Showing posts with label lemon juice. Show all posts
Showing posts with label lemon juice. Show all posts

Saturday, 5 July 2014

lemon juice -- liver tonic


కాలేయానికి టానిక్‌

నిమ్మను మన ప్రాతంలో పలు రకాలుగా ఉపయోగిస్తారు. నిమ్మకాయ రసం నీటిలో లేదా మజ్జిగలో పిండుకుని తాగటం మనవారి అలవాటు. నిమ్మరసంలో ఆమ్లాలు అధికం. అయినా జీర్ణక్రియ సమస్యలను పరిష్కరించటంలో నిమ్మరసం పాత్ర ఉంది. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండి తాగితే మేలు చేస్తుంది. 

ప్రతిరోజూ ఉదయాన్నే నిమ్మరసం తాగితే అది కాలేయానికి టానిక్‌గా పనిచేసి, పైత్యరసాల ఉత్పత్తిని పెంచుతుంది. నిమ్మరసంలోని విటమిన్ సి వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగై, పలురకాల అంటురోగాల నుండి మనల్ని రక్షిస్తుంది. గొంతునొప్పి, ఆస్మా ఇబ్బందుల నుండి ఉపశమనం ఇచ్చే గుణం నిమ్మకుంది.