Tuesday, 12 May 2015

If young mummies to be slim - fallow these tips

యంగ్ మమ్మీలు స్లిమ్‌గా ఉండాలంటే... 

పిల్లలు పుట్టిన వెంటనే వేగంగా సన్నబడిపోవాలని నేటి తరం అమ్మలు కోరుకుంటున్నారు. కానీ ఇది మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మెలమెల్లగా వర్కవుట్ల సంఖ్యను పెంచుతూ మాత్రమే ఒంట్లోని కొవ్వును కరిగించుకోవాలని సూచిస్తున్నారు.
 
బాలివుడ్‌ తారలు ఐశ్వర్యారాయ్‌, శిల్పా శెట్టి, కాజోల్‌, కరిష్మా, ఇంకా జెన్నిఫర్‌ లోపెజ్‌, అమెరికన్‌ మోడల్‌ సారా స్టాగ్‌ వంటి సెలబ్రిటీలను చూస్తుంటే వీళ్లు పిల్లల తల్లులా అని ఆశ్చర్యమేస్తుంది. తమ నాజూకైన శరీర లావణ్యంతో వీళ్లు ఎందరినో ఆశ్చర్యపరుస్తున్నారు. కొత్తగా తల్లులైన నేటి వివాహిత యువతులు తాము కూడా సినీతారల్లాగ స్లిమ్‌గా కనిపించాలని కోరుకుంటున్నారు. బిడ్డను ప్రసవించిన కొద్ది రోజులకే స్లిమ్‌గా అయిపోవాలని తాపత్రయ పడుతున్నారు. అందుకోసం తీవ్రస్థాయిలో వ్యాయామాలను చేస్తున్నారు. కానీ... అలా చేయడం వారి ఆరోగ్యానికి ప్రమాదకరం.
వేగంగా బరువు తగ్గొద్దు...
పిల్లల్ని కన్న వెంటనే బరువు తగ్గడానికి ప్రయత్నించడం వల్ల శారీరకంగా పలు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. హఠాత్తుగా బరువు తగ్గినా శరీరం తట్టుకోలేదు. ముఖ్యంగా చిన్నారులకు తల్లిపాలను పట్టే అమ్మలు లావుతగ్గడానికి ప్రయత్నించ కూడదు. డైటింగ్‌ కూడా వాళ్లకి మంచిది కాదు. అయినా చేయడానికి ప్రయత్నిస్తే శరీరంలోని పోషకవిలువలు తగ్గిపోయి రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే కొత్తగా బిడ్డను కన్న తల్లులు మెల్లగా బరువు తగ్గాలి.
ప్రసవానంతర వ్యాయామాలు...
బిడ్డను కన్న తర్వాత (పోస్ట్‌ డెలివరీ ఎక్సర్‌సైజెస్‌) చేసే వ్యాయామాలు కొన్ని ఉన్నాయి. ఇవి కొత్తగా తల్లులైన వారి శరీరంలోని కొవ్వును కరిగించడమే కాదు శరీరానికి కావాల్సిన అదనపు ఎనర్జీని అందిస్తాయి. శరీరలోపల భాగాలను సంరక్షిస్తాయి. తేలికపాటి వ్యాయామాలు చేయాలి. మెల్ల మెల్లగా వ్యాయామాల తీవ్రతను పెంచుకుంటూ పోవాలి. నార్మల్‌ డెలివరీ అయితే నాలుగు వారాల అనంతరం వ్యాయామాలు చేయడం ప్రారంభించాలి. సిజేరియన్‌ అయితే ఆరు వారాల తర్వాత వ్యాయామాలు చేయడం మొదలుపెట్టాలి. ఈ వ్యాయామాలు చేస్తే స్లిమ్‌గా తయారవుతారు...
హిప్‌ థ్రస్టర్‌: ఈ వర్కవుట్‌ వల్ల పెల్విక్‌ చుట్టూతా ఉన్న కండరాలు దృఢంగా తయారవుతాయి. శరీరంలో ఎనర్జీ పెరుగుతుంది.
వి-పోజ్‌ హోల్డ్‌ అండ్‌ పుషప్‌: ఈ వర్కవుట్‌ చేయడం వల్ల పొట్ట దగ్గర పేరుకు పోయిన కొవ్వు వేగంగా కరుగుతుంది. వెన్ను భాగం దృఢంగా తయారవుతుంది.
ప్లాంక్స్‌: ఇవి చేస్తే పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కరుగుతుంది.
లాంజెస్‌ అండ్‌ స్క్వాట్స్‌: లెగ్‌ వ ర్కవుట్లలో ఇవి చాలా ప్రధానమైనవి. వీటిని చేయడం వల్ల లోయర్‌ బాడీపై ఒత్తిడి బాగా పడుతుంది. మంచి ఫలితాలు కనిపిస్తాయి.
చెస్ట్‌ వర్కవుట్‌: రొమ్ములు చక్కటి ఆకారంలో ఉండడానికి చెస్ట్‌ వర్కవుట్లు బాగా సహాయపడతాయి.
డెడ్‌లిఫ్ట్‌: ఇది శరీరం మొత్తానికి వ్యాయామం ఇస్తుంది. కొవ్వును తగ్గిస్తుంది. హార్మోన్ల సమతుల్యతను కాపాడే లింఫటిక్‌ గ్లాండ్‌ను క్రమబద్ధీకరిస్తుంది.
ఎలాంటివి తినాలి?
కొత్తగా ‘తల్లు’లైన వాళ్లు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. బరువు తగ్గడానికి వ్యాయామాలు చేస్తున్నాం కదా అని తక్కువ కేలరీలున్న ఆహారం మాత్రమే తిని కడుపు మాడ్చుకోకూడదు. వీళ్లు తినే డైట్‌లో రకరకాల పండ్లు, కూరగాయలు ఉండాలి. పసుపు, ఆరంజ్‌ రంగులున్న పండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బొప్పాయి, పీచ్‌, నిమ్మ వంటి వాటిల్లో సి-విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. పండ్లు, కూరగాయల్లో పీచు పదార్థాలతోపాటు తక్కువ పరిమాణంలో మాత్రమే కాలరీలు ఉంటాయి. ఆకుకూరలు కూడా బాగా తినాలి. అలాగే యాంటాక్సిడెంట్లు బాగా ఉన్న ఆహారపదార్థాలు తినడం వల్ల బరువు తగ్గుతారు. రోజూ గ్రీన్‌ టీ తాగడం వల్ల కూడా శరీర బరువు తగ్గుతుంది. పరిమిత స్థాయిలో డ్రైఫ్రూట్స్‌ను స్నాక్‌గా తీసుకుంటే మంచిది. నీళ్లు బాగా తాగాలి. నీళ్లు బాగా తాగితే జీవక్రియ సాఫీగా జరుగుతుంది. అంతేకాదు కొవ్వు సైతం వేగంగా కరుగుతుంది.
ఇవి గమనించాలి...
వ్యాయామాలు చేసేటప్పుడు కొత్తగా తల్లులైన వాళ్లు కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. సర్టిఫైడ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పర్యవేక్షణలోనే వ్యాయామాలు చేయాలి. వర్కవుట్లు చేయడం ప్రారంభించేముందు ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించాలి. వ్యాయామాలు చేసేటప్పుడు పొత్త్తికడుపు భాగంలో ఏమాత్రం ఇబ్బందిగా అనిపించినావర్కవుట్లు చేయడంఆపేయాలి. ప్రసవ సమయంలో కాంప్లికేషన్స్‌ ఎదుర్కొన్న వారు వాకింగ్‌ లాంటి తేలికపాటి వ్యాయామాలను మాత్రమే చేయాలి. అలాగే సులువుగా ఉండే యోగాసనాలను కూడా చేయొచ్చు. రోజుకు 20-30 నిమిషాల చొప్పున వారానికి మూడు పర్యాయాలు వ్యాయామాలు చేస్తే చాలు.
అవి అపోహలే...
బిడ్డను కన్నతర్వాత వర్కవుట్లు చేయడం గురించి కొన్ని అపోహలు ఉన్నాయి. వాటిల్లో స్ర్టెంగ్త్‌ ట్రైనింగ్‌ మంచిది కాదనే అభిప్రాయం ఒకటి. కానీ బిడ్డను కన్న తర్వాత సె్ట్రంగ్త్‌ ట్రైనింగ్‌ చేసిన తల్లులు ఎంతో వేగంగా మంచి ఫలితాలు పొందరని పలు స్టడీలు చెప్తున్నాయి. బిడ్డలు పుట్టిన తర్వాత పొట్ట ఫ్లాట్‌ అవదనేది మరొక అపోహ. ఈ అభిప్రాయం కూడా తప్పే. పొట్ట తగ్గడం చాలామందిలో చూస్తున్నాం. అలాగే తల్లులు వర్కవుట్‌ చేసిన తర్వాత పిల్లలకు ఫీడ్‌ ఇవ్వకూడదంటారు. ఇది కూడా అపోహే. వ్యాయామాలు చేయడం వల్ల బ్రెస్ట్‌ ఫీడింగ్‌పై ఎలాంటి దుష్ప్రభావం పడదు

No comments:

Post a Comment