మనిషిని రోగాల బారి నుంచి కాపాడేది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ. మరి ఆ రోగ నిరోధక వ్యవస్థను నిరోధించేది వారసత్వంగా వచ్చే జన్యువులు.. ఇది ఇప్పటిదాకా అందరు భావిస్తున్న అంశం. కానీ, దానికి మన జన్యువులు కారణమే అయినా రోగనిరోధక వ్యవస్థను నిరోధించేది మన చుట్టూ ఉండే ‘పర్యావరణం’ అని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు. ఈ విషయాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించారు. ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్లు, ఇతర ఇమ్యూనిటీ ప్రభావాలపై పరిశోధనలు చేస్తే పర్యావరణం, కొన్ని రకాల సూక్ష్మజీవుల ప్రభావం కనిపించిందని చెప్పారు.
‘‘ఉద్యోగాలు చేసే మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లు దీర్ఘకాలిక ఒత్తిడి బారిన పడుతున్నారు. ఉద్యోగుల్లో మూడో వంతు మంది ఇదే పరిస్థితిలో ఉన్నారు’’ అంటోంది అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ స్టడీ నివేదిక. ఇందులో వెల్లడయిన ఫలితాల్ని పక్కన పెడితే ఎంతో సామర్థ్యంగా ఒత్తిడి నుంచి బయటపడే ప్రయత్నాలు చేయడంలో కూడా మహిళలే ముందున్నారు. అవేంటంటే...
No comments:
Post a Comment