|
ఒకప్పుడు భూమిపై రాక్షస బల్లులు ఉండేవని అందరికీ తెలుసు. కానీ, వాటితో పాటు బొద్దింకలు కూడా ఉండేవని ఈ మధ్యే తెలిసింది. పదికోట్ల సంవత్సరాల వయస్సున్న బొద్దింక శిలాజనమూన ఒకటి మయాన్మార్‌లోని నోయిజీ బమ్ వర్ద ఉన్న గనుల దగ్గర బయటపడింది. అంతరించిన భక్షో కీటకాల్లో ఒక కొత్త వర్గానికి చెందినదిగా శాస్త్రవేత్తలు దాన్ని గుర్తించారు. ఇప్పుడున్న బొద్దింకల్లాగే అది కూడా రాత్రివేళల్లో సంచరిస్తుండేదని వారు తెలిపారు. మనం చూస్తున్న బొద్దింకలు పాడైన ఆహారం, పుస్తకాలు, వెంట్రుకల్లో ఆహారం కోసం వెతుకుంటుంటే పదికోట్ల సంవత్సరాల క్రితందైన ఆ బొద్దింక మాత్రం వేటాడడడం ద్వారా ఆహారాన్ని సంపాదించుకునేదని శిలాజనమూనా పరిశీలనలో తేలింది. దానికి పొడవాటి మెడ ఉండడంవల్ల తలని సులభంగా తిప్పగలిగేదనీ, దానికి ఇప్పటి కీటకాలకున్నట్లు పొడవాటి కాళ్లు కూడా ఉన్నాయని తెలిసింది. ఆ శిలాజనమూనా సరీసృపాల చివరిదశ నాటిదని (6కోట్లు నుంచి 13కోట్ల సంవత్సరాల మధ్యకాలంలోది) స్లోవేకియాలోని భూగర్భ పరిశోధనా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త పీటర్ వాసన్‌స్కీ, జర్మనీలోని స్టేట్ మ్యూజియం ఆఫ్ నాచురల్ హిస్టరీకి చెందిన శాస్త్రవేత్త గున్‌టర్ బెబ్లీ తెలిపారు. అప్పట్లో ఉన్న బొద్దింక జాతుల్లో కేవలం ఒక జాతి మాత్రమే ఇప్పుడుందని వారు తెలిపారు.
|
No comments:
Post a Comment