Showing posts with label keera. Show all posts
Showing posts with label keera. Show all posts

Sunday, 6 July 2014

Carrot pack --- telugu Beauty pack

 ‘క్యారెట్ ప్యాక్
మనం తరచూ ఏదో ప్యాక్ వేసుకుని ఫ్రెష్ అవుతుంటాం. పార్లర్ కు వెళ్ళినా ఫ్రూట్ ప్యాక్ను వేయటానికే బ్యుటీషియన్ వాళ్ళు ముందుకొస్తారు. అందుకు కారణం ఫ్రూట్ ప్యాక్ ఎన్నో రకాలుగా పని చేస్తుంది. శరీర తత్వాన్ని మారుస్తుంది, రంగును ఇనుమడింప చేతుంది.

1 . క్యారెట్తురుమునకు రెండు టేబుల్స్పూన్ల గ్లిజరిన్చేర్చి ప్యాక్లా వేసుకుంటే పాదాలు మృదువుగా తయారవుతాయి. అలాగే అర టీస్పూన్పసుపు, తాజా కొబ్బరి తురుము అరకప్పు తీసుకోవాలి. రెండింటినీ బాగా కలిపి పాదాలకు పట్టించి మర్దనా చేయాలి.తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.
2 . అరి కాళ్ళు మృదువుగా ఉండాలంటే తరచూ వాటిని కొబ్బరినూనెతో మర్దనా చేస్తుండాలి.
3 . మోకాళ్లు నల్లగా ఉంటే బాగుండదు. అందుకు కమలాపండు ముద్దలా చేసి కొబ్బరినూనెలో అరగంట పాటు నానబెట్టి మిశ్రమాన్ని ప్యాక్లా వేయాలి. తర్వాత శనగపిండి, పాలు, తేనె ఒక్కో చెంచాడు చొప్పున కలపాలి. మిశ్రమాన్ని మోకాళ్ల కు పట్టించి ఆరాక కడిగేయాలి.
4 . కీరా జ్యూస్లో బియ్యపు పిండిని కలిపి పాదాలకు ప్యాక్గా వేసుకుంటే కాళ్ళపగుళ్ళు తగ్గుతాయి.
5 . కొందరికి పాదాల మడమలు మోటుగా బిరుసైన చర్మంతో ఉంటాయి. ఇటువంటివారు నిమ్మరసం పంచదార కలిపిన మిశ్రమంలో మర్దనా చేసుకుంటే ఫలితం ఉంటుంది.
6 . టేబుల్స్పూన్శనగపిండి పుల్లపెరుగు తీసుకుని కలిపి మిశ్రమంలా చేసి దానికి కాస్త పసుపు కలిపి పాదాలకు రాసి కాస్త ఆరిన తర్వాత గట్టిగా రుద్ది కడిగేస్తే మృతకణాలు తొలగిపోతాయి.