Saturday 30 August 2014

పోషకాహారమే రక్ష


  • 21/08/2014
ఇంటి పనులు, ఆఫీసు పనులతో సతమతమయ్యే
మహిళలు పౌష్టికాహారం తగు మోతాదులో తీసుకుంటే వారు అలసట, అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు. కొంతమంది ఉద్యోగినులు హడావుడిగా నాలుగు మెతుకులు తినేసి ఆఫీసుకి టైమ్ అయిపోయిందని పరుగుపెడుతుంటారు. మరికొంత మంది కాఫీ, టీలతోనే సరిపెట్టేసుకుంటారు. ఇలాంటివి తాత్కాలిక ఉత్సాహాన్ని ఇచ్చినా వాటి ప్రభావం దీర్ఘకాలంలో కానీ బయటపడదు. పురుషుల కంటే భిన్నమైన బాధ్యతలతో సతమతమయ్యే మహిళలకు పౌష్టికాహారం ఎంతో అవసరం. మంచి ఆహారపు అలవాట్లతో ఉద్యోగినులు తమ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆకలిని తీర్చుకోవటానికి అనారోగ్యకర ఆహారాన్ని తీసుకోకుండా జాగ్రత్త పడాలి. పౌష్టికాహారం వేటిల్లో లభిస్తుందో అవగాహన పెంచుకోవాలి.
గోధుమలు :
గోధుమలతో తయారుచేసిన పదార్థాలను తీసుకుంటే ఫైబర్ (పీచు) ఎక్కువగా లభిస్తుంది. బ్రౌన్ రైస్‌లో కూడా పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. గోధుమ రొట్టెలు తీసుకుంటే జీర్ణాశయ సమస్యలు తలెత్తవు. గర్భాశయ క్యాన్సర్, జీర్ణకోశ వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. శరీరానికి సరిపడా శక్తినిచ్చే క్యాలరీలు గోధుమల్లో లభిస్తాయి.
బ్లూ బెర్రీస్స్ :
వయసు తక్కువగా కనబడాలనుకుంటే రోజూ బ్లూబెర్రీ పండ్లను తీసుకోవాలి. ఇవి మతిమరుపును తగ్గిస్తూ, రక్తపోటు రాకుండా కాపాడుతాయ. అనామ్లజనికాలు ఉత్పత్తి అయి శరీరంపై ముడతలు రాకుండా చేస్తాయి.
ఓట్స్ :
బ్రేక్‌ఫాస్ట్‌గా ఓట్స్ తీసుకుంటే ఆ రోజంతా ఉల్లాసంగా గడుపుతారు. ఇవి కొలెస్ట్రాల్‌ను రాకుండా చేస్తాయ. ఓట్స్ తినటం వల్ల ఆకలి వేయదు, బరువు పెరగరు. కొలెస్ట్రాల్, జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయ.
వాల్‌నట్స్ :
వాల్‌నట్స్‌తో ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్, యాసిడ్స్ వంటివి సమకూరుతాయి. ప్రతిరోజూ గుప్పెడు వాల్‌నట్స్ తీసుకుంటే కొలెస్ట్రాల్ రాకుండా కాపాడుతోంది. మెదడు చురుగ్గ పనిచేస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గి, తగినంత నిద్ర పడుతుంది. గుండె సంబంధమైన సమస్యలు దరిచేరవు.
ఆపిల్ :
పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆపిల్ అనేక అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. రోజూ ఒక ఆపిల్ తింటే ఎలాంటి రోగాలూ దరిచేరవని వైద్య నిపుణులు చెబుతుంటారు. మెదడుకు శక్తిని అందిస్తాయ. ఆకలి వేసినపుడు ఆపిల్ తింటే అదనపు శక్తి లభిస్తుంది.
మంచినీరు :
కావల్సినంత నీరు తీసుకోకపోతే ఎన్నో రకాల జబ్బులు మనల్ని చుట్టుముడతాయి. తగినంతగా నీరు తాగితే ఎక్కడలేని శక్తి వస్తోంది. శరీరాన్ని కాంతివంతంగా ఉంచడంలో, చెడు కణాలను బయటకు పంపడంలో మంచినీటిది కీలక పాత్ర. ప్రతిరోజూ 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగితే జీర్ణశక్తి పెరగటమే కాదు అధిక బరువు సమస్య దూరమవుతుంది.
అవిసె గింజలు :
ఆహారంలో అవిసె గింజలను తీసుకుంటే కొవ్వు సంబంధమైన యాసిడ్స్ విడుదల కావు. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణప్రక్రియ సజావుగా సాగుతుంది. శరీరం నుంచి వేడిని తొలగించడంలో, కొలెస్ట్రాల్ పెరగకుండా కాపాడడంలో ఇవి మేలు చేస్తాయ. రొమ్ము క్యాన్సర్‌ను నివారించుకోవచ్చు.
డార్క్ చాకొలెట్ :
డార్క్ చాకొలెట్లను తింటే గుండె సంబంధ సమస్యలు రావు. ఎముకలను పటిష్టంగా ఉంచటానికి అవసరమైన మ్యాంగనీస్, కాపర్, జింక్, పాస్ఫరస్ వంటివి పుష్కలంగా లభిస్తాయ. మతిమరుపు సమస్య తగ్గుతుంది.
క్యారెట్ :
కంటి జబ్బులు రాకుండా విటమిన్-ఎ క్యారట్‌లో పుష్కలంగా లభిస్తోంది. పొటాషియం వల్ల రక్తపోటు తగ్గిస్తోంది. క్యాన్సర్ రాకుండా కాపాడుతోంది. శరీరం కాంతివంతంగా ఉంటుంది.
అరటి పండ్లు :
వీటిని తింటే శరీరంలోని అన్ని భాగాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. మెదడునకు తగినంత ఆక్సిజన్‌ను అందుతుంది. వీటిలో విటమిన్లు, మినరల్స్, పిండి పదార్థాలు లభిస్తాయి. మలబద్ధకం సమస్య రాదు. పేగులను శుద్ధిచేయడంలో అరటి పండు దోహదం చేస్తుంది.
పాలు :
పాలు అందరికీ బలవర్థకమైన ఆహారమైనప్పటికీ మహిళలకు ఎంతో అవసరం. పాలలో కాల్షియం, విటమిన్ బి12, పొటాషియం పుష్కలంగా లభిస్తాయ. శరీరాన్ని చల్లబడనీయకుండా ఉంచుతుంది. ఎముకలు, దంతాలను గట్టిపడేలా చేస్తోది. రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ నివారణకు పాలు తాగడం మంచిది.
టమాటాలు :
పండిన టమాటాలను తినవచ్చు లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. గుండె సంబంధ సమస్యలు తలెత్తకుండా రక్షిస్తాయి.

No comments:

Post a Comment