వైద్యోనారాయణోహరిః (కథ)
- - కొడుకుల సూర్య సుబ్రహ్మణ్యం (సూర్యశ్రీ)
- 17/08/2014
TAGS:
ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం విధి వక్రీకరించడంతో శర్మ చేతివేళ్లకి ఏదో మాయరోగం వచ్చింది. కుడి చేతి వేళ్లలో భరించలేనంతగా మంటలు పుట్టడంతో తల్లడిల్లిపోతున్నారు. స్థానికంగా పేరుగడించిన మంచి డాక్టర్ శంకర్‌ని కలిసారు. మంచికి మారుపేరై సేవా దృక్పథంతో సామాజిక స్పృహ నేపథ్యంగా ప్రజారోగ్యమే ప్రధాన లక్ష్యంగా ఎంతో మందికి ఎనలేని వైద్య సేవలందించిన మహోన్నత వ్యక్తి ఆయన. అలా ఆయన వైద్య సేవలందుకున్న అశేష ప్రజానీకంలో శర్మ ఒకరు.
తాత్కాలిక ఉపశమనార్థం ఆయన మందులిచ్చి ‘ఓ నాల్రోజుల తరువాత కలవండి’ అన్నారాయన! ఆ మాటలకు కొండంత ధైర్యం వచ్చిన శర్మ ‘హమ్మయ్యా’ అనుకుంటూ ఇంటిముఖం పట్టారు. ఆయనకు వచ్చిన అనారోగ్యమేమిటో? ఎలాంటిదో? డాక్టరేమన్నారో? అనేక భయాందోళనలతో కూడిన ప్రశ్నలు భార్యామణి హృదయంలో రొద చేస్తుంటే టెన్షన్ భరించలేక వీధి గుమ్మంలోనే ఉండిపోయింది రెప్పార్పకుండా! ఇంటికి తిరిగొచ్చిన పెనిమిటి ‘మరేం ఫర్వాలేదుట.. టాబ్లెట్స్ రాసిచ్చారంతే’ అని చెప్పుకుపోతుండడంతో గట్టిగా ఊపిరి తీసుకుందా ఇల్లాలు - పాపం మళ్లీ కథ మొదటికే వస్తుందని గ్రహించలేక!
వేళ్లన్నీ ఎర్రబడిపోయాయి. లోలోపల శూలాలతో పొడిచేస్తున్నట్లుగా ఉంది. వేళ్లల్లో మంటలు పుడుతున్నాయి. కనీసం ఇడ్లీ ముక్కకూడా విరవలేని పరిస్థితి. ‘ఓరి భగవంతుడా! ఏమిటి నాకో దుస్థితి? అనుకుంటూ మళ్లీ హుటాహుటిన శంకర్ గారి వద్దకు పరుగెత్తారు. భర్తపడే శారీరకావస్థకు భార్యామణి తల్లడిల్లిపోతోంది. పెళ్లయి రెండేళ్లు కాకుండానే తల్లిని కాబోతున్నానన్న ఆనందం కూడా లేకుండా పోయిందామెకు పాపం! భర్త ఓ పక్క అవస్థపడుతుంటే ఆనందం ఆమె స్వంతం ఎలా అవుతుంది? పోనీ పుట్టింటి వాళ్లకో అత్తింటి వాళ్లకో విషయం చెబితేనో? అమ్మో! ఇంకేమయినా ఉందా? పాపం దూరాన ఉండి వాళ్లేమీ చేయలేరు సరికదా! వాళ్లని కూడా బాధ పెట్టిన వాళ్లమవుతాం’ అనుకుని ప్రస్తుతానికి చెప్పద్దనే నిర్ణయానికి వచ్చేసిందా సాధ్వి. శర్మది ప్రైవేట్ ఉద్యోగం. ఆర్థిక స్థితి కూడా అంతంతమాత్రం. చేతినిండా డబ్బున్నా కొన్ని సమస్యలు పరిష్కారవుతాయి. ఆ అవకాశం ఆయనకామడదూరంలో ఉంది.
‘చూడండి శర్మగారూ! ఇలా టాబ్లెట్స్ ఎంత కాలమని వాడతారు చెప్పండి! వాడినంత సేపూ బాగానే ఉన్నట్లుంటుంది’ ఆపేస్తే పెయిన్స్ మళ్లీ స్టార్ట్ అవుతాయి.
శంకర్ డాక్టర్ మాటలకు నిశే్చష్టుడై నిలువు గుడ్లేసిన శర్మ కాసేపటి దాకా తేరుకోలేక పోయారు. అతి ప్రయత్నం మీద నోరు తెరచి ‘మరి నా పరిస్థితేమిటి డాక్టర్?’ అతి దీనంగా అడిగేసరికి డాక్టర్ చిరునవ్వుతో-
‘మరేం ఫరవాలేదు. అనవసరంగా భయపడకండి. చిన్న ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది’
‘అమ్మో ఆ.ప.రే.ష.నా?’ అంటూ అంత శర్మ నోరు తెరిచాడు.
‘అనవసరంగా భయపడకండి. హైదరాబాద్‌లోని నిమ్స్‌కి వెళ్లండి. అక్కడ మంచి మంచి చేయి తిరిగిన డాక్టర్లుంటారు. చక్కటి వైద్యం మీకందుతుంది. చిన్నాపరేషనే! గాబరాపడకండి. వీలైనంత తొందరగా వెళ్లండి. వ్యాధి ముదిరితే ప్రమాదం’ అంటూ ఏవేవో టాబ్లెట్స్ రాసిస్తూ కొండంత ధైర్యాన్ని నూరిపోసిన డాక్టర్‌కి కృతజ్ఞతలు చెప్పి ఇంటిముఖం పట్టిన శర్మ జరిగినదంతా భార్యామణికి పూసగుచ్చినట్లు చెప్పాడు. ఆమె హృదయం ఆవేదనతో బరువెక్కిపోయింది.
ఓ మూడ్రోజులు సెలవు పెట్టి హైదరాబాద్ చేరుకున్నాడు శర్మ. అక్కడున్న బంధువొకాయన సహాయంతో ‘నిమ్స్’లోకి అడుగుపెట్టిన శర్మకు అంతా అయోమయంగా ఉంది. రోగులతో కిటకిటలాడిపోతున్న హాస్పిటల్ ప్రాంగణంలో తిరుగాడుతూ వాళ్లనీ వీళ్లనీ అడిగి మొత్తంమీద తన వ్యాధిని నిర్ధారించి పరిష్కరించే వాస్క్య్‌లర్ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిని కలుసుకోగలిగాడు.
‘మరేం ఫరవాలేదు. నేనున్నాగా!’ అంటూ ఆయన వెన్నుతట్టారు. ఆ అమృత స్పర్శకే రోగం నయమైపోయిందా అనిపించింది శర్మకి.
‘ఎనిమిది వేలు దాకా చేత్తో పట్టుకోండి. అయినా అంతవదనుకోండి’ అంటూ ధైర్యం చెబుతూ ‘ఈ గురువారం ఆపరేషన్ చేద్దాం! ఆపరేషన్ అంటే ఏదో పెద్దగా ఊహించేస్కుని గాబరాపడిపోకండి. సూది గుచ్చినట్లు కూడా ఉండదు సరేనా!?’ అంటూ శర్మకి మనోధైర్యాన్ని నూరిపోశారు.
‘ఈ బుధవారం జాయిన్ అవండి. ఆపరేషన్ అయిన వారంలోపు డిశ్చార్జ్ చేసేస్తాం! మళ్లీ ఫ్యూచర్‌లో మీకెలాంటి ఇబ్బంది ఉండదు సరేనా?’ అంటూ భరోసా ఇచ్చారు. ‘ఎనిమిది వేలంటే మాటలా? రెండు దశాబ్దాల క్రితం అంత పెద్దమొత్తం చేత్తో పట్టుకోవాలంటే ఓ మధ్య తరగతి కుటుంబీకుని వల్ల అయ్యే పనేనా? ఎస్టిమేషన్ సర్ట్ఫికెట్ ఒకటి రామకృష్ణ గారి నుండి తీస్కుని హెడ్ ఆఫీస్‌కి వెళ్లి అప్లికేషన్ రాసిచ్చిన గంటలోపే శర్మ పరిస్థితినర్థం చేసుకున్న అధికారులు చెక్ రాసిచ్చేసారు. శర్మతో మాట్లాడుతూనే చీమకుట్టినట్లు కూడా అనిపించనంతగా అతిలాఘవంగా ఆపరేషన్ పూర్తి చేసేసి వార్డుకు పంపించేశాడు.
ఓ నాల్రోజుల అనంతరం కుట్లు విప్పేసి మందులు రాసిస్తూ డిశ్చార్జ్ చేసి పంపించేసేటప్పుడు తన శారీరక స్థితిగతులపై వెల్లువెత్తిన ప్రశ్నల వర్షాన్ని శర్మ ఒక కాగితంపై కురిపించాడు.
‘సార్! నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అడిగితే విసుగెత్తించిన వాడనవుతానని ఈ జాబితా మీ ముందుంచుతున్నాను’ అంటూ డాక్టర్ చేతికందించాడు శర్మ. ఆయన చిరునవుతో సందేహాలన్నీ పటాపంచలు చేసేస్తూ ‘్ఫ్యచర్‌లో మీకెలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మీ పనులన్నీ మీరు యధావిధిగా కొనసాగిస్తారు. విత్ ఇన్ ఫ్యూడేస్ యు ఆర్ ఆల్వేస్ పెర్‌ఫెక్ట్’ అనేటప్పటికి కొండంత భారం దిగిపోయి మనసు తేలికపడింది శర్మకి.
శర్మలాంటి వేలాది మంది రోగుల రోగపు మంటలార్పేస్తూ ... మనో ధైర్యాన్నందిస్తూ అపరధన్వంతరులుగా రోగుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్న డాక్టర్ల పేర్లెన్నని ఏకరువు పెట్టగలం!? అందుకే అన్నారేమో! వైద్యోనారాయణోహరిః అని!!

- కొడుకుల సూర్య సుబ్రహ్మ
No comments:
Post a Comment