‘జ్ఞానదంతం’తో జ్ఞానం వస్తుందా?
- -డా.కె.ఎల్.వి.ప్రసాద్
TAGS:
జ్ఞానదంతం సమస్య సాధారణంగా యవ్వనంలో ఉన్న యువతీ యువకుల్లో - ముఖ్యంగా విద్యార్థుల్లో, ఉద్యోగస్థుల్లో వస్తుంది. ఈ సమస్యతో సాధారణ చిన్నచిన్న పనులు చేసుకోవడం కూడా కష్టమవుతుంది. మనిషిలో ఏకాగ్రత లోపిస్తుంది. అందుచేత, ఏ మాత్రం అశ్రద్ధ చేయవలసిన అంశం కాదిది. పరిస్థితిని గమనించిన వెంటనే, అనుభవజ్ఞులైన దంత వైద్యులను సంప్రదించవలసి ఉంటుంది.
మొదట, పంటిని మూసి ఉంచిన చిగురును కత్తిరించి పంటి పై భాగం పూర్తిగా కనపడేట్టు చేయడం. దీనినే దంతవైద్య పరిభాషలో ‘‘ఓపరెక్యులెక్టమీ’’ అంటారు. ఒక్కోసారి ఇది సరిపోతుంది. దీనివల్ల పూర్తి స్వస్థత చేకూరుతుంది. కొంతమందిలో దీనివల్ల కూడ ప్రయోజనం ఉండదు! అప్పుడు శస్తచ్రికిత్స ద్వారా పన్నును వదిలించుకోవడమే సరైన మార్గం. ఒకప్పుడు రుూ పన్ను తీయడం పెద్ద సమస్యగా ఉండేది. ఇప్పుడు అనుభవజ్ఞులైన దంతవైద్యులు (ఓరల్ సర్జరీ) అందుబాటులో ఉండడంవల్ల, పరిస్థితి సులభమైపోయింది. లేదంటే, కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే యిది!
ఇతర శస్తచ్రికిత్సల మాదిరిగానే, ముందు కొన్ని రక్త- మూత్ర పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది. ఈ శస్తచ్రికిత్సకు ఎక్స్‌రే తప్పనిసరి. 1) ‘లేట్రల్- ఆబ్లిక్‌వ్యూ’ గాని, 2) ఆర్థి-పాంటమోగ్రాఫ్ గాని, దవడలు పంటి యదార్థ స్థితిని చూపిస్తాయి. శస్తచ్రికిత్సకు యివి మార్గదర్శకాలుగా ఉంటాయి.
శస్తచ్రికిత్స చేసే సమయానికి, పంటి-చిగురుకు సంబంధించిన వ్యాధి తగ్గిపోవాలి. దవడ వాపుతగ్గి నోరు పూర్తిగా స్వేచ్ఛగా, తెరుచుకోగల పరిస్థితులు ఉండాలి. ఇతర శారీరక వ్యాధులతో యిబ్బందులు పడుతున్నవారు, వారి వైద్య వివరాలను ముందుగానే దంతవైద్యులకు తెలియజేయాలి.
===============
జీవితంలో అనేక వింతలు- విడ్డూరాలు జరుగుతుంటాయి. ఇవి ఆనందానికి సంబంధించినవి కావచ్చు. ఆరోగ్యానికి సంబంధించినవి కావచ్చు. ఆరోగ్యపరంగా చెప్పలేనన్ని సమస్యలు రావచ్చు! అవి వయస్సునుబట్టి కొన్ని, మనస్సునుబట్టి కొన్ని, ఆయా సమయాల్లో తమ ఉనికిని చాటుతుంటాయి. మనం మరచిపోతే అవి గుర్తుచేస్తుంటాయి. కొన్ని జీవితంలో మరచిపోలేనంత గాయాన్ని మిగిల్చి వెళుతుంటాయి.
ఇక్కడ యిప్పుడు మనం చర్చించుకోవలసింది యావత్ శరీరం గురించి కాదు, కేవలం దవడలు, వాటిలో ఉండే దంతాల గురించి, వాటి ద్వారా ఉత్పన్నమయ్యే సమస్యల గురించి.
దవడల్లో వచ్చే ప్రతి పన్నుకి ఒక వయస్సుంది. పాల పళ్ళు- తాత్కాలికమైనవి కాబట్టి, వాటిని ప్రక్కనపెట్టి వాటి తర్వాత వచ్చే స్థిర దంతాల గురించి ఆలోచిస్తే, ప్రతి పన్ను ప్రకృతి నిర్దేశించిన వయస్సు ప్రకారం దవడలో ప్రత్యక్షం అవుతుంది. అంతేకాని అన్ని పళ్ళు ఒక్కసారి రావడం జరుగదు. అలా, ఆరు సంవత్సరాల వయస్సులో స్థిరమైన పళ్ళు రావడం మొదలయి, పనె్నండు సంవత్సరాల వయస్సు వచ్చేసరికి, పై దవడలో పధ్నాలుగు, క్రింది దవడలో పధ్నాలుగు, మొత్తం యిరవయి ఎనిమిది దంతాలు వచ్చేస్తాయి. కొద్దిశాతం మందిలో కొద్దిగా ముందు వెనుకలు ఉంటాయి.
అంటే దవడలలో, మూడవ ‘విసురుడు దంతం’ (3జూ య్ఘూ) తప్ప మిగతా పళ్ళన్నీ వచ్చేస్తాయి. ఈ మూడవ విసురుడు దంతం కొంచెం సమయం తీసుకుని వస్తుంది. అంటే, సుమారుగా 17-21 సం.ల మధ్య వయస్సులో వస్తుంది. ఆలస్యంగా వస్తూవస్తూ కొంతమందిలో వింత వింత సమస్యలను సృష్టించి యిబ్బందులకు గురిచేస్తుంటుంది.
బ్రతికినంత కాలం గుర్తుంచుకునేలా చేస్తుంది. ఈ దంతాన్ని ‘జ్ఞానదంతం’ (జీనిడ్జె జ్జ్హ) అంటారు. ఈ దంతం వచ్చిన తరువాత మనిషిలో జ్ఞానం వస్తుందా? అన్నది కాస్సేపు పక్కన పెడితే, చాలా మందిలో యిది యిబ్బందులకు గురిచేస్తుంది. అందరికి దీనితో సమస్య రావాలని లేదు. దవడలో తగినంత చోటుఉన్న పరిస్థితిలో, రుూ దంతం సాధారణంగా ఎలాంటి సమస్యను సృష్టించదు! సమస్యలు, దవడలో- పన్ను రావడానికి తగినంత స్థలం లేనప్పుడే ఉత్పన్నమవుతాయి. అయితే, ఎక్కువ శాతం మందిలో, రుూ పన్ను వచ్చే సమయానికి, దవడలో సరిపడినంత స్థలం ఉండదు. కనుక ఎక్కువ శాతం దీనితో యిబ్బంది పడతారు.
దవడల్లో జ్ఞానదంతాల స్థానం: క్రింది దవడలో కుడివైపు ఒకటి, ఎడమవైపు ఒకటి, అలాగే పై దవడలో కుడివైపు ఒకటి, ఎడమ వైపు ఒకటి, చివరి స్థానాన్ని ఆక్రమించుకుని ఉంటాయి. ఇక్కడ గమనించవలసిన విషయం యేమిటంటే, తొంబయి శాతం, క్రింది దవడకు సంబంధించిన జ్ఞానదంతాలే సమస్యలను సృష్టించి యిబ్బందులకు గురిచేస్తాయి. దంత వైద్యపరి భాషలో వీటిని 8/8 8/8గా గుర్తిస్తారు. డెంటల్ ఫార్ములాలో వాటిని యిలా వ్యక్తీకరిస్తారు.
సాధారణంగా, 17-21, సం.ల మధ్య వయస్సులో వచ్చే రుూ జ్ఞానదంతం (్థర్డ్‌మోలార్) కొంత మందిలో అనుకూల పరిస్థితులనుబట్టి ఏ వయస్సులోనయినా రావచ్చు. పరిస్థితులు అనుకూలించకపోతే, అది దవడ లోపలే ఉండిపోవచ్చు. దవడలోపలే ఉన్నప్పుడు దాని ఉనికినే మనం గుర్తించలేకపోవచ్చు (ఎక్స్-రే తీసి చూస్తే తప్ప) ఒక్కోసారి ఊహించని సమస్యతో యిబ్బందులకు గురిచేసి, తన ఉనికిని చాటుకోవచ్చు.
జ్ఞానదంతం అవసరం- ఉపయోగం: ఇది స్థిర దంతాలలో చివరి పన్ను. దీని అవసరం, ఉపయోగంకంటే, దీని ఉనికే యిబ్బందికరమైనది. నిజానికి పళ్ళు లేదా దంతాలు అవసరం నమలడానికి. అందంగా కన్పించడానికి, స్వచ్ఛమైన పద ఉచ్ఛారణకు పనికివస్తాయి. కాని, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ దంతం పై మూడింటిలో దేనికీ ఉపయోగపడదు.
ముందరి పళ్ళు ఒక దానితో మరొకటి కలుసుకున్నట్టుగా, ఏ ఒక్కరికి కూడ జ్ఞానదంతాలు కలుసుకోవు. అందుచేత నమలడంలోను, పద ఉచ్ఛారణలోను వీటి పాత్ర శూన్యం. దవడలో చివరి భాగాన (లోపలి భాగాన) ఉండడంవల్ల, దంత సౌందర్యం విషయంలో దీని ఉపయోగం అసలు లేదు. అందువల్ల వీటితో సమస్య లేనంతవరకు మనం ఎలాగు పట్టించుకోము! ఈ దంతాలవల్ల యిబ్బందులు మొదలయినట్లయితే, వీటిని సాధ్యమయినంత త్వరగా వదిలించుకోవడమే మంచిది!
ఇబ్బందులు ఎలా ఉంటాయ్?
ఇది దవడలో చివరి పన్ను కావడంవల్ల, పరిశుభ్రతలో లోపం జరగడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. తద్వారా ఆ పంటి చుట్టుతా ఉండే చిగురు వ్యాధిగ్రస్తమవుతుంది. రెండవదిగా, ఈ జ్ఞానదంతం వచ్చే సమయానికి, దవుడలు సరిపడినంత చోటులేకపోవడంవల్ల, పన్ను బలవంతంగా చీల్చుకుని, పాక్షికంగా బయటికి వచ్చి ఆగిపోవడంవల్ల చిగురు పంటిని పూర్తిగా విడువక, చుట్టురా, సంచి మాదిరిగా ఉండడంవల్ల, దానిలోనికి మనం తినే ఆహార పదార్థపు అణువులు చేరుకుని, పరిశుభ్రతకు నోచుకోక, చిగురు వ్యాధిగ్రస్తం కావడమేకాక, కుళ్ళిన ఆహార పదార్థపు అణువులు బాక్టీరియాల చర్యలకు లోనయి, ఆ రసాయనిక చర్యల అనంతరం కొన్ని ఆమ్లాలు, వాయువులు వెలువడతాయి.
వెలువడిన విషవాయువులవల్ల నోటి దుర్వాసన కలుగుతుంది. విడుదల అయిన ఆమ్లాలవల్ల, పిప్పి పన్ను సమస్యకు పునాది పడుతుంది.
ఈ విధంగా, జ్ఞానదంతం చుట్టుతా ఉండే చిగురు వ్యాధిగ్రస్తం కావడాన్ని ‘‘పెరికార్నయిటిస్’’ అంటారు.
వ్యాధి లక్షణాలు: ప్రారంభ దశలో, చిగురు వాచి, కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. కొద్దిగా నొప్పిగా ఉంటుంది. తర్వాత చిగురు బాగా వాచి, ఎర్రగా తయారయి, విపరీతమయిన నొప్పి మొదలవుతుంది. మెత్తని ఆహార పదార్థాలను కూడ తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత క్రమంగా, దవుడ వాయడం, దవడ క్రంది లింపు- గ్రంథులు వాచి నొప్పిని కలిగించడం, చిగురు నొప్పి, పంటి నొప్పి, దవడ నొప్పితోపాటు, చెవిలో పోటు ప్రారంభం కావడం, జ్వరం రావడం, నోరు మూసుకుపోవడం, మెత్తని ఆహార పదార్థాలను గాని, ద్రవ పదార్థాలను గాని మింగలేని పరిస్థితి ఏర్పడ్డం జరుగుతుంది. ఆ తర్వాత, చిగురునుండి చీము-నెత్తురు రావడం, నోటి దుర్వాసన రావడం వంటి లక్షణాలు కన్పిస్తాయి. చెవిలో పోటును బట్టి, కొంతమంది పొరపాటున, చెవి, ముక్కు, గొంతు, వైద్యుల దగ్గరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ప్రారంభ దశలో చికిత్స మొదలుపెట్టినప్పుడే వస్తాయి. అశ్రద్ధచేస్తే, యిన్ని రకాల యిబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.
సమస్య ఎలా ఉంటుంది?
జ్ఞాన దంతం వచ్చే సమయానికి దవడలో సరిపడినంత చోటులేకపోవడంవల్ల, పన్ను రాకడకు అవరోధం ఏర్పడుతుంది. ఈ రకంగా పన్ను నిటారుగా వచ్చి, మధ్యలో ఆగిపోవచ్చు. కుడివైపునకు వాలిన రీతిలో వచ్చి, సగంలో ఆగిపోవచ్చు. అదే విధంగా ఎడంవైపునకు వాలిన రీతిలో వచ్చి, సగంలో ఆగిపోవచ్చు. బుగ్గవైపు పంటి పై భాగము కేంద్రీకరింపబడి, క్రమంగా బుగ్గను పుండుగా మార్చవచ్చు. నాలుక వైపు కేంద్రీకరింపబడి నాలుకను గాయపరచవచ్చు. వీటన్నింటికి భిన్నంగా, పైకి రాకుండా దవడలోనే, దవడకు సమాంతరంగా అణిగి ఉండవచ్చు. ఇలా రకరకాలుగా, పైకి సరిగా పూర్తిగా రాలేని పన్నును, లేదా రాని పన్నును ‘ఇంపాక్టెడ్ టూత్’ అంటారు. ఈ పంటి చుట్టుతా ఉండే చిగురు వ్యాధిగ్రస్తం కావడాన్ని ‘పెరికార్నయిటిస్’ (-ఉ్గన్ళ్జ్గినినిడ) అంటారు. వ్యాధి ముదిరి, దవడలో కదలడానికి ఉపయోగపడే కండరాలు బిగుసుకుపోవడంవల్ల, దవుడలు మూసుకుపోయి నోరు తెరవలేని పరిస్థితి ఏర్పడవచ్చు. ఇలా నోరు మూసుకుపోవడాన్ని ‘ట్రిస్‌మస్’ లేదా ‘లాక్-జా’ అంటారు. ఈ సమస్య రావడానికి యింకా అనేక కారణాలు కూడా ఉంటాయి.
చికిత్స: తాత్కాలిక చికిత్స ద్వారా ఈ జ్ఞానదంత సమస్య పదే పదే పునరావృతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుచేత, శాశ్వత పరిష్కార మార్గాలకే మొగ్గుచూపాలి. కనుక ఈ చికిత్స ముఖ్యంగా రెండు విధాలుగా ఉంటుంది.
1) ఔషధ చికిత్స- కేవలం మందులు వాడడం ద్వారా తగ్గించుకోవడం. 2) శస్త్ర చికిత్స మందులు వాడిన తరువాత కూడ పదే పదే పునరావృతమవుతున్నప్పుడు, శస్తచ్రికిత్స మాత్రమే దానికి శాశ్వత పరిష్కారం కాగలదు. ఈ శస్త్ర చికిత్స రెండు స్థాయిలలో జరగవచ్చు.

No comments:
Post a Comment