Thursday 28 August 2014




NewsListandDetails మైగ్రేన్‌ నిరోధించేందుకు చిట్కాలు
- ప్రతిరోజూ నియమానుసారం వ్యాయామం. ప్రతిరోజూ కావలసినంత నిద్ర
- విశ్రాంతితో పాటు వత్తిడిని తగ్గించుకోవడం
- లైటు వెలుగును మార్పు చేసుకోండి. చాలా అధికమైన వెలుగు తీవ్రమైన మైగ్రేన్‌ శిరోవేదనకు కారణమౌతుంది.
- అధికమైన వేడితోపాటు మసాలా వంటలు, పులిసిన పదార్థాలతో చేసిన వంటలను తినడం మానాలి.
- పులుపు, వగరు పళ్లు తినడం మంచిది.
మైగ్రేన్‌ లక్షణాలు తెలియగానే...
ఆయుర్వేదంలో మైగ్రేన్‌ శిరోవేదనకు ప్రత్యేకమైన చికిత్స కలదు. మైగ్రేన్‌ శిరోవేదనకు ముందు లక్షణాలు ప్రస్ఫుటం కాగానే వెంటనే సరైన చికిత్స ప్రారంభించాలి. శిరోవేదన తీవ్రంగా ఉన్నా కొద్దిపాటిగా ఉన్నా చికిత్సను మాత్రం సమంగానే ప్రారంభించాలి. మైగ్రేన్‌ శిరోవేదనను గుర్తించేందుకు ఒక దినచర్య పట్టికను రాసుకోవడం అవసరం. మైగ్రేన్‌ లక్షణాలు ప్రారంభం కాగానే...
- చీకటి గదిలో నిశ్శబ్దంలో విశ్రాంతి తీసుకోవాలి.
- పళ్లరసాల సేవనం ఎంతో మంచిది. (మైగ్రేన్‌ వల్ల వాంతులు కలిగి ఉంటే పళ్లరసాల సేవనం అత్యవసరం)
- చల్లని గుడ్డను తలపై పెట్టుకోవాలి.
- వాంతులు వచ్చినట్లుగా ఉంటే నిరోధించకూడదు. కొన్నిసార్లు అజీర్ణం వల్ల కూడా మైగ్రేన్‌ రావచ్చు. ఇలాంటి సమయంలో వాంతులు చేసుకోవడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది.
మూలికా చికిత్సలు
- శొంఠిని గంధంలా తయారుచేసుకుని తలకు పట్టించుకొని గంటసేపు విశ్రాంతిగా పడుకొంటే మైగ్రేన్‌ శిరోబాధ సమసిపోతుంది.

No comments:

Post a Comment