Thursday, 28 August 2014


NewsListandDetails అధికబరువుకు అనేక కారణాలు ఉన్నాయి. బరువు ఎక్కువగా ఉన్నామని ఆలోచిస్తూ కూర్చుంటే సన్నగా అయిపోలేము కదా. దానికి కొన్ని నియమాలు పాటిస్తే మూడునెలలో చక్కగా అందంగా, నాజూగ్గా తయారు కావచ్చునంటున్నారు ఆరోగ్యనిపుణులు. కొందరైతే బేరియాట్రిక్‌ సర్జరీలకు తయారవుతున్నారు. కానీ అవికాస్త వికటించాయంటే ఏమవుతామో చెప్పలేం కదా. ప్రాణాపాయం సంభవిస్తే ఏమయిపోతామంటూ వాపోయే యువత కూడా ఉన్నారు. కాస్తంత వ్యాయామానికే శరీర బరువు, కైవారమూ తగ్గుతుందేమిటి? అందుకే ఇవన్నీ మానేసి ఇతరత్రా ప్రత్యామ్నాయ వైద్యాలను ఆశ్రయించేవారు ఉంటారు. కొవ్ఞ్వ బాగా చేరిన పొత్తికడుపుపైనో, తొడలపైనో, పొట్టపైనో రాసే ప్రత్యేక ఔషధీయ చమురు రాసినా ఇంచో, అర ఇంచో రెండించులో, మూడించులో కైవారం తగ్గిపోతుందన్న ప్రకటనలకు స్పందించే ఊబకాయ శిరోమణులెందరో అలాంటివారి కోసం కొన్ని చిట్కాలు చెప్తుంటారు.
- అనాసపండు జ్యూస్‌ తాగితే అధిక బరువు నుండి విముక్తులు కావచ్చును.
- ఉదయం నిద్రలేవగానే లీటరు మంచినీరు త్రాగి, వేప, తులసి, పసుపు చూర్ణాలను సమభాగాలుగా కలుపుకుని, నిద్రలేవగానే మంచినీటితో ఒక గ్రాము చూర్ణం సేవించాలి.
- విరేచనం అయ్యేక తిరిగి అరలీటరు నీరు సేవించాలి.
- ఉదయం టిఫిన్‌కు బదులు మూడు అనాసముక్కలు, అరచెక్క జామ, యాపిల్‌, కేరట్‌లతో జ్యూస్‌ చేసుకుని తాగాలి.
- ప్రతిరోజూ ఒక కోడిగ్రుడ్డు తినాలి.
- ఆకలి వేసినప్పుడు జొన్నపేలాలు తినాలి.
- వంటల్లో అలీవ్‌ ఆయిల్‌ వాడుట మంచిది.
- ఉదయం పూట వ్యాయామం చేయాలి. లేదంటే జిమ్మాస్టిక్‌ బాల్‌పై కొద్దిసేపు వ్యాయామం చేస్తే చాలా మంచిది.
- అవకాశం ఉంటే స్విమ్మింగ్‌ చేయాలి.
- అధిక బరువు గురించి పదేపదే ఆలోచించడం మానాలి.
- మనస్సును పాజిటివ్‌గా ఉంచుకోవాలి.
- ప్రతిరోజూ ఇంచుమించు మూడు నుండి నాలుగు లీటర్ల మంచినీరు అలవాటు చేసుకోవాలి.
- రోజూ కొద్దిసేపు వాకింగ్‌ లేదా సైక్లింగ్‌ చేయాలి.
- ఉదయం నిద్ర నుండి లేవగానే పది నుంచి 20సార్లు ప్రాణాయామం చేయాలి.
- వర్షం నీరు పట్టి నిలువ చేసుకుని, రోజూ ఉదయాన్నే పరగడుపున గ్లాసు నీళ్లలో పావుచెంచా మంచి పసుపు కలుపుకుని సేవించి గంట వరకు ఏదీ తినకుండా ఉండే 40రోజుల్లో అధిక బరువు సమస్య నుండి విముక్తి కావచ్చును.
- వేడినీటిలో స్పూను తేనె, ఒక చెక్క నిమ్మరసం కలుపుకుని తాగితే ఊబకాయం తగ్గుతుంది.
- రోజు, ఆవుపాలు తృప్తితీరా సేవిస్తే లావు తగ్గుతారు.
- నల్ల ఉలవలు, ఉడికించి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు తగినంత సైంధవ లవణం కలిపి తింటే 40రోజుల్లో బరువ్ఞ తగ్గుతారు.
- వారమునకు ఒకసారి గ్లాసు బియ్యానికి పద్నాలుగు గ్లాసు నీరు పోసి అందులో బీట్‌రూట్‌, కేరట్‌, ఉల్లిపాయ, టమాట, బీన్స్‌ వేసి ఉడికించి, అందులో అల్లం, కరివేపాకు వేసి జావగా చేసుకుని రోజంతా ఇదే తాగితే మంచి ఫలితం ఉంటుంది.
- కలబంద, గోమూత్రం కలిపి రోజూ 20యం.ఎల్‌ సేవించిన అధికబరువు నుండి విముక్తులు కావచ్చును.
-  అన్ని రకాల మొలక విత్తనాలు చూర్ణం చేసుకుని రోజూ టీ స్పూను పాలల్లో వేసుకుని సేవిస్తే అధిక బరువు తగ్గుతుంది.
- వారానికి ఒకసారి నువ్వుల నూనెను వంటికి పట్టించి, అభ్యంగన స్నానం ఆచరిస్తే...అధిక బరువు నుండి విముక్తులు కావచ్చును.
- ఆహారంలో పల్చటి మజ్జిగ ఎక్కువగా సేవించాలి.
- వారమునకు  ఒక పర్యాయం ఆవిరిస్నానం (స్టీమ్‌బాత్‌) చేస్తే అధికబరువు తగ్గవచ్చును.
- ఆహారంలో క్రొవ్వు  పదార్థాలు తగ్గించాలి.
- మసాలాలు, బిర్యానీలు, నూనెపదార్థాలు, మాంసాహారం విసర్జించాలి.
- భోజనానికి ముందు మంచినీరు సేవించడం ద్వారా ఆహారం తక్కువగా తీసుకుంటారు.
- ఆహారంలో ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి.
- అధిక బరువును తగ్గించుకోవాలనే తాపత్రయంతో ప్రమాదకరమైన మందులు వాడరాదు. ఉలవలు కషాయంగా కాచుకుని అందులో సైంధవ లవణం కలుపుకుని ఆహారపానీయంగా సేవిస్తే అధిక బరువు తగ్గుతారు.
- ప్రతిరోజూ సాఫీగా విరేచనం అయ్యేటట్లు చూసుకోవాలి.
- ముల్లంగి రసంలో కొద్దిగా తేనె కలుపుకుని సేవిస్తే అధికబరువు నుండి విముక్తులు కావచ్చును.   
-  పుట్టగొడుగులు కూరగా వండుకుని తింటే అధిక బరువు తగ్గుతారు.
- సునాముఖి, త్రిఫల, తులసి, గుంటకలగర వీటి చూర్ణములను సమభాగాలుగా కలుకుని ప్రతిరోజూ ఒక గ్రాము చూర్ణం మంచినీటితో సేవించిన ఊబకాయం తగ్గుతారు.
- కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఆకులను చూర్ణం చేసుకుని ఒక గ్లాసు నీటిలో అరస్పూను చూర్ణం సేవిస్తే అధిక బరువు నుండి విముక్తి పొంద వచ్చును. కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ (త్రిఫల) శొంఠి, పిప్పళ్ల మిరియాలు, సైంధవ లవణం వీటి చూర్ణం నిల్వచేసుకుని పావు చెంచా చూర్ణం గోరువెచ్చని నీటితో సేవిస్తే గ్యాస్‌,అధిక బరువు తగ్గుతారు.
- పాల పదార్థములు తగ్గించాలి.
- స్వీట్స్‌ వాడకం తగ్గించాలి
- దంపుడు బియ్యం వాడుట వలన కూడా అధికబరువు తగ్గించుకోవచ్చును.
- పిజ్జా, బర్గర్‌, ఫాస్ట్‌ఫుడ్స్‌ కేకులు వాడకం తగ్గించాలి.
- క్రమం తప్పకుండా భోజనం చేయాలి. మితాహారం ఆరోగ్యానికి మంచిది. (అతి సర్వత్రా వర్జయేత్‌). వారానికి ఒకరోజు ఉపవాసం దీక్ష పాటిస్తే మంచిది.
- మానసిక ఒత్తిడులు లేకుండా మనస్సును ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలి.
- యోగా, ధ్యానం (మెడిటేషన్‌) సంగీత సాధన చేయుట చేస్తుండాలి.
- అధికశాతం నీరు ఉన్న ఫ్రూట్స్‌ సేవించాలి. ఉదా: పుచ్చకాయలు, కీరదోసకాయలు, కర్బూజాపండు, అనాసపండు, కమలా, నారింజ వంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.

No comments:

Post a Comment