Saturday 30 August 2014

ఉద్యోగులకు ‘యాంటీసె్ట్రస్‌?
ఆఫీసు పని ముగించుకుని బయటపడ్డాక కూడా ఆఫీసు నుంచి ఫోన్లు, ఇ-మెయిల్స్‌ వస్తున్నాయా? వాటి నుంచి బయటపడలేక, వ్యక్తిగత సమయాన్ని వదులుకోలేక విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారా? మిగతా దేశాల్లో సంగతేమో కాని జర్మనీలో అయితే ఇటువంటి పరిస్థితి నుంచి ఉద్యోగుల్ని బయటపడేసేందుకు ‘‘యాంటీస్ర్టెస్‌’’ చట్టాన్ని అమలుచేసే యోచనలో ఉందక్కడి ప్రభుత్వం. ఇప్పటికే అక్కడి కంపెనీల్లో కొన్ని దీన్నో పాలసీగా అమలుచేస్తున్నాయి కూడా.
ఇంతకీ ఈ యాంటీస్ర్టెస్‌ చట్టం ఏం చెప్తుందంటే.... కార్యాలయాల్లో పనిగంటలు ముగించుకుని బయటపడ్డాక కూడా పనికి సంబంధించిన ఫోన్లు లేదా మెయిల్స్‌ ద్వారా సదరు ఉద్యోగిని ఇబ్బంది పెట్టకూడదు. పనివేళలు ముగిశాక కూడా ఆఫీసు పని మీ వెంటపడడానికి ప్రధాన కారణం స్మార్ట్‌ఫోన్లు. వీటి పుణ్యాన ఉద్యోగులు ఎల్లప్పుడూ ఆన్‌లైన్‌లో కనిపిస్తుంటారు. దాంతో పనివేళలు పూర్తయ్యాక కూడా కంపెనీలు మెయిల్‌ పంపడమో, ఫోన్‌ చేయడమో చేస్తున్నాయి. దీనివల్ల ఉద్యోగులు 24గంటలు ఆఫీసు పనిచేస్తున్నట్టే భావిస్తున్నారు. ఒత్తిడికి గురవుతున్నారు. ఇది అటు కంపెనీకి, ఇటు ఉద్యోగికి ఇద్దరికీ మంచిది కాదని జర్మనీ ప్రభుత్వం యాంటీస్ర్టెస్‌ చట్టం ఏర్పాటుచేస్తామంటోంది. ఇదిలా ఉంటే యుకెలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. అక్కడ పనివేళలు ముగిశాక కూడా ఉద్యోగులకు ఆఫీసు వ్యవహారాలకి సంబంధించిన ఇ-మెయిల్స్‌ వెళ్తూనే ఉంటాయి. మెయిల్స్‌ వస్తే రానివ్వండి మీరు మాత్రం సాయంత్రాలు, వారాంతాలు వాటికి దూరంగా ఉండడమే బెటర్‌ అంటున్నారు మానసిక నిపుణులు. అంతేకాదు మీరు కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటుంటే కనుక ఈ విషయాలు ఆచరించండని కొన్ని సలహాలు కూడా ఇస్తున్నారు. ఆఫీసు పనివేళలు పూర్తయ్యాక ఆఫీసు వ్యవహారాల గురించి ఇ-మెయిల్‌ చేయొద్దని సహోద్యోగులకు, కంపెనీ వారికి చెప్పండి. ఇంట్లో ఉన్నప్పుడు స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్లకు దూరంగా ఉండండి. ఆఫీసు వర్క్‌ ఇ-మెయిల్స్‌ కోసం వేరే మెయిల్‌ ఐడి ఏర్పాటుచేసుకోండి. మొత్తంమీద చెప్పొచ్చేదేమిటంటే పనివేళలు పూర్తయ్యాక ఆఫీసు పనిని పార్సిల్‌ కట్టి పక్కన పడేయండి.

No comments:

Post a Comment