Wednesday 20 August 2014


కీళ్లనొప్పి పోయేది ఎలా?

ప్రశ్న - జవాబు
========
ప్రశ్న: నా వయసు 36 సం.లు. నేను ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాను. నా బరువు 60 కేజీలు. కాళ్లు, చేతులు నీరు పట్టి, నొక్కితే గుంటలు పడతాయి. కీళ్లు వాపును కలిగివుండి నొప్పి పెడతాయి. నాకు చల్లని వాతావరణం, చన్నీటి స్నానం హాయిగా ఉంటాయి. నాకు రెండు సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది. దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపగలరు.
కమల, ఖమ్మం
జ: మీ సమస్యకు ‘ఎపిస్’ అనే మందు సరిపోతుంది. ఈ మందును 200 పోటెన్సీలో మీరు 15 రోజులకు ఒక్కసారి ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున మూడు నెలలపాటు వాడగలరు. అలాగే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. కాల్షియం ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. పాలు, గుడ్లు, పెరుగు వంటివి తీసుకోవాలి. పాదరక్షలు సౌకర్యవంతంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఒకేచోట ఎక్కువసేపు కూర్చోవడం నివారించుకోవాలి. నొప్పి తీవ్రత తగ్గించుకోవడానికి అతిగా పెయిన్ కిల్లర్‌ను వాడకూడదు. నీరు సరిపడినంతగా త్రాగాలి. తాజా కూరగాయలు నిత్యం ఆహారంలో ఉండే విధంగా తీసుకోవాలి. *

No comments:

Post a Comment