Monday, 15 June 2015

ఆరోగ్య రక్ష...తులసి!


                    రోజూ పెరట్లో కనిపించే తులసి మొక్కలు మన ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. నోటిపూత, నోట్లో అల్సర్‌, ఇతర ఇన్‌ఫెక్షన్ల నివారణకు తులసి ఎంతో ఉపకరిస్తుంది. ప్రధానంగా చిన్నపిల్లల్లో తరచూ దగ్గు, జలుబు, జ్వరం, డయేరియా, వాంతులు మొదలైనవాటిని నివారించేందుకు తులసి ఆకులు సహాయపడతాయి. రింగ్‌వార్మ్‌లాంటి చర్మసంబంధ వ్యాధులకు తులసి ఆకుల రసం రాసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ల్యూకోడెర్లాలో ప్రకృతి వైద్యులు తులసికి మొదటి ప్రాధాన్యతనిస్తారు. తలనొప్పికి కూడా తులసి మంచి ఔషధంలా పనిచేస్తుంది. తులసి ఆకులను డికాక్షన్‌గా తీసుకుంటే తలనొప్పిని దూరం చేయవచ్చు. అంతేకాదు ఈ ఆకులను ఎండబెట్టి, వాటిని పొడి చేసి, దాంతో పళ్ళు తోముకుంటే దంతాలకు చాలా మంచిది. దీన్ని ఆవనూనెలో కలిపి టూత్‌పేస్ట్‌లా కూడా వాడుకోవచ్చు. అలా చేయడం వల్ల నోటిదుర్వాసన పోయి, పళ్ళను అందంగా మార్చుతుంది. గంధం అరగదీసి అందులో తులసి ఆకులను కలిపి ఆ మిశ్రమాన్ని నుదుటిమీద రాసుకుంటే వేడివల్ల వచ్చే తలనొప్పిని దూరం చేసి, ఎంతో చల్లదనం లభిస్తుంది. తులసి ఆకులు కలిపిన నీటిని తాగడం వల్ల గొంతులో కలిగే ఇబ్బందులను దూరం చేయొచ్చు.

No comments:

Post a Comment