Saturday 11 July 2015

teLUGU JOKES

వృత్తి ధర్మం

ఒక వ్యక్తి లైబ్రరీకి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడం గురించిన పుస్తకాన్ని అడుగుతాడు
ఆ లైబ్రేరియన్‌ ఎగా దిగా చూసి ఇలా అంటాడు
తమ్ముడూ బుక్‌ ఎవరు రిటర్న్‌ చేస్తారు?


చలి
రాము: ఒరేరు జంభూ అంత చలిగా ఉంటే స్విమ్మింగ్‌ పూల్‌లో ఎలా స్నానం చేస్తున్నావ్‌రా?
సోము: అందుకేగా స్వెట్టర్‌ వేసుకొని చేస్తున్నాను.

టూ వీలర్‌
నలుగురు కుర్రాళ్ళు ఒక మోటారు సైకిల్‌ మీద పార్టీకి బయలు దేరుతారు. ట్రాఫిక్‌ పోలీస్‌ వాళ్ళని ఆపుతాడు.
టూవీలర్‌ మీద ముగ్గురు రావడమే నేరం అటువంటిది మీరు నలుగురు వస్తున్నారు. పదండి స్టేషనికి అంటాడు ట్రాఫిక్‌ పోలీస్‌.
మోటారు సైకిల్‌ నడుపుతున్న కుర్రాడు హఠాత్తుగా వెనక్కు చూసి వార్నీ ఐదో వాడెక్కడ పడిపోయాడ్రా. ఇవ్వాళ పార్టీకి బిల్‌ కట్టాల్సింది వాడే కదా అంటాడు. 


తొక్క
ఎంతోరు ఒక్కో అరటిపండు అడిగాడు శివకోటి పండ్లు అమ్మే కుర్రాడిని
''ఒక్కోటి రూపాయి సార్‌'' చెప్పాడతను.
''ముప్పావలాకిస్తావా;''
ముప్పావలాకు తొక్క వస్తుంది
'' సరే అయితే ఈ పావలా తీసుకుని తొక్క నువ్వుంచుకుని పండు నాకివ్వు '' అన్నాడు శివకోటి.


లేడీస్‌ ఫస్ట్‌
టీచర్‌: ఈ వాక్యం సరిచేయి ''ఎద్దూ, ఆవు పరస్పరం తోసుకుంటున్నాయి
గిరిష్‌: ఆవు, ఎద్దూ పరస్పరం తోసులాడుకుంటున్నాయి
టీచర్‌: దీంట్లో నువ్వు చేసిన మార్పు ఏమిటి?
గిరిష్‌: లేడీస్‌ ఫస్ట్‌


ఏ కాలం
పిల్లల నుండి సమాధానాలు రాబట్టాలనుకున్నారు మాష్టారు.
మాష్టారు: సూర్యుడు పడమట అస్తమించాడు. రాహుల్‌ ఇదేం కాలం చెప్పు?
రాహుల్‌: సాయంకాలం సార్‌
మాష్టారు: అది కాదు బాబు బాగా ఆలోచించి చెప్పు
రాహుల్‌: మరో ప్రశ్న అడగండి సార్‌
మాష్టారు: శ్రీకృష్ణుడు కంసుడ్ని సంహరించెను. ఇదేం కాలం
రాహుల్‌: వాడికి పోయే కాలం సార్‌


వేలం
బస్సు వెళ్తోంది హఠాత్తుగా కనకారావు కేకపెట్టాడు.
''బాబూ నా పర్సు పోయింది. దాన్లో పదివేల రూపాయ లున్నాయి. 
నా పర్సు నాకిస్తే వారికి వంద రూపాయలిస్తాను'' ఏడుస్తూ అన్నాడు.
''నాకిస్తే ఐదొందలిస్తాను'' మరో వ్యక్తి అరిచాడు
''నాకిస్తే వెయ్యి''
''నాకిస్తే రెండు వేలు''
అసలెవ్వరికి ఇవ్వకుంటే మొత్తం నావేగా అన్నాడొక ప్రయాణీకుడు నాలుక కరుచుకుంటూ.

No comments:

Post a Comment