తొలిసారి గర్భం ధరించిన మహిళలు తమకు పుట్టబోయే పిల్లలను ఎలా చూసుకోవాలి, ఎలా ఆడించాలనే విషయాలు బిడ్డ పుట్టకముందరే నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. భార్యాభర్తలిరువురూ ఉద్యోగాలు చేస్తుండడంతో కో-పేరెంటింగ్ పట్ల జంటలు ఆసక్తి చూపుతున్నారు. బొమ్మలను తమ పిల్లగా భావించుకుని వాటితో మాట్లాడడం, ఆడడం వంటివి సాధన చేస్తున్నారు. ఇలాంటి 182 జంటలను ఓహియో యూనివర్సిటీ అఽధ్యయనకారులు పరీక్షించారు. బొమ్మతో వారు సంభాషిస్తున్న తీరు, చూపుతున్న శ్రద,్ధ ఆ బొమ్మలతో వాళ్లు ఆడుతున్న తీరుని వీడియోలో రికార్డు చేశారు. వారు సాధన చేసినట్టుగానే పిల్లలు పుట్టిన తర్వాత తమ చిన్నారులను వారు చూడగలుగుతున్నారు. బొమ్మలతో ఆడుకున్నట్టు, మాట్లాడినట్టుగానే పుట్టిన తమ చిన్నారులతో కూడా ఈ జంటలు వ్యవహరిస్తున్నాయని అధ్యయనకారులు చెబుతున్నారు. |
|
No comments:
Post a Comment