Saturday, 6 June 2015

Menthi magaya -- telugu vantakam

మెంతి మాగాయ


మామిడికాయలు- 25
కారం - ఒకటిన్నర కేజీ
మెంతులు - ఒకటిన్నర కప్పు
ఆవాలు - ఒకటిన్నర కప్పు
ఉప్పు - 400 గ్రా.
నూనె - 1/2 కేజీ
ఇంగువ - చింతగింజంత
వెల్లుల్లి - 25 రెబ్బలు
మామిడికాయలను నీటిలో శుభ్రం చేసి పలుచని ముక్కలుగా చేసుకోవాలి. ఈ ముక్కల్ని మధ్యాహ్నం ఎండలో చాపమీద పోసి ఆరనివ్వాలి. సాయంత్రం వేళ మెంతులు, ఆవాలు దోరగా వేయించి మిక్సీ పట్టాలి. బాణలిలో ఇంగువ నూనె కాచి అందులో కారం పోసి బాగా కలపాలి. ఎండిన మామిడి ముక్కల్ని పెద్ద బేసిన్‌లో వేసి ఉప్పు, పసుపు, వేయించిన వెల్లుల్ని కలిపి మూత పెట్టాలి. మూడవ రోజున మామిడి ముక్కలను బాగా కలిపి జాడీలో పెట్టాలి. తీపి కావాలని కోరుకునే వారు ఇంగువ, వెల్లుల్లికి బదులు అరకిలో బెల్లం కోరు కలుపుకోవాలి
.

No comments:

Post a Comment