Tuesday 12 May 2015

Eating little is good for health


అర్ధాకలి మంచిదే!

  • -
  • :
*సుష్టుగా తింటే సమస్యలే *పనినిబట్టి ఆహారం
* శ్రమను బట్టి శక్తి అవసరం
రోజంతా కష్టపడి పనిచేసే పెద్దవారికి సమారు 2,400 కేలరీల శక్తినిచ్చే ఆహార పదార్థాలు కావాలి. ఆఫీసులో ఉద్యోగాలు చేసేవాళ్ళకు సుమారు 1800 కేలరీలు సరిపోతాయి.
మన దేశ జనాభాలో 30 శాతం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. గర్భిణీలకు, చిన్నపిల్లలకు, వ్యవసాయ కూలీలకు అవసరమైన పోషకాహారం దొరకడం లేదు. హెల్త్ ఇండిసిస్ ప్రకారం మార్బిడిటీ రేటు మోర్టాలిటీ రేటు శిశు మరణాల సంఖ్య సగటు వయసులో మనం వెనుకబడి ఉన్నాం. ఇతర దేశాల్లో ఆడవాళ్ళ సగటు జీవన వయస్సు ఎక్కువ. మగవాళ్ళకి తక్కువ. మన దగ్గర ఆడవాళ్ళ జీవన ప్రమాణం తక్కువ. మగవాళ్ళ ప్రమాణం ఎక్కువ. వీరిలో చాలామంది సరైన ఆహారం, ప్రసవానంతర జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ప్రతి వ్యక్తి తను చేసే పనిని బట్టి తగినన్ని కేలరీలను ఇచ్చే ఆహారం తీసుకోవాలి. రాళ్ళు కొట్టేవాళ్ళు, బండ పనులు చేసేవాళ్ళు వాస్తవానికి ఇంకా ఎక్కువ కేలరీలు ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. కాని వాళ్ళకు మామూలు ఆహారం కూడా దొరకని స్థితిలో ఉన్నారు. వీళ్ళ తర్వాత మోడరేట్ వర్కర్స్, లైట్ వర్కర్స్ వస్తారు. వీళ్ళకి శారీరక శ్రమ తక్కువ కాబట్టి తక్కువ తిన్నా సరిపోతుంది.
మన దేశంలో మగవాళ్ళకు 1800 కేలరీలు రెండు లేక మూడు పూటలా ఆహారం కావాలి. స్ర్తిలకు రోజుకు 1600 కేలరీలు కావాలి. ఆహారంలో ప్రొటీన్లు, కొవ్వులు, పిండి పదార్థాలతోబాటు నీళ్ళలో కరిగే విటమిన్లు (విటమిన్ బి, సి) కొవ్వులలో కరిగే విటమిన్లు (డి.ఎ.ఇ) తీసుకోవాలి. నీళ్ళలో కరిగే విటమిన్లు ఎక్కువైనా అంత ప్రమాదం లేదు. మూత్రం ద్వారా వెళ్లిపోతాయి. క్రొవ్వులలో కరిగే విటమిన్లు ఎక్కువ తీసుకోవటం మంచిది కాదు. నీళ్లశ్ళ విరేచనాలు, తలనొప్పి, కళ్ళు తిరగడం జరగవచ్చు. వీటితోపాటు మైక్రో న్యూట్రియంట్స్, మినరల్స్ కూడా లభించాలి. మినరల్స్, ఐరన్, కాల్షియమ్, కాపర్, బోరాన్, సిలికాన్, మాలిబ్డినమ్ మొదలైనవి కనీస స్థాయిలో ఆహారంలో లభించాలి. ఇవి తీసుకోకపోతే రకరకాల జబ్బులురావచ్చు. ఒక లెక్క ప్రకారం మనిషిలో ఏదో విధంగా 34 రకాల విటమిన్లు, మినరల్స్, మైక్రో న్యూట్రియంట్స్ లభించే పరిస్థితి ఉండాలి.
మైక్రో న్యూట్రియంట్స్ శరీరంలో ఉండే కణాలలో జరిగే రసాయనిక ప్రక్రియలో భాగంగా జరిగే ఆక్సిడేషన్, రిడక్షన్‌లలో అవి ఎంజైములకు కో ఎంజైములకు సహాయకారులుగా కేటలిస్టులుగా పనిచేస్తాయి. ఇవి ఏ మాత్రం దొరకని ఆహారం తీసుకునే వ్యక్తి పలు రకాల చిన్న చిన్న రుగ్మతలలో బాధపడుతుంటాడు.
ఉదాహరణకు తొందరగా తలమీద జుట్టు ఊడడం, చిన్నతనంలోనే వెంట్రుకలు తెల్లబడటం, బలమైన ఆహారం తీసుకుంటున్నప్పటికి అవి శరీరంలోకి ప్రవేశించక త్వరగా నిస్సత్తువకు లోనవడం జరుగుతుంది. ఇవేకాక తెల్ల నల్ల మచ్చలు చర్మంమీద పడడం చర్మం ముడతలు పడడం, చర్మం మందంగా మారడం లాంటి వ్యాధులు రావచ్చు. సాధారణంగా ఈ మైక్రోన్యూట్రియంట్స్ అనేవి మనం తినే ఆహారంలో ఉంటాయి. ఇవి మనం వండే విధానం, తినే పద్ధతి, జీర్ణక్రియ, ఎనిమిలేషన్ మీద ఆధారపడతాయి. అందుచేత ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారం మొలకెత్తిన గింజలు, అనాస, సీతాఫలం లాంటివి, కాయగూరలు, డ్రైఫ్రూట్స్ బాగా తినాలి. డ్రైఫ్రూట్స్‌లో ఎక్కువ బలం ఉంటుంది. అంటే తక్కువ మోతాదులో ఎక్కువ శక్తి.
ఒక్కో పదార్థం శరీరానికి ఒక్కో విధంగా కేలరీలను ఇస్తుంది. చాలా తక్కువ మోతాదులో ఉన్నటువంటి క్రొవ్వు పదార్థం దానికన్నా అనేక రెట్లు ఎక్కువగా తీసుకున్నా పిండి పదార్థాలు, ప్రొటీన్స్ ఇచ్చే శక్తికి సమానమవుతుంది. అందుకే చాలామంది వైద్యులు క్రొవ్వులు, రకరకాల నూనెలు తక్కువ మోతాదులో తీసుకోమంటారు. ఆహారం, వయసు, లింగభేదం, చేసే పనిమీద వారికి కావలసిన శక్తి ఆధారపడి ఉంటుంది. ఒక్క లెక్క ప్రకారం రోజంతా కష్టపడి పనిచేసే పెద్దలకు సుమారు 2400 కేలరీల శక్తినిచ్చే ఆహార పదార్థాలు కావాలి.
అదేవిధంగా ఆఫీసులో ఉద్యోగాలు చేసేవాళ్ళకు సుమారు 1800 కేలరీలు సరిపోతాయి. చాలామందిలో ఆహార పదార్థాల విషయంలో ఒక అపోహ ఉంది. అదేమిటంటే పాలు, గుడ్లు, మాంసం, పాల ఉత్పత్తులు.. ఇవి చాలా పుష్టినిచ్చే పదార్థాలని భావిస్తారు. ఈ విషయంలో అమెరికా నాసా శాస్తవ్రేత్తలు విస్తృతమైన పరిశోధనలు నిర్వహించి కొన్ని ఆశ్చర్యకరమైన విశేషాలు అందజేశారు.
వాళ్ళు చెబుతున్న దానిని బట్టి ఆహారం తిన్న ఎలుకలకన్నా అర్థాకలితో ఉన్న ఎలుకల ఆయుష్షు 30 శాతం పెరిగింది. రోజు మనం తినే పెరుగు అన్నం అన్నిటికన్నా చాలా శ్రేష్టమైనది. ప్రకృతి సిద్ధంగా లభించే తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. పెరిగే వయసు వరకు పౌష్టికాహారం ఉండాలి. ఆ తర్వాత శరీర విధులను నిర్వహించడానికి అవసరమైన కేలరీలు చాలు. తక్కువ ఆహారంలో ఎక్కువ కేలరీలు వచ్చే ఆహారం తీసుకోవాలి. మైక్రోన్యూట్రియంట్స్ ముఖ్యంగా ఉండాలి. లోకాలరీ ఆహారం మంచిది. పలు రకాల పోషక విలువలున్న ఆహారమే కాకుండా శరీరానికి అవసరమయ్యే విటమిన్, మినరల్ కల ఆహారం శరీర ఆరోగ్యానికి మంచిది.

No comments:

Post a Comment