Showing posts with label Telugu short story. Show all posts

Friday, 19 June 2015
Wednesday, 20 August 2014
తరం-అంతరం (కథ)
- -కొండముది నాగసులోచన
TAGS:

...............
.............
‘నాకు ఈతరం వాళ్ళంటే అస్సలు ఇష్టం లేదు.’
‘ఏం... ఎందుకని...?’
‘ఎందుకంటావేంటి? వాళ్ళకి ఒక పద్ధతి లేదు, పాడూ లేదు. పొదుపూ లేదు, వాళ్ళ బొందా లేదు. ఒక పైసా పెట్టే చోట రూపాయి పెడ్తారు. అదేమంటే అదంతే- నీకేం తెలియదంటారు. అడగ్గూడదు. అ డిగితే రాద్ధాంతం చేశామంటారు. మా కాలంలో ఇలా ఉండేదా? మా నాన్న చనిపోయేదాకా ఆయన దగ్గరే నా కుటుంబం అంతా ఉంచాను. కిక్కురుమనటానికి లేదు. ఒక్క పైసా వెనుకేసుకోలా. ఎప్పుడో గజం రెండు రూపాయలకు కొన్నా ఈ స్థలం. ఇప్పుడిది కోట్లు, కోట్లు చేస్తుందిట! అయినా కలికాలం కాకపోతే భూమి రేట్లు ఏంటి..? ఆకాశాన్నంటుతున్నాయి. ఏదో ఆ రోజుల్లో కాబట్టి రిటైరవంగానే వచ్చిన డబ్బులతో ఈ ఇల్లు కట్టేసా. ఇప్పుడైతేనా.. చాలా అవుతుంది.
ఈ పక్కన ప్లాట్ ఓనరు లేడూ.. వాడికి చాలా పొగరు. వాడేంటి..? ఈ వీధిలో వాళ్ళందరికీ పొగరే. పెద్దవాళ్ళను గౌరవించడం రాదు. అద్సరే.. ఈ పక్కన పింజారీ వెధవున్నాడే, వాడి గురించి నీకు కాస్త చెప్తాను. వాడు ఎవరో కాదు, మా విశ్వనాథం కొడుకే. మా విస్సూ, నేను ఎంత స్నేహంగా ఉండేవాళ్ళం... సాయంత్రం అయిందంటే లోకాభిరామాయణం మాట్లాడుతూ పొద్దు పుచ్చేవాళ్ళం. వాడి కొడుకు,నా కొడుకూ కూడా స్నేహితులే. కానీ, మా విశ్వం హఠాత్తుగా పరలోకయాత్ర చేసాడు. అప్పట్నుంచీ శని మొదలైంది.
ఆ విశ్వం కొడుకు లేడూ.. వాణ్ణి ఈమధ్యకాలంలో చూళ్ళే. అమెరికాలోనే ఉంటున్నాడు. రెండేళ్ళుగా ఇల్లు పాడుపడ్డ కొంపలాగా ఉంది. పట్టించుకున్న నాథుడు లేడు. నాకు బాధేసేది. ఓ రోజు విశ్వం కొడుకూ, వాడి కుటుంబం హఠాత్తుగా వచ్చారు. ఓ మాటా లేదు మంతీ లేదు. రెండేళ్లు ఇంటిని పాడుపెట్టారు కదా, ఓ పూజో ఏదో చేయించుకోవచ్చు కదా... అహా... అదీ లేదు. అన్నింటికీ గొడవ పెడ్తున్నానని నన్నంటారు. ఓ ఇరుగూ పొరుగూ లేదు.
మొన్నటికి మొన్న... ఆ మామిడి చెట్టుంది చూశావా...? దాని పూత, ఆకులు మా లోగిల్లో పడ్తున్నయ్. కాయలన్నీ ఇటే కాస్తున్నయ్. నాకూ, వాడికి సంబంధం లేనప్పుడు వాడి చెత్త నాకెందుకు..? నాకు ఒళ్ళుమండి రోజూ ఆకులు చిమ్మించమన్నా. అదెలా కుదుర్తుంది..? అంటాడు- అంట్ల వెధవ. పనిమనిషిని పెట్టమన్నా. పనిమనుషులు దొరకట్లేదంటాడు. మాటా మాటా పెరిగింది. వాడు పక్కలో బల్లెమైపోయాడు. అందరూ వాడికే.. బోడి సపోర్టు. ఆ గొడవ తర్వాత వాడి కుటుంబమే బయటకు రావటంలా. నా దెబ్బకు పారిపోయినట్లున్నాడు. పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ..!
***
నమస్తే.. నా పేరు వాసు. పైన తిట్ల పురాణం విన్నారే, వారు మా నాన్నగారు. ఆయనంతే... ఆయన మారరు. నాకు, ఆయనకు ఓ తరం తేడా. నా అదృష్టం బాగుంది గనుక మంచి కంపెనీలో అమెరికాలో ఉద్యోగం వచ్చింది. మా పక్కింటి విశ్వనాథంగారి అబ్బాయి మధూ, నేనూ మంచి ఫ్రెండ్స్‌మే. అమెరికాలో కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. హఠాత్తుగా రెసిషన్ పీరియడ్ మామీద భూతంలా దాడి చేసింది. ఏ క్షణాన ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి.
ఓ రోజు వాడి ఉద్యోగం పోయింది. మధు పెద్దగా సంపాదించిందేమీ లేదు. పిల్లలు చదువులకొచ్చారు. ఒక్కసారిగా సమస్యలు చుట్టుముట్టేసరికి వాడు చాలా కుంగిపోయాడు. నేనూ మరికొంతమందిమీ వాడికి ధైర్యం చెప్పాం. అందరి పరిస్థితి అంతే మరి. ఒకరికొకరం ధైర్యం చెప్పుకోవడం, రేపటి గురించి తీయని కలలు కనటం.
మధు ఇండియాకి వచ్చేశాడు. హైదరాబాద్‌లోనే వాడికి ఓ మోస్తరు ఉద్యోగం దొరికింది. తండ్రి కట్టిన ఇల్లు ఎలానూ ఉంది గనుక వెళ్ళంగానే వాడికి పెద్ద బాధేమీ ఉండదనుకున్నాను. పిల్లలకు కూడా సీట్లు దొరికాయి. కానీ, వాడికి మా నానే్న పెద్ద సమస్య అయినాడు. నాకూ ఈ రెసిషన్ పీరియడ్ బాగా దెబ్బతగిలిన మాట వాస్తవమే. అయితే, మా నాన్న స్థితి, మనఃస్థితి తెలిసిన వాడినవటం వల్ల ఒక ఫ్లాట్ ముందే కొనుక్కున్నాను. కాస్త డబ్బు వెనకేసుకున్నాను. ఓ మంచి ఇండియన్ కంపెనీలోకి దూకేసాను. ఈ సంగతులు మా నాన్నకు తెలిస్తే నాలో ఉన్న ధైర్యమంతా నీరుగారిపోయేట్లు తిట్టేస్తాడు. నా కుటుంబంతో నేను అమెరికాలో సుఖంగానే ఉన్నా.
కానీ, ఓ రోజు హఠాత్తుగా మధు పొద్దునే్న ఫోన్ చేసాడు. వాడి బాధ చూస్తే నాకూ బాధ కలిగింది. ముందుగా వాడిని ఫామిలీతో సహా ఆన్‌లైన్‌కి రమ్మన్నా. అందరం సమావేశమయ్యాం. వాడు కళ్ళనీళ్ల పర్యంతమైనాడు. ‘‘ఒరేయ్ వాసూ, మీ నాన్నతో వేగడం చాలా కష్టంరా బాబూ’’ అంటూ ప్రారంభించాడు. ప్రతిదాంట్లో తలదూరుస్తానంటాడు. పైగా మనం ఇరుగు పొరుగు వాళ్ళం. నువ్వు మా విశ్వనాథం కొడుకువి. నా కొడుకులాంటివాడివి.. అనే సెంటిమెంట్ ఒకటి వాడతాడు. నేను ఆయన మాట వినకపోతే మామిడి చెట్టుని సాకుగా చేసుకుని తిడ్తున్నాడ్రా. ఇక్కడ పనిమనుషులు దొరకటం లేదు. మా ఆవిడే పనంతా చేసుకుంటోంది.
కానీ- మీ నాన్న వదలట్లేదురా బాబూ... ఆయన భయానికి మామిడి చెట్టు కొట్టేద్దామనుకుంటున్నా. పోనీ .. సర్దుకుపోదామంటే, మా పిల్లల వస్తధ్రారణ, వాళ్ళ మాటలను కూడా విమర్శిస్తూ తిట్టిపోస్తున్నాడంటూ మధు వాపోయాడు. మా ఆవిడ కలుగజేసుకుని, మా నాన్న అలా ఎందుకు చేస్తున్నాడో ఎనలైజ్ చేసింది.
కన్నకొడుకు కళ్ళముందు లేడు. ఈ తరం వారిని తిట్టడానికి కారణం- బహుశా తన ఉనికికి గుర్తింపు పోతున్నదన్న బాధ కావచ్చు. నేనూ, మా ఆవిడా మధుకి ఇంకొన్నాళ్ళు ఓపిక పట్టమని సలహా ఇచ్చాం. పాజిటివ్‌గా ఉండమని మధుకి సూచించాం. మా నాన్న ప్రవర్తన మారితే సరే, లేకపోతే మధు మరో ఇంటికి తాత్కాలికంగా మారేట్లు నిర్ణయించుకున్నాం. ఇందుకుగాను మధూ, అతడి భార్య పిల్లలు ఏం చెయ్యాలో నిర్ణయించాం. మళ్లీ కలుద్దామని, నాకు ఆఫీస్‌కి టైం అవుతుండడం వల్ల ఆన్‌లైన్‌లో విడిపోయాం.
***
మర్నాడు ఉదయం మధు గేటు తీసుకుని లోపలికి సరాసరి వస్తుంటే మా నాన్న ముఖం చిట్లించి ప్రశ్నార్థకంగా పెట్టాడు. మధు, వాడి భార్య మామిడి ఆకులు శుభ్రంగా ఎత్తి వేశారు. ‘ఇన్నాళ్ళూ మీకు కష్టం కలిగించినందుకు మమ్మల్ని క్షమించండి బాబాయిగారూ..’ అని మధు అంటే మా నాన్న అవాక్కైపోయాడు. రోజూ ఉదయానే్న ఇదే దినచర్య. మధ్యమధ్యలో ‘మావయ్యగారూ..! అత్తయ్యగారు మామిడికాయ పప్పు అమోఘంగా చేస్తారని విన్నాం. ఈ కాయలుంచండి..’ అంటూ మధు భార్య మామిడికాయలిస్తుంటే మా నాన్న మొహమాట పడిపోయి, ‘ఇదుగో.. నేను నీ మీద అరిచానని పెద్దగా మనసులో పెట్టుకోకురా అబ్బీ... నేనూ మా ఆవిడా ఇంత ఇల్లు మెంటెయిన్ చెయ్యలేకే...’ అనేసాడు.
ఆదివారం మధు పిల్లలు ‘తాతయ్యగారూ.. మాకు కొంచెం తెలుగు నేర్పుతారా... ఈ ఇండియన్ హిస్టరీ అర్థం అయ్యేట్లు చెప్పరూ..’ అని అంటుంటే మా నాన్న ఏదో నిధి దొరికినంత ఆనంద పడిపోయి వాళ్ళకోసం మళ్లీ చిన్నవాడైపోయాడు. మధు భార్య తనకున్న సందేహాలను అడుగుతూ, మా అమ్మా నాన్నలకు మరింత దగ్గిరైపోయింది.
ఇప్పుడు మా నాన్నకు, మా అమ్మకూ- ‘అత్తయ్యగారూ, మామయ్యగారూ..’ అని నోరారా పిలిచే ఓ కొడుకు, కోడలూ దొరికారు. ‘తాతగారూ..’ అని పిలిచే మనవడు, మనవరాలు దొరికారు. ప్రస్తుతం మామిడి చెట్టు ఆకులు, పూత మా నాన్నను బాధించడం లేదు. చెట్టుమీద కోకిల కూత మనోహరంగా ఉంది. నేను కూడా సమస్య అలా పరిష్కారమైనందుకు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాను.

మాతృగర్జన ( కథ)
.........
దీపావళి నాడు తెల్లారి, ఆనక మధ్యాహ్నమై, పొద్దు పడమటికి వాలినా ‘ఇంకెప్పుడు చీకటి పడుతుందిరా బా బూ..!’ అని అసహనంగా ఆరాటపడే పిల్లకాయలా ఉంది సరస్వతి. సాయంత్రం నాలుగు గంటలకు కానీ పిల్లల్ని కలుసుకోనివ్వరని తెలిసినా- కూతురు కనిపించకపోయినా, గోడలు అడ్డంగా ఉన్నా- కనీసం కొన్ని గజాల దూరంలో మాత్రమే ఉన్నానన్న తృప్తి అయినా దక్కుతుందని రెండు గంటలకే ‘రాశి’ విద్యా సంస్థల కార్యాలయానికి ఆమె వచ్చేసింది.
‘ఆరాటపు పేరంటాళ్ళు తెల్లవారక ముందే అరుగుపై తిష్టవేశారు’ అన్నట్టు సరస్వతి వచ్చేసరికే కొందరు తల్లిదండ్రులు ఉన్నారక్కడ. వాళ్ళ దగ్గరున్న సంచుల్లో రకరకాల తీపి, కారపు పిండివంటలు, చాక్లెట్లు, శీతల పానీయాలున్నాయ. ‘రాశి’ విద్యా సంస్థలు రకరకాల పరీక్షల ఫలితాలకు బాగా పేరుమోశాయి. అందుకే వందెకరాల విస్తీర్ణంలో వేలాదిమంది విద్యార్థులతో విస్తరించాయి ఆ విద్యా సంస్థలు. నెలలో ఓ ఆదివారం సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు హాస్టల్లో ఉన్న తమ పిల్లలను కలుసుకునే అవకాశం తల్లిదండ్రులకు ఇస్తుంటుంది పాఠశాల యాజమాన్యం. బిడ్డలను చూడాలన్న ఆదుర్దాతో చాలామంది మ ధ్యాహ్నం రెండు కాకుండానే వచ్చినా వాళ్ళ పిల్లల పేర్లు రాసుకునే బాధ్యత నిర్వర్తించడానికి అక్కడ ఎవరూ లేరు. అక్కడున్న సిబ్బందిని అడుగుతుంటే ‘పిల్లలను బయటకు పంపించమని హాస్టల్ వార్డెన్లకు ఫోన్ చేసి చెప్పే అధికారం ఒక్క వేణు సార్‌కే ఉంది. ఆయన మూడింటికి వస్తారు. అప్పటివరకూ ఆగండి’ అని చెపుతున్నారు.
మూడు గంటలైనా వేణు సార్ రాలేదు కానీ, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ హాలు తల్లిదండ్రులతో కిక్కిరిసిపోయింది. అక్కడ చోటులేకపోవడంతో కొందరు బయట చెట్ల కింద చేరారు. ఆ రోడ్డుకు అటూ ఇటూ వందలాది బైక్‌లూ, కార్లే. అక్కడనుంచి చూస్తుంటే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ పెద్ద రాక్షసి తలలా, దానికి అ టూ ఇటూ పదడుగుల ఎత్తు ప్రహరీ గోడలు ఆ రాక్షసి భుజాల్లా కనిపిస్తున్నాయి. ఆ గోడలపై తిరిగి ‘వై’ ఆకారంలో ఇనుప కమీలూ, వాటికి మళ్లీ ఇనుప ముళ్ళతీగా ఉన్నాయి. ఆ గోడల్ని చూస్తే సరస్వతికి రాజమండ్రి సెంట్రల్ జైలు గుర్తుకు వచ్చింది. తమ ఊరి పంచాయితీ ఎన్నికలప్పుడు జరిగిన కొట్లాటలో ఆమె తండ్రి అరెస్టయి రిమాండ్‌లో ఉన్నప్పుడు చూడడానికి ఆ జైలుకి వెళ్ళింది. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌కు కుడివైపున ఉన్న భారీ గేటు కూడా సెంట్రల్ జైలు గేటుతో పోటీపడేలా ఉంది. కొంతమంది తల్లిదండ్రులు ఆ గేటుకు దూరంగా నిలబడ్డారు. ఏవైనా వాహనాల లోపలికి వెళుతున్నప్పుడు, బయటకు వస్తున్నప్పుడు సెక్యూరిటీ గార్డులు గేటు తీసి, మళ్లీ మూస్తున్నారు. అలా తీసినప్పుడు చూస్తే గేటుకు వంద మీటర్ల దూరంలోని హాస్టల్ బ్లాక్ కనిపిస్తోంది. ఆ కొన్ని క్షణాల వ్యవధిలోనే తల్లిదండ్రులు ఆతృతగా హాస్టల్ బ్లాక్ వంక చూస్తున్నారు. ‘ఏ వరండాలోనో తచ్చాడుతూ తమ బిడ్డలు కనబడకపోతారా?’ అన్నదే వారి ఆశ. గేటు తీసినప్పుడల్లా కళ్ళు చిట్లించి చూసినా వాళ్ళలో ఏ ఒక్కరి ఆశ తీరలేదు. సరస్వతి కూడా అలా నిరాశ చెందింది. ప్రహరీ గోడమీది ముళ్ళతీగలపై వాలిన పావురాలు మెడలు లోపలి వైపుకి, బయటి వైపుకి తిప్పుతూ- పంజరాల్లో చిక్కుకున్న ప్రాణులను చూసినట్టు తమను జాలిగా చూస్తున్నట్టనిపించింది సరస్వతికి.
***
సరస్వతి చిన్నప్పుడు- ఆమె తండ్రి ముంజెకాయలు కోయడానికి తాటి చెట్టెక్కి, ఎండుకొమ్మ పట్టుకోవడంతో జారి కిందపడ్డాడు. కాళ్ళు విరిగి కొన ఊపిరితో ఉన్న అతడిని ట్రాక్టర్‌పై తణుకులోని ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. ఎంతో బలాఢ్యుడైన తండ్రిని ఆ స్థితిలో చూసేసరికి సరస్వతి గొల్లుమంది. ఎవరెంత వారించినా, కసిరినా మొండికేసి తానూ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ తెల్లటి దుస్తుల్లో ఉన్న వైద్యులు తండ్రికి చికిత్స చేయడానికి ఉరుకులు, పరుగులు పెట్టడం చూసింది. గండం గడిచి, కోలుకున్నాక తండ్రి ఆస్పత్రి నుంచి వస్తూ, చెంపల వెంట కన్నీళ్లు కారుతుండగా ఆ వైద్యులకు చేతులెత్తి మొక్కడం చూసింది. పండగలప్పుడు కూడా దేవుళ్ళకు మొక్కని తండ్రి డాక్టర్లకు చేతులు జోడించడం చూసిన సరస్వతిలో ఓ ఆలోచన రేకెత్తింది. డాక్టర్లంటే కనిపించే దేవుళ్ళంత గొప్పవాళ్ళనిపించింది. తానూ పెద్ద చదువు చదివి డాక్టర్ కావాలన్న కోరిక ఆ క్షణంలోనే సరస్వతి మనసులో హత్తుకుపోయింది. అయితే, ఆడపిల్లను పొరుగూరు పంపి చదివించడానికి ససేమిరా వీల్లేదన్న ఆమె నానమ్మ, తాతయ్యల పట్టుదలతో- కలుపుమొక్కను పెకలించినంత నిర్దాక్షిణ్యంగా ఆమె కోరికను పెకలించి వేశారు. దాంతో ఆమె చదువు ఏడవ తరగతితోనే ముగిసిపోయింది. చదువు మానాల్సి వచ్చినప్పుడు సరస్వతికి జీవితం ఎంత నాణ్యమైన విత్తనం వేసినా మొలకెత్తని చవిటిపర్రలా తోచింది. మక్కువతో పెంచుకున్న పూలమొక్కను మొగ్గ తొడక్కుండానే పశువులు మేసేసినట్టనిపించింది. తర్వాత అయిదేళ్ళకే ఆ ఊరివాడే అయిన సత్యనారాయణకు ఇచ్చి పెళ్లి చేసేశారు.
సత్యనారాయణ చదివింది అయిదో తరగతి వరకే. సరస్వతికిచ్చిన కట్నంతో కలిసి వారికిగల పొలం నాలుగెకరాలైంది. పెళ్లయిన నాలుగు నెలలకే నెల తప్పిన సరస్వతి ఆ క్షణంలోనే నిశ్చయించుకుంది. తనకు పుట్టే బిడ్డ ఆడైనా, మగైనా మెడిసిన్ చదివించాలి. తన కనుముక్కు తీరుకే కాదు, తాను నిజం చేసుకోలేని తన కలను కూడా బిడ్డ వారసత్వం గా అందిపుచ్చుకోవాలని ఆశించింది. డాక్టర్ చదువు అప్పటికే తమలాంటివారికి అందనంత ఖరీదైపోతోందని సరస్వతికి తెలుసు. ఫ్రీ సీటు తెచ్చుకోకుంటే తమకున్న నాలుగు ఎకరాలు అమ్మి మేనేజ్‌మెంట్ కోటాలోనైనా బిడ్డను చదివించాల్సిందేననుకుంది. అదేమాట భర్తతో చెప్పింది. మరో బిడ్డ అక్కరలేకుండానే మొదటి బిడ్డతోనే ఆపరేషన్ చేయించుకుంటానంది. ఆ ప్రకారమే స్వాతి పుట్టగానే కుటుంబ నియంత్రణ పాటించింది. భర్త సత్యనారాయణ కూడా తన తల్లిదండ్రులు ‘ఓ కన్ను కన్నూ కాదు, ఓ బిడ్డ బిడ్డా కాదు’ అంటూ మగబిడ్డ కోసం ఆగమని పోరు పెడుతున్నా లెక్క చేయకుండా భార్య మాటను మన్నించాడు. డాక్టర్ కావాలన్న తన జీవిత స్వప్నాన్ని స్వాతి ద్వారా నిజం చేసుకోవాలని కంకణం కట్టుకున్నా- ఎన్నడూ బిడ్డపై దాన్ని బలవంతంగా రుద్దినట్టు ప్రవర్తించలేదు సరస్వతి. మనిషి గుండెలపై బండరాయిలా తిష్టవేసిన మృత్యువును సైతం దూదిపింజలా ఎగరగొట్టగల ఆ వృత్తి ఎంత గొప్పదో చెప్పడం ద్వారా- చెలమలో నీరూరినంత సహజంగా స్వాతికే డాక్టర్ కావాలన్న కోరిక బలంగా కలిగేలా చేసింది. ఖర్చును ఖాతరుచేయకుండా ఎల్‌కెజీ నుంచే తణుకులోని ఓ కార్పొరేట్ స్కూల్లో చదివింది. స్వాతి కూడా ప్రతి క్లాసులో అగ్రస్థానంలో ఉంటూ తల్లి నమ్మకాన్ని ఏ యేటికాయేడు రెట్టింపు చేస్తూ వచ్చింది. పదో తరగతి మంచి మార్కులతో పాసైన కూతురిని నెల్లాళ్ల క్రితమే ‘రాశి’లో చేర్పించారు సరస్వతి దంపతులు. పదో తరగతి వరకూ చదువు పొరుగూళ్ళోనే అయినా రోజూ స్కూలు బస్సులో వెళ్లి వచ్చేది స్వాతి. దాంతో ఏనాడూ బిడ్డను విడిచిపెట్టి ఉండాల్సిన అవసరం రాలేదు వారికి. స్వాతిని రాశి హాస్టల్‌లో విడిచిపెట్టి వచ్చే రోజున ముగ్గురి కళ్లూ తుఫాన్ వేళ మబ్బులయ్యాయి. ముగ్గురి గుండెల్లోనూ వినబడని పిడుగేదో పడ్డంత బాదే. వెక్కెక్కి ఏడుస్తూ, బలవంతంగా చెయ్యూపుతున్న స్వాతిని విడిచిపెట్టి రావాలంటే సరస్వతికి అడుగుపడలేదు. అయితే- తనను తాను సంబాళించుకుని- తెల్లకోటు వేసుకుని, మెడలో స్టెత్‌తోరోగులను చిరునవ్వుతో పలకరిస్తున్న ‘డాక్టర్ స్వాతి’ని ఊహించుకుంటూ, ఆ అందమైన ఊహ ఊతంతో దుఃఖాన్ని తట్టుకుని, తన ఊరికి తిరిగి రాగలిగింది. ఈరోజు సత్యనారాయణ కూడా సరస్వతితో రావలసినవాడే. అతడు కూడా నెర్రెలు కొట్టిన వేళ వరినాట్లు నీటి తడి కోసం తహతహలాడినట్టు- కూతురిని చూడాలని తపిస్తున్నాడు. అయితే, చేనుపై చీడ ఆశించడంతో వెంటనే పురుగుమందు కొట్టాల్సి రావడంతో ఆగిపోయాడు.
***
చూస్తుండగానే నాలుగైంది. అప్పటికీ వేణుసార్ రాలేదు. అలాగని పిల్లలను చూసేందుకు తల్లిదండ్రులకు అనుమతినిచ్చేబాధ్యత మరెవరూ తీసుకోలేదు. ఎవరడిగినా, ఎన్నిసార్లడిగినా ఒకటే సమాధానం- ‘వేణుసార్ రావాలి’! అయిదు గంటలైనా ఆయన ఊడిపడలేదు. బిడ్డలను ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న ఆరాటంలో ఉన్న తల్లిదండ్రుల ముఖాల్లో ఉక్రోషం, ఆగ్రహం, నిస్సహాయత కలగలసి కనిపిస్తున్నాయి. ‘‘మా అబ్బాయికి వేడి వేడి బొబ్బట్లంటే ఇష్టం. హాట్ ప్యాక్‌లో తెచ్చాను. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే అవి చల్లారి పోయేవరకూ పర్మిషన్ ఇచ్చేలా లేరు’’ అని ఒక తల్లి వాపోయింది.
‘డిసిప్లిన్ ఉండొచ్చు. కానీ, ఇంత రిజిడ్‌గా కాదు. వేణుసార్ రాలేకపోతే ఆల్టర్నేటివ్ పర్సన్‌కి ఆ రెస్పాన్సిబిలిటీ అప్పజెప్పాలి తప్ప మనల్నందరినీ ఇంతసేపు వెయిట్ చేయించడం- వెరీ రూడ్ మేనేజ్‌మెంట్’’ ఓ వ్యక్తి నిరసన వ్యక్తం చేశాడు.
సరస్వతి పైకి ఏమీ అనలేదు కానీ మనసులోనే వేణుసార్‌ని బూతులు తిట్టుకుంది. మేతకోసం గూడువిడిచి వెళ్లిన తల్లి పొద్దువాలి చీకటి కమ్ముకున్నా తిరిగి రానప్పుడు పక్షికూనల్లా అక్కడున్న ప్రతి తల్లీ, తండ్రీ అసహనంతో, దుఃఖంతో వేగిపోతున్నారు. కొందరు సహనం కోల్పోయి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లోని సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. అయినా సిబ్బంది- చీకట్లో ఎంత అదిలించినా ఒకే శృతితో గీపెట్టే కీచురాళ్ళలా తొణక్కుండా ఒకేమాట చెబుతున్నారు- ‘‘వేణుసార్ రావాలి.. కొద్ది సేపట్లో వచ్చేస్తారు’’. అని
***
హాస్టల్ బ్లాక్ వెనుక పొద్దుగుంకుతోంది. ఆరైంది. అయినా వేణుసార్ జాడలేదు. బయట ఎదురుచూస్తున్న తల్లిదండ్రుల పరిస్థితి- ఏడుపొక్కటే తక్కువ అన్నట్టుంది. చీకటి పడకుండానే అందరి ముఖాలూ ఆవేదనతో నలుపెక్కాయి. ‘తమకే ఇంత బాధగా ఉంటే, తమ కోసం లోపల ఎదురుచూస్తున్న బిడ్డలకు ఇంకెంత బాధగా ఉందో? ప్రతి క్షణమూ ముల్లులా గుచ్చుకునే నిరీక్షణతో ఆ లేత హృదయాలు ఇంకెంత విలవిలలాడుతున్నాయో?’ అని అనుకుంటుంటే వారి బాధ రెట్టింపవుతోంది. హాస్టల్‌కు సరుకుల లోడుతో ఓ లారీ వచ్చింది. దాంతో గేటు బార్లా తెరిచారు సెక్యూరిటీ సిబ్బంది. లారీ లోపలికి వెళ్ళి గేటు తిరిగి మూసేలోగా హాస్టల్ బ్లాక్ దగ్గరనుంచి ‘్ధబ్’మన్న శబ్దం, ఆ మరుక్షణమే కెవ్వున కేకలు వినిపించాయి. గేటు ఎదురుగా నిలుచున్న నిలుచున్న తల్లిదండ్రులు గుండెలు గుబగుబలాడుతుండగా చరచరా గేటును సమీపించారు. వారిస్తున్న సెక్యూరిటీ సిబ్బందిని తోసుకుంటూ లోపలికి చొరబడ్డారు. దూరం నుంచే కంటబడ్డ దారుణాన్ని చూసి హాహకారాలు చేస్తూ అటువైపు ఉరికారు. హాస్టల్ బ్లాక్ మూడో అంతస్తు నుంచి కిందికి దూకేసిందో అమ్మాయి. నెత్తుటి మడుగులో గిలగిలా తన్నుకుంటున్న ఆ బిడ్డ తమలో ఎవరి పేగు తెంచుకుని పుట్టిందో? ప్రతి తల్లీ అటు ఉరుకుతూనే ఆ బిడ్డ తమ బిడ్డ కారాదని దేవుళ్ళను కోరుకుంది. వాళ్ళంతా అక్కడకు చేరుకునేసరికే బిడ్డలో చలనం ఆగిపోయింది. ఎరుపెక్కిన పడమర దిక్కున సూర్యుడు అస్తమించాడు. ఎర్రటి నెత్తుటి మడుగులో ఓ బాల్యం అస్తమించింది. అక్కడి చదువుతో పదునెక్కి, ఉన్నత శిఖరాలు చేరడానికి దోహదపడుతుందనుకున్న ఓ మెదడు- పగిలిన తలలోంచి బయటపడి ఆ ప్రాంగణంలోని మట్టిలో పడి ఉంది. దాని నుంచి స్రవిస్తున్న నెత్తుటితో పచ్చిక ఎర్రబారింది. వాళ్ళలో ఓ తల్లి- ప్రాణాలు కోల్పోయింది తాను ప్రాణాధికంగా ప్రేమించిన తన బిడ్డేనని గుర్తించి గుండెలు బాదుకుంటూ బిడ్డ శవంపై పడి ‘‘తల్లీ.. సుష్మా.. నీకు ఏ కష్టం వచ్చిందని ఇంత పని చేశావమ్మా! వేలమంది ఉంటున్నారు.. నాలుగు రోజులు పోతే నీకూ అలవాటవుతుందనుకున్నామేగానీ ఇంత అన్యాయం జరుగుతుందనుకోలేదే తల్లీ!’’ రోదించింది. ఆమె తమ బిడ్డ కాదని నిర్థారణ కావడంతో ‘అమ్మయ్యా’ అని నిట్టూర్చినా, చాలామంది అమ్మలు సాటి అమ్మ దుఃఖంతో చలించి విలపించసాగారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో ఉన్న తల్లిదండ్రులు, గేటు దగ్గరున్న సెక్యూరిటీ వాళ్ళే కాక మొత్తం సిబ్బంది అంతా అక్కడకు చేరుకున్నారు. సుష్మ దూకిన మూడో అంతస్తులో నిలబడి గొల్లున ఏడుస్తున్న పిల్లలనుంచి ఓ వార్త పాకింది. కొత్తగా హాస్టల్లో చేరిన సుష్మకు ప్రతి రాత్రీ అమ్మా నాన్నా గుర్తొచ్చి ఏడుస్తూనే ఉంది. ఆదివారం వాళ్ళు వస్తారని ఎంతో ఆశగా ఎదురుచూసింది. తెల్లవారిన దగ్గర్నుంచి ఎవరు పలకరించినా ఆ ప్రస్తావనే తెచ్చింది. పొద్దుగుంకేవేళైనా- అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌కు రమ్మన్న పిలుపు రాకపోవడంతో గుండె బరువును భరించలేకపోయింది. అంతే- పరుగు పరుగున వెళ్లి కిందికి దూకేసింది.
***
విద్యా సంస్థల సిబ్బంది అక్కడకు చేరిన తల్లిదండ్రులను వెళ్లిపొమ్మని అభ్యర్థించారు. అంతలో వేణుసార్ వచ్చాడు. వచ్చీరాగానే ‘‘ప్లీజ్.. ప్లీజ్! అందరూ బయటకు వచ్చేయండి. చనిపోయిన అమ్మాయి మెంటల్ కండిషన్ బాగాలేదు. హాస్టల్‌లో చేర్చుకోమని చెప్పినా పేరెంట్సే బలవంతంగా చేర్చారు. ఇప్పుడిలా అయింది. ఎవరైనా చేయగలిగిందేముంది? మీ పిల్లలను అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌కు పంపిస్తాం. కలుసుకుని వెళుదురుగాని.. రండి’’ బతిమాలుతున్నట్టు అన్నాడు.
కొంతసేపటివరకూ మెదడు మొద్దుబారినట్టయిన సరస్వతి అప్పటికి తేరుకుంది. ఓ బిడ్డ కళ్లెదుట నెత్తుటి ముద్దలా పడి ఉంటే తానూ, తనలాంటి తల్లులూ ఏం చేస్తున్నారు? అడవిలో పులి జింక పిల్లను నోట కరచుకుపోతుంటే ఏమీ చేయలేని పెద్దజింకల మందలా చూస్తున్నారు. ఇదేనా తాము చేయాల్సింది? సిగ్గుతో, రోషం తో, దుఃఖంతో సరస్వతి ముఖం ఎర్రబారింది. పడమరన గుంకిన పొద్దు ఆమె ముఖంలో చేరినట్టయింది. మడుగు కట్టిన నెత్తుటిలో తన కూతురు స్వాతి ముఖం ప్రతిబింబిస్తున్నట్టూ, ఆమె మెడలో స్టెతస్కోపుకు బదులు ఉరితాడు ఉన్నట్టు అనిపించింది. కూతురిని డాక్టర్ని చేయాలన్న కోరిక- గోదావరి గట్టు తెగిన వేళ వరి మొలకలా కొట్టుకుపోగా, ఆమె అపాయంలో ఉందన్న భీతి క్షణ క్షణానికీ ఉప్పొంగే వరద గోదావరిలా పెరిగిపోయింది. ఆరుగంటలవరకూ పత్తాలేని వేణుసార్‌ఓ పిల్ల ప్రాణం పోయాక వచ్చి- తప్పును ఆ పిల్లపైనే నెడుతున్నాడు. తప్పు ఆ పిల్లదికాదు- ఆ వేణుసార్‌దీ, ఈ విద్యా సంస్థదీ, తమలాంటి తల్లిదండ్రులదీ అన్న నిజం ఆమెకు నెత్తుటి రంగు ఎరుపు అన్నంత నిశ్చయంగా తోచింది. అకస్మాత్తుగా అరిచింది- ‘‘అమ్మా.. స్వాతీ.. స్వాతమ్మా! ఎక్కడున్నావు తల్లీ?’’ ఆ అరుపు ఆమె ఒక్క గొంతుదిలా కాక అక్కడున్న అమ్మలందరూ అరిచినంత బిగ్గరగా ఉంది. పురిటినొప్పులవేళ కలిగిన వ్యధార్తికి వందల రెట్లు ఎక్కువగా ఉంది.
వేణుసార్ సరస్వతికి దగ్గరగా వచ్చి ‘‘ఎందుక మ్మా అలా అరుస్తావు? ఇక్కడ అసలే పరిస్థితి బాగాలేదు..’’ మందలింపుగా అన్నాడు.
‘‘నువ్వు నోర్ముయ్యరా పనికిమాలిన నా కొడకా! నీవల్ల కాదూ ఇంత ఘోరం జరిగింది? అసలు ఇది చదువు చెప్పే చోటా, బిడ్డల్ని బలి ఇచ్చే చోటా? ఇంత జరిగాక నా బిడ్డను ఒక్క క్షణం ఇక్కడుంచను. అమ్మా.. స్వాతీ! అమ్మనొచ్చాను.. వచ్చెయ్యమ్మా! మనింటికి వెళ్లిపోదాం వచ్చెయమ్మా...!’’ ఆ సమయంలో సరస్వతి మామూలుగా లేదు. తన కూనకు హాని జరుగుతుందని పసిగట్టినవేళ తాండవమాడుతున్న సివంగిలా ఉంది. హాస్టల్ వరండాల్లో చేరిన పిల్లల్లో ఎక్కడుందో గానీ, స్వాతి బావురుమంటూ దూసుకుంటూ వచ్చి ఒక్కాసారి తల్లిని వాటేసుకుంది. ఓ భుజాన కారప్పూస, సున్నుండలున్న సంచి వేలాడుతుండగా, మరో భుజానికి కూతురిని ఎత్తుకుని చకచకా అలవోకగా గేటువైపు నడిచింది.
‘‘ఏంటమ్మా..! ఇది నీ ఇల్లు కాదు. రాశి ఇన్‌స్టిట్యూషన్. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి వీల్లేదు’’ అడ్డుపడబోయాడు వేణుసార్. ఓ తల్లి కన్నబిడ్డ ఓ పక్కన శవంగా పడి ఉంది. మరో పక్కన ఇంకో తల్లి తన బిడ్డను కాపాడుకోవడానికి ఉగ్రరూపం ధరించింది. అయినా వాడికి వణుకు పుట్టలేదు. కారణం- ఆ విద్యా సంస్థ యజమాని బంధువు ఓ ఎమ్మెల్యే కావడం. ఆ పలుకుబడికి తోడు ఏటా కోట్ల రూపాయల్లో మీడియాకు ప్రకటనలిస్తుంటారు. హాస్టల్ పిల్లలు మరణించిన సంఘటనలు ఇంతకుమునుపూ జరిగినా, తమ సంస్థలో బిడ్డలను చేర్చేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. అదే వేణుసార్ ధీమాకు కారణం.
‘‘అడ్డు తప్పుకుంటావా? కాలెత్తి తన్నమంటావా?’’ తప్పుకోకపోతే తన మాటకూ, చేతకూ వెంట్రుకవాసి తేడా ఉండదన్న నిశ్చయం ధ్వనించింది సరస్వతి హెచ్చరికలో.
కాస్త జంకిన వేణు చివరి అస్త్రం ప్రయోగించాడు. ‘‘మీ అమ్మాయిని ఇప్పుడు తీసుకుపోతే- మళ్లీ చేర్చుకోం. అంతేకాదు- మీరు కట్టిన డబ్బులో పైసా కూడా తిరిగివ్వం’’. డబ్బుకన్నా మనిషిని నియంత్రించేది ప్రపంచంలో మరేదీ లేదన్నది అతడి నమ్మకం.
సరస్వతి గర్జించింది.
‘‘పోరా..! ఓ పంట పండలేదనుకుంటాం. అంతే తప్ప మా కడుపు పంటను మీ పొట్టన పెట్టుకోనిస్తామా?’’
వేణు ఇక మాట్లాడలేకపోయాడు. బొమ్మలా ఉన్నచోటే నిలబడిపోయాడు. చరిత్రను తిరగరాసి విజేతగా నిలిచిన ఝాన్సీ లక్ష్మీబాయిలా- బిడ్డను అలాగే మోసుకుంటూ చకచకా నడిచి, గేటు దాటింది సరస్వతి. తాను డాక్టర్ కాలేకపోయినా తన కూతురిని ప్రాణగండం నుంచి కాపాడుకున్నానన్న తృప్తి మెరిసింది ఆమె మొఖంలో! గేటు దగ్గరన్న సెక్యూరిటీ సిబ్బందే కాదు- అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ సన్‌షేడ్ పైనున్న పావురాలు కూడా సరికొత్త దృశ్యాన్ని చూస్తున్నట్టు బిత్తరపోయాయి. *

అనసూయ అసూయ (కథ)
- పెళ్లిమండపంలో అప్పటివరకూ మోగిన బాజాలు సేద తీరుతున్నాయి. ముహూర్తానికి ఇంకా టైముంది. పెళ్లికొచ్చిన చుట్టాలతో కుర్చీలన్నీ నిండిపోయి ఉన్నాయి. పట్టుచీరల గరగరలు, సిల్కు పంచెల చరచరలు, పట్టుపావడాల పరవళ్లు, సఫారీ డ్రెస్సుల ఏకీకృత రంగులు, కోట్లు వేసుకున్న కోటీశ్వరులతో... అంతా ఆనందమయంగా ఉంది.
‘‘బాబాయ్.. ఆ అమ్మాయి ఎవరు..? ఎక్కడో చూసినట్లుంది. గానీ ఎవరో గుర్తుకురావడం లేదు. సింపుల్‌గా, హుందాగా ఉంది. నీకు మన బంధువర్గంలో తెలియనివారుంటూ లేరు గదా..’’ అడిగింది అనసూయ తన పక్కనే కూర్చున్న బాబాయి సత్యనారాయణతో.
‘‘ఆ అమ్మాయి నీకు వరసకు చెల్లెలవుతుంది. తెనాలిలో పండ్ల వ్యాపారం చేసే మీ దూరపు బంధువు సుబ్బారావు బాబాయి రెండో కూతురు. మీ నాన్న సంబంధీకులకు, సుబ్బారావు సంబంధీకులకు ఉన్న వైరం కారణంగా మీమధ్య రాకపోకలు లేవులే. అయినా పిల్లలేం చేశారు? మీ హయాంలోనన్నా కలసి మెలసి ఉండండి’’ అని, ‘‘అమ్మాయ్.. సరోజా..’’ అంటూ పిలిచాడు.
పదేళ్ళ కూతురు చేయి పట్టుకుని నెమ్మదిగా నడచి వెళుతున్న సరోజ సత్యనారాయణ కేకకు పక్కకు తిరిగి చూసి ‘‘బాబాయ్.. పిలిచావా?’’ అంటూ దగ్గరకొచ్చింది.
‘‘రామ్మా.. ఈమె మీ గుంటూరు పెదనాన్న కూతురు అనసూయ. ఇప్పుడు ఈమె అక్కడ పెద్ద లీడింగు లాయరు. ఈమె భర్త మోహన్ కూడా పెద్ద లాయరేలే. మీ కుటుంబాల మధ్య సామరస్య లోపం కారణంగా సంబంధాలు లేవు. ఇప్పుడు పెద్దవాళ్ళు పోయారు. వాళ్ళతోపాటే పంతాలు, పట్టింపులూ పోయాయి. ఇక మీరన్నా బంధుత్వాలు కలుపుకోండి..’’ అన్నాడు.
‘‘నమస్కారం అక్కా..’’ అంటూ నమస్కరించింది సరోజ అనసూయకి.
సరోజను చూసి అనసూయ సంతోషంతో పొంగిపోయింది. ‘నమస్కారం, కూర్చో..’ ఖాళీగా ఉన్న పక్క సీటు చూపించింది. సరోజ కూర్చుని, కూతుర్ని తన ఒళ్లో కూర్చోబెట్టుకుంది.
సరోజ కూతురు స్వప్న గడ్డం పట్టుకుని నిమురుతూ, ‘‘ఏం చదువుతున్నావ్ పాపా?’’ అంటూ ఎంతో ఆప్యాయంగా అడిగింది అనసూయ.
‘‘సెవెంత్ క్లాస్’’ ముద్దు ముద్దుగా చెప్పింది స్వప్న.
‘‘ఏ స్కూల్లో?’’
స్వప్న చెప్పిన ఆ ఇంటర్నేషనల్ స్కూలుపేరు విని అనసూయ అవాక్కయిపోయింది. అది సెంట్రల్ ఎ.సితో కూడిన- దక్షిణ భారతదేశంలోనే చెప్పుకోదగ్గ స్కూలు. అక్కడ ఎల్‌కెజిలో చేర్చడానికే డొనేషన్ లక్షల్లో ఉంటుంది. తమలాంటి మధ్య తరగతివాళ్ళకు అది ఊహలకు మాత్రమే పరిమితం.
‘‘సరోజా.. మీ ఆయనేం చేస్తుంటాడు?’’ ఆతృతగా అడిగింది అనసూయ.
‘‘అమ్మాయ్ సరోజా. వాళ్ళాయన ప్రసాదరావని గొప్ప ఇంజనీరు. పెద్ద బిల్డరు. నీవు వినే వుంటావు. విజయవాడలో రోజా అండ్ సరోజ కన్‌స్ట్రక్షన్స్‌కు అధిపతి. వ్యాపారం కోట్లలో ఉంటుంది. ఆయన సొంతూరు బాపట్ల. ఈ సంబంధం ఒకప్పుడు నీకూ వచ్చి తప్పిపోయిందే..’’ చెప్పాడు సత్యనారాయణ.
అనసూయకు అంతా గుర్తొచ్చింది. అవును.. ఈ సంబంధం తనకూ వచ్చిందే. పెళ్లిచూపుల్లో తనకు సరిగా మర్యాద చేయలేదని అలిగి వెళ్లిన పెళ్లికొడుకు ప్రసాదరావు తనకు చూచాయగా గుర్తే. అంతేగాక తన తండ్రి తరువాత రోజుల్లో చెప్పాడు. ఆ బాపట్ల ప్రసాదరావు బిల్డరుగా కోట్లు సంపాదించాడని, దేనికైనా పెట్టి పుట్టి ఉండాలని అనేవాడు. అంతేగాక అతను మనవాళ్లలో- మనకంటే లేని అమ్మాయిని చేసుకున్నాడని చెబుతుండేవాడు. అయితే- ఆ ప్రసాదరావు ఈ సరోజను చేసుకున్నాడన్నమాట.
ఆమె ప్రమేయం లేకుండానే ఆమె మనసు ఈర్ష్య తో రగిలిపోయింది.
‘‘నువ్వెంతవరకు చదివావ్ సరోజా?’’
‘‘నేను బియస్సీ గ్రాడ్యుయేట్‌ని అక్కా’’
‘‘ఏం చేస్తుంటావ్, అంటే- ఏదైనా జాబ్ చేస్తున్నావా?’’
‘‘ఉద్యోగమా? పాడా? హౌస్‌వైఫ్‌ని. పాప చదువు, ఇంట్లో పని, గార్డెన్ పర్యవేక్షణ.. దీంతోనే సరిపోతుందక్కా. ఇంకా జాబ్ చేయడం కూడానా?’’.
‘‘తోటంత పెద్దదా? ఇంట్లో పనివాళ్లుంటారుగదా. చదువుకున్న దానివి. నీకు పొద్దుపోవడం కష్టమా?’’
‘‘ఇంట్లో పనివాళ్ళు లేకేం అక్కా. అరడజను మందిపైనే ఉన్నారు. ఒక తోటమాలి, వాడి భార్య ఇంట్లో పనిమనిషి. ఆమెగాక వంటమనిషి. పైపనులు చూడ్డానికి ఓ మనిషి. అంటే కుక్కలను రెండు పూటలా బయట తిప్పడం, వాటికి స్నానం చేయించడం, వాటికి తేదీలవారీగా డాక్టరు దగ్గరకు తీసుకెళ్లి ఇంజక్షన్లు వేయించడం, ఇంకా బజారుకు వెళ్లడం లాంటివి చేస్తాడు. ఇంకొకాయన కారు డ్రైవరు. ఉదయం పాపను స్కూల్లో వదలిరావడం, మళ్లీ తీసుకురావడం. ఎప్పుడైనా తెలిసిన స్నేహితురాళ్ల ఇంటికి తీసుకుపోవడానికి, ఇలా పెళ్లిళ్లకు తీసుకురావడానికి అతనుంటాడు. మావారు పూర్తిగా ఓ కారు మాకిచ్చేశాడు. ఆయన పనులకు ఆయన కారు వేరేగా ఉంది. పగలు డ్యూటీకి ఒక గూర్ఖా, రాత్రి డ్యూటీకి మరో గూర్ఖా. ఇంతమందిని పర్యవేక్షించడం కష్టమే గదా. ఇంకా నాకు ఉద్యోగం చేసే తీరికుందంటావా అక్కా?’’
‘‘ఇల్లెలా ఉంటుంది. తోట పెద్దదేనా?’’ ఏదో ఆలోచిస్తూ అడిగింది అనసూయ.
‘‘ఎకరం స్థలంలో తోట. తోట మధ్యలో కట్టిన డ్యూప్లెక్స్ హౌస్. నువ్వు మా ఇంటికొచ్చి నాలుగు రోజులుండక్కా... అన్నీ తీరిగ్గా చూపిస్తాను. బాగా ఎంజాయ్ చేద్దాం’’ ఆశగా అడిగింది సరోజ.
‘‘అలాగేలే సరోజా.. ఒక రోజు వస్తాను. అన్నీ చూపిద్దువు గాని’’
పెండ్లి మేళాలు మోగటంతో అందరూ తమ తమ మాటలు ఆపి పెండ్లి తంతు చూడసాగారు.
పెళ్లి కార్యక్రమం చూస్తున్నా అనసూయ హృదయమంతా ఆవేదనతో దహించుకుపోసాగింది. తన ఐశ్వర్యాన్ని, వైభవాన్ని సరోజ తన్నుకుపోయినట్లు భావించ
సాగింది. తమ డాబా ఇల్లు. తాము ఉపయోగించే స్కూటర్లు.. ఇలా పెళ్లిళ్లకు రావడానికి కూడా కారులో ఖర్చని ఆఖరుకు బస్సుల్లో రావడం.. అంతా ఆమెకు వేదనను కలిగించసాగింది. ఇక అక్కడ ఉండలేక ఏదో పని ఉన్నట్లు అక్కడనుంచి లేచి వడివడిగా నడిచి మూడు వరుసల వెనుకకు వచ్చి అక్కడున్న ఓ కుర్చీలో కూర్చుంది.
తలంబ్రాలు వేసేటప్పుడు- అంతవరకూ ఎక్కడున్నాడోగాని సరోజ భర్త కూడా పెళ్లిపీటల దగ్గరకు చేరుకున్నాడు. ఇద్దరూ పెళ్లికుమార్తె, పెళ్లికుమారుడి ఎదుట నిలుచుని అక్షింతలు వేశారు.
సరోజ భర్తను చూసిన అనసూయకు ఇంకా తెలియకుండానే అసూయ ఎక్కువైంది. జంట ఎంతో అందంగా ‘ఒకరికోసం ఒకరిని దేవుడు సృ ష్టించి’నట్లుగా ఉన్నారు. ఆమె భర్త ప్రసాదరావు ఖరీదైన సూటులో మెరిసిపోతున్నాడు. అక్షింతలు వేసిన తరువాత నేరుగా భర్తను తీసుకుని అనసూయ వద్దకు వచ్చింది. భర్తను పరిచయం చేసింది.
‘‘ఈమె మా అక్క అనసూయ.. బంధువులమైనా అనేక కారణాల వల్ల మేము కలుసుకోలేకపోయాం. ఇపుడు మా సత్యనారాయణ బాబాయి ద్వారా ఒకరినొకరం తెలుసుకున్నాం..’’.
సరోజ మాటలు ఆమెకు కర్ణకఠోరంగా ఉన్నాయి. తన నోటికాడి ఆహారం లాక్కున్న రాక్షసిలా అనసూయ దృష్టిలో ఆమె ఉంది.
‘హాయ్..’ అన్నాడు ప్రసాద్.
అనసూయ సిగ్గుల మొగ్గవుతూ తిరిగి ‘హలో’ చెప్పింది.
ఇంతలో సరోజ కూతురు మంచినీళ్లు కావాలని అడగడంతో ‘‘అక్కా.. మీరు మాట్లాడుకొంటుండండి. నేను పాపకు మంచినీళ్లు తాగించి వస్తా’’ అంటూ ముందుకు నడిచింది.
‘‘మరోలా అనుకోకపోతే మిమ్మల్నొకటడగుతాను. మిమ్మల్ని ఎక్కడో చూసాను. కానీ- ఎక్కడ చూసానో జ్ఞాపకం రావడంలేదు. మీకేమయినా నన్ను చూసినట్లు గుర్తుందా?’’ స్టైల్‌గా అడిగాడు ప్రసాద్.
అనసూయకు రోషం ముంచుకొచ్చింది. సరోజ వచ్చేలోగా తన మనసులోని ఆవేదననంతా వెళ్లగక్కాలని ఉంది. ‘‘అవును.. మీరెందుకు తెలియదు. పనె్నండేళ్లనాడు మా ఇంటికి పెళ్లిచూపులకొచ్చారు. మీకు సరిగా మర్యాదలు చెయ్యలేదని అలిగిపోయారు. లేకపోతే నేను ఈరోజు సరోజ స్థానంలో ఉండాల్సినదాన్ని...’’ తొందరపడి అనేసింది.
ప్రసాద్ ఆవేశపడకుండా, ‘‘అవునండీ. ఇప్పుడు నాకు బాగా గుర్తొచ్చింది. ఆ రోజు పెళ్లిచూపుల్లో నేను మిమ్మల్ని బాగా ఇష్టపడ్డాను. కట్నాలు కూడా ఆశించలేదు. మా మామయ్య తొందరపాటువల్ల మీ సంబంధం చెడిపోయింది. చాలాకాలం వరకూ మీరు నా మనసులో మెదులుతూనే ఉన్నారు. జరిగిందానికి మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను’’ అన్నాడు బాధ వ్యక్తపరుస్తూ.
ప్రసాద్ గుండెల్లో తనకున్న స్థానానికి మురిసిపోయింది అనసూయ.
‘‘మీ ఆయన పెళ్లికొచ్చాడా? మీకు పిల్లలెందరు?’’ మళ్లీ అడిగాడు.
‘‘మా ఆయన అర్జంటు కోర్టు పనిమీద ఊళ్ళోనే ఉండిపోయారు. మాకు ఇద్దరబ్బాయిలు. వాళ్ళను కూడా పెళ్లికి తీసుకురాలేదు’’.
‘‘మీకు ఇద్దరు పిల్లలా? అదేదో టివి యాడ్‌లో చూసినట్టు ‘మమీ’ అంటూ కూతురొచ్చి తల్లిని కౌగిలించుకొనేదాకా ఆమె తల్లని ఎవరికీ తెలియదు. పెళ్లికాని ముగ్ధలాగే వయసు పైబడకుండా ఉంటుంది. అలా సౌందర్యాన్ని కాపాడుకొంటున్నారు మీరు..’’.
అనసూయ ఏం మాట్లాడకుండా సిగ్గుతో తలవంచుకుంది.
‘‘మీరు ఎప్పుడయినా ఫోను చేసి రండి. మి మ్మల్ని నా ఏ.సి. కారులో విజయవాడంతా తిప్పి చూపిస్తాను. దేవాలయాలు, సినిమాలు, పార్కులు అన్నిటికీ వెళ్దాం. మీరు కోరిన హోటల్లో మీకు ఇష్టమైనవి తినిపిస్తాను. ఇలాగయినా ఆనాడు మీకు జరిగిన అన్యాయానికి న్యాయం చేస్తాను’’ అంటూ జేబులోంచి తన ఖరీదైన విజిటింగు కార్డు ఇచ్చాడు. ఇంతలో ఎవరో బంధువులామె అనసూయని పిలుస్తూ వచ్చేసరికి అక్కడనుంచి వెళ్లిపోయాడు. ప్రసాద్ ఇచ్చిన విజిటింగు కార్డును పదిలంగా పర్సులో పెట్టుకుంది.
బఫేలో భోజనాలను ప్లేట్లలో పెట్టుకుని ఒక పక్కగా వచ్చి తినసాగారు అనసూయ, ఆమె స్నేహితురాలు. తన అదృష్టాన్ని సొంతం చేసుకుందని భావిస్తున్న సరోజ తనను పిలుస్తున్నా వినిపించుకోకుండా తప్పించుకుని తిరుగుతోంది అ నసూయ.
‘‘ఏమిటే వాడితో అంత క్లోజుగా మాట్లాడుతున్నావు’’ స్నేహితురాలి మాటలకు ఉలిక్కిపడింది.
‘‘ఆయనో పెద్ద బిల్డరు విజయవాడలో. కోటీశ్వరుడు. అలా అనకు’’ అంది అనసూయ.
‘‘అంతే నీకు తెలిసింది. అతను సరోజను పెళ్లిచేసుకోకముందే రోజా అనే తన కొలీగ్.. తమిళమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు. ఆమెకొక కొడుకు కూడా. ఆమెతో విజయవాడ పడమటలో కాపురం. ఎప్పటికో విషయం తెలిసిన సరోజ ఏమీ చేయలేక- అంతా తన ప్రారబ్దం అని సరిపెట్టుకుంది. అఫిషియల్ ప్రోగ్రామ్స్‌కు రోజాను భార్యగా తీసుకుపోతాడు. బంధువుల పెళ్లిళ్లకు సరోజకు భర్తగా వస్తాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సరోజ చాలా మంచిది. బాధను దిగమింగుకుని కూతురి కోసం బతుకుతోంది’’.
స్నేహితురాలి మాటలతో- అంతవరకూ ఈర్ష్యతో సరోజమీద పెంచుకున్న అసూయ అనసూయలో ఎగిరిపోయింది. తను చదువుకున్నదై కూడా పక్కవాళ్ల సుఖం చూసి ఓర్చుకోలేకపోయినందుకు బాధపడింది. ఇప్పుడు సరోజపై విపరీతమైన జాలి, అంతులేని ప్రేమ ఏర్పడింది.
భోజనం పూర్తయి చేయి కడుక్కున్న వెంటనే బ్యాగులోంచి ప్రసాదరావు విజిటింగు కార్డు క్రిందపడేసి కాలితో నలిపేసింది. ఊరికి వెళ్తున్నానని చెప్పడానికొచ్చిన సరోజను ప్రేమగా కౌగిలించుకుని నుదుట మీద ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంది. *

అదృశ్య భల్లూకం (కథ)
కన్నడ మూలం: మంజు యం.దొడ్డమణి అనువాదం: కల్లూరు జానకి రామారావు
లెక్కలేనన్ని రంధ్రాలతో చినిగిన బనియన్ తొడుక్కుని, తెగిపోయిన హవాయి చెప్పును పిన్నుతో కుట్టి- కుంటి లింగన్నగాడు ఏకబిగిన కుంటుకుంటూ ఎగబీలుస్తూ, ఇంటి అరుగుమీద కూర్చున్న గాజుల శివప్పకాడికి వచ్చి, ఎగూపిరి దిగూపిరితో నిల్చున్నాడు. వాణ్ని చూడగానే గాజుల శివప్పకి ఆరాటం ఎక్కువైంది. ‘‘ఏందిరా.. కుంటోడా, ఇట్లా లగెత్తుకుని ఆయాసపడుకుంటూ వచ్చినావేందిరా? ఏమయినాదిరా?’’ అని సముదాయించే సమయంలోనే కుంటోడు సరోజ చావు విషయాన్ని ఆద్యంతమూ చెప్పగానే విని గాజుల శివప్ప కుప్పకూలినంత నిశ్శక్తుడైనా, నిలదొక్కుకుని వస్తున్న దుఃఖాన్ని అతికష్టంమీద ఆపుకుంటూ, కుంటోడు చెప్పిన ఈ విషయం నిజం కాకూడదని వేయి దేవుళ్లకి మొక్కుకుంటూ, నదివైపు త్వరత్వరగా అడుగులు వేశాడు. శివప్ప వెనకాలే బయల్దేరాడు కుంటోడు.
***
కొనే్నళ్ల క్రితం బస్సు సౌకర్యమే లేని ఈ కుగ్రామానికి ఇసుకను సాగేసే ఓ లారీలోంచి ఎక్కణ్నుంచో వచ్చి ఇక్కడ దిగాడు కుంటోడు. నది ఒడ్డున శివలింగేశ్వరస్వామి గుళ్లో పూజారి పంచిపెడుతున్న ప్రసాదంతో కడుపు నింపుకుని రాత్రీపగలూ అక్కడే గడుపుతూ వుండేవాడు. రాను రానూ తానొక అనాథనని, ఊరూరూ తిరుగుతూండే బికారినని చెప్పుకుంటూ పూజారి సానుభూతిని సంపాదించాడు. కొందరి ఇళ్ళల్లో, పొలాల్లో పనే్జసి వాళ్లిచ్చిన చిల్లర కాసుల్ని పోగుచేసుకుని, అప్పుడప్పుడు లారీలని క్లీన్ చేస్తూ లారీ డ్రయివర్లు ఇచ్చిన పైసల్తో, వారానికోసారైనా దూరంగా వున్న పట్టణానికెళ్లి ఇంగ్లీషు చిత్రాలనాడిస్తున్న టెంట్లలోకెళ్లి సినిమాలని చూసి వచ్చేవాడు. ఇంగ్లీషు సినిమాలంటే కుంటోడికి ఎక్కడలేని వ్యామోహం. అయితే, వూళ్లోవాళ్లెవళ్లకీ ఈ విషయం తెల్సేదే కాదు. ఈ విషయం ఎవ్వరికీ తెలియనీయకుండా చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు. వాడి మంచితనాన్ని గమనించిన దేవస్థానపు కార్యదర్శి, పూజారి- గుడికో కావలివాడు దొరికాడని, గుడి కాంపౌండుకానుకొనున్న ఓ చిన్న పెంకుటింటిని వాడు ఉండటానికి కేటాయించారు. కుంటోడు సహితం వూరివాళ్లు తనపైన వుంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా కాలం గడిపేవాడు. కుంటి లింగడి పూర్తి పేరేమిటనేది వూళ్లోవాళ్లెవరికీ తెలీని విషయం. వాడు మాత్రం తన పేరు లింగారాజని చెప్పుకుంటూ తిరిగేవాడు. లింగడు పుట్టుకతోటే కుంటోడు కాదు. అడవిలో ఓసారి తేనెపట్టును తీయబోయి, చెట్టునుండి కిందపడితే కుడికాలికి పెద్ద దెబ్బ తగిలింది. అయితే, దానికి సరైన చికిత్స ఏదీ చేసుకోకపోగా కుంటుతూ నడవటం ప్రారంభించాడు. ఆనాటినుంచి వాడు కుంటి లింగడయ్యాడు.
***
నదికి ఫర్లాంగు దూరంలో పొదల నడుమ పడున్న శవాన్ని గుంపులో కొందరు గుర్తుపట్టారు. అర్ధనగ్నంగా పడున్న ఆ శరీరాన్ని ఎవరో పుణ్యాత్ముడు తాను కట్టుకున్న పంచనే విప్పి చచ్చిన ఆ యువతి శరీరంపైన కప్పాడు. చచ్చిపడున్నది గాజుల శివప్ప కూతురు సరోజ! పెద్దమనిషై ఎన్నో నెలలు కాలేదు. పాపం..! తల్లి ప్రేమే ఎరగక తండ్రి ఆసరాలో పెరిగిన అమాయక ఆడకూతురు. పొద్దు పొడవకముందే లేచి, తండ్రి వద్దంటున్నా నదీ తీరానికొచ్చిన రెండు గంటల్లోపే శవమైపోయింది.
శవం చుట్టూ చేరిన అమాయకపు జనాల అనుమానమంతా ఆ కనిపించని ఎలుగుబంటిపైనే! ఓ నెలకిందట పొ లం కాపు కాయను వెళ్లిన చిన్నవ్వ తన పొలంలోనే ఇలాగే శవమైపోయింది.
అతి చిన్నవయసులోనే పెళ్లయి, పెళ్లయిన కొన్ని రోజులకే రోడ్డు ప్రమాదానికి గురై భర్తను కోల్పోయిన అభాగ్యురాలు చిన్నవ్వ. భర్తకున్న మూడెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ వుండేది. ఎవరిముందు చేయిసాచక, మగాడివలే పొలంలో ఒకర్తే పనిచేసుకుంటూ వుండే ధైర్యవంతురాలైన ఆడది. అవసరమైనపుడు మాత్రమే ఓ ఇద్దరు కూలీలని పెట్టుకుని వ్యవసాయపు పనులు చేసుకుంటూ వుండేది. గవర్నమెంటు వాళ్ల సాయంతో బోర్‌వెల్ తవ్వించి దానికో చిన్న షెడ్డు కట్టించుకుంది. ఎన్నో రాత్రులు చిన్నవ్వ అదే షెడ్డులో నిర్భయంగా పొలం కాచుకుంటూ కాలం వెళ్లబుచ్చింది. ఒంటరిగానే జీవనాన్ని గడపటం ఆమెకు అలవాటైపోయింది.
ఆ రాత్రి- పంట చేతికి వచ్చి నిల్చిన సమయంలో తానే ఒంటరిగా కావలి కాయను వెళ్లింది. వెళ్లేటప్పుడు తనకెదురైన కుంటోణ్ని పలకరించింది. అయితే దాని దురదృష్టం.. అదే దాని కడపటి రాత్రి అయ్యింది. తాను నివాసముండే షెడ్డుకు కొంచెం దూరంలోనే- మనిషెత్తు పెరిగిన చెరకు తోట మధ్య చిన్నవ్వ శవం అనాథగా మిగిలింది. నక్కలపాలైన చిన్నవ్వ శవాన్ని మొదట చూసింది కుంటోడే. చిన్నవ్వ మరణవార్త వూరి జనానికి చేరవేశాడు. చిన్నవ్వ నిగూఢ మరణం వూరివారందరికీ కొరకరాని కొయ్య అయ్యింది. ఈ రహస్యాన్ని ఛేదించాలని, మరణానికి కారణాన్ని తెలుసుకోవడం కోసం వూరి జనాలు ముందుకు రాగా- సాయంత్రం ఒకచోట కనిపించిన ఎలుగుబంటి.. నిన్నటి రాత్రి పొలంలోకి నుగ్గి ఒంటరిగానున్న చిన్నవ్వను ఆక్రమించి చంపేసిందని, ఆమె శరీరంపైన కన్పించిన రక్కిన గోళ్ల గుర్తులని చూపించాడు కుంటోడు. అతడు చెప్పినట్లే- ఆ కనిపించని ఎలుగుబంటే దీనికి కారణమని అందరూ నిర్థారించారు. చిన్నవ్వ శరీరానికి అంత్యక్రియలు ఊళ్లోవాళ్లే అందరూ కలిసి నిర్వహించారు. తన రక్తసంబంధీకురాలిని పోగొట్టుకున్నంతగా కుంటోడు వలవలా ఏడ్చాడు. చిన్నవ్వ వీణ్ణి తన తమ్ముడిలా చూసుకుంటూ వుండేది.
ఈ ఘటన నడచిన మరుదినమే ఊరిలోని ప్రముఖులందరూ చేరి, తమ గ్రామానికి సంబంధించిన ఫారెస్టు ఆఫీసుకెళ్లి, ఆ ఎలుగుబంటిని పట్టుకుని తమను రక్షించవలసిందిగా ఫారెస్టు ఆఫీసు సిబ్బందిని ప్రార్థించారు. వెంటనే ఫారెస్టు డిపార్టుమెంటు వాళ్లు స్పందించి పనె్నండు మందిగల ఓ దళాన్ని ప్రతిరోజూ ఓ వారం రోజులపాటు, ఆ పల్లెల్లోని పొలాల్లో, తోటల్లో, అడవుల్లో గస్తీ ని ర్వహించి, కన్నుల్లో కన్నుపెట్టి గాలించినా ఎల్లాంటి ప్రయోజనం కన్పించకపోగా, ‘కానిపనికి కష్టం మెండని’ ఫారెస్టు డిపార్టుమెంటు అధికారులు అక్కడి నుంచి నిష్క్రమించారు. వాళ్లు వెనుదిరిగి వెళ్లిన తర్వాత గ్రామస్థులు ఒక్కొక్కరే ప్రయాణామైపోవటాన్ని తగ్గించారు. నలుగురైదుగురు కలిసి గంపులుగా చేతుల్లో బడితెలతో తాము వెళ్లవలసిన చోటికి వెళ్లటం ప్రారంభించారు. గ్రామస్థులందరికీ ప్రాణభయం కరడుగట్టుకొనిపోయింది. ఆనాటినుంచి- ఎవరికీ కనిపించని ఆ ఎలుగుబంటే వాళ్ల ఆలోచనల్లో నిల్చిపోయింది.
****
తాను విన్న వార్త నిజం కాకూడదని వేయి దేవుళ్లకి మొక్కుకుంటూ, ఆతురాతురతో పరుగెత్తి వస్తున్న గాజుల శివప్ప- అక్కడ చేరిన గుంపులోకి దూసుకెళ్లి, నిర్జీవంగా పడున్న తన కూతుర్ని చూసి కడుపు తరుక్కుపోయేలా భోరుభోరున ఏడవడం ప్రారంభించాడు. అక్కడున్నవాళ్లు ఆయన్ని పట్టుకుని ఓదార్చకపోయి వున్నట్లయితే, అక్కడే పారుతున్న ఆ నదిలో పడి ప్రాణం తీసుకుని వుండేవాడే.
కూతురుపైన తనకున్న ప్రేమ అలాంటిది. కూతురు లేకుండా తాను జీవించటం సాధ్యం కాదనుకున్నాడు. కూతుర్ని పోగొట్టుకున్న దుఃఖం, సంకటం గాజుల శివప్పని ప్రతిక్షణం హింసించసాగాయి. సరోజ చావుకు కారణం ఆ భల్లూకమేనని, అందులో సందేహమేమీ లేదని కుంటోడు ఇతరుల్తో అంటున్నప్పుడు, ఆ కనిపించని ఎలుగుబంటిని చీల్చి చెండాడి గ్రామ ద్వారానికి వేలాడగట్టాలనే ఆవేశం గాజుల శివప్పది. అయితే- ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి.
తల్లిలేని పిల్లని ఎంతో గారాబంగా పెంచాడు. ఇక మూడే మాసాల్లో కూతురు పెళ్లిచేయడానికని అన్నీ సిద్ధం చేసికొన్నాడు శివప్ప. మూడు నెలల కిందటే సరోజకి బంగారపు గాజులు చేయించి చేతులకి తొడుక్కోమన్నాడు. అయితే ఆమె ఎందు కో వేసుకోలేకపోయింది. దానికి బదులుగా తండ్రి విక్రయంచే ఆకుపచ్చని మట్టిగాజులే తొడుక్కుని ఎంతో సంబరంగా ఇల్లంతా గెంతింది.
ఉన్న ఒక్క ఆడకూతురు ఇప్పుడు లేకుండాపోయింది. కూతురు జ్ఞాపకాలు ఈటెల్లా గుచ్చుకుంటున్నాయి. చేసేది లేక ఒక్కగానొక్క కూతుర్ని మట్టిపాలు చేసి, బరువెక్కిన గుండెతో ఇంటి మార్గం పట్టాడు గాజుల శివయ్య.
సాయంకాలం గాజుల శివప్ప ఇంట్లో సరోజ పటం ముందు దీపం ప్రకాశించసాగింది. ఆ దీపమున్న చూరుకే శివప్ప శవం వేలాడుతూంది. ఇంత జరిగినా ఆ గ్రామస్థులెవ్వరూ పోలీస్ స్టేషన్‌వైపు చూడలేదు.
పతి ఇంటినుండి ఒక్కొక్కరు చొప్పున, పది గుంపులై, ఒక్కో గుంపు ఒక్కో దిక్కు, ఊరి నాల్గు దిక్కులా, ఆ అదృశ్య భల్లూకాన్ని వేటాడేందుకు బయల్దేరారు. ఎవ్వరికీ కన్పించని ఆ నల్లటి భయంకర భల్లూకం మాత్రం గ్రామస్థుల మధ్యలో రాజోచితంగా తన కామతృష్ణ తీర్చుకోవడానికి, ఇంకొకర్ని బలి తీసుకోడానికి- మనిషి రూపంలో కుంటుకుంటూ పోతున్నది.
*

Subscribe to:
Posts (Atom)