|
పరగడుపునే వెల్లుల్లి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఎప్పటికప్పుడు పరిశోధనలు రుజువు చేస్తూనే ఉన్నాయి. వెల్లుల్లి ఎందుకు తినాలంటే..
- ఇది నాచురల్ యాంటీ బయాటిక్‌గా పనిచేస్తుంది. అల్పాహారం తినకముందే రెండు వెల్లుల్లిపాయల్ని తింటే.. కడుపులోని చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. పొద్దున్నే తినడం వల్ల వెల్లుల్లికి ఈ శక్తి ఎక్కువ.
- కాలేయం, పిత్తాశయం పనితీరును మెరుగుపరిచే రసాయనాలు వెల్లుల్లిలో ఉన్నాయట. కడుపులోని సమస్యల్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా జీర్ణప్రక్రియల్ని చురుగ్గా ఉంచడంతోపాటు వ్యర్థాలను బయటికి పంపే ప్రక్రియకు దోహదపడుతుంది వెల్లుల్లి. ఆకలిని కూడా పెంచుతుంది. - మానసిక ఒత్తిళ్లు, డిప్రెషన్, గ్యాసి్ట్రక్ సమస్యలకు చక్కటి విరుగుడు. కొన్ని రకాల కేన్సర్ల నిరోధానికి కూడా పనికొస్తుంది. - న్యుమోనియా, ఆస్తమా, దగ్గు, బ్రాంకైటిస్, లంగ్ ఇన్‌ఫెక్షన్స్ వంటి వాటికి అడ్డుకట్ట వేస్తుంది. టీబీ బాధితులు కూడా తప్పనిసరిగా వెల్లుల్లిని తింటే మంచిది. - అయితే వెల్లుల్లితో ఇన్నేసి ఉపయోగాలు ఉన్నప్పటికీ - కొందరికి ఇది తింటే పడదు. చర్మం మీద అలర్జీ వస్తుంది. ఇంకొందరికి శరీరం ఉన్నట్లుండి వేడి చేస్తుంది. తలనొప్పికూడా వస్తుంది. ఇటువంటి వాళ్లు వెల్లుల్లిని తినకూడదు. |
No comments:
Post a Comment