తరం-అంతరం (కథ)
- -కొండముది నాగసులోచన
TAGS:
...............
.............
‘నాకు ఈతరం వాళ్ళంటే అస్సలు ఇష్టం లేదు.’
‘ఏం... ఎందుకని...?’
‘ఎందుకంటావేంటి? వాళ్ళకి ఒక పద్ధతి లేదు, పాడూ లేదు. పొదుపూ లేదు, వాళ్ళ బొందా లేదు. ఒక పైసా పెట్టే చోట రూపాయి పెడ్తారు. అదేమంటే అదంతే- నీకేం తెలియదంటారు. అడగ్గూడదు. అ డిగితే రాద్ధాంతం చేశామంటారు. మా కాలంలో ఇలా ఉండేదా? మా నాన్న చనిపోయేదాకా ఆయన దగ్గరే నా కుటుంబం అంతా ఉంచాను. కిక్కురుమనటానికి లేదు. ఒక్క పైసా వెనుకేసుకోలా. ఎప్పుడో గజం రెండు రూపాయలకు కొన్నా ఈ స్థలం. ఇప్పుడిది కోట్లు, కోట్లు చేస్తుందిట! అయినా కలికాలం కాకపోతే భూమి రేట్లు ఏంటి..? ఆకాశాన్నంటుతున్నాయి. ఏదో ఆ రోజుల్లో కాబట్టి రిటైరవంగానే వచ్చిన డబ్బులతో ఈ ఇల్లు కట్టేసా. ఇప్పుడైతేనా.. చాలా అవుతుంది.
ఈ పక్కన ప్లాట్ ఓనరు లేడూ.. వాడికి చాలా పొగరు. వాడేంటి..? ఈ వీధిలో వాళ్ళందరికీ పొగరే. పెద్దవాళ్ళను గౌరవించడం రాదు. అద్సరే.. ఈ పక్కన పింజారీ వెధవున్నాడే, వాడి గురించి నీకు కాస్త చెప్తాను. వాడు ఎవరో కాదు, మా విశ్వనాథం కొడుకే. మా విస్సూ, నేను ఎంత స్నేహంగా ఉండేవాళ్ళం... సాయంత్రం అయిందంటే లోకాభిరామాయణం మాట్లాడుతూ పొద్దు పుచ్చేవాళ్ళం. వాడి కొడుకు,నా కొడుకూ కూడా స్నేహితులే. కానీ, మా విశ్వం హఠాత్తుగా పరలోకయాత్ర చేసాడు. అప్పట్నుంచీ శని మొదలైంది.
ఆ విశ్వం కొడుకు లేడూ.. వాణ్ణి ఈమధ్యకాలంలో చూళ్ళే. అమెరికాలోనే ఉంటున్నాడు. రెండేళ్ళుగా ఇల్లు పాడుపడ్డ కొంపలాగా ఉంది. పట్టించుకున్న నాథుడు లేడు. నాకు బాధేసేది. ఓ రోజు విశ్వం కొడుకూ, వాడి కుటుంబం హఠాత్తుగా వచ్చారు. ఓ మాటా లేదు మంతీ లేదు. రెండేళ్లు ఇంటిని పాడుపెట్టారు కదా, ఓ పూజో ఏదో చేయించుకోవచ్చు కదా... అహా... అదీ లేదు. అన్నింటికీ గొడవ పెడ్తున్నానని నన్నంటారు. ఓ ఇరుగూ పొరుగూ లేదు.
మొన్నటికి మొన్న... ఆ మామిడి చెట్టుంది చూశావా...? దాని పూత, ఆకులు మా లోగిల్లో పడ్తున్నయ్. కాయలన్నీ ఇటే కాస్తున్నయ్. నాకూ, వాడికి సంబంధం లేనప్పుడు వాడి చెత్త నాకెందుకు..? నాకు ఒళ్ళుమండి రోజూ ఆకులు చిమ్మించమన్నా. అదెలా కుదుర్తుంది..? అంటాడు- అంట్ల వెధవ. పనిమనిషిని పెట్టమన్నా. పనిమనుషులు దొరకట్లేదంటాడు. మాటా మాటా పెరిగింది. వాడు పక్కలో బల్లెమైపోయాడు. అందరూ వాడికే.. బోడి సపోర్టు. ఆ గొడవ తర్వాత వాడి కుటుంబమే బయటకు రావటంలా. నా దెబ్బకు పారిపోయినట్లున్నాడు. పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ..!
***
నమస్తే.. నా పేరు వాసు. పైన తిట్ల పురాణం విన్నారే, వారు మా నాన్నగారు. ఆయనంతే... ఆయన మారరు. నాకు, ఆయనకు ఓ తరం తేడా. నా అదృష్టం బాగుంది గనుక మంచి కంపెనీలో అమెరికాలో ఉద్యోగం వచ్చింది. మా పక్కింటి విశ్వనాథంగారి అబ్బాయి మధూ, నేనూ మంచి ఫ్రెండ్స్‌మే. అమెరికాలో కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. హఠాత్తుగా రెసిషన్ పీరియడ్ మామీద భూతంలా దాడి చేసింది. ఏ క్షణాన ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి.
ఓ రోజు వాడి ఉద్యోగం పోయింది. మధు పెద్దగా సంపాదించిందేమీ లేదు. పిల్లలు చదువులకొచ్చారు. ఒక్కసారిగా సమస్యలు చుట్టుముట్టేసరికి వాడు చాలా కుంగిపోయాడు. నేనూ మరికొంతమందిమీ వాడికి ధైర్యం చెప్పాం. అందరి పరిస్థితి అంతే మరి. ఒకరికొకరం ధైర్యం చెప్పుకోవడం, రేపటి గురించి తీయని కలలు కనటం.
మధు ఇండియాకి వచ్చేశాడు. హైదరాబాద్‌లోనే వాడికి ఓ మోస్తరు ఉద్యోగం దొరికింది. తండ్రి కట్టిన ఇల్లు ఎలానూ ఉంది గనుక వెళ్ళంగానే వాడికి పెద్ద బాధేమీ ఉండదనుకున్నాను. పిల్లలకు కూడా సీట్లు దొరికాయి. కానీ, వాడికి మా నానే్న పెద్ద సమస్య అయినాడు. నాకూ ఈ రెసిషన్ పీరియడ్ బాగా దెబ్బతగిలిన మాట వాస్తవమే. అయితే, మా నాన్న స్థితి, మనఃస్థితి తెలిసిన వాడినవటం వల్ల ఒక ఫ్లాట్ ముందే కొనుక్కున్నాను. కాస్త డబ్బు వెనకేసుకున్నాను. ఓ మంచి ఇండియన్ కంపెనీలోకి దూకేసాను. ఈ సంగతులు మా నాన్నకు తెలిస్తే నాలో ఉన్న ధైర్యమంతా నీరుగారిపోయేట్లు తిట్టేస్తాడు. నా కుటుంబంతో నేను అమెరికాలో సుఖంగానే ఉన్నా.
కానీ, ఓ రోజు హఠాత్తుగా మధు పొద్దునే్న ఫోన్ చేసాడు. వాడి బాధ చూస్తే నాకూ బాధ కలిగింది. ముందుగా వాడిని ఫామిలీతో సహా ఆన్‌లైన్‌కి రమ్మన్నా. అందరం సమావేశమయ్యాం. వాడు కళ్ళనీళ్ల పర్యంతమైనాడు. ‘‘ఒరేయ్ వాసూ, మీ నాన్నతో వేగడం చాలా కష్టంరా బాబూ’’ అంటూ ప్రారంభించాడు. ప్రతిదాంట్లో తలదూరుస్తానంటాడు. పైగా మనం ఇరుగు పొరుగు వాళ్ళం. నువ్వు మా విశ్వనాథం కొడుకువి. నా కొడుకులాంటివాడివి.. అనే సెంటిమెంట్ ఒకటి వాడతాడు. నేను ఆయన మాట వినకపోతే మామిడి చెట్టుని సాకుగా చేసుకుని తిడ్తున్నాడ్రా. ఇక్కడ పనిమనుషులు దొరకటం లేదు. మా ఆవిడే పనంతా చేసుకుంటోంది.
కానీ- మీ నాన్న వదలట్లేదురా బాబూ... ఆయన భయానికి మామిడి చెట్టు కొట్టేద్దామనుకుంటున్నా. పోనీ .. సర్దుకుపోదామంటే, మా పిల్లల వస్తధ్రారణ, వాళ్ళ మాటలను కూడా విమర్శిస్తూ తిట్టిపోస్తున్నాడంటూ మధు వాపోయాడు. మా ఆవిడ కలుగజేసుకుని, మా నాన్న అలా ఎందుకు చేస్తున్నాడో ఎనలైజ్ చేసింది.
కన్నకొడుకు కళ్ళముందు లేడు. ఈ తరం వారిని తిట్టడానికి కారణం- బహుశా తన ఉనికికి గుర్తింపు పోతున్నదన్న బాధ కావచ్చు. నేనూ, మా ఆవిడా మధుకి ఇంకొన్నాళ్ళు ఓపిక పట్టమని సలహా ఇచ్చాం. పాజిటివ్‌గా ఉండమని మధుకి సూచించాం. మా నాన్న ప్రవర్తన మారితే సరే, లేకపోతే మధు మరో ఇంటికి తాత్కాలికంగా మారేట్లు నిర్ణయించుకున్నాం. ఇందుకుగాను మధూ, అతడి భార్య పిల్లలు ఏం చెయ్యాలో నిర్ణయించాం. మళ్లీ కలుద్దామని, నాకు ఆఫీస్‌కి టైం అవుతుండడం వల్ల ఆన్‌లైన్‌లో విడిపోయాం.
***
మర్నాడు ఉదయం మధు గేటు తీసుకుని లోపలికి సరాసరి వస్తుంటే మా నాన్న ముఖం చిట్లించి ప్రశ్నార్థకంగా పెట్టాడు. మధు, వాడి భార్య మామిడి ఆకులు శుభ్రంగా ఎత్తి వేశారు. ‘ఇన్నాళ్ళూ మీకు కష్టం కలిగించినందుకు మమ్మల్ని క్షమించండి బాబాయిగారూ..’ అని మధు అంటే మా నాన్న అవాక్కైపోయాడు. రోజూ ఉదయానే్న ఇదే దినచర్య. మధ్యమధ్యలో ‘మావయ్యగారూ..! అత్తయ్యగారు మామిడికాయ పప్పు అమోఘంగా చేస్తారని విన్నాం. ఈ కాయలుంచండి..’ అంటూ మధు భార్య మామిడికాయలిస్తుంటే మా నాన్న మొహమాట పడిపోయి, ‘ఇదుగో.. నేను నీ మీద అరిచానని పెద్దగా మనసులో పెట్టుకోకురా అబ్బీ... నేనూ మా ఆవిడా ఇంత ఇల్లు మెంటెయిన్ చెయ్యలేకే...’ అనేసాడు.
ఆదివారం మధు పిల్లలు ‘తాతయ్యగారూ.. మాకు కొంచెం తెలుగు నేర్పుతారా... ఈ ఇండియన్ హిస్టరీ అర్థం అయ్యేట్లు చెప్పరూ..’ అని అంటుంటే మా నాన్న ఏదో నిధి దొరికినంత ఆనంద పడిపోయి వాళ్ళకోసం మళ్లీ చిన్నవాడైపోయాడు. మధు భార్య తనకున్న సందేహాలను అడుగుతూ, మా అమ్మా నాన్నలకు మరింత దగ్గిరైపోయింది.
ఇప్పుడు మా నాన్నకు, మా అమ్మకూ- ‘అత్తయ్యగారూ, మామయ్యగారూ..’ అని నోరారా పిలిచే ఓ కొడుకు, కోడలూ దొరికారు. ‘తాతగారూ..’ అని పిలిచే మనవడు, మనవరాలు దొరికారు. ప్రస్తుతం మామిడి చెట్టు ఆకులు, పూత మా నాన్నను బాధించడం లేదు. చెట్టుమీద కోకిల కూత మనోహరంగా ఉంది. నేను కూడా సమస్య అలా పరిష్కారమైనందుకు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాను.

No comments:
Post a Comment