Sunday, 1 February 2015

How to prepare Balanced slim diet

తక్కువ క్యాలరీల ఆహారం ఇలా చేయండి

మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు పెరగకుండా ఉండాలన్నా తక్కువ కాలరీలున్న ఆహారాన్ని తీసుకోవాలి. తక్కువ కాలరీలతో ఎక్కువ పోషకాలను అందించే ఆహారాన్ని తయారుచేసుకునేందుకు న్యూట్రిషనిస్టులు కొన్ని సూచనలు చేశారు. అవేంటంటే...
 స్మార్ట్‌ కుకింగ్‌ అలవాటు చేసుకోవాలి. మీ ఆహారాన్ని గ్రిల్‌ చేయటం, ఉడకబెట్టడం, బేక్‌ చేయటం చాలా మంచిది. నాన్‌స్టిక్‌ తవా, పాన్‌లో ఆహారాన్ని తయారు చేసుకోండి. అలాంటి ఆహారం తినటం వల్ల తక్కువ క్యాలరీలతో పాటు ఆరోగ్యం కూడా.
 కాలీఫ్లవర్‌, మిరియాలు, తోటకూరలు, బీరకాయల్లాంటి పదార్థాల్లో విటమిన్లు, మినరల్స్‌, యాంటీఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు ఇవన్నీ లో క్యాలరీ పదార్థాలు.
 ప్రొటీన్‌ ఆహారాన్ని తీసుకుంటేనే సంతృప్తిగా ఉంటుంది. అందుకే ప్రొటీన్లు ఎక్కువగా ఉండే చేపలు, చికెన్‌, సోయా లాంటివి తింటే బావుంటుంది.
 జొన్నలు, రాగులు, గోధుమలతో చేసిన రొట్టెలు తినాలి, ఓట్స్‌, బార్లీ, డ్రై ఫ్రూట్స్‌, అవిసె గింజల్లో పీచు పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది.
 వంటనూనెల్ని నెలకోసారి మారుస్తుండాలి. రైస్‌బ్రాన్‌, ఆవ నూనెల్ని వాడుతుండాలి.
 పళ్లు, కూరగాయల ముక్కలు ఆహారంలో ఎక్కువగా చేర్చాలి. అన్నం, కూర దాదాపుగా సరిసమానంగా ఉండాలి. అంటే కూర ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి.
 స్నాక్స్‌ టైంలో నూనెతో తయారైన సమోసాలు, బజ్జీల్లాంటి వాటికి దూరంగా ఉండాలి.
 టీలు, కాఫీలు తాగే రోజులో ఒకటి రెండుసార్లకంటే ఎక్కువగా తాగకూడదు.

No comments:

Post a Comment