నిమ్మరసంలో చర్మ ఛాయను మెరుగుపరిచే బ్లీచింగ్ గుణాలు అధికం. అరచెక్క నిమ్మరసానికి కొద్దిగా నీళ్లూ, అరచెంచా తేనె కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి. రెండు చెంచాల నిమ్మరసానికి చెంచా తేనె, చెంచా బాదం నూనె కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. దీనిని ముఖానికీ, మెడకీ పట్టించి ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి. దీనివల్ల తేమతో పాటూ ముఖం నిగారింపు సంతరించుకుంటుంది. మృతకణాలు తొలగించడానికి నిమ్మరసం ఎంతో ఉపయోగపడుతుంది. సగానికి కోసిన నిమ్మచెక్కని పంచదారలో అద్ది, దాంతో ముఖాన్ని సున్నితంగా రుద్దుకుంటే మృతకణాలు తొలగిపోతాయి. బ్లాక్‌హెడ్స్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో సన్నగా తరిగిన నిమ్మచెక్కతో కానీ, నిమ్మరసంలో ముంచిన దూదితో కానీ రుద్దితే ఫలితం ఉంటుంది. ముఖంపై పేరుకున్న బ్యాక్టీరియా తొలగి యాక్నే వంటి సమస్యలు పోతాయి. ముఖ చర్మమూ మృదువుగా మారుతుంది.
|
No comments:
Post a Comment