Tuesday 12 May 2015

Food that helps the growing nails beautifully - telugu tips

ఈ ఐదింటితో మీ గోళ్లు మిల మిల...

చేతి గోళ్లు అందంగా కనపడాలంటే మెనిక్యూర్‌ ఒక్కటే మార్గం కాదు. గోళ్ల పైభాగం అందంగా కనిపించాలంటే వాటి లోపలి భాగం కూడా ఆరోగ్యంగా ఉండాలి. సమతులాహారం తీసుకుంటే గోళ్లు ఆరోగ్యంగా...దృఢంగా ఉంటాయి. అందంతో మెరిసిపోతాయి.
 
లివర్‌ తింటే మంచిది....
ఐరన్‌ లోపం ఉంటే గోళ్లు చిట్లిపోతాయి. అందుకే మాంసాహారులు లివర్‌ బాగా తినాలి. లివర్‌లో గోళ్లకు కావలసిన ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. శాకాహారులైతే పాలకూర, కాయధాన్యాలు, బీన్స్‌, బెల్లం వంటివి తినాలి. వీటిల్లో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇవి ఎక్కువగా తినడం వల్ల గోళ్లు చిట్లకుండా ఆరోగ్యంగా ఉంటాయి.
 
చేప...
చేపలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ బాగా ఉంటాయి. అంతేకాదు చేపలో కావాలసినన్ని ప్రొటీన్లు, సల్ఫర్‌ కూడా ఉంటాయి.. మకేరల్‌, సాల్‌మాన్‌ వంటి చేపల్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి గోళ్లకు కావాల్సిన తేమను అందిస్తాయి. అంతేకాదు సన్నగా, బలహీనంగా ఉండే గోళ్లను బలంగా, మృదువుగా తయారుచేస్తాయి. ఫాస్ఫరస్‌, సల్ఫర్‌ రెండూ గోళ్లను గట్టిగా, దృఢంగా ఉంచుతాయి.
పాల ఉత్పత్తులు...
గోళ్లల్లో కెరటిన్‌ అనే ప్రొటీన్‌ ఉంటుంది. పెరుగు, పాలు, వెన్న లాంటి పాల ఉత్పత్తుల్లో కాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గోళ్లల్లో ఉండే కెరటిన్‌కు మరింత దోహదకారులుగా పనిచేస్తాయి. కాల్షియం, బయొటిన్‌లు గోరు పైభాగాన్ని పటిష్టంగా ఉంచుతాయి. గోళ్లు చిట్లిపోకుండా కాపాడతాయి.
తెల్ల సొన...
తెల్లసొన పోషకాల నిలయం. ఇది గోళ్లల్లో ఉండే కెరటిన్‌ని పటిష్టంగా తయారుచేస్తుంది. తెల్లసొనలో బయొటిన్‌ కూడా అధికపాళ్లల్లో ఉంటుంది. గుడ్డును ఉడకబెట్టి అందులోని తెల్లసొనను తింటే గోళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.
 
గింజలు...
జింకు లోపం చాలామందిలో చూస్తుంటాం. దీనివల్ల గోళ్లు ఎంతో బలహీనంగా ఉండి ఇట్టే చిట్లిపోతుంటాయి. అంతేకాదు గోళ్ల పైభాగంలో చిన్న చిన్న తెల్లటి మచ్చలు కూడా వస్తాయి. ఇవి రాకుండా, గోళ్లు బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం గుమ్మడిగింజలు, నువ్వు గింజలు, ఓట్స్‌ తింటే మంచిది. వీటిల్లో జింకు బాగా ఉంటుంది

No comments:

Post a Comment