Showing posts with label neck pain - remedy. Show all posts
Showing posts with label neck pain - remedy. Show all posts

Monday, 29 September 2014

neck pain - remedy

మెడనొప్పి తగ్గే మార్గం లేదా..?


ప్రశ్న:నా వయసు 32 సం.లు. నేను ఒక కంపెనీలో కంప్యూటర్ ఉద్యోగినిగా పనిచేస్తున్నాను. నాకు కొంతకాలంగా మెడ కదిలించటంవలన నొప్పి అధికమవుతున్నది. విశ్రాంతి వలన నొప్పి తగ్గుతుంది. అలాగే మలబద్ధకంతో బాధపడుతుంటాను. దాహం అధికంగా కలిగి ఉండి నీరు ఎక్కువగా త్రాగుతాను. మానసికంగా నాకు కోపం ఎక్కువ. కదలికలవలన నాకు బాధలు ఎక్కువవుతున్నాయి. తిమ్మిర్లు ఎక్కువగా ఉండి, కుడి చెయ్యి పైకి ఎత్తడం కష్టంగా మారుతున్నది. దగ్గరలో ఉన్న డాక్టర్‌ని సంప్రదించగా ఎక్స్‌రే తీసి స్పాండిలోసిస్ సమస్యగా నిర్థారించి మెడపట్టి పెట్టుకోమన్నారు. మెడ పట్టిపోయే మార్గం లేదా? దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపగలరు.
రాధ, రంగారెడ్డి
జ: మీ సమస్యకు ‘బ్రయోనియా’ అనే మందు సరిపోతుంది. ఈ మందును 200 పోటెన్సీలో మీరు 15 రోజులకు ఒక్కసారి ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున మూడు నెలలపాటు వాడగలరు. అలాగే కాల్కేరియాఫ్లోర్ 6 ఎక్స్ అనే మందును రోజుకు 4 మాత్రలు మూడుసార్లు చొప్పున రెండు నెలలు వాడగలరు. ఈ సమస్య ముఖ్యంగా వెన్నుపూసలమధ్య ఉన్న కార్టిలెజ్ క్షీణించి, ఆస్టియోఫైట్స్ ఏర్పడటంవలన వస్తుంది. కావున స్పాంజి లేదా దూది ఎక్కువగా ఉపయోగించిన కుర్చీల్లో అసంబద్ధ భంగిమలలో కూర్చోవటం మానుకోవాలి. అలాగే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. కాల్షియం ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. పాలు, గుడ్లు, పెరుగు వంటివి తీసుకోవాలి. ఒకేచోట ఎక్కువసేపు కూర్చోవడం నివారించుకోవాలి. నొప్పి తీవ్రత తగ్గించుకోవటానికి అతిగా పెయిన్ కిల్లర్స్‌ను వాడకూడదు. నీరు సరిపడినంతగా త్రాగాలి. తాజా కూరగాయలు నిత్యం ఆహారంలో ఉండే విధంగా తీసుకోవాలి
.