నిషా (కథ)
- - అగేహానంద్
- 24/08/2014
TAGS:
గంగాధర్‌రావు సాటాపూర్ ప్రాథమిక పాఠశాలకు బదిలీమీద వచ్చాడు. అప్పటికే అక్కడ అపరంజని, పింగాక్షిలనే ఇద్దరు ఉపాధ్యాయినులు పనిచేస్తున్నారు. మీటింగ్‌ల కోసం విద్యాధికారి కార్యాలయానికి తిరగలేక వాళ్లిద్దరూ గంగాధరరావునే హెడ్‌మాస్టర్‌గా ఉండమన్నారు. సాటాపూర్‌లో అదొక్కటే పాఠశాల అవడంతో వారివాళ్లందరూ ‘మా హెడ్‌మాస్టర్‌గారు’ అని సంబోధించేవారు. బడిలో కొత్త పుస్తకాలు వచ్చినా, ఆటల్లో విద్యార్థులు బహుమతులు గెలిచినా పిల్లలకు బహూకరించేది హెడ్‌మాస్టర్ గంగాధర్‌రావే. ఆగస్టు 15 అయినా, జనవరి 26 అయినా జెండా ఎగరేసేది హెడ్‌మాస్టర్ గంగాధర్‌రావే. మండల సమావేశాలకు, శిక్షణ తరగతులకు తప్పకుండా వెళ్లేవాడు గంగాధర్‌రావే. మండలాఫీసులో ‘సాటాపూర్ హెడ్‌మాస్టర్‌గారు’ అని పిలిచేది కూడా గంగాధర్‌రావునే. మండల ఆఫీసునుండో, ఎమ్మార్వోనుండో, డిఇఓ నుండో ఉత్తరాలు వస్తే తెరిచేది కూడా హెడ్‌మాస్టర్ గంగాధర్‌రావే. తిరిగి వాటికి తగిన విధంగా జవాబులు రాసేది కూడా ఆయనే. ఏ పత్రం రాసినా చివరికి సంతకం చేసేది హెడ్‌మాస్టర్ గంగాధర్‌రావే. క్రమక్రమంగా గంధార్‌రావు తన స్నేహితులకు, చుట్టాలకు హెడ్‌మాస్టర్ గంగాధర్‌రావుగానే పరిచయం చేసుకోవడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లోనే పరిచయస్తులు, వీధివాళ్ళు, బంధువులు అందరూ ఆయన్ని హెడ్‌మాస్టర్ గంగాధర్‌రావు అని పిలవడానికి అలవాటుపడ్డారు.
సాటాపూర్‌కు గంగాధర్‌రావు వచ్చి మూడేళ్లు దాటాయి. జూన్‌లో మళ్లీ బదిలీల కోసం ప్రకటన వచ్చింది. గంగాధర్‌రావు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కాని నచ్చిన ఊరు దొరక్క వెళ్లలేదు. అపరంజని టీచర్ బదిలీ మీద వేరే ఊరు వెళ్లిపోయింది. ఆ ఖాళీలో రామ్‌దాస్ వచ్చారు. జూలై మొదటి తేదీకల్లా విధుల్లో చేరాలని ఉత్తర్వులు వచ్చాయి.
గంగాధర్‌రావుకన్నా రామ్‌దాస్ సీనియర్. దీంతో హెడ్‌మాస్టర్ గంగాధర్‌రావుకు షాక్ తగిలింది. గత మూడేళ్లుగా తాను సాటాపూర్‌కు హెడ్‌మాస్టర్. ఇప్పుడు తనకున్నా సీనియర్ అయిన రామ్‌దాస్ వస్తే తాను మామూలు ఉపాధ్యాయుడు అవుతాడు. సాటాపూర్ హెడ్‌మాస్టర్ పదవి పోతుందనిపించడంతో మనసంతా ఆందోళనతో నిండిపోయింది.
ఏంచేయాలో తోచక ఉపాధ్యాయ సంఘ భవనానికి వెళ్లాడు. చిన్న చిన్న పైరవీలు చేసే నాయకుడు అప్పారావును కలిసి తన బాధను చెప్పుకున్నాడు. ‘నేను రామ్‌దాస్‌గారికి చెప్పి చూస్తాను. మన ప్రయత్నం మనం చేద్దాం’ అని భరోసా ఇచ్చాడు అప్పారావు.
మర్నాడు సాయంత్రం అప్పారావు రామ్‌దాస్‌ని కలిశాడు. ఆ మాటా ఈ మాటా మాట్లాడి మెల్లిగా అసలు విషయంలోకి వచ్చాడు.
‘సాటాపూర్ హెడ్‌మాస్టర్‌గా గంగాధర్‌రావు ఉంటేనే బాగుంటుంది’ అన్నాడు.
‘గంగాధర్‌రావు నాకన్నా జూనియర్ కదా? అతనెలా హెడ్‌మాస్టర్ అవుతాడు’ అడిగాడు రామ్‌దాస్.
‘గత మూడేళ్లుగా గంగాధర్‌రావు సాటాపూర్‌లో హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. స్కూల్‌ను చక్కగా నిర్వహిస్తున్నాడు. ఇకముందు కూడా ఇలాగే ఉంటే బావుంటుంది’ చెప్పుకొచ్చాడు అప్పారావు.
‘కావొచ్చు. కానీ గంగాధర్‌రావు 96 డిఎస్‌సి, నేను 95 డిఎస్‌సి. కాబట్టి నేనే సీనియర్‌ని. నా జూనియర్‌ని హెడ్‌మాస్టర్‌గా నేనెందుకు అంగీకరించాలి’ అని ప్రశ్నించాడు రామ్‌దాస్.
‘అది కాదన్నా... సాటాపూర్‌లోనూ, మొత్తం మండలంలోనూ హెడ్‌మాస్టర్‌గా పిలిపించుకుంటున్న గంగాధర్‌రావు ఇకముందు అసిస్టెంట్‌గా పిలిపించుకోవడం ఎంత బాధగా ఉంటుందో చెప్పు. ఎవరైనా ‘పూలమ్మిన చోట కట్టెలమ్మగలరా? నువ్వే చెప్పు. ఒక సంవత్సరం ఆగితే తర్వాతి కౌన్సిలింగ్‌లో వేరే ఊరికి బదిలీ అయిపోతాడు. దానికి నేను హామీ’ అన్నాడు అప్పారావు.
తలెత్తి సూటిగా అప్పారావు కళ్లల్లోకి చూశాడు రామ్‌దాస్.
‘అప్పారావ్... కాలం మారింది. పూలమ్మిన చోట కట్టెలమ్మగలరా అనేది పాత నానుడి. ఈ రోజుల్లో పూలు అమ్మితే లాభం వస్తుందనుకుంటే పూలే అమ్ముతాడు. కట్టెలమ్మితో లాభమనుకుంటే కట్టెలే అమ్ముతాడు. నేడు లాభంతో పనికాని వస్తువులతో ఏం పని? వాటిని ఇంట్లో అయితే ఉంచుకోం కదా’ ఎదురుదెబ్బ కొట్టాడు.
‘నేను సీనియర్‌ని, నా జూనియర్ దగ్గర నేను అసిస్టెంట్‌గా పనిచేయలేను. నేనే హెడ్‌మాస్టర్‌ని అవుతాను. అడ్జెస్టు అవమని గంగాధర్‌రావుకే చెప్పండి’ అనేసి వెళ్లిపోయాడు రాందాస్.
ఆ మర్నాడు అప్పారావు సందేశం విన్న గంగాధర్‌రావుకి నిషా దిగడం మొదలైంది.

No comments:
Post a Comment