Wednesday, 3 June 2015

ఉపశమనాన్నిచ్చే ఆరు మసాజ్‌లు

మసాజ్‌లు అంటే చాలు చాలామంది ముఖం అదొలా పెడుతుంటారు. కానీ అవి ఇచ్చే ఉపశమనం మాటల్లో చెప్పలేనిది. మసాజ్‌ వల్ల శరీరం ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. అందుకే ఆరోగ్యమైన జీవనశైలికి డైట్‌, వ్యాయామాలు ఎంత ముఖ్యమో అలసిన శరీరానికి మసాజ్‌ కూడా అంతే అవసరం. మసాజ్‌ చేయించుకోవడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన మలినాలు బయటకు పోతాయి. అందుకే ఈ మసాజ్‌లను చేయించుకుని రిలాక్స్‌ కండి.
 
బాలినెసె మసాజ్‌...
ఇది ఇండొనేసియాకు చెందిన సంప్రదాయ మసాజ్‌. ఈ మసాజ్‌కు పుట్టిల్లు బాలి దీవులు. ఈ టెక్నిక్‌లో మసాజ్‌తోపాటు ఆక్యుప్రషర్‌, రిఫ్లెక్సోలజీ, ఆరోమాథెరపీ వంటి రకరకాల ప్రకియలు మిళితమై ఉంటాయి. రిలాక్స్‌ అవడానికి ఈ టెక్నిక్‌ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది కండరాలను వదులుచేయడంతోపాటు శరీరంలో నొప్పి బాపతు బాధలను పోగొడుతుంది. ఈ టెక్నిక్‌ వల్ల రక్తప్రసరణ బాగా జరిగి మెదడు విశ్రాంతి స్థితిని పొందుతుంది. శరీరానికి నూతనోత్తేజం వ స్తుంది. కండరాలు బాగా ఒత్తిడికి లోనైనప్పుడు ఈ టెక్నిక్‌ మంచి ఫలితాలను ఇస్తుంది. కీళ్లు, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది. మైగ్రేన్‌ తగ్గుతుంది. నిద్రలేమి, శ్వాస సంబంధమైన సమస్యలు ఉండవు.
 
డీప్‌ టిష్యూ మసాజ్‌...
నిత్యం వర్కవుట్లు చేయలేని వారికి ఈ టెక్నిక్‌ బాగా ఉపయోగపడుతుంది. ఇలాంటి వాళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే వారానికొకసారి ఈ మసాజ్‌ని చేయించుకోవాలి. ఈ టెక్నిక్‌ వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో మెదడు, శరీరం బాగా రిలాక్స్‌ అవుతాయి. అంతేకాదు శరీరంలో తలెత్తే రకరకాల నొప్పుల్ని, బాధల్ని ఈ మసాజ్‌ పోగొడుతుంది. ఈ మసాజ్‌ వల్ల మానసికంగా, శారీరకంగా ఎంతో సేదదీరుతారు. ‘టెక్స్టింగ్‌ నెక్‌’ (మొబైల్‌లో తరచూ మెసేజ్‌లిస్తుండడం వల్ల మెడకు తలె త్తే నొప్పులు), ‘హంచ్డ్‌ ఒవర్‌ లాప్‌టాప్‌ సిండ్రోమ్‌’ (హెచ్‌ఔల్‌ఎస్‌) సమస్యలు కూడా తగ్గుతాయి.
 
హెర్బల్‌ బాల్‌ ట్రీట్‌మెంట్‌...
ఈమధ్యకాలంలో హెర్బల్‌ బాల్‌ ట్రీట్‌మెంట్‌ని చాలామంది చేయించుకుంటున్నారు. ఈ పద్ధతిలో కీళ్ల దగ్గర హెర్బల్‌ బాల్స్‌ పెడతారు. ఒంటికి నూనె బాగా పట్టించి హెర్బల్‌ బాల్స్‌ పెట్టడం వల్ల ఆ మూలికలు నూనెలో నానినట్టవుతాయి. దీంతో కండరాలు రిలాక్స్‌ అవుతాయి. మోకాళ్లు, మడమలు, భుజాల వంటి భాగాల్లో వీటిని పెడతారు . హెర్బల్‌ ఆయిల్‌ని శరీరానికి పెట్టేటప్పుడు ప్రత్యేకమైన సో్ట్రక్స్‌, టెక్నిక్స్‌ను ప్రయోగిస్తారు. అంతేకాదు ఆరై్త్రటిస్‌, బ్యాక్‌, జాయింట్‌పెయిన్స్‌, ఆస్తమా, కండరాలు బిగుసుకుపోవడం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మూలికల వల్ల కీళ్ల బాధలు తగ్గుతాయి. అంతేకాదు రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది.
 
స్పోర్ట్స్‌ మసాజ్‌....
ఇదొక చికిత్సా విధానం. బిగుసుకుపోయిన కండరాలను ఫ్లెక్సిబుల్‌గా చేస్తుంది. పనిచేయని కండరాల్లో కదలికలు తీసుకువస్తుంది. టిష్యూలు బాగా పని చేస్తాయి. ఈ మసాజ్‌ చేయించుకోవడం శరీర కదలికల్లో వేగం పెరుగుతుంది. ముఖ్యంగా క్రీడాకారుల ఆట తీరు బాగా మెరుగుపడుతుంది. వారు తొందరగా గాయాలపాలు కారు. ఈ మసాజ్‌ వల్ల బిగబట్టినట్టున్న టిష్యూలు వదులై వేగంగా పని చేస్తాయి.
 
టెంపుల్‌ మసాజ్‌...
సాధారణంగా ఈ టెక్నిక్‌ను థాయ్‌లాండ్‌లోని దేవాలయాల్లో చేస్తారు. ఈ మసాజ్‌ శరీరంపై తేలికపాటి ఒత్తిడిని కలుగజేస్తుంది. సె్ట్రచింగ్‌కు సహాయపడుతుంది. ఈ మసాజ్‌ వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతాం. బాగా నిద్రపోతాం. శరీరంపై, మెదడుపై అదుపు సంపాదిస్తాం. వాటి గురించిన అవగాహనను పెంపొందించుకుంటాం. అంతేకాదు బ్లాక్‌ అయిన ఎనర్జీ విడుదలవుతుంది. శరీరం లోపల ఉండే ఎనర్జీని కూడా ఈ మసాజ్‌ సమతుల్యం చేస్తుంది. కండరాల ఒత్తిడిని పోగొట్టి అవి ఫ్లెక్సిబుల్‌గా ఉండేట్టు సహాయపడుతుంది.
 
రీ ఎనర్జైసింగ్‌ సన్‌ స్టోన్స్‌...
ఈ తరహా మసాజ్‌లో గోరువెచ్చగా ఉన్న రాళ్లను శరీరంలోని ఏడు చక్రాలపై ఉంచుతారు. వీటిని శక్తి కేంద్రాలుగా చెప్తారు. క్రీడాకారులకు, హైపర్‌యాక్టివ్‌గా ఉండేవాళ్లకు ఇది ఎంతగానో పనికి వస్తుంది. ఈ మసాజ్‌ను చేస్తే అలసట, బలహీనతలు పోతాయి. ఆరై్త్రటిస్‌, కండరాల సమస్యల వంటి వాటిపై ఈ మసాజ్‌ ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది.

No comments:

Post a Comment