Wednesday 6 May 2015

telugu = usiri tho sweet


మురబ్బా

  • :
కావాల్సినవి :
ఉసిరి ముక్కలు - 1 కేజీ
పంచదార - 1/2 కేజీ
బెల్లం - 1 కేజీ
నెయ్యి - 100 గ్రా.
యాలకులు - 12
ఎండుకొబ్బరి - 1/2 కప్పు
మిరియాలు - 2 చెంచాలు
జీలకఱ్ఱ - 5 చెంచాలు
జీడిపప్పు - 24
ఉసిరి ముక్కలు కడిగి, తుడిచి ఎండలో ఆరనివ్వాలి. ఆ తర్వాత వీటిని మిక్సీ పట్టాలి. మిరియాలు, జీలకఱ్ఱ, ఎండుకొబ్బరి, యాలకులు నేతిలో వేయించి విడిగా మిక్సీ పట్టాలి. పెద్ద గినె్నలో సరిపడా నీళ్ళు (2 గ్లాసులు) తీసుకుని బెల్లం పొడి, పంచదార కరిగించి తీగ పాకం రానిచ్చి అందులో మిరియాలు, జీలకఱ్ఱ, ఎండుకొబ్బరి, యాలకుల పొడి, వెయ్యి వేసి బాగా కలపాలి. నెయ్య రాసిన పళ్లెంలో జీడిపప్పు సర్ది ఈ మిశ్రమం పోసి ఆరబెట్టాలి. చల్లారాక ముక్కలుగా చేసుకుని డబ్బాలో పెట్టుకోవాలి. ఇలా చేసిన ఉసిరి మురబ్బా కొన్ని నెలల పాటు చెడిపోకుండా నిల్వ ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం ఒక మురబ్బా ముక్క తింటే ఆరోగ్య రీత్యా మంచిది

No comments:

Post a Comment