Thursday 28 August 2014

గృహార్వణము

  • 08/06/2014
  • |
  • -వాస్తు విశారద ఉమాపతి బి.శర్మ
ఇల్లు నిర్మించే సమయంలో యజమాని నక్షత్ర (నామ నక్షత్రము) రాశి, రీత్యా స్వస్థానాలు కొన్ని ఉంటాయి. స్థూలం గా యజమాని పడక గది నైరుతి దిశలో ఉండాలి అనే వాస్తు సూత్రమూ ఉంది. నామ నక్షత్ర రాశికి, ఈ స్థూల సూత్రం విరుద్ధమైతే ఏం చేయాలి అనేదీ చాలా కీలకమైన ప్రశ్న. అంతే కాదు సమాధానం పరస్పర ఖండనగా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడే వాస్తు శాస్తజ్ఞ్రుని ఉపజ్ఞ అంటే టాలెంట్ ఆవిష్కృతవౌతుంది. ఉదా. వృషభ రాశి ఆగ్నేయ దిశ జన్మరాశి రీత్యా స్వస్థానం - వర్గకాకిణుల రీత్యా ‘కామేశ్వరరావు’ వ్యవహార నామం అయిందనుకోండి - అప్పుడు జన్మరీత్యా, వ్యవహార నామరీత్యా, స్థూల వాస్తు రీత్యా కూడా ఆగ్నేయం - నైరుతి - రెండూ అనుకూల స్థానాలే కాబట్టి - ఒక సౌకర్యం - అట్లా కాక వ్యవహార నామము ధర్మారావు జన్మ నక్షత్రము వృశ్చికము అయినదనుకోండి అప్పుడు స్థూల వాస్తు సూత్రం ప్రకారం నైరుతి ప్రతికూల దిశ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? నైరుతి దిశలోనే దక్షిణము తలగడ పెట్టి పడుకోవాలి. త వర్గంలో వచ్చే నకారానికి దక్షిణము అర్వణమవుతుంది - నకారం వృశ్చిక రాశిలోనికి వస్తుంది కనుక ఉత్తరం ధన ధాన్య సమృద్ధిని కలిగిస్తుంది. అంతేకాక లేవగానే ఉత్తరాన్ని చూడటం పడుకునే ముందు ఉత్తర దిశగా ప్రార్థన చేసుకోవటం శుభం కలిగిస్తుంది. అందుకే వాస్తు శాస్తజ్ఞ్రునికి సమన్వయ ప్రతిభ అత్యవసరం. అట్లాకాక కేవలం శాస్త్రాన్ని ఏకపక్షంగా గుడ్డిగా అనుసరిస్తే ఫలితాలు తప్పు కావటం ద్వారా శాస్త్రానికి చెడ్డపేరు రావటం జరుగుతుంది. ఈ సందర్భంలో మరో విషయాన్ని కూడా గమనించాలి.
సాధారణంగా వాస్తు పండితులు ఇంట్లో దేవతా గృహాన్ని ఈశాన్య దిశలో పశ్చిమ ముఖంగా ఉంచటం - యజమాని తూర్పు ముఖంగా కూర్చుని ప్రార్థన కాని, పూజ కాని చేయటం నిర్దేశిస్తున్నారు. ఇది చాలా పొరపాటు పద్ధతి. ఈశాన్య దిశ వేరు ఈశాన్య కోణం (మూల) వేరు. మరో విషయం ఎప్పుడూ ఆరాధనీయుడు. పూజనీయుడూ, గౌరవనీయుడూ తూర్పు ముఖంగా ఉండాలి. ఆరాధించే వాడు, గౌరవించేవాడు, అతనికి అభిముఖంగా ఉండాలి. ఆ సందర్భంలో పశ్చిమ దిశా న్యాయం వర్తించదు. ‘దైవ ప్రాచ్య’ దిశా న్యాయం వర్తిస్తుంది అంటే అభిముఖంగా ఉన్నాడు కనుక ఆ న్యాయం వర్తిస్తుంది. అంటే కిర్త కూడా అద్దంలోని ప్రతిబింబ పద్ధతిలో తూర్పుగా ఉన్నట్టుగానే వర్తిస్తుంది. అదే దైవ ప్రాచ్యం - ఈ సందర్భంలో మంత్ర శాస్త్ర నియమాలను కూడా తెలుసుకొని ఉండాలి. ఆ విషయాలు వచ్చే సంచికలో చర్చిద్దాం. *
సమస్య - సమాధానాలు
వేదాంతం రాఘవాచార్య (కాంచీపురం)
ప్రశ్న: ఇంట్లో కాని ఆఫీసుల్లో గాని, అదే పనిగా దేవుని చిత్రపటాలు పెట్టుకోవటం, కాలెండర్లుగా ముద్రించటం తప్పు కాదా?
జ: పరిమిత సంఖ్యలో దేవతా చిత్ర పటాలు ఉంటే ఫరవాలేదు. ముఖ్యంగా విష్ణు దేవుని పటం - లక్ష్మీదేవి పటాలు ఉదయమే చూడటం శుభం. మంగళప్రదం. దేవతా పటాలు కాలెండర్లుగా ముద్రించటం డాలర్లుగా చేసి మెడలో వేసుకోవటం హిందూ మతానికి పట్టిన అతివ్యాప్తి దోషం. అంతేకాదు దేవతా క్షేత్రాలను అదే పనిగా దర్శించడం కూడా సరియైనది కాదు. ‘అతి స్నేహాదవజ్ఞా’ సంస్కృత సూక్తి ‘ఫెమిలారిటీ బ్రీడ్స్ కంటెమ్ట్’ ఆంగ్ల సూక్తి.
ఎన్.ఎస్. (వైజాగ్)
ప్రశ్న: తిరుమల, షిర్డీ వంటి దేవస్థానాలు ప్రసిద్ధి పొందటానికి వాస్తు కారణమా?
జ: అవి దేవర రహస్యాలు. బయటపెట్టటం చర్చించటం మంచిది కాదు. దుష్టులకు పాయింట్ అందించినట్టవుతుంది.

No comments:

Post a Comment