Wednesday, 28 January 2015

Becareful with Bathroom current

బాత్‌ రూమ్‌ కరెంట్‌తో జాగ్రత్త

ఇంట్లో బాత్రూమ్‌కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందని అందరికీ తెలుసు. కానీ బాత్రూమ్‌ శుభ్రత విషయంలో చాలా మంది అజాగ్రత్త చేస్తుంటారు. దీంతో పాటు బాత్రూమ్‌లో ఉండే ఎలకి్ట్రక్‌ వస్తువుల గురించి చూసిచూడనట్లు కొందరు వదిలేస్తుంటారు. దీనివల్ల అనేక సమస్యలు వస్తాయి. బాత్రూమ్‌లో కరెంట్‌ షాక్‌కి తావు లేకుండా ఉండాలంటే ఈ పద్ధతులు పాటించాలి.
 ముందు బాత్రూమ్‌ బయటే విద్యుత్‌ గృహోపకరణాలు అమర్చుకోవాలి. బాత్రూమ్‌లో వాటర్‌ హీటర్‌ని వాడకపోవటం మంచిది.
 బాత్రూమ్‌లో ఎలకి్ట్రక్‌ షేవర్‌, హైర్‌ డ్రయర్స్‌, ఎలకి్ట్రకల్‌ హీటర్‌ వాడటం అంత శ్రేయస్కరం కాదు.
 చేతులు తడిగా ఉన్నపుడు విద్యుత్‌ ఉపకరణాలను, స్విచ్‌లను తగలకూడదు.
 కిచెన్‌ లేదా బాత్రూమ్‌లో తేమశాతం ఎక్కువ ఉన్న స్థలంలో పాత కరెంటు వైర్లని, బోర్డులని తొలగించాలి.
 ఎక్స్‌టెన్షన్‌ యూనిట్లను, అడాప్టర్స్‌ని బాత్రూమ్‌లో వాడకండి.
వాటర్‌హీటర్‌ని ఎలా వాడాలంటే ...
 ఎలకి్ట్రక్‌ వాటర్‌హీటర్‌ లైసెన్స్‌డు ప్లంబర్‌ లేదా నిపుణుడితో మాత్రమే బిగించాలి.
 వాటర్‌ హీటర్‌కి సంబంధించిన బోర్డు, వేడి నీళ్ళు వచ్చే పైప్‌, ఉష్ణతాకం, ప్రెజర్‌ రిలీఫ్‌ వాల్వుని తర్వాత్తర్వాత కూడా ఏ సమస్యా రాకుండా ముందుగానే జాగ్రత్తగా పిట్‌ చేయించుకోవాలి.
 వాటర్‌ హీటర్‌ వాడిన తర్వాత స్విచ్ఛాఫ్‌ చేయటం మర్చిపోకండి.
 స్టీమ్‌లో ఏదైనా తేడా వచ్చిందని గమనించిన వెంటనే నిపుణుల సహాయంతో సమస్యని పరిష్కరించుకోండి.
 వాటర్‌ హీటర్‌ని మైంటైన్‌ చేయటం, రిపేర్లు వచ్చినపుడు చూసుకునే వారు దాని గురించి ప్రాథమిక విషయాలు తెలుసుకోకుండా దాని జోలికి వెళ్ళటం
ప్రమాదకరం.
చిన్నపిల్లలు జాగ్రత్త
 చిన్న పిల్లలు స్నానం చేసేటపుడు ఆటలాడనివ్వద్దు.
 120 డిగ్రీలకంటే ఎక్కువ నీళ్ల ఉష్ణోగ్రత ఉండకూడదు.
 పాప లేదా బాబుని ఒంటరిగా బాత్రూమ్‌లో వదిలేసి బయటికి వెళ్లరాదు.
 టబ్‌లో మొదట చల్లని నీళ్లు నింపాలి, తర్వాతనే వేడినీళ్ళు పోయాలి.
 పిల్లలకి అందేట్లు షాంప్స్‌, హెయిర్‌ కలర్స్‌, డ్రయర్స్‌ లాంటివి ఉంచరాదు.
 చాలామంది బాత్రూమ్‌లో బకెట్‌లో హీటర్‌ వేసి తమ పనిలో నిమగ్నమవుతారు. పిల్లలు వెంటనే బకెట్‌లో చేయి పెట్టి కరెంట్‌ షాక్‌కి గురయ్యే ప్రమాదముంది.
 డోర్‌కి, గోడలకి మేకులు, బోల్టులు ఉంటే తీసేయండి.

No comments:

Post a Comment