Friday, 19 September 2014

stages of growth of baby during pregnency

NewsListandDetails
పిండం పెరుగుదలని మూడు దశలుగా గమనించవచ్చు. 1. ఓవ్యు లేటరీ లేదా జెర్మినల్‌ పీరియడ్‌-ఓవ్యు లేషన్‌ జరిగిన రెండు వారాల వరకు ఈ దశ ఉంటుంది.
2. ఎండ్రియోనిక్‌ పీరియడ్‌-3వవారం నుంచి 7వవారం వరకు ఉంటుంది. 3. ఫీటల్‌ పీరియడ్‌-8వ వారం నుండి డెలీవరీ అయ్యే వరకు ఫీటల్‌ పీరియడ్‌ ఉంటుంది.
ఇన్నర్‌సెల్‌మాస్‌ నుంచే పిండం తయారవుతుంది. ఇన్నర్‌ సెల్‌మాస్‌ మూడు పొరలుగా రూపొందుతుంది. పై పొర ఎక్టోడెర్మ్‌ నుంచి నాడీమండలం, కన్ను, దంతాలు, చర్మం, నోరు, ముక్కు, వెంట్రుకలు, లాలాజలం గ్రంధులు, పురీషనాళం చివరి భాగం ఏర్పడుతుంది.
రెండో పొర ఎండోడెర్మ్‌ నుంచి జీర్ణమండలం, శ్వాసకోశాలు రూపొందుతాయి. పాంక్రియాస్‌, లివర్‌, లంగ్స్‌, థైరాయిడ్‌, యురెత్రా, మూత్రాశయం, ఉమ్మనీటి సంచి ఏర్పడతాయి.
మూడవపొర మీసోడెర్మ్‌ నుంచి ఎముకలు, గుండె, రక్తనాళాలు, రక్తం, మూత్రనాళికలు, కండరాలు, జననేంద్రియాలు, పెరికార్డియం, పెరిటోనియం ఏర్పడి ఒక శరీర ఆకృతి ఏర్పడుతుంది. 13-15 రోజుల్లో ఉమ్మనీటి సంచి పెద్దదవుతుంది.
20వరోజు పిండానికి గర్భకోశంలో తాడులా ఏర్పడే బొడ్డుతాడు థాతువు ద్వారా తల్లి నుంచి పోషకపదార్థాలు సేకరించడం సాధ్యమవుతుంది.
28వరోజుకు పిండదశలో మెదడుగా రూపొందే ఒకే ఒక నాడీకణం 33సార్లు విభజన చెంది 15వందల కోట్ల కణాలు మూడు నెలల్లో తయారవుతాయి. ఆ విధంగా 3నెలలకు మెదడు ఏర్పడుతుంది. మెదడు బరువు శరీరం బరువులో పదోవంతు ఉంటుంది.
32వరోజుకి ముక్కు చెవులు, కళ్లు పెరుగుతాయి. గుండె కొట్టుకోవడం ఆరంభిస్తుంది. శ్వాసావయవాలు, ట్రకియా, లారింక్స్‌ రూపొందుతాయి.
40వ రోజుకి అన్నకోశం నిర్మాణం పూర్తవుతుంది. అస్తిపంజర నిర్మాణం ప్రారంభమవుతుంది. గుండె నిర్మాణం పూర్తవుతుంది.
50 రోజుకి నాడీమండల నిర్మాణం, కండరాల్ని చూడవచ్చు. ఎడ్రినల్‌, థైరాయిడ్‌ గ్రంధుల్ని గుర్తించవచ్చు. ఏడోవారం నుంచి పిండాభివృద్ధి వేగంగా జరుగుతుంది. పన్నెండో వారంలో బాహ్య జననేంద్రియాల్ని గుర్తించవచ్చు. 11.5 సెం.మీ పొడవుండి 14గ్రా. బరువుంటుంది. నెలలు నిండేసరికి 650మి.లీ. యూరిన్‌రోజుకి ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది.
పదహారో వారంలో చర్మం పింక్‌ కలర్‌లో ఉండి సన్నటి నూస వెంట్రుకలేర్పడతాయి. చర్మం మందంగా మారుతుంది. గర్భంలో శిశువు అటుఇటు తిరుగుతూ ఉంటుంది. పిండం పొడవు 19సెం.మీ ఉండి బరువు 100గ్రా ఉంటుంది.
20వ వారంలో అండాశయాలు,బీర్జాలు కన్పిస్తాయి. మూత్రపిండాలలోని భాగాల్ని గుర్తించవచ్చు. మెకోనియంను గుర్తించవచ్చు. చర్మం ముడతలు పడి ఉంటుంది. పిండం 22సెం.మీ పొడవుండి 300గ్రా. బరువుంటుంది.
24వ వారంలో లంగ్స్‌ గట్టిగా ఉన్నవి మెత్తగా తయారవుతాయి. శ్వాసతీసుకోవడం 11వవారంలో కన్పించిన ఇర్రెగ్యులర్‌గా 20వవారం వరకు ఉంటుంది. నిమిసానికి 30-70సార్లు శ్వాస ఆడుతుంది. బిడ్డ పొడవు 32సెం.మీ బరువు 600గ్రా ఉంటుంది.
28వ వారంలో కళ్లు తెరుస్తారు. ఆకారం సన్నగా ఉంటుంది. వినాళ గ్రంధులు 10వవారం రూపొందినా డెవలప్‌ కావడానికి టైమ్‌ పడుతుంది. గుండె, ఊపిరితిత్తుల కన్నా థైమస్‌ గ్రంధి పెద్దదిగా ఉండి దేహ రక్షణకు ఉపయోగపడే లింఫాయిడ్‌ థాతువుల్ని రూపొందిస్తుంది. బిడ్డ పొడవు 36సెం.మీ. బరువు 1 కేజీ ఉంటుంది.
32వ వారంలో చర్మం అడుగున కొవ్వు పొర ఏర్పడుతుంది. శరీర అవయవాలన్నీ రూపొందుతాయి. బిడ్డ 41 సెం.మీ ఉండి 1800గ్రాముల బరువుంటుంది.
38వవారంలో అవయవాలు సంపూర్ణంగా అభివృద్ధి చెంది ఉంటాయి. 46సెం.మీ పొడవు 2500గ్రాము బరువు ఉంటుంది. పిండం శిశువుగా తల్లి గర్భంలో 280 రోజులుంటుంది. 40వవారం వచ్చేసరికి బిడ్డ బరువు 3,200గ్రాములుంటుంది. పొడవు 50సెం.మీ, తల30-30 సెం.మీ ఉండి సంపూర్ణ ఆకృతిని కల్గి ఉంటుంది. ఇది తల్లి ఆరోగ్యం, తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది. ఫలదీకరణం చెందిన గుడ్డు పొడవు శిశువు పుట్టే సమయానికి 5వేల సార్లు పెరుగుతుంది. కాని శిశువు పెద్దది కావడానికి మూడున్నర రెట్లు మాత్రమే పొడవు పెరుగుతుంది.
పిండం దాని రక్తంను అదే అభివృద్ధి పరుచుకుంటుంది. తల్లి రక్తంలో పిండం రక్తం ఎట్టి పరిస్థితులలోను కలవదు. పిండం గర్భంలో ఉన్నంత కాలం కూడా జీర్ణమండలం గాని, శ్వాసమండలం కూడా పనిచేయదు. అందువల్ల తల్లి రక్తం నుండి పోషకపదార్థాలు ప్రాణవాయువు సరఫరా అవుతాయి.
14వరోజు ఎంబ్రియోనిక్‌ పీరియడ్‌లోనే రక్తకణజాలం రూపొందుతుంది. లివర్‌, స్ప్లీన్‌, ఎముక మూలుగ (బోన్‌మారో) రక్తకణాల్ని రూపొందించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఫీటల్‌ రక్తంలో 5-6 మిలియన్‌ రక్తం హిమోగ్లోబిన్‌ 110-150% రెటిక్యులాసైట్స్‌-5% ఎరిత్రోబ్లాస్ట్‌-10% ఉంటుంది. ఎర్రరక్తకణాల జీవితకాలం 80రోజులుంటుంది. 5-8వారాల మధ్య హిమోగ్లోబిన్‌ ఉత్పత్తి ప్రారంభమవుతుంది.
తెల్లరక్తకణాలు 2నెలల తర్వాత ఉత్పత్తి అవుతాయి. తెల్లరక్తకణాల సంఖ్య 15-29 వేలు ఉంటుంది. థైమస్‌, స్ప్లీన్‌ తెల్లరక్తకణాల్ని పెంపొందించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. దీనివల్ల 12వవారంలో మాయ ద్వారా మెటర్నల్‌ ఇమ్యూనో గ్లోబ్యులిన్‌ ఉత్పత్తి అయి పిండ రక్షణ చేస్తుంది.
ఫీటల్‌ సర్క్యులేషన్‌లో తాత్కాలికంగా నిర్మితమైన నాల్గు అవయవాలుంటాయి.
1. డక్టస్‌ దీనోసస్‌ (సిర నుండి సిరకు) ఈ రక్తనాళం అంబులైకల్‌ వెయిన్‌ నుండి ప్రాణవాయువుతో కూడిన మంచి రక్తంను ఇన్‌ఫీరియల్‌ వీనాలోనికి తీసుకొనిపోతుంది.
2. ఫోరామిన్‌ ఓవెల్‌: గుండె రెండు కర్ణికల మధ్య టెంపరరీగా ఏర్పడిన రంధ్రం అందువల్ల రక్తం కుడి నుండి ఎడమ కర్ణికకు ఈ రంధ్రం గుండా పోయి అక్కడి నుండి ఎడమ జఠరికకు నెట్టబడి అక్కడి నుండి అయోర్టాలోనికి పంపబడుతుంది.
3. డక్టస్‌ ఆర్టిరీయోసిస్‌ (ధమని నుండి ధమనికి) ఈనాళం రక్తంను పల్మోనరీ ఆర్డరీ నుండి డిసెడింగ్‌ ఆర్చ్‌లోని అయోర్టాలోకి చేర్చబడుతుంది.
4. హైపోగ్యాస్ట్రిక్‌ ఆర్టిరీస్‌: ఇవి రెండు ఇంటర్నల్‌ ఇలియాక్‌ ఆర్టరీస్‌ నుండి శాఖలై ఈ పేరుతో పిలవబడును. అవి బొడ్డు త్రాడులోనికి ప్రవేశించినపుడు అంబులైకల్‌ ఆర్డరీలుగా పిలవబడును. ఇవి చెడురక్తంను మావికి తీసుకొనిపోతుంది. అక్కడ తిరిగి శుభ్రపడి ప్రాణవాయువును స్వీకరిస్తుంది.
మావిలో శుభ్రపడిన రక్తం అంబులైకల్‌ పెయిన్‌ ద్వారా బొడ్డులోనికి ప్రవేశించి కాలేయానికి ప్రవేశించుటకు ముందు ఒక పెద్ద శాఖ విడిపోయి డక్టస్‌ వీనోసస్‌గా పోయి మంచి రక్తంను ఇన్‌ఫీరియర్‌ వీనాకేవాలోనికి చేరుతుంది. అక్కడ చెడురక్తంతో కలిసి ఇన్‌ఫీరియర్‌ వీనాకేవా నుండి కుడికర్ణికలోనికి పోతుంది. అక్కడి నుండి ఫోరామిన్‌ ఓవెల్‌ ద్వారా ఎడమ కర్ణికకు చేరుతుంది. అక్కడి నుండి ఎడమ జఠరికకు చేరి అక్కడి నుండి అయోర్టాలోకి పంపబడుతుంది. ఎక్కువ రక్తం, తల, చేతులు, నాళం గుండా పోతుంది. ఆ రక్తం సుపీరియర్‌ వీనాకేవా ద్వారా కుడి జఠరికలో పోయి అక్కడి నుండి పల్మోనరీ ఆర్డరీలోకి పోతుంది.
శిశువు పుట్టకముందు పల్మోనరీ సర్కులేషన్‌ చాలా తక్కువగా పనిచేస్తుంది. శిశువు శ్వాస తీసుకొనుట మొదలు పెట్టినందువల్ల శిశువు ఏడ్చినప్పుడు ఊపిరితిత్తులు వ్యాకోచిస్తాయి. దీనివల్ల డక్టస్‌ ఆర్డిరీయోసన్‌ నుండి ఆర్టరీన్‌లోనికి ప్రవేశించుచున్న రక్తం ఇప్పడు పల్మోనరీ ఆర్డరీస్‌ నుండి ఊపిరితిత్తులలోనికి ప్రవహించు ప్రాణవాయువును గ్రహిస్తుంది.
పిండం ప్రారంభ బరువు శిశువు పుట్టే సమయానికి 3000మిలియన్‌ సార్లు పెరుగుతుంది. 12 వారాలకి 600% పెరిగితే, 20వారాలకి 220%, తర్వాత నెలనెలకు తగ్గుతూ 120%, 90%, 50%, 20% ఉంటుంది. 9వనెలలో 20% అభివృద్ధి ఉంటుంది
నెలలు నిండిన తర్వాత యూట్రస్‌ 500రెట్లు పెరిగి కోడిగ్రుడ్డు ఆకారంలో ఉండి సుమారు కిలో బరువుండవచ్చు.
ఫలదీకరణం చెందిన అండం ఏవిధంగా కణ విభజన ద్వారా పిండంగా రూపొంది, అభివృద్ధి చెంది పెరిగి మానవాకృతిని పొందుతుందో తెలుసుకున్నారు కదా

No comments:

Post a Comment