నాడీ వ్యవస్థ దెబ్బతింటే నిద్రలేమి!

ఫైబ్రోమైయాల్జియా అనే పదం ల్యా టిన్ నుంచి వచ్చింది. ఫైబ్రస్ అంటే గట్టి నార వంటి కణజాలమని అర్థం. మయో అంటే కండరాలకు సంబంధించినది అని అర్థం. ఆల్జియా అంటే నొప్పి అని అర్థం. కండరాలు, సంధాయక కణజాలాల్లో నొప్పి ఉంటుంది కాబట్టి ఈ వ్యాధిని ఫైబ్రోమైయాల్జియాగా వ్యవహరిస్తారు.
కారణాలు
ఈ వ్యాధికి స్పష్టమైన కారణాలు తెలియకపోయినప్పటికీ అధ్యయనకారులు కొన్ని అంశాలను కారణాలుగా ప్రతిపాదిస్తున్నారు. కుటుంబంలో ఎవరైనా ఒకరికి ఈ సమస్య ఉంటే మిగతావారిలో కూడా కనిపించవచ్చు. ఇలా ముఖ్యంగా మహిళల్లో జరిగే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి సమూహాన్ని 1980 నుంచి ఒక వైద్యపరమైన సమస్యగా వైద్యలోకం పరిగణించటం మొదలుపెట్టింది. పైబ్రోమైయాల్జియాకు దారితీసే కొన్ని అంశాలను ఇప్పుడు చూద్దాం.
మెదడులోను, వెన్నుపాములోనూ ఉండే నరాల కణజాలం బాగా సున్నితంగా మారటం వల్లగానీ, లేదా నాడీ వ్యవస్థలో తయారయ్యే రసాయనాల మొత్తాల్లో మార్పులు చోటుచేసుకోవటంవల్లగానీ నరాల కణజాలం అత్యధికంగా స్పందిస్తుంది. దీంతో చిన్నపాటి కారణానికే, కొద్దిపాటి మార్పుకే శరీరం నొప్పిని పసిగడుతుంది. మానసిక ప్రవర్తన (మూడ్)ని నియంత్రించే మెదడులోని జీవరసాయనాల్లో మార్పులు రావటంవల్ల నొప్పిని తట్టుకునే తత్వం తగ్గిపోతుంది. దీంతో నిద్రలో విశ్రాంతి లభించకపోవటం, నిస్త్రాణ వంటివి కలుగుతాయి. దీని తరువాత బాధితుల శారీరక చైతన్యం తగ్గిపోతుంది. కండరాల్లోను, కణజాలాల్లోనూ ఫ్లూజ్వరంలో మాదిరిగా అకారణంగా నొప్పిగా అనిపిస్తుంటుంది.
కార్టిసాల్, గ్రోత్ హార్మోన్ వంటి హార్మోన్ల విడుదలను మెదడులోని పిట్యూటరి గ్రంథి, హైపోథెలామస్ అనే భాగాలు నియంత్రిస్తుంటాయి. ఫైబ్రోమైయాల్జియా వ్యాధికి లోనైనవారిలో ఈ హార్మోన్ల విడుదలలో తేడాలు చోటుచేసుకుంటాయి. వీటి తయారీలో సంభవించిన అసమతుల్యత కారణంగా నిస్త్రాణ, ప్రవర్తనలో మార్పులు, విషయగ్రహణ శక్తితగ్గటం, మనసును లగ్నం చేయలేకపోవటం, నొప్పిని తట్టుకోలేకపోవటం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
నిద్రలో గాఢనిద్ర స్థితిని పొందలేకపోవటం ఈ వ్యాధికి మరో కారణం. గ్రోత్ హార్మోన్ వంటి పదార్థాలు గాఢ నిద్రలో విడుదలవుతుంటాయి. నిద్రచెదిరినప్పుడు ఈ హార్మోన్ల విడుదలకు అంతరాయం ఏర్పడుతుంది. నిద్ర చెడిపోవటం అనేది ఫైబ్రోమైయాల్జియా వ్యాధిలో ఒక లక్షణంగానూ, ఒక కారణంగాను పరిణమిస్తుంది. చాలామంది ఫైబ్రోమైయాల్జియా లక్షణాలను ఇతర వ్యాధిస్థితులకు ఆపాదించుకుంటారు. ఫ్లూజ్వరం, దెబ్బలు తగలటం, శస్తచ్రికిత్స దుష్ఫలితాలు, మనోభిఘాతం, ఒత్తిడి. ఇలాంటివాటి కారణంగా ఫైబ్రోమైయాల్జియా లక్షణాలు ప్రారంభమైనట్లు భావిస్తుంటారు. మరికొంతమంది ఈ వ్యాధి లక్షణాలను ‘వేడి చేయటం’గా అభివర్ణిస్తుంటారు.
లక్షణాలు
ఫైబ్రోమైయాల్జియా లక్షణాలు ఒక్కొక్కరిలో ఒకో తీవ్రతతో, ఒకో పద్ధతిలో వ్యక్తమవుతాయి. ముఖ్యంగా నడుము పైభాగంలోనూ, అలాగే నడుము దిగువ భాగంలోనూ నొప్పి ఏకకాలంలో కనిపిస్తుందని చెబుతుంటారు. అలాగే నొప్పి, శరీరంలో కుడి ఎడమ భాగాల్లో ఒకే స్థాయిలో కనిపిస్తుందని చెపుతుంటారు. ప్రధానంగా మొండెం, మెడ, నడుము, తుంటి భాగం, భుజాలు... ఈ భాగాల్లో నొప్పి ఎక్కువగా ఉంటుంది. హస్తపాదాల్లో అంతగా ఉండదు. నొప్పి అస్పష్టంగా మొదలై క్రమంగా తీవ్రతరమవుతుంది. ఫైబ్రోమైయాల్జియా వ్యాధి లక్షణాలను పోలిన లక్షణాలు అనేక ఇతర వ్యాధుల్లో కనిపిస్తాయి. కనుక ఇతర వ్యాధుల ఉనికిని పరీక్షించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఫైబ్రోమైయాల్జియాతోపాటు ఇతర వ్యాధులు కూడా సమాంతరంగా ఉండే అవకాశం ఉంటుంది. *

గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామ్ (GRE) లో క్వాంటిటేటివ్ రీజనింగ్ అతి ముఖ్యమైన, బాగా స్కోరు చేసుకోగలిగిన విభాగం. అందుకే విద్యార్థులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ పరీక్షకు సన్నద్ధం కావాలి!
కంపారిజన్ ప్రశ్నల్లో సమస్యలపట్ల మంచి అవగాహన, సాధన ఉన్నట్లయితే పూర్తిగా సమస్య పరిష్కరించకుండానే సమాధానాన్ని గుర్తించవచ్చు. ఎందుకంటే దీంట్లో కచ్చితమైన సమాధానం అవసరం ఉండదు కాబట్టి. ఇలా చాలావరకు పరీక్ష సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. అయితే ఇలా చేయాలంటే విద్యార్థి పరీక్షకంటే ముందే సబ్జెక్టుపై పట్టు సాధించవలసి ఉంటుంది.
పైన చెప్పిన అంశాలపై విద్యార్థి ప్రాథమిక అవగాహన ఏర్పరచుకోవాలి. ఒకవేళ విద్యార్థి తను ఇంతకుముందు నేర్చుకున్న అంశాలు మరిచిపోయి ఉన్నట్లయితే ఇంకోసారి ఈ అంశాల పునశ్చరణ చేసుకోవాలి. ఇది పరీక్ష సన్నద్ధతకు ఉపకరిస్తుంది. ప్రాథమిక అవగాహన ఏర్పడిన తర్వాత పరీక్షకు మిగిలున్న సమయాన్ని బట్టి ఎన్ని ఎక్కువ ప్రశ్నలు అభ్యాసం చేస్తే అంత ఆత్మవిశ్వాసం ఏర్పడుతూ ఉంటుంది.
ఆంగ్లం మాతృభాషగా లేని విద్యార్థులు విదేశాల్లోని (ఉదా: యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఇంగ్లాండ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్) విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందాలనుకుంటే వారు తప్పకుండా ఆంగ్ల భాషా సామర్థ్య (లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ) పరీక్షను ఎదుర్కొనాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు ఆమోదించే ఆంగ్ల భాషా పరీక్షలు IELTS(ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం), TOEFL (టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఫారెన్ లాంగ్వేజ్). భారత్ లాంటి దేశాల విద్యార్థులకు ఈ రెండు పరీక్షలూ అందుబాటులో ఉన్నాయి. 

