Wednesday, 3 June 2015

ఇంట్లోనే హెయిర్‌ స్పా 

ఎంత బాగా తయారైనా... జుట్టు మేనేజిబుల్‌గా లేకపోయినా, నిర్జీవంగా కనిపిస్తున్నా ఒక్కసారిగా మూడాఫ్‌ అయిపోవడం చాలామందికి అనుభవమే. ఆ సమస్యకు ఇలా చేయొచ్చు..
 
ఇల్లుకదలకుండానే అందమైన జుట్టు సొంతం చేసుకోవడానికి ఇంట్లోనే చేసుకోదగ్గ ఈ హెయిర్‌ స్పా ట్రీట్‌మెంట్‌లో ఐదు దశలుంటాయి. 1. మర్దన 2. ఆవిరి పట్టడం 3. తలస్నానం 4. కండీషనింగ్‌ 5. జుట్టుకు ప్యాక్‌...
 
మర్దన: ముందుగా.. కొబ్బరి నూనె, ఆలివ్‌ ఆయిల్‌, బాదం నూనెలను సమపాళ్ళలో కలిపి గోరువె చ్చగా వేడి చేయాలి. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా మునివేళ్ళతో తీసుకుని కుదుళ్లకు బాగా పట్టించి పదిహేను నుంచి ఇర వై నిమిషాల సేపు మర్దన చెయ్యాలి.
 
ఆవిరి పట్టడం: వేడినీళ్ళలో ఒక టవల్‌ ముంచి నీళ్ళు కారకుండా పిండివేయాలి. గోరువెచ్చగా ఉన్న ఆ టవల్‌ను జుట్టంతా మూసి ఉండేలా తలకు చుట్టుకుని పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉండాలి. ఇలా చేయడం వల్ల, అంతకు ముందు పట్టించిన ఆయిల్‌ మిశ్రమం జుట్టు కుదుళ్ళకు బాగా ఇంకుతుంది.
 
తల స్నానం: గాఢత తక్కువ ఉన్న షాంపూను గానీ కుంకుడు లేదా శీకాయను ఉపయోగించి, గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. లేదా నూనె పటి ్టంచి స్టీమ్‌ ఇచ్చిన జుట్టును రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు తలస్నానం చెయ్యవచ్చు.
 
కండీషనింగ్‌: షాంపూతో లేదా కుంకుడు కాయలతో తలస్నానం చేసిన తరువాత జుట్టుకు కండీషనర్‌ అప్లై చేసి ఐదు నిమిషాల తర్వాత నీటితో కడిగేసుకోవాలి. మార్కెట్‌లో దొరికే కండీషనర్‌ వాడటం ఇష్టంలేనపుడు, రెండు కప్పుల నీళ్ళలో ఒక చెంచా టీ ఆకులు వేసి మరిగించి దానిలో రెండు చెంచాల నిమ్మరసం పిండి ఆ మిశ్రమాన్ని కండీషనర్‌గా ఉపయోగించుకోవచ్చు.
 
జుట్టుకు ప్యాక్‌: ఇక హెయిర్‌ స్పాలో ఆఖరి ద శ జుట్టుకు ప్యాక్‌ వెయ్యడం. జుట్టు తత్వాన్ని బట్టి ప్యాక్‌ను తయారు చేసుకోవాలి. పొడారిపోయినట్లుండే జుట్టుకలవారు.. గుడ్డు పచ్చసొన, ఆయులీ హెయిర్‌ కలవారు గుడ్డు తెల్లసొన, నార్మల్‌ హెయిర్‌ కలవారు గుడ్డు మొత్తంగా తీసుకుని, కొద్దిగా తేనె, కొద్దిగా కొబ్బరి నూనె కలిపి బాగా గిలకొట్టి దానిని తలకు పట్టించాలి.
 
వేడినీటిలో ముంచి పిండిన టవల్‌ను తలకు చుట్టుకోవాలి. ఇరవై నిమిషాలు తర్వాత షాంపూ లేదా కుంకుడుకాయ, శీకాకాయలతో కాని తలస్నానం చెయ్యాలి.
 
ఇలా వారానికి ఒక సారి చొప్పున నెలరోజుల పాటు చేసి, ఆ తరువాత క్రమంగా అవసరాన్నిబట్టి నెలకు ఒకటి రెండు సార్లు చేయాలి.

No comments:

Post a Comment