Monday 27 April 2015

Many uses with lemon peel...


NewsListandDetails
నిమ్మతొక్కలతో...
-  తుప్పు పట్టిన తీగల మీద బట్టలను ఆరవేసినప్పుడు లేదంటే బట్టలకు ఉన్న హుక్స్‌ తుప్పుపట్టినప్పుడు బట్టలకు తుప్పు అంటుకుంటుంది. ఆ తుప్పు మరకలు పోవాలంటే మరకల మీద నిమ్మతొక్కలతో గాని ఉప్పు కలిపిన రసంతో కాని రుద్ది ఎండలో వేయాలి.
- నిమ్మకాయ చెక్కలతో తలరుద్దుకుని వేడినీళ్లతో స్నానం చేస్తే చుండ్రుపోతుంది.
- దంతసామాగ్రి, కత్తిపిడి బొమ్మలు వంటివి పసుపు రంగుకి మారితే నిమ్మతొక్కలతో రుద్దాలి.
- రసము తీసేసిన నిమ్మతొక్కలను నానవేసిన నీళ్లతో స్నానం చేస్తే శరీరము కాంతివంతముగా ఉంటుంది. గజ్జి,తామర వంటి చీడలు, చర్మవ్యాధులు దరిచేరవు.
- నిమ్మతొక్కలని చిన్నచిన్న ముక్కలుగా చేసి అడుగంటిన పాత్రల్లో వేసి నీరుపోసి మరిగించి చల్లారాక శుభ్రంగా కడిగితే మరకలు పోతాయి.
- నిమ్మచెక్కలతో రాగి వస్తువులను శుభ్రపరచుకోవచ్చును. ఉప్పులో ముంచిన నిమ్మచెక్కతో రుద్ది, వేడినీటితో కడిగి ఆపై పొడిబట్టలతో తుడవాలి.
- రసం తీసేసిన నిమ్మచెక్కలతో డైనింగ్‌ టేబుల్‌ను తుడిస్తే జిడ్డుపోయి క్లీన్‌గా ఉంటుంది.
- అరటికాయలు తరిగాక చేతులు మరకలుగా, జిగురుగా చిరాగ్గా ఉంటాయి. అప్పుడు నిమ్మ తొక్కలతో చేతులు బాగా రుద్దుకుంటే సరిపోతుంది.
- నిమ్మతొక్కలతో రుద్దితే బట్టలపై పడిన గోరింటాకు మరకలు పోతాయి.
- రసం పిండేసిన నిమ్మతొక్కల్ని పారేయకుండా ఏదైనా జాడీలో వేసి సరిపడా ఉప్పువేసి ఉంచండి. అలా జాడీ నిండేదాకా నిమ్మతొక్కల్ని వేసి, ఆఖరికి కాసిని మెంతులు, ఆవాలుపొడి, సరిపడా కారం, ఇంగువ వేసి నూనె కాచి పోసి పోపు పెడితే నిమ్మతొక్కలతో నిమ్మపచ్చడి రెడీ.
- రసం పిండేసిన నిమ్మతొక్కలతో వాష్‌ బేసిన్‌ రుద్దితే తెల్లగా ఉంటుంది.
- కొంతమంది మోచేతులు, మోకాళ్లు బాగా నల్లగా ఉండి గరుకుగా ఉంటాయి. అలాంటి వాళ్లు నిమ్మతొక్కలతో మోచేతులను మోకాళ్లను బాగా రుద్దితే చర్మం నునుపుగా, మృదువుగా ఉంటుంది.
- నిమ్మతొక్కలతో గోళ్లను బాగా రుద్దితే,గోళ్లు అందంగా, పుచ్చిపోకుండా ఉంటాయి.

No comments:

Post a Comment