్సా
కావల్సిన పదార్థాలు
మటన్‌-కేజీ, కారం- టేబుల్‌ స్పూను, నూనె-కప్పు,
టొమాటోలు-రెండు, ఉల్లిపాయలు- నాలుగు 
కొత్తిమీర-కట్ట,అల్లం వెల్లుల్లి పేస్టు-రెండు చెంచాలు
పసుపు-పావు టేబుల్‌ స్పూను
ఉప్పు-తగినంత, నువ్వులు-రెండు టేబుల్‌ స్పూను
యాలకులు-నాలుగు, కొబ్బరి తురుమ - రెండు టేబుల్‌ స్పూన్లు, ధనియాల పొడి-టేబుల్‌ స్పూను
జీలకర్ర పొడి- టేబుల్‌ స్పూను,మిరియాలు-ముప్పావు చెంచా, దాల్చిన చెక్క-పెద్ద ముక్క,
లవంగాలు -నాలుగైదు,గసగసాలు-టేబుల్‌ స్పూను
నెయ్యి-రెండు టీబుల్‌ స్పూన్లు
తయారు చేయి విధానం
బాణలిలో నూనె లేకుండా నువ్వులు, యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలూ, గసగసాలు వేయించుకోవాలి. తరువాత మెత్తగా పొడిచేసి పెట్టుకోవాలి. అలాగే టొమాటోలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, తాజా కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుము మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి అల్లం వెల్లుల్లి పేస్టు వేయించుకోవాలి. అందులో ముందుగా వేసుకున్న మసాలా పొడి వేయాలి. తరువాత కొబ్బరి మిశ్రమం వేయాలి. పచ్చి వాసన పోయాక మటన్‌ ముక్కలు తగినంత ఉప్పు వేసి మూత పెట్టేయాలి. మటన్‌ మెత్తగా ఉడికాక ధనియాల పొడి జీలకర్ర పొడి, కారం వేసి కలిపి దింపేస్తే సరిపోతుంది. ఇది బిర్యానీ, రొట్టెల్లోకి చాలా బాగుంటుంది.


చింత చిగురు మాంసం
కావాల్సినపదార్థాలు
చింతచిగురు-అరకిలో మాంసం ( చికెన్‌ లేదా మటన్‌) ,అరకిలో కొబ్బరి తురుము: 2 టీ స్పూను, కొత్తిమీర- కట్ట,ధనియాల పొడి-టీ స్పూన్లు
అల్లంవెల్లుల్లిముద్ద- టీ స్పూను, జీలకర్ర- టీ స్పూను, పుదీనా-కట్ట ,ఆవాలు-టీ స్పూను
నూనె-టేబుల్‌ స్పూను, ఉల్లిపాయ- ఒకటి
కారం -2 టేబుల్‌ స్పూను, ఉప్పు-రుచికి సరిపడా
పసుపు-చిటికెడు, గరం మసాలా-టీ స్పూను
తయారు చేయి విధానం
నాన్‌స్టిక్‌ పాన్‌ తీసుకుని నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిముక్కలు కూడా వేసి అవి వేగాక, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. తరువాత కొబ్బరి తురుము వేసి ఓ నిమిషం వేయించాలి. ఇప్పుడు మటన్‌ లేదా చికెన్‌ ముక్కలు వేసి ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు పోసి కలపాలి. తరువాత ధనియాల పొడి, కారం కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మాంసం ఉడికే వరకూ ఉంచాలి. ఉడికిన తరువాత చింత చిగురు వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. చివరగా గరం మసాలా వేసి ఓ నిమిషం ఉంచి దించాలి.

No comments:

Post a Comment