శనగపప్పు కేసరి
ఇది పోషకాల మయం. చేయడం ఎంతో సులువు. హల్వా రుచితో ఎంతో బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు.
కావలసిన పదార్థాలు...
పచ్చి శనగపప్పు - రెండు కప్పులు
పంచదార - రెండు కప్పులు
పాలు - లీటరు
నూనె - కొద్దిగా
నెయ్యి - టేబుల్ స్పూన్
జీడిపప్పు, పలుకులు, ఎండుద్రాక్ష - కొద్దిగా
తయారు చేసే విధానం...
శనగపప్పును మరీ మెత్తగా కాకుండా పలుకుగా ఉండేలా ఉడికించాలి. చల్లారాక మిక్సీలో వేయాలి. బాణలీలో నూనె వేడి చేసి, ముందుగా సిద్ధం చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేయించాలి. ఇప్పుడు పాలను సగం అయ్యే దాకా బాగా మరిగించాలి. ఆ తరువాత శనగపప్పు మిశ్రమం, పంచదార, జీడిపప్పు, ఎండుద్రాక్ష పలుకులు ఒక్కొక్కటిగా వేస్తూ బాగా కలపాలి. సన్నటి మంటపై ఉంచి ఐదు నిమిషాలయ్యాక తీసేస్తే సరిపోతుంది.కొంచెం ఘాటుగా ఉండాలని కోరుకుంటే ముద్ద కర్పూరం చాలా కొద్దిగా చల్లుకోవచ్చు
No comments:
Post a Comment