అదను చూసి.. జీవితం కాటేసింది
ఆరోజు నా పెళ్లిచూపులు. మనసులో టెన్షన్. అబ్బాయినైనా ఎందుకిలా అంటే నా అవిటితనం. చిన్నప్పుడే పోలియో సోకింది. ఏ అమ్మాయీ నన్నిష్టపడదనే అభిప్రాయం. అందుకే పెళ్లే వద్దనుకున్నా. ‘నీ తర్వాత ఇద్దరు తమ్ముళ్లున్నారు. వాళ్ల కోసమైనా చేసుకోరా’ బతిమాలేది అమ్మ. ఆమె కోసమే ఒప్పుకున్నా. నాన్న చిన్నప్పుడే మమ్మల్ని వదిలి పత్తా లేకుండా పోయాడు. అమ్మే అన్నీ తానై సాకింది. డిగ్రీ ఫైనలియర్‌లో ఉండగానే సిటీకొచ్చి ఓ చిన్నపాటి ఉద్యోగంలో చేరా. ఆరేళ్లు గడిచాయి. ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్నాం.
ఆ అమ్మాయి పేరు పూర్ణిమ. చిన్నప్పుడే అమ్మ చనిపోతే అమ్మమ్మ పెంచిందట. నాన్న తాగుబోతు. పేద కుటుంబం. ‘నేను నచ్చానా? నా వైకల్యం సంగతి తెలుసా?’ పెళ్లిచూపుల్లో అడిగా. ‘నాదేం లేదు.. అంతా పెద్దవాళ్లిష్టం’ ముక్తసరిగా సమాధానం చెప్పింది. తంతు ముగిసింది. ‘మాకు మీ సంబంధం నచ్చలేదు’ పదిరోజులయ్యాక కబురు పంపారు. నేనూహించిందే. ఉసూరుమన్నా.
ఉద్యోగం చేస్తూనే దూరవిద్యలో ఎంబీఏలో చేరా. ఏడాది గడిచాక వాళ్లు మళ్లీ ఫోన్ చేశారు. నన్ను పెళ్లాడటానికి అమ్మాయి ఒప్పుకుందట. అప్పుడు వద్దని ఇప్పుడు కావాలనుకోవడమేంటి? ‘ఇందులో ఏదో మతలబు ఉంది. నేను చేసుకోను. కావాలంటే ఓ ఆర్నెళ్లు ఆగుదాం’ నా అభిప్రాయం చెప్పేశా. మావాళ్లు వింటేగా! పరుగున వెళ్లి అన్ని విషయాలు మాట్లాడుకోవడం.. రెండునెలల్లో పెళ్లి చకచకా జరిగిపోయాయి.
మూణ్నెళ్లు చిలకా గోరింకల్లా ఉన్నాం. ఆపై నెలకోసారైనా మా ఇంటికొచ్చేవాడు మామయ్య. డబ్బులడిగేవాడు. ముందు అర్థింపుగా.. ఆపై ఆర్డరేస్తున్నట్టుగా. ఉంటే ఇచ్చేవాణ్ని. లేకుంటే లేవని చెప్పేవాణ్ని. పూర్ణిమ అలిగేది. ఆనక మౌనవ్రతం, ఉపవాసం. గొడవలు మొదలయ్యాయి. ఏంటీ బాధ? అసలు నన్నెందుకు పెళ్లాడినట్టు? ఆరా తీస్తే తెలిసింది. గుండెజబ్బుతో చనిపోయే పరిస్థితుల్లో ఉంటే నాన్న మాట కాదనలేక నన్ను పెళ్లి చేసుకుందని. కారణమేదైనా తాళికట్టి ఆలి అయింది. కళ్లలో పెట్టుకొని చూసుకోవాలనుకున్నా. అయినా ఏం లాభం? రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు!
మొదటి పెళ్లిరోజున తనడిగితే వాళ్ల పుట్టింటికి తీస్కెళ్లా. అకారణంగా గొడవ సృష్టించారు. పెద్ద మొత్తం డబ్బులు డిమాండ్ చేశారు. ఇవ్వనని ఖరాఖండిగా చెప్పా. నామీద, మా అమ్మ మీద గృహహింస కేసు పెట్టారు. వాళ్ల నాన్నే ఇదంతా చేయిస్తున్నాడని తెలుసు. ఆ విషయం తెలుసుకొని నా దగ్గరికొచ్చేయమని మొత్తుకున్నా. తను విన్లేదు. విడాకులు కావాలంది. ఆర్నెళ్లు పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరిగా. ‘అరవై వేలు ఇవ్వు. కేస్ వాపస్ తీస్కుంటాం’ అన్నారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఇదంతా చేశారు. ఎంత నమ్మకద్రోహం? పైసా కట్నం లేకుండా ఆమెని పెళ్లి చేసుకున్నా.. లక్ష రూపాయల ఖర్చైంది. ఇప్పుడు యాభై వేలిచ్చి కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నా.
డబ్బులు పోయాయి. ఏడాది మానసిక క్షోభ అనుభవించా. అప్పులు మిగిలాయి. పైగా పెళ్లాం వదిలేసిందనే నింద. అయినా ఇప్పుడెంతో హాయిగా, సంతోషంగా ఉన్నా. రాజీ పడుతూ అనుక్షణం నరకం అనుభవించే బదులు.. విడిపోవడమే మంచిదైంది. అవసరం కోసం మోసం చేసే అమ్మాయిలు ఉంటారని గతంలో విన్నా. నా విషయంలో ప్రత్యక్షంగా చూశా. అందరూ అలా ఉంటారని కాదు.. కొందరైనా అలా ఉంటారు. జాగ్రత్త.
తగువుతో మొదలై.. మనువుతో ఒక్కటై
మల్లెపూల పందిరి.. గది నిండా పరుచుకున్న అగరొత్తుల పరిమళం.. మనసులో ఒకటే అలజడి. ఆరోజు నా తొలిరేయి. ప్రియసఖి కోసం నిరీక్షిస్తూ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిపోయా. సుష్మితతో పరిచయం.. ప్రేమ.. పెళ్లి.. ఒక్కసారిగా కళ్లముందు కదలాడసాగాయి.
‘ఎవరైనా చరణ్ గుడ్‌బోయ్ అంటారు. సుస్మితేంటి నిన్ను తిడుతోంది. తనతో ఏదైనా గొడవా?’ క్లాస్‌మేట్ రమ్య మాటకి ఆశ్చర్యపోయా. ఈ రెండేళ్లలో తనతో మాట్లాడిందే తక్కువ. ఎప్పుడూ మాట తూలలేదు. మరి నాపై కక్షేంటి? మర్నాడు కాలేజీ గేటు ముందు నిల్చున్నా. తను లోపలికొస్తోంది. ‘సుస్మితా ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి’ పిలుస్తుంటే విననట్టే వెళ్లిపోయింది. సాయంత్రం మళ్లీ ఎదురెళ్లా. ‘అసలేం జరిగింది? నాపై కోపంగా ఉన్నావట?’ అడిగా. ‘నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు’ విసురుగా చెప్పింది. నాకు తెలియకుండా ఏదైనా పొరపాటు జరిగిందేమో! ఈసారి కలిస్తే సారీ చెప్పాలనుకున్నా. ఓ వారమయ్యాక ల్యాబ్ దగ్గర కనిపించింది. పలకరించబోతుంటే ‘ఏంటిది రోజూ నన్నే ఫాలో అవుతున్నావ్? ఎవరైనా చూస్తే బాగోదు’ కసురుకుంది. మొహం కొట్టేసినట్టైంది. జన్మలో తన మొహం చూడొద్దనుకున్నా.
ఆరోజు కాలేజీ వార్షికోత్సవం. ‘నాలోనె పొంగెను నర్మదా...’ పాడా. చప్పట్లు మోగాయి. ‘ఫర్వాలేదే.. చదువులో మెరిట్.. పాటలూ బాగానే పాడుతున్నావ్. కీపిటప్’ మెసేజ్ పెట్టింది. కోపంగా ఉన్నా ‘థాంక్స్’ చెప్పా. మరోసారి కాలేజీ బస్‌లో ‘హాయ్ సింగర్’ అంటూ పలకరించింది. ‘ఇదిగో ఈ సీట్లోనే రోజూ కూర్చుంటా. ఓసారి నువ్వు ఆక్రమించావ్. లేవమంటే లేవలేదు. అప్పట్నుంచే నీపై కోపం’ అసలు సంగతి చెప్పింది. నాకైతే ఆ సంఘటనే గుర్తు లేదు.
ఆపై కనపడ్డ ప్రతిసారీ పలకరించేది. వాట్సాప్ చాటింగ్.. క్యాంటీన్‌లో కబుర్లు వూపందుకున్నాయి. ఇష్టమైన వంటకాలు తీసుకొచ్చి పెట్టేది. తొందర్లోనే మా చనువు సాన్నిహిత్యమైంది. హెచ్‌వోడీని బతిమాలి మరీ తననీ మా ప్రాజెక్ట్‌వర్క్ టీంలో చేర్పించా. ఓరోజు ఏవో జోక్స్ వేసుకొని నవ్వుకుంటున్నాం. ‘ఓహో.. శత్రువులు మిత్రులయ్యారన్నమాట. ఫ్రెండ్సేనా.. ఈజ్ దేర్ ఎనీ సమ్‌థింగ్ సమ్‌థింగ్’ అంది రమ్య. సుష్మిత సిగ్గుపడుతూ వెళ్లిపోయింది. నేనూ ఆలోచనల్లో పడిపోయా. తను అందంగానే ఉంటుంది. కొంచెం పొగరున్నా అభిమానం చూపే మనసు. తనే నా భార్యని ఫిక్సయ్యా.
క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఇద్దరికీ ఉద్యోగాలొచ్చాయి. పెళ్లి మాటెత్తా. ‘ముందు మా పేరెంట్స్‌ని ఒప్పించు’ షరతు పెట్టింది. ఫోన్ చేసి చెప్పాలా? అంకుల్ ఆఫీసుకెళ్లి కలవాలా? ఆర్నెళ్లలో అరవైరకాలుగా ఆలోచించా. ఏదీ వర్కవుట్ కాలేదు. ఈ ప్రయత్నాల్లో ఉండగానే ‘ఓసారి మా ఇంటికి రా’ సుష్మిత ఫోన్. బిక్కుబిక్కుమంటూ వెళ్లా. ‘మాకు ఒక్కతే కూతురు బాబూ. అదే మా ప్రాణం. నీ గురించి ఎప్పుడూ చెబుతుంటుంది. త్వరలోనే మీ అమ్మానాన్నలతో మాట్లాడతాం’ తీయని మాట చెప్పారు అంకుల్. సుస్మితని అక్కడే ముద్దాడాలన్నంత సంతోషమేసింది.
తర్వాత సీన్లకి బ్రేక్ వేస్తూ లోపలికొచ్చింది నా శ్రీమతి. తెల్లచీర.. జడనిండా మల్లెపూలతో దేవకన్యలా ఉంది. తన వెచ్చని స్పర్శ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ‘సుషీ.. కోపతాపాలతో మొదలెట్టి.. ప్రేమబాట పట్టి.. పెళ్లిపీటలెక్కిన మనలాంటి జంటలు అరుదు కదా’ గోముగా అడిగా. ‘ఔన్నిజమే. కానీ నీకో సీక్రెట్ చెప్పనా?’ అంది కళ్లింతలు చేస్తూ. వూకొట్టా. ‘నువ్వంటే నాకు మొదట్నుంచీ లవ్వోయ్. అయినా అమ్మాయిని కదా. నోరు తెరవలేను. అందుకే రమ్యతో చిన్న అబద్ధం చెప్పించి నువ్వు నా చుట్టూ తిరిగేలా చేశా’ అంది. ఆ మాటతో దిమ్మ తిరిగి నా మైండ్ బ్లాక్ అయిపోయింది. నోరెళ్లబెట్టి అలా చూస్తుంటే ‘అయ్యవారు తేరుకోండిక! ముహూర్తం మించిపోతోంది’ అనడంతో ఈ లోకంలోకి వచ్చా. ఈ మాస్టర్‌మైండ్‌ని ఎలా భరించాలా అని ఆలోచిస్తూనే.. ఇంత ప్రేమించే అమ్మాయి దొరకడం లక్కీనే కదా అనుకుంటూ లైట్లు ఆర్పేశా.
ప్రేమలో ఫెయిల్.. చదువు పాస్
ప్రేమ మోజులోపడి చదువును నిర్లక్ష్యం చేసే వాళ్లెంతోమంది. కానీ చదువే వద్దనుకున్న కుర్రాడు ఓ అమ్మాయి కారణంగా బీటెక్ పూర్తి చేశాడు. అదెలా?
‘నా ఫ్రెండ్సంతా శ్రీ చైతన్యలో చేరుతున్నారు. నేనూ చేరతా నాన్నా?’ నా మాటకి గుడ్లురిమారు నాన్న. ‘స్కూల్‌కే సరిగా వెళ్లవు. లక్షల ఫీజు కట్టి కార్పొరేట్ కాలేజీలో చేర్పించాలా?’ అంటూ నా ఉత్సాహంపై నీళ్లు చల్లారు. ఇరవై కిమీల దూరంలో మొదలైంది నా ఇంటర్. బూత్‌బంగ్లాలాంటి కాలేజీ.. ఉదయం, సాయంత్రం బస్సు ప్రయాణం. చిరాకేసేది. క్లాసులకు తరచూ బంక్ కొట్టేవాణ్ని. కొన్నాళ్లయ్యాక అసలు కాలేజీకెళ్లడమే మానేద్దాం అనుకున్నా.
ఓరోజు ఎప్పట్లాగే ఇంటికొచ్చే బస్సెక్కుతున్నా. ఎక్కణ్నుంచో వచ్చింది మెరుపుతీగలా ఓ అమ్మాయి నన్ను దాటుకొని లోపలికెళ్లిపోయింది. కాసేపయ్యాక ఎవరో పిలిస్తే పొడుగాటి జడని ముందుకు తోసి వెనక్కి తిరిగింది. ఒక్కసారిగా తన చూపులు నా గుండెల్లో గుచ్చాయి. ఒంట్లో నరాలు జివ్వుమన్నాయ్. మర్నాడు అదే సమయానికి మళ్లీ కనపడింది. మీసాలు మొలిచే ప్రాయంలో కుర్రాళ్లకి ఏ అమ్మాయైనా అందంగానే కనిపిస్తుందట. తనేమో అప్సరస. అరగంట ముందే బస్టాపులో వాలిపోయేవాణ్ని. కొత్త డ్రెస్ వేసుకొని పోజు కొట్టడం.. ఫ్రెండ్స్‌తో బిగ్గరగా మాట్లాడ్డం.. తన దృష్టిలో పడటానికి చేయని ప్రయత్నం లేదు. మాట కలిపే ధైర్యం మాత్రం లేదు.
నా ఫస్టియర్ పూర్తైంది. తను కనుమరుగైంది. డీలా పడిపోయా. వూళ్లొ కాలేజీలన్నీ గాలించా. ‘పిచ్చోడిలా ఏంటా వెతుకులాట? ఎవరి కోసమో చెప్పరా’ అనేవారు ఫ్రెండ్స్. నా బాధ వాళ్లకేం తెలుసు? వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు కొన్నాళ్లకు ఓసారి మా వూళ్లొ కనిపించింది. నాకు పట్టరానంత సంతోషం. ‘ఆమె పేరు ప్రియ. నీకన్నా సీనియర్. బంధువులింటికొచ్చింది’ వివరాలు అందించాడో స్నేహితుడు.
ఇంటర్ కాగానే ఎంసెట్ కోచింగ్ కోసం నెల్లూరు వెళ్లా. బాగా చదవాలి.. తన కాలేజీలోనే చేరాలి. ఇదీ నా లక్ష్యం. బాగా కష్టపడ్డా. మంచి ర్యాంకొచ్చింది. పేరున్న కాలేజీలో సీటొచ్చే అవకాశం ఉన్నా ప్రియ కాలేజీలోనే చేరా. మళ్లీ తను కనపడింది. నాకు ప్రాణం లేచొచ్చింది. కాలేజీకి రోజూ హాజరు వేసుకునేవాణ్ని. కానీ మళ్లీ అదే మొహమాటం. రెండేళ్లు గడిచినా నోరు విప్పలేదు.
వారంలో ప్రియ ఫేర్‌వెల్ డే. ఆరోజు కచ్చితంగా నా మనసులో మాట చెప్పాలనుకున్నా. బాగా ప్రిపేరయ్యా. కానీ నా దురదృష్టం! ఓరోజు తను ఒకబ్బాయితో సన్నిహితంగా కనిపించింది. వాళ్లది ప్రేమేమో అనే అనుమానం. కావొద్దని అందరి దేవుళ్లకు మొక్కుకున్నా. ప్చ్.. నా కోరిక తీరలేదు. ఆ అబ్బాయి మరోసారి ప్రియకు ముద్దు పెడుతూ కనిపించాడు. నా కళ్లల్లోంచి ధారగా నీళ్లు.
ఐదేళ్ల నుంచి తనని అనుసరించా. గుండెల్లో కొండంత ప్రేమ పెంచుకున్నా. ఇప్పుడు తను వేరొకరి సొంతం. అయినా అప్పుడొచ్చింది మొండి ధైర్యం. నా ప్రేమ, బాధంతా వెళ్లగక్కేసానోసారి. నేనెవరో.. ఎప్పట్నుంచి ప్రియని ఇష్టపడుతున్నానో.. తనకోసం ఏం చేశానో చెప్పేశా. అంతా విని ‘అయ్యో.. మరిన్నాళ్లు నాతో ఎందుకు చెప్పలేదు? సారీ.. నేనీమధ్యే ఆ అబ్బాయి లవ్ ప్రపోజల్‌కి ఒప్పుకున్నా’ అంది. అప్పుడు కలిగింది అసలైన బాధ. నా ప్రేమ విషయం ముందే చెబితే ఒప్పుకునేదేమో. ఏదేమైనా ఇప్పుడు నా చేతుల్లో ఏం లేదు.
అప్పట్నుంచి ఎప్పుడు ఎదురుపడ్డా చిరునవ్వుతో పలకరించేది. కల్మషం లేని మాట. బాగా చదవమని చెప్పేది. తన ప్రోత్సాహంతోనే బీటెక్ పూర్తి చేశా. తన ప్రేమ దక్కలేకపోయినా డిగ్రీ పట్టా చేతికందిందంటే ఆమె చలవే. ప్రియ కోసం ఎదురుచూసిన క్షణాలు.. మాటలు.. జ్ఞాపకాలు ఎప్పటికీ నా గుండెల్లో పదిలమే.
‘నా ఫ్రెండ్సంతా శ్రీ చైతన్యలో చేరుతున్నారు. నేనూ చేరతా నాన్నా?’ నా మాటకి గుడ్లురిమారు నాన్న. ‘స్కూల్‌కే సరిగా వెళ్లవు. లక్షల ఫీజు కట్టి కార్పొరేట్ కాలేజీలో చేర్పించాలా?’ అంటూ నా ఉత్సాహంపై నీళ్లు చల్లారు. ఇరవై కిమీల దూరంలో మొదలైంది నా ఇంటర్. బూత్‌బంగ్లాలాంటి కాలేజీ.. ఉదయం, సాయంత్రం బస్సు ప్రయాణం. చిరాకేసేది. క్లాసులకు తరచూ బంక్ కొట్టేవాణ్ని. కొన్నాళ్లయ్యాక అసలు కాలేజీకెళ్లడమే మానేద్దాం అనుకున్నా.
ఓరోజు ఎప్పట్లాగే ఇంటికొచ్చే బస్సెక్కుతున్నా. ఎక్కణ్నుంచో వచ్చింది మెరుపుతీగలా ఓ అమ్మాయి నన్ను దాటుకొని లోపలికెళ్లిపోయింది. కాసేపయ్యాక ఎవరో పిలిస్తే పొడుగాటి జడని ముందుకు తోసి వెనక్కి తిరిగింది. ఒక్కసారిగా తన చూపులు నా గుండెల్లో గుచ్చాయి. ఒంట్లో నరాలు జివ్వుమన్నాయ్. మర్నాడు అదే సమయానికి మళ్లీ కనపడింది. మీసాలు మొలిచే ప్రాయంలో కుర్రాళ్లకి ఏ అమ్మాయైనా అందంగానే కనిపిస్తుందట. తనేమో అప్సరస. అరగంట ముందే బస్టాపులో వాలిపోయేవాణ్ని. కొత్త డ్రెస్ వేసుకొని పోజు కొట్టడం.. ఫ్రెండ్స్‌తో బిగ్గరగా మాట్లాడ్డం.. తన దృష్టిలో పడటానికి చేయని ప్రయత్నం లేదు. మాట కలిపే ధైర్యం మాత్రం లేదు.
నా ఫస్టియర్ పూర్తైంది. తను కనుమరుగైంది. డీలా పడిపోయా. వూళ్లొ కాలేజీలన్నీ గాలించా. ‘పిచ్చోడిలా ఏంటా వెతుకులాట? ఎవరి కోసమో చెప్పరా’ అనేవారు ఫ్రెండ్స్. నా బాధ వాళ్లకేం తెలుసు? వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు కొన్నాళ్లకు ఓసారి మా వూళ్లొ కనిపించింది. నాకు పట్టరానంత సంతోషం. ‘ఆమె పేరు ప్రియ. నీకన్నా సీనియర్. బంధువులింటికొచ్చింది’ వివరాలు అందించాడో స్నేహితుడు.
ఇంటర్ కాగానే ఎంసెట్ కోచింగ్ కోసం నెల్లూరు వెళ్లా. బాగా చదవాలి.. తన కాలేజీలోనే చేరాలి. ఇదీ నా లక్ష్యం. బాగా కష్టపడ్డా. మంచి ర్యాంకొచ్చింది. పేరున్న కాలేజీలో సీటొచ్చే అవకాశం ఉన్నా ప్రియ కాలేజీలోనే చేరా. మళ్లీ తను కనపడింది. నాకు ప్రాణం లేచొచ్చింది. కాలేజీకి రోజూ హాజరు వేసుకునేవాణ్ని. కానీ మళ్లీ అదే మొహమాటం. రెండేళ్లు గడిచినా నోరు విప్పలేదు.
వారంలో ప్రియ ఫేర్‌వెల్ డే. ఆరోజు కచ్చితంగా నా మనసులో మాట చెప్పాలనుకున్నా. బాగా ప్రిపేరయ్యా. కానీ నా దురదృష్టం! ఓరోజు తను ఒకబ్బాయితో సన్నిహితంగా కనిపించింది. వాళ్లది ప్రేమేమో అనే అనుమానం. కావొద్దని అందరి దేవుళ్లకు మొక్కుకున్నా. ప్చ్.. నా కోరిక తీరలేదు. ఆ అబ్బాయి మరోసారి ప్రియకు ముద్దు పెడుతూ కనిపించాడు. నా కళ్లల్లోంచి ధారగా నీళ్లు.
ఐదేళ్ల నుంచి తనని అనుసరించా. గుండెల్లో కొండంత ప్రేమ పెంచుకున్నా. ఇప్పుడు తను వేరొకరి సొంతం. అయినా అప్పుడొచ్చింది మొండి ధైర్యం. నా ప్రేమ, బాధంతా వెళ్లగక్కేసానోసారి. నేనెవరో.. ఎప్పట్నుంచి ప్రియని ఇష్టపడుతున్నానో.. తనకోసం ఏం చేశానో చెప్పేశా. అంతా విని ‘అయ్యో.. మరిన్నాళ్లు నాతో ఎందుకు చెప్పలేదు? సారీ.. నేనీమధ్యే ఆ అబ్బాయి లవ్ ప్రపోజల్‌కి ఒప్పుకున్నా’ అంది. అప్పుడు కలిగింది అసలైన బాధ. నా ప్రేమ విషయం ముందే చెబితే ఒప్పుకునేదేమో. ఏదేమైనా ఇప్పుడు నా చేతుల్లో ఏం లేదు.
అప్పట్నుంచి ఎప్పుడు ఎదురుపడ్డా చిరునవ్వుతో పలకరించేది. కల్మషం లేని మాట. బాగా చదవమని చెప్పేది. తన ప్రోత్సాహంతోనే బీటెక్ పూర్తి చేశా. తన ప్రేమ దక్కలేకపోయినా డిగ్రీ పట్టా చేతికందిందంటే ఆమె చలవే. ప్రియ కోసం ఎదురుచూసిన క్షణాలు.. మాటలు.. జ్ఞాపకాలు ఎప్పటికీ నా గుండెల్లో పదిలమే.
అలాంటి అనుభవం ఎవరికీ వద్దు!
అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకున్నారు. పెద్దలు వద్దంటున్నా చాటుమాటుగా కలుసుకోసాగారు. ఆ తప్పటడుగే వారి పాలిట శాపమైంది. ఇంతకేమైంది? ఆ కుర్రాడి మాటల్లోనే.
మరదలితో నాది ఎనిమిదేళ్ల ప్రేమ. ‘నువ్వంటే నాకు ప్రాణం బావా’ లెక్కలేనన్నిసార్లు అనుంటుంది నాతో. ఇలాంటి అమ్మాయి దొరకడం ఏ కుర్రాడికైనా హ్యాపీనే కదా!
మా ప్రేమ పెద్దలకు నచ్చేది కాదు. ‘ముందు చదువు, ఉద్యోగం సంగతి చూడండి. సెటిలైతే మేమే మీ పెళ్లి చేస్తాం’ షరతు విధించారు. వరసైనోళ్లం. వయసుమీదున్నాం. ప్రేమించుకుంటే తప్పేంటట? మా కళ్లకి వాళ్లు విలన్లలా కనిపించారు. పైపెచ్చు వాళ్లు వద్దు వద్దంటే మాకు కలుసుకోవాలనే ఆరాటం ఎక్కువైంది. మరెలా? ఒకరింటికి ఇంకొకరం వెళ్లలేం. వూళ్లొ తిరిగితే జనాల కంట్లో పడతాం. వూరవతలున్న అటవీప్రాంతం మా తీవ్రమైన సమస్యకి పరిష్కారంగా కనిపించింది.
నెలకోసారైనా అక్కడికెళ్లేవాళ్లం. కోరినంత ఏకాంతం. మా ముద్దూముచ్చట్లకు హద్దే లేదిక. ఒకరి ఒడిలో ఇంకొకరం తల పెట్టుకొని కబుర్లు చెప్పుకోవడం.. కళ్లల్లోకి కళ్లు పెట్టి చూస్తూ గంటలు గడిపేయడం.. అచ్చం సినిమా హీరోహీరోయిన్లలా ఫీలైపోయేవాళ్లం.
రోజులన్నీ ఒకేలా ఉండవుగా! ఓసారి ఎప్పట్లాగే మా లోకంలో మేమున్నాం. వెనకనుంచి ఎవరో అపరిచితులు ముగ్గురు వచ్చి అమాంతం మాపై దాడి చేశారు. వాళ్ల ఒంట్లోంచి గుప్పుగుప్పుమంటూ మద్యం వాసన. ‘రేయ్.. ఈ పిల్లతో కాసేపు మమ్మల్నీ రొమాన్స్ చేయ్‌నీరా’ అన్నాడొకడు. ఏం జరుగుతుందో క్షణంపాటు అర్థం కాలేదు. తేరుకొని నోరు తెరవబోతుంటే నాపై పిడిగుద్దులు కురిపించారు మూకుమ్మడిగా. కుప్పకూలిపోయా. ఒకడు మరదల్ని దూరంగా లాకెళ్లిపోతున్నాడు. మూలుగుతూనే ‘పారిపో.. పారిపో’ అనరిచా. గింజుకోవడం మానేసి ‘మా బావని కొట్టొద్దు’ అని ఏడుస్తోంది. నేనంటే ఎంత ప్రేమ తనకి! నాపై మరో రెండు దెబ్బలేసి మిగతా ఇద్దరూ నా చిట్టితల్లి చుట్టూ మూగారు. ఎంత బతిమాలినా వినకుండా కర్కశంగా ఆక్రమించుకోసాగారు. ‘ప్లీజ్.. వదలండి’ దీనంగా ఏడుస్తోంది తను. ఆ క్షణం నాపై నాకే అసహ్యం వేసింది. ప్రాణం పోయినా సరే మరదలి మానం కాపాడాలి అనుకుంటూ పైకి లేచా. వాళ్ల దగ్గరికి పరుగెత్తి పిడికిలి బిగించి ఒంట్లో శక్తినంతా కూడదీసుకొని ఒక్కొక్కడి కడుపులో గుద్దా. తాగిన మత్తులో ఉండటంతో ఒకట్రెండు దెబ్బలకే కూలబడిపోయారు. క్షణం ఆలస్యం చేయకుండా పరుగందుకున్నాం. తుప్పలు, ముళ్లపొదలు, ఎత్తుపల్లాలు ఏవీ చూడకుండా పరుగెత్తుతూనే ఉన్నాం. కిందపడ్డాం.. లేచాం. శరీరమంతా రక్తాలు కారుతున్నాయి. పరుగు మాత్రం ఆపలేదు. ఐదు నిమిషాల్లో రోడ్డుమీదికొచ్చాం.
జరిగింది తలచుకుంటే ఇప్పటికీ ఒళ్లు జలదరిస్తుంది. అమ్మాయిని ప్రేమించడం.. ఏకాంతంగా కలుసుకోవడం.. హీరోయిజం అనుకునేవాణ్ని. ఆరోజుతో పటాపంచలైంది. పెళ్లి కాకుండానే చాటుమాటుగా కలుసుకోవడం.. పెద్దల్ని మోసగించడం తప్పని కూడా తెలిసొచ్చింది. పైపెచ్చు ఇలాంటి చాటుమాటు సరసాలు ప్రేమికుల్ని చిక్కుల్లో పడేస్తాయి. వూహించని భయంకర పరిస్థితి తీసుకొస్తాయి. మన తప్పటడుగులు చెడ్డవాళ్లకు అవకాశం కల్పిస్తాయి. అందుకు మేమే సాక్ష్యం. ప్రేమించడం తప్పుకాదు.. పెళ్లికి ముందే ఏదో చేయాలనుకోవడమే తప్పు. ప్రేమిస్తే ధైర్యంగా ఉండండి. నిజాయతీతో పెద్దల్ని ఒప్పించండి.
తప్పు చేశా... కుమిలిపోతున్నా
పచ్చని పంట పొలాలు... గలగలా పారే సెలయేళ్లు... ఎవరికిష్టం ఉండదు? అందుకే కాలేజీకి ఒక్కరోజు సెలవొచ్చినా పిన్ని వాళ్లూరిలో వాలేవాణ్ని. ‘ఒరేయ్ సలీం సబీహా ఆంటీ వాళింటికెళ్లి కొంచెం పంచదార పట్రాపో’ కేకేసింది ఓసారి పిన్ని. గుమ్మంలో అడుగు పెడుతుంటే ఓ చక్కనిచుక్క ఎదురొచ్చింది. ‘ఏం కావాలి?’ ముఖంపై పడ్డ ముంగురుల్ని సవరించుకుంటూ అడిగింది. తడబడుతూనే వచ్చిన పనితోపాటు మా పిన్నీతో ఉన్న చుట్టరికం చెప్పా. ఆపై కావాలనే తనని పలకరించేవాణ్ని. బదులిచ్చేది. కొద్దిరోజులకే మా పరిచయం ప్రేమ పట్టాలెక్కింది.
చదువు పూర్తైంది. లగేజీ సర్దేసుకొని పిన్నింటికి బయల్దేరా. చూపుల సైగలు... వాళ్లింట్లో ఎవరూ లేకపోతే కలుసుకోవడాలు... ఇదీ మా దినచర్య. ఓరోజు పెరట్లో చాలాసేపే మాట్లాడుకున్నాం. ఎండకి చెమట్లు పట్టేశాయి. తన ఓణీతో నా చెమట్లు తుడిచింది. ఒంట్లో నరాలు జివ్వుమన్నాయ్. ‘పదా... ఎండ ఎక్కువగా ఉంది. ఇంట్లోకెళ్లి మాట్లాడుకుందాం’ అంది. ఇద్దరం ఒకే మంచంపై కూర్చున్నాం. తగినంత ఏకాంతం. లబ్‌డబ్... నా గుండె శబ్దం నాకే వినిపిస్తోంది. తప్పు చేయమంది తనువు. వారించింది మనసు. చటుక్కున అక్కణ్నుంచి లేచా. ‘మనం సాధ్యమైనంత తొందర్లో పెళ్లి చేసుకుందాం’ అంటూ బయల్దేరా.
మా ప్రేమ విషయం వాళ్లింట్లో తెలిసింది. అదీ నా మంచికే అయింది. వాళ్ల అన్నయ్య మాట్లాడటానికొచ్చాడు. మా ఇల్లు చాలా చిన్నది. కుర్చీ కూడా లేదు. పక్కింట్లో కూర్చోబెట్టా. అమ్మ టీ తెచ్చేలోపే వెళ్లిపోయాడు. నాకు ఒకటే టెన్షన్. ‘అబ్బాయి గుణవంతుడే. చదువు, అందం ఉంది. కానీ మరీ పేదోళ్లు. మనకి సరిపోరు’ తేల్చేశాడట. దుఃఖం పొంగుకొచ్చింది. వాళ్లని ఎలా ఒప్పించాలో ఆలోచిస్తుండగానే తనకి పెళ్లిచూపులు జరిగి, పెళ్లి నిశ్చయం అయిపోయింది. మమ్మల్ని కలవకుండా, మాట్లాడకుండా కట్టడి చేశారు. నాకు నిద్ర కరువైంది. ‘నా మనసు నీకే సొంతం. వేరొకర్ని పెళ్లాడ్డం నాకిష్టం లేదు. ఏదైనా చెయ్’ ఓరోజు ఎలాగో ఫోన్ చేసి ఏడుస్తూ చెప్పింది.
రేపే తన పెళ్లి. ముందురోజే రాత్రే స్నేహితులతో కలిసి రెండు కార్లలో బయల్దేరా. వూరి చివర ఉన్నామని ఓ కుర్రాడితో కబురు పంపా. తనటెళ్లగానే నా మెదడులో వేల ఆలోచనలు. మేం పారిపోతే పెళ్లి బాజాలు మోగాల్సినచోట చావు డప్పు మోగుతుందేమో! మేం దొరికిపోతే తనని కచ్చితంగా చంపేస్తారు. వూహిస్తుంటేనే చాలా భయమేసింది. వెనక్కి వెళ్లిపోదాం అన్నా. నా ఫ్రెండ్స్ షాక్. ఉత్తిచేతులతో వెళ్లొద్దన్నారు. జరగబోయే దారుణాలు వివరించా. చేసేదేం లేక అంతా తిరిగెళ్లిపోయాం. ప్రాణసఖి నాకోసం వచ్చిందో, లేదో తెలియదు.
మర్నాడే తన పెళ్లైంది. కొన్నాళ్లకు వేరే అమ్మాయితో నాది కూడా. విధి ఎంత చిత్రమైందంటే మా ఇంటికి రావాల్సిన అమ్మాయి వేరే వాళ్లింటికి వెళ్లింది. వాళ్లింటికి వెళ్లాల్సిన అమ్మాయి మా ఇంటికొచ్చింది. ఔన్నిజమే. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిని నా ప్రేయసి వాళ్లన్నయ్య పెళ్లాడాలనుకున్నాడట. కట్నం విషయంలో తేడాలొచ్చి ముందుకెళ్లలేదు. మరో పిడుగులాంటి వార్త ఏంటంటే... కొన్నాళ్లకే నా ప్రియనేస్తం భర్త ఓ ప్రమాదంలో చనిపోయాడు. వెళ్లి పలకరించాలని చాలాసార్లు అనుకున్నా ధైర్యం చాల్లేదు. ఈ మధ్యే గుండె పగిలే మరో విషయం తెలిసింది. ‘పెళ్లికి ముందురోజు రాత్రి ఆ అమ్మాయి వూరవతలివైపు పరుగెత్తడం... కాసేపయ్యాక వెనక్కి తిరిగిరావడం చూశాన్రా’ అంది పిన్ని. ఆ మాటతో నాకు కన్నీళ్లు ఆగలేదు. ఆరోజు పెద్ద తప్పు చేశానని ఇప్పటికీ కుమిలిపోతూనే ఉన్నా.
వంచకుడు తలొంచుకునేలా చేస్తా!
డిప్లమో అయ్యాక బీటెక్ చదివి ఐఈఎస్‌కు ప్రిపేర్ కావాలనేది నా కల. ‘నాకూ చదివించాలనే ఉందమ్మా. కానీ...’ నాన్న అంతరంగం అర్థమైంది. పని దొరికితేనే ఇంట్లో పొయ్యి వెలిగే కుటుంబం. ఆయనేం చేస్తారు? పరీక్షలపై మనసు పెట్టా. ప్రాంగణ నియామకాల్లో ఎంపికయ్యా. ఎలాగైనా కుటుంబాన్ని మంచి స్థితికి తేవాలి అనుకుంటూ సిటీలో అడుగుపెట్టా.
ఉద్యోగం చేస్తూనే ఆటోక్యాడ్, స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సుల్లో చేరా. నా తపనని అంతా మెచ్చుకునేవారు. ‘దూరవిద్యలో కూడా బీటెక్ చేయొచ్చు’ సహోద్యోగి సలహా ఇచ్చిందోరోజు. ఎంట్రెన్స్ రాస్తే మంచి కాలేజీలో సీటొచ్చింది. ఆదివారం క్లాసులు. ఆఫీసు, కాలేజీకి దగ్గరగా ఉంటుందని హాస్టళ్లొ చేరా. కొత్త వాతావరణం.. కొత్త స్నేహాలు. ‘సునీ.. నా ఫోన్ రిపేరులో ఉంది. నీ నెంబర్ ఫ్రెండ్‌కిచ్చా. ఫోన్ చేస్తే నాకివ్వు’ అంది హాస్టల్‌మేట్. సాయంత్రం కాల్ చేశాడు. ఆరోజు ఏప్రిల్ ఫస్ట్. నేను ఫూల్ అయిన రోజు కదా! బాగా గుర్తుంది. రెండ్రోజుల్లో నాలుగైదుసార్లు రాయబారం నడిపా. తర్వాత తన ఫోన్ బాగైనా నాకే చేసేవాడు. అదేమంటే ‘తనే కాదు ఇప్పుడు నువ్వూ ఫ్రెండే కదా.. పలకరించొద్దా?’ అనేవాడు. తప్పదనుకొని నేనూ మాట కలిపా. అడక్కముందే అన్ని వ్యక్తిగత వివరాలూ పంచుకునేవాడు. ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నానని కూడా చెప్పాడు. ‘నువ్వు ఎవర్నైనా ప్రేమిస్తున్నావా?’ అడిగాడోసారి. అలాంటిదేం లేదన్నా.
హాస్టల్ ఫ్రెండ్ లౌడ్‌స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతుందో సాయంత్రం. అవతలివైపు తనే. ‘నాకు బతకాలని లేదు. నా లవర్ నన్ను చీట్ చేసింది’ ఏడుస్తున్నాడు. వెంటనే ఫోన్ లాక్కున్నా. ‘తను మోసం చేస్తే నువ్ చస్తావా? మీ పేరెంట్స్ గురించి ఆలోచించవా?’ చెడామడా తిట్టా. ఆరోజు నుంచి ఏదో వంకతో మాట కలిపేవాడు. ‘ఆరోజు నన్ను ఓదార్చకపోయి ఉంటే నేనీపాటికి చనిపోయేవాడినే’ అనేవాడు. పైగా తనూ బీటెక్ సీనియర్ కావడంతో ఏవైనా సందేహాలుంటే అడిగేదాన్ని. జాలి.. అవసరం.. ఓదార్పు..ఆకర్షణ కారణాలేవైనా మా మధ్య ప్రేమ చిగురించింది. ఐదునెలలు ఒకర్నొకరం చూసుకోకుండానే ప్రేమ వూసులాడుకున్నాం.
ఓరోజు ‘కలుద్దామా?’ అన్నాడు. ‘ఓ.. యెస్’ నేను. తొలిసారి తనెదురైనపుడు మనసులో అలజడి. చేతిలో చేయి పడగానే ఒంట్లో నరాలు జివ్వుమన్నాయ్. తరచూ కలిసేవాళ్లం. కొద్దిరోజుల్లోనే తను లేకుండా బతకలేననే స్థితికొచ్చా. అది వాడికర్థమైంది. ఏ అవసరం ఉన్నా నాకే చెప్పేవాడు. నా జీతంలో సగం తనకే ఇచ్చేదాన్ని. నాకు నాదీ, తనదీ అనే తేడాల్లేవు. ఆ మైకంలోనే నన్ను నేనే అర్పించుకున్నా.
తన చదువైపోయింది. పెళ్లి చేసుకుందాం అన్నా. ‘ఉద్యోగం రావాలిగా’ సమాధానం. అప్పట్నుంచి ‘అవసరం’ ఉంటేనే నా దగ్గరికొచ్చేవాడు. రాన్రాను అదీ లేదు. పెళ్లి మాటెత్తితే చిరాకు, కోపం. నన్ను వదిలించుకోవాలని చూసేవాడు. ఓరోజు నిలదీశా. ‘మావాళ్లు ఒప్పుకునేలా లేరు. మనం బ్రేకప్ చెప్పుకోవడమే బెటర్’ తేల్చేశాడు. కుప్పకూలిపోయా.
అన్నిరకాలుగా మోసపోయా. బతకడం వ్యర్థమనిపించింది. ఆత్మహత్య చేసుకుందామని రైల్వేట్రాక్‌పై నిల్చున్నా. రైలు కూత వినిపిస్తోంది. రకరకాల ఆలోచనలు మెదడును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ్. పేద తల్లిదండ్రులు.. మమ్మల్ని పెంచడానికి వాళ్లు పడ్డ కష్టం.. నాకుద్యోగం వచ్చినపుడు ఇరుగుపొరుగుతో చెప్పుకొని గర్వపడ్డ క్షణాలు.. ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి. ఛీ.. పిచ్చిపని చేస్తున్నా. వాళ్లకోసమైనా బతకాలి. ఓ బలమైన కాంక్ష నన్ను పక్కకు తోసింది. క్షణం ఆలస్యమైతే తునాతునకలయ్యేదాన్నే. తర్వాత నింపాదిగా ఆలోచించా. ఓ మోసగాడి కోసం చావడం తప్పనిపించింది. బీటెక్ పూర్తి చేసి వాడు సిగ్గు పడేలా పెద్ద ఉద్యోగం సంపాదించాలనే స్థిర లక్ష్యంతో కదిలా.
నాన్నా.. నీ ప్రేమ కావాలి!
చేతిలో అపాయింట్‌మెంట్ లెటర్. మనసులో కొంచెం సంతోషం.. కొంచెం అలజడి. బెరుకుబెరుగ్గా బ్యాంకు లోపల అడుగుపెట్టా. ఎదురుగా క్యాబిన్‌లో ఒకాయన సీరియస్‌గా పని చేస్తున్నారు. ‘హలో కెన్ ఐ స్పీక్ టు శ్రీనివాస్ సర్’ అన్నా ఆయన దగ్గరికెళ్లి. తలెత్తి ‘యెస్.. చెప్పండి’ అన్నారు నేనేనన్నట్టు. ఆయన చేతిలో లేఖ పెట్టా.
శ్రీనివాస్ సర్ సీనియరే కాదు చాలా మంచోడు కూడా. ఎవరికే ఆపద, సందేహం వచ్చినా నేనున్నానంటూ ముందుకొచ్చేవాడు. ఏడాదిపాటు ప్రతి పనికీ సర్.. సర్ అంటూ ఆయన వెనకాలే తిరిగా. ఆపై మా మధ్య సర్, గారు పిలుపులు మాయమై ‘నువ్వూ’ అనే స్థాయికి చేరాం. కలిసి భోంచేయడం, సరదాగా కబుర్లు చెప్పుకోవడం, ఒకరికొకరం చిన్నచిన్న బహుమతులిచ్చుకోవడం మామూలైంది.
రాన్రాను పని ఒత్తిడి ఎక్కువైంది. తట్టుకోలేక రాజీనామా చేశా. కొత్త ఉద్యోగం వెతుకులాటలో పడిపోయా. ప్రతిక్షణం శ్రీనే గుర్తొచ్చేవాడు. ఎందుకో అతడి ఎడబాటు నేను తట్టుకోలేకపోయా. నాది స్నేహం కాదు ప్రేమని అర్థమైంది. అటువైపు పరిస్థితేంటి? ఏమో.. నాకైతే తెలియదు. అమ్మాయినైనా నేనే సిగ్గు విడిచి ‘ఐలవ్యూ శీనూ’ అన్నా ఓరోజు. ‘పిచ్చిమొద్దూ ఇంత ఆలస్యంగా చెప్పడం. ఈ మాట కోసం ఎంతోకాలం నుంచి ఎదురు చూస్తున్నా తెలుసా?’ అన్నాడు. నా మనసు తీన్మార్ డ్యాన్స్ ఆడింది. స్నేహితులం ప్రేమికులమయ్యాం. పార్కులు, సినిమా థియేటర్లు, కెఫేలు... మేం తిరగనిచోటు లేదు.
ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలెట్టారు. నా గుండెల్లో దడ మొదలైంది. మనసంతా శీనూనే ఉంటే నాకెవరు నచ్చుతారు? ఏదో వంక చెప్పి ఒకట్రెండు సంబంధాలు తప్పించేశా. ఇంకా ఎన్నాళ్లీ అబద్ధాలు? ‘నాన్నా నాకింక సంబంధాలు చూడొద్దు. నేను శ్రీనుని ఇష్టపడ్డా. అతడ్నే పెళ్లాడతా’ ఓరోజు తెగేసి చెప్పా. వివరాలడిగారు నాన్న. బ్యాంకు ఉద్యోగం.. కుటుంబ పద్ధతులు.. సాయం చేసే గుణం అన్నీ నచ్చాయి. కులమే అడ్డుపడింది. ‘నీకు నచ్చినవాడ్ని ఇచ్చి పెళ్లి చేయాలనే ఉంది. అలా చేస్తే మేం ఈ సమాజంలో తలెత్తుకోలేమమ్మా. అతడ్ని మర్చిపో’ అన్నారు. మన కష్టసుఖాల్ని పట్టించుకోని ఈ సమాజం గురించి ఆలోచించొద్దని నాన్నను బతిమాలా. విన్లేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పెద్దల్ని కాదని మేం గుడిలో ఒక్కటయ్యాం. పరువు పోయిందని నాన్న ఏడ్చారు. బంధువులు కొట్టినంత పన్జేశారు.
చూస్తుండగానే ఐదేళ్లు గడిచాయి. మాకో బాబు. శీను నన్ను మహరాణిలా చూసుకుంటున్నాడు. అయినా ఏదో వెలితి. మంచి మార్కులొస్తేనో.. మంచి పని చేశాననో గుండెలకు హత్తుకొని మురిసిపోయే నాన్న నా పక్కన లేరు. చెడుదారిలో వెళ్తే మొట్టికాయలేసి మంచీచెడూ వివరించే నాన్న అండగా లేరు. అది గుర్తొచ్చినప్పుడల్లా ఏడుపొచ్చేది. అయినా నా ప్రయత్నాలు ఆపలేదు. అన్నట్టు ఈమధ్యే నాన్న మాట కలిపారు. ఆయన మనసులో ఉన్న కాఠిన్యం కరిగిపోయిందనుకున్నా. కానీ ఏదో పొడిపొడిగా రెండు మాటలు మాట్లాడారు. నాక్కావాల్సింది అది కాదు. రోజూ నా చిటికెనవేలు పట్టుకొని నడిపించిన నాన్న కావాలి. చెడుదారిలో వెళ్తే బెత్తం పట్టి దండించిన ఆ నాన్న కావాలి. నాకు శీను అంటే ఇష్టం. దానర్థం మీరంటే ఇష్టం లేదని కాదు. నాన్నా దయచేసి అర్థం చేసుకొని ఆదరించండి ప్లీజ్.
మనసిచ్చి నిలిచా... మోసపోయి వగచా!
ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడది ఉంటుందంటారు. నిజమో? అబద్ధమో? తెలియదు. నేను మాత్రం ప్రాణంగా ప్రేమించిన ఓ అమ్మాయి బాగుపడటానికి కారణమయ్యా. మరి తను నాకేం బహుమతి ఇచ్చింది?
నా డిగ్రీలో మా ప్రేమ మొదలైంది. తనపుడు ఇంటర్. చిన్నప్పుడే ఆమె నాన్న చనిపోయారు. అమ్మ వేరొకరితో సహజీవనం చేసేది. ఆ ఇద్దరూ కలిసి తనని చిత్రహింసలు పెట్టేవారు. ‘అయ్యోపాపం’ అనిపించేది. ఆ జాలి నుంచే ప్రేమ మొగ్గ తొడిగింది. తనని ముద్దుగా ‘పండు’ అని పిలిచేవాణ్ని.
‘నరేంద్రా... మా అమ్మ నన్ను వాడి దగ్గరికెళ్లమంటోంది. అలా చేస్తేనే డిగ్రీలో చేర్పించడానికి డబ్బులిస్తాడట. నాకు బతకాలని లేదు’ భోరుమంది ఓరోజు. నా గుండె రగిలిపోయింది. ఛీ... ప్రపంచంలో ఇలాంటి తల్లి కూడా ఉంటుందా? అనిపించింది. ‘నీకేం భయం లేదు. నిన్ను నేను చదివిస్తా’ మాటిచ్చా. ఏవో సాకులు చెప్పి ఇంట్లోంచి డబ్బులు తెస్తూ పండుని పీజీ దాకా చదివించా. మధ్యమధ్యలో మేం కలుసుకుని కష్టసుఖాలు పంచుకునేవాళ్లం.
పండు చదువు పూర్తైంది. తనేదైనా ఉద్యోగం చేస్తేనే గుర్తింపు, గౌరవం. నా సంగతి వదిలేసి తన కోసం చాలాచోట్ల ప్రయత్నించా. కొలువు సంపాదించడం అనుకున్నంత సులువేం కాదని అర్ధమైంది. ఆఖరికి ఓ స్నేహితుడిని బతిమాలి పండుని ఓ రిటైల్‌స్టోర్‌లో సేల్స్‌ప్రమోటర్‌గా పెట్టించా. ఎనిమిదివేల జీతం. ‘నువ్వే గనక లేకపోతే నా జీవితం ఎలా ఉండేదో’ కన్నీళ్లు పెట్టుకుంది. ‘పిచ్చిదానా మనిద్దరిదీ ఒకే జీవితం’ అంటూ గుండెలకు హత్తుకున్నా.
తనుద్యోగంలో కుదురుకుంది. ప్రేమప్రయాణం సాఫీగానే సాగుతోంది. ‘డిసెంబరులో మంచి ముహూర్తాలు ఉన్నాయట. పెళ్లి చేసుకుందామా?’ అడిగా. నీళ్లు నమిలింది. బహుశా పెద్దలు అడ్డుపడతారని భయం కాబోలు! ‘మా ఇంట్లో ఓకే. మీ అమ్మ ఒప్పుకోకపోయినా ఫర్వాలేదు. ఏమంటావ్?’ నా మాటకి కొంచెం సమయం కావాలంది. ఒకటి.. రెండు.. ఆర్నెళ్లు గడిచాయి. ఎటూ తేల్చదు.
ఓరోజు పండు పనిచేసేచోటికే వెళ్లా. ఆరోజు రాలేదట. తన గురించి అడుగుతుంటే నన్నంతా జాలిగా చూస్తున్నారు. ఎందుకని ఆరా తీస్తే ‘తను ఇక్కడ ఓ అబ్బాయితో ప్రేమలో పడింది’ అనేమాట నా గుండెల్లో ఈటెలా దిగింది. నేను నమ్మలేదు. కానీ ఆ నమ్మకం వమ్ము కావడానికి వారం పట్టలేదు. మరోసారి ఆఫీసుకొస్తే ఆ అబ్బాయితో సన్నిహితంగా కనిపించింది. అక్కడే నిలదీశా. ‘క్షమించు... ఇంకోసారలా చేయను’ అంది తలొంచుకొని. పదకొండేళ్ల ప్రేమని వదిలేయడానికి మనసొప్పలేదు.
నెలరోజుల్లో పెళ్లి ముహుర్తం పెట్టించా. అంగీకారం తెలిపింది. మనిషి మారిందనుకున్నా. నా మనసుతో ఇంకా ఆటలాడుతోందని తర్వాతే అర్థమైంది. పెళ్లి పనుల హడావుడిలో నేను తిరుగుతుంటే ఆ అబ్బాయితో బైక్‌పై షికార్లు చేస్తూ కనిపించింది. ఉన్నచోటే కుప్పకూలిపోయా. తర్వాత గుండె పగిలే మరిన్ని తెలిశాయి. వాళ్లిద్దరు భార్యాభర్తలమని చెప్పి ఓ గది అద్దెకు తీసుకొని ఉంటున్నారట. ఈ బంధానికి వాళ్ల అమ్మ కూడా ఆమోదం ఉంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇంతలా మోసగిస్తుందనుకోలేదు.
పెళ్లి పెటాకులైంది. రోజంతా తన ఆలోచనలే. మోసపోయాననే బెంగే. తిండి మానేశా. ఆరోగ్యం పాడై నెలరోజులు బెడ్ మీదే ఉన్నా. సాటి మనిషిగానైనా ఒక్కరోజైనా వచ్చి చూడలేదు. ఈమధ్యలో వచ్చిన నా పుట్టినరోజుకీ పలకరించలేదు. తన కోసం నా సరదాలు వదులుకున్నా. కెరీర్‌ని నిర్లక్ష్యం చేశా. శూన్య హస్తాలతో... మనసు నిండా బాధతో జీవచ్ఛవంలా ఉన్నా. నా పరాజయానికి కారణం ఆ అమ్మాయే.
నా డిగ్రీలో మా ప్రేమ మొదలైంది. తనపుడు ఇంటర్. చిన్నప్పుడే ఆమె నాన్న చనిపోయారు. అమ్మ వేరొకరితో సహజీవనం చేసేది. ఆ ఇద్దరూ కలిసి తనని చిత్రహింసలు పెట్టేవారు. ‘అయ్యోపాపం’ అనిపించేది. ఆ జాలి నుంచే ప్రేమ మొగ్గ తొడిగింది. తనని ముద్దుగా ‘పండు’ అని పిలిచేవాణ్ని.
‘నరేంద్రా... మా అమ్మ నన్ను వాడి దగ్గరికెళ్లమంటోంది. అలా చేస్తేనే డిగ్రీలో చేర్పించడానికి డబ్బులిస్తాడట. నాకు బతకాలని లేదు’ భోరుమంది ఓరోజు. నా గుండె రగిలిపోయింది. ఛీ... ప్రపంచంలో ఇలాంటి తల్లి కూడా ఉంటుందా? అనిపించింది. ‘నీకేం భయం లేదు. నిన్ను నేను చదివిస్తా’ మాటిచ్చా. ఏవో సాకులు చెప్పి ఇంట్లోంచి డబ్బులు తెస్తూ పండుని పీజీ దాకా చదివించా. మధ్యమధ్యలో మేం కలుసుకుని కష్టసుఖాలు పంచుకునేవాళ్లం.
పండు చదువు పూర్తైంది. తనేదైనా ఉద్యోగం చేస్తేనే గుర్తింపు, గౌరవం. నా సంగతి వదిలేసి తన కోసం చాలాచోట్ల ప్రయత్నించా. కొలువు సంపాదించడం అనుకున్నంత సులువేం కాదని అర్ధమైంది. ఆఖరికి ఓ స్నేహితుడిని బతిమాలి పండుని ఓ రిటైల్‌స్టోర్‌లో సేల్స్‌ప్రమోటర్‌గా పెట్టించా. ఎనిమిదివేల జీతం. ‘నువ్వే గనక లేకపోతే నా జీవితం ఎలా ఉండేదో’ కన్నీళ్లు పెట్టుకుంది. ‘పిచ్చిదానా మనిద్దరిదీ ఒకే జీవితం’ అంటూ గుండెలకు హత్తుకున్నా.
తనుద్యోగంలో కుదురుకుంది. ప్రేమప్రయాణం సాఫీగానే సాగుతోంది. ‘డిసెంబరులో మంచి ముహూర్తాలు ఉన్నాయట. పెళ్లి చేసుకుందామా?’ అడిగా. నీళ్లు నమిలింది. బహుశా పెద్దలు అడ్డుపడతారని భయం కాబోలు! ‘మా ఇంట్లో ఓకే. మీ అమ్మ ఒప్పుకోకపోయినా ఫర్వాలేదు. ఏమంటావ్?’ నా మాటకి కొంచెం సమయం కావాలంది. ఒకటి.. రెండు.. ఆర్నెళ్లు గడిచాయి. ఎటూ తేల్చదు.
ఓరోజు పండు పనిచేసేచోటికే వెళ్లా. ఆరోజు రాలేదట. తన గురించి అడుగుతుంటే నన్నంతా జాలిగా చూస్తున్నారు. ఎందుకని ఆరా తీస్తే ‘తను ఇక్కడ ఓ అబ్బాయితో ప్రేమలో పడింది’ అనేమాట నా గుండెల్లో ఈటెలా దిగింది. నేను నమ్మలేదు. కానీ ఆ నమ్మకం వమ్ము కావడానికి వారం పట్టలేదు. మరోసారి ఆఫీసుకొస్తే ఆ అబ్బాయితో సన్నిహితంగా కనిపించింది. అక్కడే నిలదీశా. ‘క్షమించు... ఇంకోసారలా చేయను’ అంది తలొంచుకొని. పదకొండేళ్ల ప్రేమని వదిలేయడానికి మనసొప్పలేదు.
నెలరోజుల్లో పెళ్లి ముహుర్తం పెట్టించా. అంగీకారం తెలిపింది. మనిషి మారిందనుకున్నా. నా మనసుతో ఇంకా ఆటలాడుతోందని తర్వాతే అర్థమైంది. పెళ్లి పనుల హడావుడిలో నేను తిరుగుతుంటే ఆ అబ్బాయితో బైక్‌పై షికార్లు చేస్తూ కనిపించింది. ఉన్నచోటే కుప్పకూలిపోయా. తర్వాత గుండె పగిలే మరిన్ని తెలిశాయి. వాళ్లిద్దరు భార్యాభర్తలమని చెప్పి ఓ గది అద్దెకు తీసుకొని ఉంటున్నారట. ఈ బంధానికి వాళ్ల అమ్మ కూడా ఆమోదం ఉంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇంతలా మోసగిస్తుందనుకోలేదు.
పెళ్లి పెటాకులైంది. రోజంతా తన ఆలోచనలే. మోసపోయాననే బెంగే. తిండి మానేశా. ఆరోగ్యం పాడై నెలరోజులు బెడ్ మీదే ఉన్నా. సాటి మనిషిగానైనా ఒక్కరోజైనా వచ్చి చూడలేదు. ఈమధ్యలో వచ్చిన నా పుట్టినరోజుకీ పలకరించలేదు. తన కోసం నా సరదాలు వదులుకున్నా. కెరీర్‌ని నిర్లక్ష్యం చేశా. శూన్య హస్తాలతో... మనసు నిండా బాధతో జీవచ్ఛవంలా ఉన్నా. నా పరాజయానికి కారణం ఆ అమ్మాయే.
మరదళ్లతో ఆడిన మనసాట!
‘హాయ్ బావా... ఎలా ఉన్నావ్... బాగా చదువుతున్నావా?’ ఎన్నడూ చేయని మరదలు అఖిల (పేరు మార్చాం) ఫోన్. ఆ షాక్ నుంచి తేరుకొని ‘ఫైన్... ఇంట్లో అంతా కులాసాయేనా?’ మాట కలిపా. నాలుగైదుసార్లు రెండువైపులా మా ఫోన్లు ముచ్చట్లాడాక ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా. నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అందోరోజు సడెన్‌గా. వేరొకరైతే ఎగిరి గెంతేసేవారే. కానీ నేను రాణితో పీకల్లోతు ప్రేమలో ఉన్నా. తనూ వరుసకి మరదలే. అందుకే కావాలనే అఖిలని దూరం పెట్టా. తనకు విషయం అర్ధమై ఫోన్ చేయడం మానేసింది. అన్నట్టు నా గుండెల్నిండా రాణినే ఉన్నా ఏనాడూ నోరు తెరచి ఆ మాట చెప్పలేదు.
కొన్నాళ్లకి అఖిల పెళ్లైంది. కనీసం శుభలేఖ కూడా ఇవ్వలేదు. అంత కోపం నాపై. ఏదైతేనేం తన పెళ్లితో నా మనసుకి ప్రశాంతత. ఇక నా ప్రేమ విషయం రాణితో చెప్పేయడమే. కానీ ఎలా? ఈ వూగిసలాటలో ఉండగానే రాణే కలిసింది. ‘బావా నీకో విషయం చెబుతా. ఏమనుకోవుగా?’ అంది సంశయిస్తూ. చెప్పమన్నా. ‘నీది అందరి మంచి కోరుకునే మనస్తత్వం. నీతోనే జీవితం పంచుకోవాలనిపిస్తోంది. ఏమంటావ్?’ అంది. ఆకలితో ఉన్నవాడికి ఇష్టమైన బిర్యానీ పెడితే వద్దంటాడా? మూడు పార్కులు... ఆరు ఐలవ్యూలతో సాఫీగా సాగిపోతోంది మా ప్రేమ.
ఆర్నెళ్లయ్యాక అఖిల ఫోన్. ‘ఎలా ఉన్నావ్?’ అనగానే బిగ్గరగా ఏడుపు మొదలుపెట్టింది. నాకేం అర్ధంకాలేదు. తేరుకొని తను విషయం చెప్పేసరికి నాకూ ఏడుపాగలేదు. కొద్దిరోజుల కిందటే తన భర్త యాక్సిడెంట్‌లో చనిపోయాడట. ‘నువ్వు నా ప్రేమని ఒప్పుకొని ఉంటే నాకీ ఏడుపు తప్పేదే’ అంటుంటే నా గుండె కలుక్కుమంది. ఆ వారమే తనని పరామర్శించడానికి అమ్మానాన్నలతో వెళ్లా. మమ్మల్ని చూడగానే అత్తయ్య సహా అంతా ఏడ్చారు. కాసేపయ్యాక దూరపు బంధువొకాయన వచ్చి ‘పాపం చిన్నవయసులో దానికి ఎంత కష్టమొచ్చింది? నువ్వు వరసైనోడివే కదా. పెళ్లి చేసుకొని తన జీవితాన్ని నిలబెట్టరా’ అన్నాడు. ఆయనపై పీకల్దాకా కోపమొచ్చింది. ‘ఇలాంటి టైంలో మాట్లాడాల్సిన మాటలా ఇవి. తర్వాత చూద్దాంలే’ అంటూ అక్కణ్నుంచి కదిలా.
ఎలా మొదలైందో తెలీదుగానీ నేను అఖిలకి దగ్గరవుతున్నాననే ప్రచారం బయల్దేరింది. అది నా ప్రేమను కాల్చేయకముందే సర్దుకోవాలని విషయమంతా రాణికి చెప్పేశా. అంతా విని ఓ నిట్టూర్పు విడుస్తూ ‘పాపం కదా... పోనీలే తనకోసం మన ప్రేమ త్యాగం చేద్దామా?’ అంది రాణి. కోపంతో తనకి ఫుల్ కోటింగ్ ఇచ్చేశా. అయినా నన్ను ఒప్పించే ప్రయత్నం మానదే! ఏం చేయాలో తెలియక అమ్మానాన్నలకి చెప్పా. ఇంతకుముందే వాళ్లు మా పెళ్లికి ఒప్పుకున్నారు. పైగా రాణంటే వాళ్లకి చాలా ఇష్టం. ‘నీకు నచ్చింది చెయ్‌రా. కానీ మనసులో ఒకర్ని పెట్టుకొని ఇంకొకర్ని ఎలా పెళ్లాడతావ్?’ సందేహంలోనే సమాధానం చెప్పారు.
అఖిల దుస్థితికి నాకూ ‘అయ్యోపాపం’ అనిపిస్తుంది. కానీ నా మనసు నిండా రాణినే ఉంటే ఏం చేయగలను? ఇది తెలుసుకోకుండా ‘అఖిలతో పెళ్లెపుడు?’ అనడిగేవారంతా. ఇంకా ఆలస్యం చేయడం భావ్యం కాదనిపించింది. నేరుగా వెళ్లి అఖిల అమ్మానాన్నల్ని కలిశా. రాణితో నా ప్రేమ విషయం చెప్పేసి వచ్చా. వాళ్లర్ధం చేసుకున్నారు. కాసేపటికే నా ఫోన్ మోగింది. అవతలివైపు అఖిల. నా గుండెల్లో ఒకటే దడ. ‘ఔను బావా.. నేనే అనవసరంగా నీపై ఆశలు పెంచుకున్నా. నువ్ రాణిని చేసుకోవడమే కరెక్ట్. నేనెప్పుడూ మీ మధ్యకు రాను’ అంది. హమ్మయ్య అనుకున్నా. ఆపై కొన్నాళ్లకే నాకుద్యోగం రావడం, రాణితో పెళ్లి చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు మేం హ్యాపీ. అప్పుడప్పుడు అఖిల గుర్తొస్తేనే మనసు భారంగా ఉంటుంది.
ఐలవ్యూ చెప్పింది... విలన్‌గా మారింది!
బంధువుల పెళ్లి. పన్నీటి జల్లులు... సన్నాయిమేళాలు... పలకరింపులతో సందడిగా ఉంది. మండపంలో వందలమంది ఉన్నా నా కళ్లు ఓ అమ్మాయి వెనకే పరుగెత్తుతున్నాయి. అందరినీ చనువుగా పలకరిస్తూ... మండపం అంతా కలియతిరుగుతోంది తను.
పెళ్లి తంతు పూర్తయ్యేలోపు ఆమె వివరాలు పట్టేశా. ‘చిన్ను’ తన ముద్దుపేరు. సిటీలో బీటెక్ సెకండియర్ చదువుతోందట. ఆ వివరాలు చాలవా? సాయంత్రమే ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టా. ‘హూ ఈజ్ దిస్?’ రెండ్రోజులయ్యాక మెసేజ్. ‘మొన్న మిమ్మల్ని వూరిలో జరిగిన పెళ్లిలో చూశా. ఆ అబ్బాయి మా బంధువే’ వివరాలందించా. ఫ్రెండ్‌గా ఓకే చేసింది.
చాటింగ్‌తో మొదలై త్వరలోనే ఫోన్ టాకింగ్ దాకా చేరాం. నా మనసంతా ఫోన్‌పైనే ఉండేది. రింగ్ అయితే తనేననే ఆతృత. నన్ను అప్‌సెట్ చేయకుండా రోజుకోసారైనా తనూ గొంతు వినిపించేది. కొద్దిరోజులయ్యాక ‘ఓసారి కలవవా ప్లీజ్’ అన్నా. వరమిచ్చింది. ఆపై తరచూ కలుసుకోవడం మామూలైంది. ఇష్టాలు, సినిమా కబుర్లు, వ్యక్తిగత సంగతులు... అన్నీ పంచుకునేవాళ్లం. సెకన్లలా గడిచిపోతున్నాయ్ రోజులు. ఇంకా ఎన్నాళ్లిలా? తను నా సొంతం కావాలని మనసు మారాం చేసింది. ప్రపోజ్ చేయాలనుకున్నా. ఇంకొద్దిరోజుల్లో తన పుట్టినరోజు. ఆరోజే నా ప్రేమ వెల్లడించాలనుకున్నా.
ఈలోపే నా ఎంబీఏ పూర్తై ఇంటికొచ్చేశా. చిన్ననాటి నేస్తం మాధురి (పేరు మార్చాం) పరుగున వచ్చి పలకరించింది. రోజూ ఇంటికొచ్చి నా వంకే చూడటం... ముసిముసిగా నవ్వడం... తన తీరు కొత్తగా అనిపించేది. ఆ భావానికి అర్ధం తెలియకముందే ‘నువ్వంటే నాకిష్టం. నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అనేసింది. పల్లెటూళ్లొ అంత ధైర్యంగా తన ఫీలింగ్ చెబుతున్న అమ్మాయిని చూస్తే ముచ్చటేసింది. కానీ అప్పటికే నా మనసు చిన్నూ సొంతం కదా! ఆ మాటే చెప్పా. తనేడుస్తూ వెళ్లిపోయింది. తర్వాతే మొదలైంది అసలు కథ.
‘నువ్వు నాకు ఫోన్ చేయొద్దు. మెసేజ్ పెట్టొద్దు’... నా చిన్నూ పొద్దునే వార్నింగ్ ఇచ్చింది. సరదాకి అంటుందనుకున్నా. వారం గడిచినా తను ఫోన్ చేయదు... చేసినా ఎత్తదు. మెసేజ్‌కి రిప్లై కూడా ఇవ్వదు. నాకంతా అయోమయం. అసలేం జరిగిందో తెలుసుకోవాలని వరుసపెట్టి ఫోన్లు చేశా. ఈసారి నా ఫోన్, వాట్సాప్ నెంబర్‌ని కూడా బ్లాక్ చేసేసింది. తనెందుకిలా ప్రవర్తిస్తుందో నాకర్ధం కాలేదు.
ఆర్నెళ్లయ్యాక నాకో ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. చిన్నూ నన్ను దూరం పెట్టడానికి కారణం నాకు ప్రపోజ్ చేసిన అమ్మాయే. వాళ్లద్దరు ఇంటర్ క్లాస్‌మేట్స్ అట. నేను సిగరెట్లు, మందూ తాగుతాననీ... అమ్మాయిల వెంట తిరుగుతాననీ... నా గురించి చాలా చెడుగా చెప్పిందట. ఆ మాటల్ని చిన్నూ నమ్మేసింది. ఆ విషయం తెలిశాక రగిలిపోయా. చిన్నూని నేరుగా కలవడానికి ప్రయత్నించా. తను పట్టించుకోలేదు. కనీసం నా మాట కూడా విన్లేదు.
పెళ్లి చేసుకొమ్మని ఇంట్లోవాళ్లు ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికీ నా మనసులో చిన్నూనే ఉంది. ఎప్పటికైనా తను జరిగిందేంటో తెలుసుకొని నన్ను ఆదరిస్తుందనే నమ్మకంతో ఉన్నా. ఒకమ్మాయి కారణంగా ప్రేమలో మాధుర్యం చవిచూస్తే... ఒకమ్మాయి ప్రేమలోని పగ ఎంత కఠినంగా ఉంటుందో తెలుసుకున్నా. నన్ను ప్రేమించిన అమ్మాయి కారణంగా నేను ప్రేమించిన అమ్మాయికి దూరమయ్యా. ఈ దుస్థితి ఎవరికీ రాకూడదు. - గోపాల్
పెళ్లి తంతు పూర్తయ్యేలోపు ఆమె వివరాలు పట్టేశా. ‘చిన్ను’ తన ముద్దుపేరు. సిటీలో బీటెక్ సెకండియర్ చదువుతోందట. ఆ వివరాలు చాలవా? సాయంత్రమే ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టా. ‘హూ ఈజ్ దిస్?’ రెండ్రోజులయ్యాక మెసేజ్. ‘మొన్న మిమ్మల్ని వూరిలో జరిగిన పెళ్లిలో చూశా. ఆ అబ్బాయి మా బంధువే’ వివరాలందించా. ఫ్రెండ్‌గా ఓకే చేసింది.
చాటింగ్‌తో మొదలై త్వరలోనే ఫోన్ టాకింగ్ దాకా చేరాం. నా మనసంతా ఫోన్‌పైనే ఉండేది. రింగ్ అయితే తనేననే ఆతృత. నన్ను అప్‌సెట్ చేయకుండా రోజుకోసారైనా తనూ గొంతు వినిపించేది. కొద్దిరోజులయ్యాక ‘ఓసారి కలవవా ప్లీజ్’ అన్నా. వరమిచ్చింది. ఆపై తరచూ కలుసుకోవడం మామూలైంది. ఇష్టాలు, సినిమా కబుర్లు, వ్యక్తిగత సంగతులు... అన్నీ పంచుకునేవాళ్లం. సెకన్లలా గడిచిపోతున్నాయ్ రోజులు. ఇంకా ఎన్నాళ్లిలా? తను నా సొంతం కావాలని మనసు మారాం చేసింది. ప్రపోజ్ చేయాలనుకున్నా. ఇంకొద్దిరోజుల్లో తన పుట్టినరోజు. ఆరోజే నా ప్రేమ వెల్లడించాలనుకున్నా.
ఈలోపే నా ఎంబీఏ పూర్తై ఇంటికొచ్చేశా. చిన్ననాటి నేస్తం మాధురి (పేరు మార్చాం) పరుగున వచ్చి పలకరించింది. రోజూ ఇంటికొచ్చి నా వంకే చూడటం... ముసిముసిగా నవ్వడం... తన తీరు కొత్తగా అనిపించేది. ఆ భావానికి అర్ధం తెలియకముందే ‘నువ్వంటే నాకిష్టం. నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అనేసింది. పల్లెటూళ్లొ అంత ధైర్యంగా తన ఫీలింగ్ చెబుతున్న అమ్మాయిని చూస్తే ముచ్చటేసింది. కానీ అప్పటికే నా మనసు చిన్నూ సొంతం కదా! ఆ మాటే చెప్పా. తనేడుస్తూ వెళ్లిపోయింది. తర్వాతే మొదలైంది అసలు కథ.
‘నువ్వు నాకు ఫోన్ చేయొద్దు. మెసేజ్ పెట్టొద్దు’... నా చిన్నూ పొద్దునే వార్నింగ్ ఇచ్చింది. సరదాకి అంటుందనుకున్నా. వారం గడిచినా తను ఫోన్ చేయదు... చేసినా ఎత్తదు. మెసేజ్‌కి రిప్లై కూడా ఇవ్వదు. నాకంతా అయోమయం. అసలేం జరిగిందో తెలుసుకోవాలని వరుసపెట్టి ఫోన్లు చేశా. ఈసారి నా ఫోన్, వాట్సాప్ నెంబర్‌ని కూడా బ్లాక్ చేసేసింది. తనెందుకిలా ప్రవర్తిస్తుందో నాకర్ధం కాలేదు.
ఆర్నెళ్లయ్యాక నాకో ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. చిన్నూ నన్ను దూరం పెట్టడానికి కారణం నాకు ప్రపోజ్ చేసిన అమ్మాయే. వాళ్లద్దరు ఇంటర్ క్లాస్‌మేట్స్ అట. నేను సిగరెట్లు, మందూ తాగుతాననీ... అమ్మాయిల వెంట తిరుగుతాననీ... నా గురించి చాలా చెడుగా చెప్పిందట. ఆ మాటల్ని చిన్నూ నమ్మేసింది. ఆ విషయం తెలిశాక రగిలిపోయా. చిన్నూని నేరుగా కలవడానికి ప్రయత్నించా. తను పట్టించుకోలేదు. కనీసం నా మాట కూడా విన్లేదు.
పెళ్లి చేసుకొమ్మని ఇంట్లోవాళ్లు ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికీ నా మనసులో చిన్నూనే ఉంది. ఎప్పటికైనా తను జరిగిందేంటో తెలుసుకొని నన్ను ఆదరిస్తుందనే నమ్మకంతో ఉన్నా. ఒకమ్మాయి కారణంగా ప్రేమలో మాధుర్యం చవిచూస్తే... ఒకమ్మాయి ప్రేమలోని పగ ఎంత కఠినంగా ఉంటుందో తెలుసుకున్నా. నన్ను ప్రేమించిన అమ్మాయి కారణంగా నేను ప్రేమించిన అమ్మాయికి దూరమయ్యా. ఈ దుస్థితి ఎవరికీ రాకూడదు. - గోపాల్
ఆ రాక్షసుడి నుంచి అలా తప్పించుకున్నాం
మంగినపూడి సాగరతీరం... సాయంత్రం వేళ. ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలు ఒడ్డుకు చేరుతూ మా పాదాలను తాకుతూ కవ్విస్తున్నాయి. అస్తమించే సూర్యుడు ఇక సెలవంటూ ముఖం చాటేస్తున్నాడు. కారుచీకటి కమ్ముకొస్తోంది. సరిగ్గా ఇదే దృశ్యం పన్నెండేళ్ల కిందట జరిగింది. తదనంతరం జరిగిన పరిణామాలు గుర్తు చేసుకుంటే మా వెన్నులో వణుకొస్తోంది.
అప్పుడప్పుడే కాలేజీకి గుడ్‌బై చెప్పిన రోజులవి. ‘చదువైపోయిందిగా... ఏదైనా ఉద్యోగం చూసుకోరా’ అందరి ఇళ్లలో ఇదే పోరు. మేం పట్టించుకుంటేగా! పొద్దంతా క్రికెట్ ఆడి.. రాత్రి పార్టీ చేసుకొని.. ఏదో సినిమాకి చెక్కేద్దాం అనుకునేవాళ్లం.
డిసెంబరు 25, 2004. వూరంతా క్రిస్మస్ సంబరాల్లో ఉంది. అదేరోజు మా అభిమాన హీరో సినిమా విడుదలైంది. మొదటిరోజే సినిమా చూడకపోవడం మాకు పరువు సమస్య. ఎవరెవరినో బతిమాలాం. మొత్తానికి మా ప్రయత్నం ఫలించింది. సెకండ్‌షో... విజయవాడ నవరంగ్ థియేటర్‌లో. సినిమా చూసి ఎముకలు కొరికే చలిలో బైక్‌లు, కార్లతో రోడ్డు మీద విన్యాసాలు చేసి ఓ ఫ్రెండ్ ఇంటికి చేరాం.
డిసెంబరు 26. అందరి ఇళ్లలో ఆగకుండా ల్యాండ్‌లైన్ ఫోన్లు మోగుతున్నాయి. ‘మీ అబ్బాయి ఎలా ఉన్నాడు?’, ‘ఏం కాలేదు కదా?’ వాకబులు. ఫోన్ పెట్టేస్తూ అమ్మానాన్నలు గాబరా పడుతున్నారు. అంతా అయోమయం. 26 తెల్లవారుజామున ఓ రాక్షసుడు ప్రకృతి రూపంలో విలయతాండవం చేశాడట. 30 మంది ప్రాణాల్ని బలిగొన్నాడని వార్త. ఈ విషయం మాకు తెలియదు. ఇప్పుడున్నట్టు అప్పట్లో 24 గంటల న్యూస్ ఛానెళ్లు పెద్దగా లేవాయే! రాత్రి ఓ స్నేహితుడి ఇంట్లో కునుకు తీసి ఉదయం ఇళ్లు చేరుకుంటే మా అమ్మానాన్నలు మమ్మల్ని గుండెలకు హత్తుకున్నారు. ఏదైనా పనిచేయమంటూ నిత్యం బూతులు తిట్టేవాళ్లు ‘నువ్వు మాకు దక్కావు చాలురా’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అందరి ఇళ్లలో ఇదే సీన్.
నిజానికి ఆరోజు మేం వెళ్లాల్సింది సెకండ్ షోకి కాదు ఫస్ట్ షోకి. ఫస్ట్ షో సినిమా చూసి కాసేపు పడుకొని లేచి మంగినపూడి బీచ్‌కెళ్లి సన్‌రైజ్ బాత్ చేయాలనేది మా ప్లాన్. పౌర్ణమి కదా... పుణ్యం కలిసొస్తుందనే ఆశ. సెకండ్ షో టికెట్లు మాత్రమే ఉన్నాయని తెలియడంతో మా ప్లాన్ మారింది. బోలెడు సమయం, అందుబాటులో కారు ఉండటంతో ముందే మంగినపూడి బీచ్‌కి వెళ్లాం. అలుపెరుగకుండా ఆటలాడాం. సూర్యుడు వీడ్కోలు తీసుకుంటుంటే కదల్లేక కదల్లేక అక్కణ్నుంచి కదిలాం. రెండున్నర గంటల్లో థియేటర్ చేరి కేరింతల మధ్య మా అభిమాన హీరో సినిమా చూశాం.
సీన్ కట్ చేస్తే... 26 ఉదయం ఆ రాక్షసుడు జనంపై నిర్దయగా విరుచుకుపడ్డాడని తెలిసింది. ఫస్ట్ షో టికెట్లు దొరికి ఉంటే ఆచూకీ లేకుండా పోయిన వాళ్లలో మేమూ ఉండేవాళ్లం. 26 ఉదయం సముద్ర స్నానానికి వెళ్తాం అని ఇళ్లలో చెప్పేశాం. సినిమా టికెట్లు దొరకకపోవడంతో మా ప్లాన్ మారింది. అదే మా ప్రాణాలు దక్కడానికి, మా ఇళ్లల్లో అందరూ ఆందోళన పడి, ఆనక మమ్మల్ని హత్తుకోడానికి కారణం. ఇంతకీ ఆ రాక్షసుడి పేరేంటో తెలుసా? సునామీ! ఆ రోజు మేం గడిపిన క్షణాలు, తదనంతర విలయం గుర్తొస్తే ఇప్పటికీ ఒంట్లో జలదరింపే.
పరిచయం స్నేహమైంది....జీవితం వరమైంది
నాకు, నా ఫ్రెండ్ సురేశ్‌కి శ్రీకాకుళంలో ఇంటర్వ్యూ. ఉదయమే బస్సులో బయల్దేరాం. కొంచెం దూరం వెళ్లాక ‘వాళ్లేం క్వశ్చన్స్ అడగొచ్చంటావ్? జీతం సంగతి ఇప్పుడే చెబుతారా?’ ముందు సీట్లోంచి మాటలు వినపడ్డాయి. చూస్తే ఇద్దరమ్మాయిలు. మేం వెళ్తున్నచోటికే వాళ్లూ వస్తున్నారనే విషయం అర్థమైంది. ‘హలో’ అంటూ మాట కలిపాం. ‘సిరి’, ‘వసంత’ పేర్లు చెప్పారు. ఇంటర్వ్యూ ఎలా చేయాలో ఒకరికొకరం సలహాలిచ్చుకున్నాం.
మధ్యాహ్నానికే నలుగురి ఇంటర్వ్యూలయ్యాయి. ‘అరసవెళ్లి గుడికి వెళ్లొద్దామా’ అంది సిరి. మొహమాటంకొద్దీ రాలేమని చెప్పి రైల్వేస్టేషన్ బయల్దేరాం. ‘అమ్మాయిలే పిలుస్తుంటే నీకేంట్రా అభ్యంతరం... వెళ్తే సరదాగా ఉండేది కదా?’ సురేశ్ గోల. నాకూ ఉబలాటంగానే ఉంది. ఓ ఆటో మాట్లాడుకొని గుడికి బయల్దేరాం. అప్పటికే వాళ్లిద్దరు దర్శనం చేసుకొని బయటికొస్తున్నారు. జాతరలాంటి వాతావరణంలో గుడి అంతా కలియతిరిగాం. వ్యక్తిగత కబుర్లు, ఇష్టాయిష్టాలు చెప్పుకుంటూ సరదాగా గడిపాం. సాయంత్రం వీడ్కోలు తీసుకుంటుంటే మనసులో ఒకటే బాధ. ‘మన స్నేహానికి ఇంతటితో ముగింపు పలకొద్దు. అప్పుడప్పుడు కలుసుకోవాల్సిందే’ తీర్మానం చేశాం. అన్నట్టుగానే వీలున్నపుడు కలుసుకునేవాళ్లం. సినిమాలు... ముచ్చట్లు రోజులు హుషారుగా గడిచేవి.
రోజురోజుకీ మా స్నేహం గాఢత పెరిగిపోతోంది. ఎక్కడ దూరం అవుతామో అనే భయం కూడా. మరోవైపు మేం ఆ అమ్మాయిలతో ప్రేమలో పడ్డామనే ప్రచారం మొదలైంది. సురేశ్ సంగతేంటో తెలీదుగానీ సిరిపై నాకు రోజురోజుకీ ఇష్టం పెరిగిపోతోంది. ఒక ఫ్రెండ్ ఓరోజు మొహంమీదే అడిగేశాడు. ఫ్రెండ్షిప్పా? ప్రేమా? ఏదీ చెప్పలేకపోయా. వాళ్లు మాకు దూరం కావొద్దనే భయమో... వూరిలో జరుగుతున్న ప్రచార ప్రభావమో తను నా సొంతమైతే బావుణ్ననిపించింది. దానికి ఏకైక మార్గం పెళ్లి. అడగాలనిపించింది. ఒప్పుకుంటే ఫర్వాలేదు. నా ప్రతిపాదన నచ్చకపోతే? ఉన్న స్నేహం కాస్తా పాడవుద్ది. అలాగని మనసూర్కోదు. గుండెలు పిండేసినట్టుండేది.
ఓరోజు నలుగురం కలిశాం. పిచ్చాపాటీ కబుర్లయ్యాక ‘నేనో అబ్బాయిని లవ్ చేస్తున్నా. ఇంట్లో వాళ్లని ఎలా ఒప్పించాలో తెలియడం లేదు. మీరే సాయం చేయాలి’ సీరియస్‌గా అంది సిరి. నా గుండెలు జారిపోయాయి. కొన్ని విషయాల్ని మనసులోనే నాన్చడం ఎంత తప్పో అర్థమైంది. అప్పుడే వసంత అందుకుంది. ‘కన్నవాళ్లు మనల్ని కష్టపడి పెంచితే ఎవడో దారినపోయే దానయ్యని ప్రేమించి వాళ్లకు చెడ్డ పేరు తెస్తావా?’ అని చెడామడా తిట్టేసింది. కన్నవాళ్లని ఎదిరించి పెళ్లి చేసుకుంటే ఎదురయ్యే కష్టాలు, వాళ్లకొచ్చే ఇబ్బందులు వివరించాడు సురేశ్. నేను సంతోషించాలో, ఏడవాలో నాకే అర్థం కాని పరిస్థితి. వాతావరణం గంభీరంగా మారింది. ‘ప్రేమ, పెళ్లి సంగతి కాసేపు వదిలేయండి. భవిష్యత్తులో మన స్నేహం ఇలాగే కొనసాగించాలని ఒట్టేయండి’ అన్నా. ముగ్గురూ నన్ను వింతగా చూశారు. ‘ఇది కొత్తగా చెప్పాలా?’ అంది వసంత. ముగ్గురూ నా చేతిలో చేయేశారు.
నెలలు, ఏళ్లు గడుస్తున్నాయి. ఇప్పటికీ మా స్నేహంలో చిన్న కుదుపు లేదు. ఒకరి కష్టసుఖాల్లో ఒకరం తోడుగా నిలుస్తూనే ఉన్నాం. ఒకమ్మాయి మనసు గెల్చుకొని తనతో జీవితాంతం నడవాలంటే భర్త హోదాతోనే అది సాధ్యం అనుకునేవాణ్ని. ఆ అభిప్రాయం మార్చుకున్నా. ‘మీరు లవర్సా?, స్నేహితులా? అన్నాచెల్లెళ్లా?’ అనే ప్రశ్నలు మాకు ఎదురవుతూనే ఉన్నాయి. ఎవరెలా ఫీలైనా ఫర్వాలేదు. మాది స్వచ్ఛమైన స్నేహం. అందుకు ప్రతిరూపంగా ఉండాలనుకుంటున్నాం. ఉంటాం.
ప్రేమాటలో గెలిచి ఓడాను
‘నేను అందంగా ఉంటా. పద్ధతైన అమ్మాయిని’... ఈ మాట గొప్పకోసం చెప్పుకోవడం లేదు. చాలామంది నాతో చెప్పిందే. ఆ పేరు కాపాడుకోవడానికి ప్రేమనే త్యాగం చేసి ఇప్పుడు వగస్తున్నా.
రోజులో ఒక్క పూటైనా పస్తులుండేంత పేదరికం మాది. అయినా పరువుకు ప్రాణమిచ్చే కుటుంబం. బాగా చదివి పెద్ద ఉద్యోగం సంపాదించి మా కష్టాల్ని గట్టెక్కించాలనుకునేదాన్ని. ఆర్థిక ఇబ్బందులు ఆ కలను చిదిమేశాయి. మంచి ఉద్యోగం, మనసున్న అబ్బాయి పెళ్లాడితే బావుణ్ను అనే ఆశ మొదలైంది. దేవుడు నా మొర ఆలకించాడు.
ఓసారి ఫ్రెండ్‌ని కలవడానికెళ్లా. వాళ్ల అన్నయ్య ఎదురుపడ్డాడు. నేవీలో ఉద్యోగమట. ‘మా చెల్లితో ఏం పని?’, ‘ఏమైనా చెప్పమంటావా?’ అనడిగాడు. వచ్చిన పని చెప్పా. మర్నాటి నుంచే నా వెంటపడటం గమనించా. పట్టించుకోలేదు. ఇంకోసారలా చేయొద్దని వార్నింగ్ ఇచ్చా. విన్లేదు. తన తీరు ఇబ్బందిగానే ఉన్నా లోలోపల గమ్మత్తుగా ఉండేది. నేనూ మెల్లిగా మాట కలిపా. కొన్నాళ్లకు ముంబయిలో ఉన్న బంధువులింటికి వెళ్లాల్సి వచ్చింది. చెప్పగానే తల్లడిల్లిపోయాడు. ‘మళ్లీ ఎప్పుడొస్తావ్?’, ‘నిన్ను చూడకుండా నేనుండగలనా?’ అంటుంటే నాపై ఇంత అభిమానం పెంచుకున్నాడా? అనిపించింది. రైలెక్కేముందు స్టేషనుకొచ్చాడు. రైలు కనుమరుగయ్యేంతవరకూ నన్నే చూస్తుండిపోయాడు. అక్కడికెళ్లాక రోజూ తనే గుర్తొచ్చేవాడు. అతడి మాటలు, నాకు దగ్గరయ్యేందుకు చేసే ప్రయత్నాలే గుర్తొచ్చేవి. కొన్నాళ్లకు ఓ లెటర్ వచ్చింది. నాతో మాట్లాడాలని ఎంతగా తపించిపోతోందీ... నా అడ్రెస్ కనుక్కోవడానికి తనెంత కష్టపడిందీ రాశాడు. కళ్లు చెమర్చాయి. వూరి నుంచి వస్తూనే అతడి గుండెలపై వాలిపోయా. ‘మనం ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకుందాం’ అన్నాడు. నన్ను మొదటిసారి చూసినరోజు దగ్గర్నుంచి ఎంత ప్రేమ పెంచుకున్నాడో చెప్పాడు. నాలోని మంచీచెడూ విడమర్చి వివరించాడు. పిల్లలు పుడితే ఏం పేర్లు పెట్టాలో చెప్పాడు. ‘మీ నుంచి పైసా కట్నం ఆశించను. అవసరమైతే నేనే ఎదురు కట్నమిచ్చి నిన్ను నాదాన్నిగా చేసుకుంటా’ అంటుంటే ఒళ్లంతా గర్వంతో పులకించింది. దుర్భర పేదరికంలో ఉన్న అమ్మాయికి ఇంతకన్నా ఏం కావాలి?
మా పెళ్లికి వాళ్లింట్లో ఓకే. మా అమ్మానాన్నలకి చెప్పే ధైర్యం లేక తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నా. ఈలోపే జరిగిందో అనర్థం. ఓరోజు బయటికెళ్లి వచ్చిన అమ్మ బాధగా నాతో ఓ విషయం చెప్పింది. ‘చిన్నప్పుడు నీతో కలిసి చదువుకున్న గీత ఒకబ్బాయితో వెళ్లిపోయిందే’ అని. గీత ప్రేమ సంగతి నాకు తెలుసు. అది చెప్పకుండా ‘పెద్దవాళ్లు పెళ్లికి ఒప్పుకుంటే ఇంతదూరం వచ్చేదే కాదుగా’ అన్నా ఏమీ ఎరగనట్టే. ఆ విషయాన్నే పొడిగించి మా ప్రేమ సంగతి చెప్పాలని నా ప్లాన్. ‘నోర్ముయ్... కన్నవాళ్ల గురించి ఆలోచించని కూతురు ఓ మనిషేనా? నువ్వేగనక ఇలాంటి పనిచేస్తే మేం ఉరేసుకొని చచ్చేవాళ్లమే’ అంది కోపంగా. అమ్మానాన్నలది అన్నంతపనీ చేయగల కఠిన మనస్తత్వం. చెప్పకనే వారి నిర్ణయం చెప్పేశారు. నాకిక ఏ దారీ కనిపించలేదు. రకరకాలుగా ఆలోచించా. వాళ్లని ఒప్పించలేను. నన్నిష్టపడ్డవాడు కట్నం వద్దన్నా అతడి తల్లిదండ్రులకు నాపై కోపం ఉంటుందనిపించింది. ఇందర్ని బాధ పెట్టడం... ఇలాంటి పరిస్థితుల్ని ఎదిరించడం నావల్ల కాదనిపించింది. మర్నాడే తనని కలిసి మన పెళ్లి జరగదని చెప్పేశా. ఈ మాట చెబుతుంటే ప్రాణం విలవిల్లాడింది. తనూ క్షోభకు గురవుతాడని తెలుసు. అయినా నాకు వేరే దారి కనిపించలేదు. ప్రేమించడానికి రెండు మనసులు చాలు... పెళ్లికి రెండు కుటుంబాల ఆమోదం కావాలని అనుభవపూర్వకంగా అర్థమైంది. నేను తీసుకున్న నిర్ణయం నన్ను జీవితాంతం బాధిస్తూనే ఉంటుంది.
ప్రేమ శక్తినిచ్చింది... బ్రేకప్‌ని భరించమంది!
పదోతరగతి పరీక్ష. మనసులో ఒకటే టెన్షన్. పరీక్ష ఎలా రాస్తానో అని కాదు. హాలులో ఒకమ్మాయి తదేకంగా నన్నే చూస్తుండటంతో. నేనూ కళ్లప్పగించా. కాసేపయ్యాక మా చూపులు మాటలయ్యాయి. ‘నీ నెంబర్ ఇస్తావా?’ అంది చివరి పరీక్ష రోజున. నేను హ్యాపీ. ఫోన్లు మొదలయ్యాయి. తనను ముద్దుగా ‘చిన్నీ’ అనేవాణ్ని. ‘నువ్వెంతా? నీ వయసెంత? మా అమ్మాయికే ఫోన్ చేసి కబుర్లు చెబుతావా? ఇంకోసారిలా చేస్తే జైళ్లొ ఉంటావ్’ చిన్ని మేనమామ బెదిరించాడు. గుండెలదిరాయి. తనని మర్చిపోవాలనుకున్నా. రోజులు గడుస్తున్నకొద్దీ ఆమె నా వూహల్లోంచి కనుమరుగవసాగింది.
ఇంటర్లో చేరా. ఆశ్చర్యంగా చిన్ని అదే కాలేజీలో కనిపించింది. మళ్లీ మాటలు షురూ. ఆపై జంటపక్షుల్లా విహరించేవాళ్లం. మా సంగతి వాళ్లింట్లో తెలిసేసరికి ఇంటర్ పూర్తైంది. మమ్మల్ని విడదీయాలని తనని హైదరాబాద్ కాలేజీలో చేర్పించారు. అయితేనేం... చిన్ని అక్కడికెళ్లగానే మొదటి ఫోన్ నాకే చేసింది. దూరమైనా మామధ్య ప్రేమ తగ్గలేదు. మేం టచ్‌లో ఉన్న సంగతి మళ్లీ తెలిసిపోయింది. తనని చదువు మాన్పించేస్తాం అని బెదిరించారు. నావల్ల తన జీవితం పాడవ్వొద్దని ‘ఇకపై మీ అమ్మాయికి ఫోన్ చేయను, కలవన’ని మాటిచ్చా. ‘నావల్ల కావడం లేదురా. నీ దగ్గరికొచ్చేస్తున్నా’ రెండోరోజే చిన్నీ గోల. హ్యాపీనే.. కానీ మనసులో భయం. నాది చిన్న ఉద్యోగం. తనని కలవడానికెళ్తేనే అప్పులు చేయడం... తీర్చడానికి కూలి పనులు చేసే పరిస్థితి. అలాంటిది తను నా దగ్గరికొస్తే ఎలా? ‘ముందు బాగా చదువుకో. ఈలోపు నేను మంచి ఉద్యోగం సంపాదిస్తా. తర్వాత మనల్ని ఆపేవాళ్లుండరు’ నచ్చజెప్పా. అప్పట్నుంచి ప్రతిక్షణం మా జీవితం గురించే ఆలోచించా. ఓ ఫ్రెండ్ సలహాతో మెడికల్ రిప్రెజెంటేటివ్‌గా చేరా. రోజూ వందలకిలోమీటర్లు ప్రయాణం... అర్ధరాత్రుళ్లదాకా పని. ఎంత కష్టమైనా తనకోసం భరించా. రెండేళ్లలో ఓ స్థాయికి చేరుకున్నా. ఇంత బిజీలోనూ వీలైనపుడు ఫోన్... వీకెండ్‌లో కలుసుకోవడం కొనసాగేవి.
చదువైపోగానే చిన్నికి ఉద్యోగమొచ్చింది. మా ఆనందాలకిక అడ్డేముంది? పెద్దల్ని ఒప్పిస్తామనే ధీమాతో అన్ని హద్దులు దాటాం. ఇదిలా కొనసాగుతుండగానే ‘మా బావతో నా పెళ్లి చేస్తాం అంటున్నారు. తను కూడా నాకు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏం జరుగుతుందో ఏమో?’ పిడుగులాంటి వార్త చెప్పిందోరోజు. నా మనసేదో కీడు శంకించింది. మీ పేరెంట్స్‌తోనే డైరెక్టుగా పెళ్లి విషయం మాట్లాడతానన్నా. రేపు, మాపంటూ వాయిదా వేయించేది. ఓపిక నశించి మీ ఇంటికే వస్తున్నానన్నా. ‘రావద్దు... నువ్వు మా ఫ్యామిలీకి సరిపోవు. మన ప్రేమకు ఇంతటితో ముగింపునిద్దాం’ అంది. కలలో కూడా వూహించని మాట. మనసు మూగగా రోదిస్తుంటే ‘ఇందులో ఎవరి బలవంతం లేదు. నేనే ఆలోచించి ఈ మాట చెబుతున్నా. మనిద్దరికి సెట్ కాదు’ అంటూ మరో వాగ్బాణం నా గుండెలో దించింది.
నువ్వే ప్రాణమంది. జీవితాంతం కలిసి ఉందామని బాసలు చేసింది. చివరికి ఒక్కమాటతో ఎనిమిదేళ్ల ప్రేమని నిట్టనిలువునా కూల్చేసింది. ఒక్కసారిగా ఇంత మార్పెలా? పైగా మన తిరుగుళ్ల సంగతేంటి... మన ప్రేమ విషయం మీ ఆయనకు తెలిస్తే ఎలా? అనడిగితే ఏమందో తెలుసా? ‘తనకి అన్నీ చెప్పేశాను. నన్నర్థం చేసుకొనే నా చేయి అందుకోబోతున్నాడు’ అంది. ఇంత ఘోరమా? తను నా సొంతం కాదనే విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేపోతున్నాను. ప్రతిక్షణం పాత జ్ఞాపకాలతో కుమిలిపోతుంటే ‘నీకేంట్రా మగాడివి. తనకు లేని బాధ నీకెందుకు? మర్చిపో’ అంటున్నారు ఫ్రెండ్స్. ఔను.. నేను మగాడినే.. కానీ మనసున్నవాడిని. అందుకే నాకీ టార్చర్. ఏదేమైనా తను నన్ను కాదనుకుంది. కష్టాల సుడిగుండంలోకి తోసేసింది. అయినా భరిస్తా. తనవల్లే కష్టాలను భరించే శక్తి సంపాదించా. ఇప్పుడూ భరిస్తూనే ఉంటా. ఎందుకంటే నేను నిజమైన ప్రేమికుడిని. మోసగాణ్ని కాదు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చిన్నీ.
అమ్మానాన్నా... ఆశీర్వదించరూ!!
చిన్ననాటి నేస్తం లావణ్య పెళ్లి. చలువ పందిళ్లు, మామిడి తోరణాలు, సన్నాయిమేళాలతో సందడిగా ఉంది. కాసేపట్లో ముహూర్తం. ఇంతలో పెళ్లిపందిట్లో కలకలం. మొత్తం కట్నం ఇవ్వలేదని వరుడి తండ్రి గొడవ పడుతున్నాడు. ‘సమయానికి డబ్బులు అందలేదు. వారంలో సర్దుబాటు చేస్తా’ అని నా ఫ్రెండ్ నాన్న మొత్తుకున్నా వినట్లే. సినిమా సీన్ గుర్తొచ్చింది. అప్పుడొచ్చాడొకతను. ‘సరేనండీ.. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తా. వాళ్లొచ్చి మీరు అడిగినంతా ఇస్తారు’ అన్నాడు. ‘ఏంటి బెదిరిస్తున్నావా?’ అవతలి మనిషి గద్దింపు. ‘నిజమే. పెళ్లికి ముందే ఇలా రచ్చ చేస్తున్నారు. పెళ్లయ్యాక మా అమ్మాయి పరిస్థితేంటి? ఇప్పుడే ఏదో ఒకటి తేల్చేసుకుందాం’ ఆవేశంగా వాదిస్తున్నాడు. క్షణాల్లో పెద్దలంతా పోగయ్యారు. వాదోపవాదాలు, చర్చలయ్యాక పెళ్లి తంతు మొదలైంది.
తను లావణ్యకు మేనమామ వరుస. మేముండే సిటీలోనే ఉద్యోగం చేస్తున్నాడట. అతడి ధైర్యాన్ని మెచ్చుకుందామని ఫోన్ కలిపా. ‘అంతమంది పెద్దవాళ్లున్నా భలే మాట్లాడారు. హ్యాట్సాఫ్’ అన్నా. ‘వయసుదేముంది? మంచిపనికి ఎవరో ఒకరు అడుగు ముందుకేయాలిగా’ అన్నాడు. సమాజం.. అవినీతి.. నిరుద్యోగం.. రాజకీయాలపై పదినిమిషాలు ఆపకుండా లెక్చరిచ్చాడు. రవి మాటలు భలే నచ్చేవి. అవి వినడానికైనా అప్పుడప్పుడు పలకరించేదాన్ని. ‘గురజాడలా.. ఎప్పుడూ సమాజం గురించే చెబుతావ్. ఇంతకీ నువ్వు కట్నం లేకుండా పెళ్లి చేసుకోగలవా?’ సరదాగా అడిగానోసారి. ‘తప్పకుండా. ఒప్పుకుంటే నిన్నే చేసుకుంటా’ అన్నాడు. గుండెలదిరాయి. ‘సీరియస్‌గానే చెబుతున్నా. మన పరిచయం అయిన దగ్గర్నుంచీ నిన్ను గమనిస్తున్నా. నీదీ నాలాంటి మనస్తత్వమే. అందుకే నువ్వంటే నాకిష్టం. ఆలోచించు’ అన్నాడు మరోసారి.
నాన్నది గుమాస్తా ఉద్యోగం. తాహతుకు మించి నన్ను, చెల్లిని చదివించారు. నేనింకా ఉద్యోగప్రయత్నాల్లోనే ఉన్నా. ఈ పరిస్థితుల్లో రవి ప్రపోజల్‌కి ఒప్పుకుంటే నాన్నకు పెద్ద భారం దిగినట్టే. కానీ ఫోన్లో అభిప్రాయాలు పంచుకోవడం తప్ప మేం ఎప్పుడూ కలుసుకోలేదు. ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియదు. అదే అడిగా. ‘పెళ్లిచూపుల పేరుతో పదినిమిషాలు మాట్లాడుకొని ముక్కూమొహం తెలియని అమ్మాయి, అబ్బాయి ఒక్కటవడం లేదా?’ ప్రశ్నించాడు. నా దగ్గర సమాధానం లేదు. కన్నవాళ్లదే తుది నిర్ణయమన్నా.
వారం తిరక్కముందే మా ఇంటికొచ్చాడు. ‘మీ అమ్మాయంటే నాకిష్టం. తనకీ నేనన్నా ఇష్టమే. పైసా కట్నమొద్దు. మాకు పెళ్లి చేయండి’ నాన్నతో సూటిగా చెప్పేశాడు. నాన్న రవిని నానా మాటలన్నారు. ‘ఒకబ్బాయిని ప్రేమించి, పెళ్లి నిర్ణయం కూడా తీసుకునేంత పెద్దదానివయ్యావా?’ అంటూ నన్నూ తిట్టారు. రవి ఎన్నిసార్లు ప్రయత్నించినా మావాళ్లు ఒప్పుకోలేదు. పైగా చాలా అవమానించారు. ఆఖరికి నేనే ఓ నిర్ణయానికొచ్చా. ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుందాం అన్నా రవితో. నా బలవంతంతో సరేనన్నాడు. మేం అడుగు బయటపెట్టాం. స్నేహితుల సాయంతో పెళ్లి చేసుకున్నాం. పెద్దకూతురు చనిపోయిందనుకున్నారు కన్నవాళ్లు. కంటికిరెప్పలా చూసుకుంటూ నాకు ఆ బాధ తెలియకుండా చూశాడు రవి.
కొన్నాళ్లకు చెల్లి ఉద్యోగం కోసం సిటీకొచ్చిందని తెలిసింది. నన్ను, చెల్లిని ఒప్పించి రవి తనను మా ఇంటికి తీసుకొచ్చాడు. ఓ బ్యాంకింగ్ ఇనిస్టిట్యూట్‌లో చేర్పించాడు. అవసరమైనప్పుడల్లా డబ్బులిచ్చాడు. అన్నీ అమ్మానాన్నలకు తెలియకుండానే. ఏడాది తిరక్కముందే చెల్లి క్లర్క్ ఉద్యోగానికి ఎంపికైంది. మాకు చెప్పలేనంత సంతోషం. ‘అక్కాబావలు లేకుంటే నాకీ ఉద్యోగం వచ్చేదే కాదు’ అందట నాన్నతో. తర్వాత అన్ని విషయాలూ చెప్పేసింది. ముందు కోప్పడ్డా నాన్నలోనూ మార్పు మొదలైందని చెప్పింది.
ఈసారి వూరెళ్లొచ్చిన చెల్లి మాకో తీపికబురు చెప్పింది. నా పేరు వింటేనే మండిపడే నాన్న నా పెద్దకూతురు గుర్తొస్తుందని ఎవరితోనో చెప్పారట. ‘మా అల్లుడు బంగారం’ అంటూ రవినీ మెచ్చుకున్నారట. అప్పట్నుంచి నా కాలు నిలవడం లేదు. మూడేళ్ల నా ఎదురుచూపులు ఫలించినట్టే అనిపిస్తోంది. ఎంతైనా ఆరోజు కన్నవాళ్లని కాదని రవితో వెళ్లిపోవడం నా తప్పే. అమ్మానాన్నలను క్షోభపెట్టిన నేను వారి కాళ్లను నా కన్నీళ్లతో కడిగి నాన్న గుండెల్లో ఒదిగిపోవాలనిపిస్తోంది. ఆరోజు కోసం ఎదురుచూస్తున్నా.
అందరు అమ్మలూ ఆప్యాయత పంచరు!
అమ్మంటే అనురాగం పంచుతుంది. కానీ ఓ అమ్మ మాత్రం అందుకు భిన్నం. అయినా అమ్మని క్షమిస్తూనే తనో మంచి అమ్మలా ఉంటానంటోంది ఓ కూతురు.
నా తొమ్మిదో తరగతిలో అక్కకో సంబంధం వచ్చింది. ‘నేనిప్పుడే పెళ్లి చేసుకోను. ఏఎన్‌ఎమ్ కోర్సు పూర్తి చేసి ఉద్యోగం చేస్తా’ తెగేసి చెప్పింది అక్క. ఆ సంబంధం నాకు కట్టబెట్టారు. వద్దని చెప్పే ధైర్యం, తెలివితేటలు లేవు.
మొదటిరోజే మొదలయ్యాయి వెతలు. అత్తగారిది గంపెడు కుటుంబం. వెట్టిచాకిరీ చేయలేక నా లేత చేతులు బొబ్బలెక్కేవి. మా ఇంటికెళ్తానని రోజూ ఏడ్చేదాన్ని. నాపై జాలి కలిగిందో.. విసుగు చెందారో.. కొన్నాళ్లకే మా ఇంట్లో వదిలేశారు. తీసుకెళ్లడానికి మళ్లీ రాలేదు. ‘మీ ఆయనేడీ?’, ‘ఇక్కడే ఉండిపోతావా ఏంటీ’ ఇరుగుపొరుగుల సూటిపోటి మాటలు మొదలయ్యాయి. అమ్మ అవమానంగా ఫీలయ్యేది. ఓరోజు పిన్నిని తోడిచ్చి నన్ను మా మెట్టినింటికి పంపింది. మళ్లీ ఎందుకొచ్చావని చేయి చేసుకున్నారు మా ఆయన. వెనక్కి వచ్చేశా. చదువుకోవచ్చని నేను సంబరపడితే శనిలా దాపురించానని అమ్మ తిట్టేది.
అక్క ఫ్రెండ్ దగ్గర ఉండి చదువుకునేది. నేనూ అక్క చదివే కాలేజీలోనే చేరా. రోజూ తనకి ఇంటి నుంచి లంచ్‌బాక్స్ తీసుకెళ్లేదాన్ని. ఆ క్రమంలోనే పరిచయమయ్యాడు నరేశ్. తిట్లు, ఛీత్కరింపులే నిత్యకృత్యమైన నాకు అతడి మాటలు వేసవిలో పన్నీటి జల్లులా తోచాయి. ఏ కష్టమొచ్చినా తనతో చెప్పుకునేదాన్ని. ఓదార్చి సాయం చేసేవాడు. మా సాన్నిహిత్యం అమ్మకి తెలిసింది. తనతో మళ్లీ కనిపిస్తే కాళ్లు విరిచేస్తానంది. అమ్మకి మళ్లీ కనిపించొద్దని మేం ఇంటికి దూరంగా వెళ్లిపోయాం. స్నేహితుల సాయంతో పెళ్లి చేసుకున్నాం. మా ప్రేమకు గుర్తుగా నాలుగేళ్లలో ఇద్దరు అమ్మాయిలు పుట్టారు.
మా చిరునామా ఎలా కనుక్కుందోగానీ ఓరోజు మా ఇంట్లో ప్రత్యక్షమైంది అమ్మ. ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడింది. ఎంతైనా అమ్మ అమ్మేకదా! తనని చూడగానే కన్నీళ్లు పొంగుకొచ్చాయి. గట్టిగా హత్తుకొని తనివితీరా ఏడ్చా. మేం కలిసిపోవడం నరేశ్‌కి నచ్చలేదు. ‘మీ వాళ్లకు దూరంగా ఉండు’ అన్నాడు. నేనొప్పుకోలేదు. గొడవలు మొదలయ్యాయి. ఆర్పాల్సిన అమ్మ ఆజ్యం పోసింది. ‘ఇలాగైతే కష్టం. నేను విడాకులిస్తా’ అన్నాడు తను. ‘పంతం నీ ఒక్కడికేనా? నీ ఇష్టమైంది చేసుకో’ అన్నా మూర్ఖంగా. మేం విడిపోయాం. ఇద్దరు పిల్లల్ని చంకనేసుకొని పుట్టింటికి చేరా.
ఇంటికి రాగానే అమ్మ ప్రేమ మాయమైంది. మళ్లీ ఛీత్కరింపులు.. అవమానాలు. తర్వాత ఫ్యామిలీ ఫ్రెండ్‌నంటూ ఒకతను రోజూ మా ఇంటికొచ్చేవాడు. అమ్మ వయసే. తను రాగానే అమ్మ బయటికెళ్లిపోయేది. తను మాటల్లో పెట్టి నన్ను ఎక్కడెక్కడో తాకాలని ప్రయత్నించేవాడు. అతడి దుర్బుద్ధి తెలిశాక వారించా. తను మరింత రెచ్చిపోయి పశుబలం చూపేవాడు. ఓసారి అమ్మతో అంతా చెప్పేశా. ‘ఫర్వాలేదు.. తనేం చేసినా భరించు. నిన్ను జీవితాంతం భరిస్తాడు’ అంది. ‘ఛీ ప్రపంచంలో ఇలాంటి తల్లులు ఉంటారా? అని అమ్మపై అసహ్యమేసింది. అమ్మ అండతో నన్ను రోజూ వేధించేవాడు.
ఓసారి బాగా ఆలోచించా. అమ్మకెలాగూ నాపై ప్రేమ లేదు. నా పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా.. ఈ సమాజం వంకరచూపులు తప్పాలన్నా నాకో తోడు కావాలి. వయసులో చాలా తేడాలున్నా తనని భర్తగా స్వీకరించా. పెనం మీంచి పొయ్యిలా పడినట్టైంది నా పరిస్థితి. తనకి నా శరీరం మాత్రమే కావాలి. బాధ్యతలు పట్టవు. పైగా నాపై విపరీతమైన అనుమానం. రోజూ నరకం చవిచూస్తున్నా.
వూహ తెలిసిన దగ్గర్నుంచీ నాకన్నీ కష్టాలే. నా వెతలన్నింటికీ కారణం అమ్మే. అయినా ఫర్వాలేదు.. నేను అమ్మని ద్వేషించను. పోరాడుతూనే ఉంటాను. మా అమ్మలాంటి అమ్మలా కాకుండా నా కూతుళ్లు నన్ను మంచి అమ్మలా భావించేలా బతుకుతూనే ఉంటాను.
అబద్ధం తుంచేసిన ప్రేమ
‘నీ ప్రేమకు నేను బానిసనే. కానీ దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు మనసుకి’ ఈ సందేశం చదివాక నా కంటికి నిద్రే కరువైంది. ఎందుకంటే ఈ మాటలు రాసింది నేను శ్వాసగా భావించే అమ్మాయి.
మాట మహా గడుసుది. నచ్చితే శిఖరాగ్రానికి తీసుకెళ్తుంది. నొప్పిస్తే అగాధంలోకి తోసేస్తుంది. ఆ మాటే మామధ్య వారధి కట్టింది. ‘నువ్వు ఏ ఆయుధంతో దాడి చేసినా నేను మాత్రం ప్రేమనే ఆయుధంతోనే ప్రతిదాడి చేస్తాను’ అని నేను రాసుకున్న మాట తనకెంతో నచ్చింది. ముఖపుస్తకంలో మా పరిచయానికి దారి తీసింది. నాకు కాలేజీ రోజుల్నుంచే ప్రేమంటే మహా ఇష్టం. ఓ ఫ్రెండ్ అడిగి మరీ నాతో తన లవర్‌కి ప్రేమలేఖలు రాయించుకునేవాడు. ‘నువ్వు నాకో కవిత రాయ్. నేన్నీకో ట్రీట్ ఇస్తా’ అనేవాడు. వాడికి రాయడం మొదలెట్టాక నాకూ ప్రేమ మీద మోజు రెట్టింపైంది. అప్పట్నుంచి నా కలం నుంచి ప్రేమ కవితలు, కథలూ అలవోకగా జాలువారేవి.
రోజులు మారాయి. ఎదలోని భావాలు.. భావోద్వేగాల్లోంచి పురుడుపోసుకున్న అక్షరాల్ని ఫేస్‌బుక్ గోడల మీద వ్యక్తం చేసే రోజులొచ్చాయి. నేనూ అదే ఫాలో అయ్యా. అవి నచ్చే నాకు స్నేహహస్తం అందించింది తను. ఆమె కూడా అక్షర సేద్యం చేసే రైతే. ఆ సారూప్యమే మామధ్య సామీప్యం పెంచింది. తన రాతలు నా మనసుని మీటితే నా అక్షరాలు ఆమెను గిలిగింతలు పెట్టేవి. సాన్నిహిత్యం గాఢత పెరిగితే ‘మీరు’ కాస్తా ‘నువ్వు’ అవుతుంది. పదేపదే మన గొంతు వాళ్ల మనసుని తాకాలని ఉవ్విళ్లూరుతుంది. మామధ్య జరిగిందదే. ఇద్దరం రోజూ గంటలకొద్దీ మనసు విప్పి మాట్లాడుకునేవాళ్లం. అందులో తొంభైశాతం ప్రేమ వూసులే.
‘నేను పొద్దున లేవగానే నువ్వు టైంలైన్‌లో ఏం పోస్ట్ చేశావో అని ఆసక్తిగా చూస్తాను తెలుసా?’ అనేది. ఓ రాతగాడికి ఇంతకన్నా ఏం కావాలి? అదీ మనసుకి నచ్చిన అమ్మాయి చెబుతుంటే! టన్నులకొద్దీ ఉత్సాహంతో మరిన్ని కవితలల్లేవాణ్ని. నా వూహలన్నింటికీ కేంద్రబిందువు తనే. ఓరోజైతే ఆమె పేరుమీద ఏకంగా పది ప్రేమకవితలు రాసి ఫేస్‌బుక్‌లో పెట్టేశా. ‘ఏంటిది.. నామీద నీ ప్రేమనంతా గుమ్మరించి ప్రపంచం ముందు పెడితే నేను చిక్కుల్లో పడనా?’ అంది చిరుకోపంతో. అదీ నిజమే. నావల్ల తనకెలాంటి ఇబ్బంది రావొద్దని అప్పటికప్పుడే తొలగించా. మా అనుబంధం గమనించి ఎంతోమంది మా ప్రేమ పెళ్లిపీటలెక్కాలని ఆల్ ది బెస్ట్ చెప్పారు. కొత్త పెళ్లికొడుకులా ముసిముసిగా నవ్వుకునేవాణ్ని.
ప్రేమ ఉన్నచోట చనువుంటుంది. చొరవ తీసుకునే ధైర్యం ఇస్తుంది. చిలిపి చేష్టలకు పురిగొల్పుతుంది. ఒక్కోసారి అదే మన కొంప ముంచుతుంది. ‘నువ్వు అబద్ధం.. నీ ప్రేమ అబద్ధం’ అన్నానోసారి. నాపై తనకెంత ప్రేమ ఉందో తన మాటల్లో వినాలనే ఉద్దేశంతో రెచ్చగొడుతూ. నేనూహించింది జరగలేదు. ‘నేను అబద్ధాలకోరునా. నన్నర్థం చేసుకుంది ఇంతేనా? ఇక జీవితంలో నేను నీతో మాట్లాడకపోవచ్చు’ అంది నొచ్చుకుంటూ. తప్పైంది క్షమించమన్నా. కరగలేదు.. కనికరించలేదు. ‘నా చెంపమీద నాలుగు కొట్టినా భరించేదాన్ని. అబద్ధాలకోరుగా చిత్రించి నా మనసు విరిచేశావు. విరిగిన మనసు అతకదు.. మళ్లీ మనం కలవలేం’ అంటూ దూరమైంది.
దగ్గరితనం దూరమవడానికి ఒక్క మాట చాలు. మళ్లీ ఆ దగ్గరితనం దగ్గరవడానికి జీవితం సరిపోదు. తన మనసును గాయపరిచిన నాకు ఆమె ఎడబాటు ఈ జన్మంతా పెనుశిక్షే. అనుభవిస్తూనే ఉంటాను. ఇది చదివాకైనా నా మనసుకైన గాయానికి తన నవనీతంలాంటి మాటలతో మందు వేస్తుందనే చిన్ని ఆశ మిణుకుమిణుకుమంటోంది.
మాట మహా గడుసుది. నచ్చితే శిఖరాగ్రానికి తీసుకెళ్తుంది. నొప్పిస్తే అగాధంలోకి తోసేస్తుంది. ఆ మాటే మామధ్య వారధి కట్టింది. ‘నువ్వు ఏ ఆయుధంతో దాడి చేసినా నేను మాత్రం ప్రేమనే ఆయుధంతోనే ప్రతిదాడి చేస్తాను’ అని నేను రాసుకున్న మాట తనకెంతో నచ్చింది. ముఖపుస్తకంలో మా పరిచయానికి దారి తీసింది. నాకు కాలేజీ రోజుల్నుంచే ప్రేమంటే మహా ఇష్టం. ఓ ఫ్రెండ్ అడిగి మరీ నాతో తన లవర్‌కి ప్రేమలేఖలు రాయించుకునేవాడు. ‘నువ్వు నాకో కవిత రాయ్. నేన్నీకో ట్రీట్ ఇస్తా’ అనేవాడు. వాడికి రాయడం మొదలెట్టాక నాకూ ప్రేమ మీద మోజు రెట్టింపైంది. అప్పట్నుంచి నా కలం నుంచి ప్రేమ కవితలు, కథలూ అలవోకగా జాలువారేవి.
రోజులు మారాయి. ఎదలోని భావాలు.. భావోద్వేగాల్లోంచి పురుడుపోసుకున్న అక్షరాల్ని ఫేస్‌బుక్ గోడల మీద వ్యక్తం చేసే రోజులొచ్చాయి. నేనూ అదే ఫాలో అయ్యా. అవి నచ్చే నాకు స్నేహహస్తం అందించింది తను. ఆమె కూడా అక్షర సేద్యం చేసే రైతే. ఆ సారూప్యమే మామధ్య సామీప్యం పెంచింది. తన రాతలు నా మనసుని మీటితే నా అక్షరాలు ఆమెను గిలిగింతలు పెట్టేవి. సాన్నిహిత్యం గాఢత పెరిగితే ‘మీరు’ కాస్తా ‘నువ్వు’ అవుతుంది. పదేపదే మన గొంతు వాళ్ల మనసుని తాకాలని ఉవ్విళ్లూరుతుంది. మామధ్య జరిగిందదే. ఇద్దరం రోజూ గంటలకొద్దీ మనసు విప్పి మాట్లాడుకునేవాళ్లం. అందులో తొంభైశాతం ప్రేమ వూసులే.
‘నేను పొద్దున లేవగానే నువ్వు టైంలైన్‌లో ఏం పోస్ట్ చేశావో అని ఆసక్తిగా చూస్తాను తెలుసా?’ అనేది. ఓ రాతగాడికి ఇంతకన్నా ఏం కావాలి? అదీ మనసుకి నచ్చిన అమ్మాయి చెబుతుంటే! టన్నులకొద్దీ ఉత్సాహంతో మరిన్ని కవితలల్లేవాణ్ని. నా వూహలన్నింటికీ కేంద్రబిందువు తనే. ఓరోజైతే ఆమె పేరుమీద ఏకంగా పది ప్రేమకవితలు రాసి ఫేస్‌బుక్‌లో పెట్టేశా. ‘ఏంటిది.. నామీద నీ ప్రేమనంతా గుమ్మరించి ప్రపంచం ముందు పెడితే నేను చిక్కుల్లో పడనా?’ అంది చిరుకోపంతో. అదీ నిజమే. నావల్ల తనకెలాంటి ఇబ్బంది రావొద్దని అప్పటికప్పుడే తొలగించా. మా అనుబంధం గమనించి ఎంతోమంది మా ప్రేమ పెళ్లిపీటలెక్కాలని ఆల్ ది బెస్ట్ చెప్పారు. కొత్త పెళ్లికొడుకులా ముసిముసిగా నవ్వుకునేవాణ్ని.
ప్రేమ ఉన్నచోట చనువుంటుంది. చొరవ తీసుకునే ధైర్యం ఇస్తుంది. చిలిపి చేష్టలకు పురిగొల్పుతుంది. ఒక్కోసారి అదే మన కొంప ముంచుతుంది. ‘నువ్వు అబద్ధం.. నీ ప్రేమ అబద్ధం’ అన్నానోసారి. నాపై తనకెంత ప్రేమ ఉందో తన మాటల్లో వినాలనే ఉద్దేశంతో రెచ్చగొడుతూ. నేనూహించింది జరగలేదు. ‘నేను అబద్ధాలకోరునా. నన్నర్థం చేసుకుంది ఇంతేనా? ఇక జీవితంలో నేను నీతో మాట్లాడకపోవచ్చు’ అంది నొచ్చుకుంటూ. తప్పైంది క్షమించమన్నా. కరగలేదు.. కనికరించలేదు. ‘నా చెంపమీద నాలుగు కొట్టినా భరించేదాన్ని. అబద్ధాలకోరుగా చిత్రించి నా మనసు విరిచేశావు. విరిగిన మనసు అతకదు.. మళ్లీ మనం కలవలేం’ అంటూ దూరమైంది.
దగ్గరితనం దూరమవడానికి ఒక్క మాట చాలు. మళ్లీ ఆ దగ్గరితనం దగ్గరవడానికి జీవితం సరిపోదు. తన మనసును గాయపరిచిన నాకు ఆమె ఎడబాటు ఈ జన్మంతా పెనుశిక్షే. అనుభవిస్తూనే ఉంటాను. ఇది చదివాకైనా నా మనసుకైన గాయానికి తన నవనీతంలాంటి మాటలతో మందు వేస్తుందనే చిన్ని ఆశ మిణుకుమిణుకుమంటోంది.
మనసిచ్చి రమ్మంటే... మసి చేసి పొమ్మంది!
నా వయసు ముప్ఫై ఒకటి. జీతం డెబ్భై వేలు. ఇది బాగున్నా ‘ఇంకా పెళ్లి కాలేదు’ అనే ట్యాగ్‌లైన్ మాత్రం నాతో సహా ఇంట్లో ఎవరికీ నచ్చలేదు. అందుకే సంబంధాల కోసం వెతుకులాట మొదలెట్టా. త్వరలోనే నేను కోరుకున్న లక్షణాలున్న అమ్మాయి ఓ మ్యాట్రిమోనీలో తారసపడింది. ఏదో కంపెనీలో హెచ్‌ఆర్ విభాగంలో పనిచేస్తోందట. ‘నలుగురం ఆడపిల్లలం. ఐదేళ్ల కిందటే అమ్మ పోయింది. మేం కట్నం ఇచ్చుకోలేం’ అంది సూటిగా. ఆ ముక్కుసూటితనమే నాకు నచ్చింది.
అభిరుచులు, ఆసక్తులు పంచుకున్నాం. ‘కార్లలో తిరగాలి’, ‘స్టార్ హొటెళ్లొ తినాలి’, ‘ఇంగ్లండ్‌లో స్థిరపడాలి’ ఇలా చెప్పుకొచ్చేది. ‘మంచి జీతమే కదా.. కారెందుకు లేదు?’, ‘ఇల్లు ఎప్పుడు కొంటున్నావ్?’ అనడిగేది. తనలా హైరేంజ్‌లో ఆలోచించడం తప్పేమనిపించలేదు. కొలీగ్స్‌కి తన ఫొటో చూపిస్తే ‘ఇంత
అభిరుచులు, ఆసక్తులు పంచుకున్నాం. ‘కార్లలో తిరగాలి’, ‘స్టార్ హొటెళ్లొ తినాలి’, ‘ఇంగ్లండ్‌లో స్థిరపడాలి’ ఇలా చెప్పుకొచ్చేది. ‘మంచి జీతమే కదా.. కారెందుకు లేదు?’, ‘ఇల్లు ఎప్పుడు కొంటున్నావ్?’ అనడిగేది. తనలా హైరేంజ్‌లో ఆలోచించడం తప్పేమనిపించలేదు. కొలీగ్స్‌కి తన ఫొటో చూపిస్తే ‘ఇంత
అందమైన అమ్మాయా? కాకిముక్కుకు దొండపండులా ఉంది’ అన్నారు. గర్వంగా ఫీలయ్యా. పైసా కట్నం అక్కర్లేదంటే కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పారు ఆ అమ్మాయి నాన్న.
కొన్నాళ్లకే మీరు, అండీ వదిలేసి ‘ఏరా’ అనేది. కాబోయే పెళ్లామే కదాని మురిసిపోయా. ‘రేయ్ బక్కోడా.. నాకోసం ఎలాగైనా లావవు’ ఆర్డరేసిందోసారి. వెంటనే జిమ్‌లో చేరా. నైట్ షిఫ్ట్‌లు.. హాస్టల్ భోజనం.. నావల్ల కాలేదు. నెలలో మరింత పీలగా మారా. నేనసలే అందంగా ఉండను. తనేమో అప్సరస. ఇలా ఉంటే నచ్చుతానో, లేదోననే భయం మొదలైంది. అడిగితే ‘పిచ్చిమొద్దూ.. నన్ను నీలా ఇష్టపడేవాళ్లు ఎవరూ దొరకరు. నిన్ను కాకుండా ఇంకెవర్ని చేసుకుంటా?’ అంది.
రోజులు గడుస్తున్నాయి. తనకి ఫోన్ చేస్తే అప్పుడప్పుడు ఎంగేజ్ వచ్చేది. గంటలకొద్దీ. అడిగితే ఇంతెత్తున లేచేది. ‘ఏంటి ఫ్రెండ్స్‌తో కూడా మాట్లాడొద్దా? నా స్నేహితురాలి లవర్ మోసం చేశాడు. అంతా కలిసి అతడ్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం’ అందోసారి. నమ్మబుద్ధి కాలేదు. మర్నాడు ఫోన్ చేసి ‘కాబోయే పెళ్లాన్ని నువ్వు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు డియర్’ అంటూ ప్రేమగా మాట్లాడింది. పడిపోయా. గంటలకొద్దీ ఎంగేజ్ వచ్చినపుడు ఇలాగే ఏదో చెప్పి కూల్ చేసేది.
సర్‌ప్రైజ్ చేద్దామని ఓసారి చెప్పకుండా వాళ్లింటికెళ్లా. చిరునామా, బైక్ నెంబర్.. అన్నీ తప్పే. ఫోన్లో నిలదీస్తే బయటికెళ్లా.. ఆఫీసులో ఓ ఉద్యోగి కేసులో ఇరుక్కుంటే పోలీస్‌స్టేషన్‌లో ఉన్నా అంటూ ఏవేవో పొంతన లేని సమాధానాలు చెప్పింది. మూడ్రోజులు తిప్పాక తాపీగా ఆ ఇల్లు మారామంది. నాకు కోపం, అనుమానం వచ్చినప్పుడల్లా ‘నువ్వే నా ప్రాణం’, ‘యూ ఆర్ మై హీరో’ అని పొగిడి కరిగించేది.
ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. కుటుంబసమేతంగా వాళ్లింటికెళ్లాం. ఫొటోలో కన్నా ఇంకా అందంగా ఉంది. తను నా సొంతం కాకపోతే బతుకే దండగనిపించింది. అప్పటికప్పుడే నచ్చిందని చెప్పేశా. తనేమో ఏమీ చెప్పకుండా సస్పెన్స్‌లో పెట్టి నరకం చూపించింది. మూడోరోజు మ్యాట్రిమోనీ సైట్‌లో కనిపించింది. ‘ఇంకో మ్యాచ్ కోసం చూస్తున్నావా?’ అంటే ‘ఔను.. నువ్వూ వేరే అమ్మాయిని చూసుకో’ అంది నిర్మొహమాటంగా. నా గుండెలో తుపాకీ తూటాలా దిగిందా మాట. ఆరోజంతా ఏడ్చాను.
మొదట్నుంచే నేనంటే తనకిష్టం లేదు. కానీ నా జీతం, హోదా నచ్చాయి. నన్ను ఓ ‘ఆప్షన్’లా పెట్టుకొని ఇంకో కుర్రాడితో ప్రేమాయణం నడుపుతోంది. ఈవిషయం వాళ్ల దూరపు బంధువులే చెప్పారు. ఇది చాలదన్నట్టు మ్యాట్రిమోనీ సంబంధాలూ వెతుకుతోంది. ఇవేం తెలియని నేను పిచ్చివాడిలా తనపై ఆశలు పెంచుకున్నా. ఇంత జరిగినా తనపై ప్రేమ చంపుకోలేకపోతున్నా. ఈమధ్యే ఆమె పుట్టినరోజు గుర్తొచ్చి ఓ ఖరీదైన గడియారం పంపా. ‘ఫ్రెండ్‌గా నీ గిఫ్ట్ తీసుకుంటున్నా’ అని చెప్పి డబ్బుపై వ్యామోహాన్ని మరోసారి చాటుకుంది.
పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఆస్తిపరుడై ఉండాలనుకోవడం తప్పు కాదు. అత్యాశతో మనసులతో ఆడుకోవడమే నేరం. ఇప్పటికైనా తను తన ఆశకు హద్దులు గీసుకొని ఇంకొకరికి గుండెకోత మిగల్చొద్దని ఆశిస్తున్నా.
కొన్నాళ్లకే మీరు, అండీ వదిలేసి ‘ఏరా’ అనేది. కాబోయే పెళ్లామే కదాని మురిసిపోయా. ‘రేయ్ బక్కోడా.. నాకోసం ఎలాగైనా లావవు’ ఆర్డరేసిందోసారి. వెంటనే జిమ్‌లో చేరా. నైట్ షిఫ్ట్‌లు.. హాస్టల్ భోజనం.. నావల్ల కాలేదు. నెలలో మరింత పీలగా మారా. నేనసలే అందంగా ఉండను. తనేమో అప్సరస. ఇలా ఉంటే నచ్చుతానో, లేదోననే భయం మొదలైంది. అడిగితే ‘పిచ్చిమొద్దూ.. నన్ను నీలా ఇష్టపడేవాళ్లు ఎవరూ దొరకరు. నిన్ను కాకుండా ఇంకెవర్ని చేసుకుంటా?’ అంది.
రోజులు గడుస్తున్నాయి. తనకి ఫోన్ చేస్తే అప్పుడప్పుడు ఎంగేజ్ వచ్చేది. గంటలకొద్దీ. అడిగితే ఇంతెత్తున లేచేది. ‘ఏంటి ఫ్రెండ్స్‌తో కూడా మాట్లాడొద్దా? నా స్నేహితురాలి లవర్ మోసం చేశాడు. అంతా కలిసి అతడ్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం’ అందోసారి. నమ్మబుద్ధి కాలేదు. మర్నాడు ఫోన్ చేసి ‘కాబోయే పెళ్లాన్ని నువ్వు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు డియర్’ అంటూ ప్రేమగా మాట్లాడింది. పడిపోయా. గంటలకొద్దీ ఎంగేజ్ వచ్చినపుడు ఇలాగే ఏదో చెప్పి కూల్ చేసేది.
సర్‌ప్రైజ్ చేద్దామని ఓసారి చెప్పకుండా వాళ్లింటికెళ్లా. చిరునామా, బైక్ నెంబర్.. అన్నీ తప్పే. ఫోన్లో నిలదీస్తే బయటికెళ్లా.. ఆఫీసులో ఓ ఉద్యోగి కేసులో ఇరుక్కుంటే పోలీస్‌స్టేషన్‌లో ఉన్నా అంటూ ఏవేవో పొంతన లేని సమాధానాలు చెప్పింది. మూడ్రోజులు తిప్పాక తాపీగా ఆ ఇల్లు మారామంది. నాకు కోపం, అనుమానం వచ్చినప్పుడల్లా ‘నువ్వే నా ప్రాణం’, ‘యూ ఆర్ మై హీరో’ అని పొగిడి కరిగించేది.
ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. కుటుంబసమేతంగా వాళ్లింటికెళ్లాం. ఫొటోలో కన్నా ఇంకా అందంగా ఉంది. తను నా సొంతం కాకపోతే బతుకే దండగనిపించింది. అప్పటికప్పుడే నచ్చిందని చెప్పేశా. తనేమో ఏమీ చెప్పకుండా సస్పెన్స్‌లో పెట్టి నరకం చూపించింది. మూడోరోజు మ్యాట్రిమోనీ సైట్‌లో కనిపించింది. ‘ఇంకో మ్యాచ్ కోసం చూస్తున్నావా?’ అంటే ‘ఔను.. నువ్వూ వేరే అమ్మాయిని చూసుకో’ అంది నిర్మొహమాటంగా. నా గుండెలో తుపాకీ తూటాలా దిగిందా మాట. ఆరోజంతా ఏడ్చాను.
మొదట్నుంచే నేనంటే తనకిష్టం లేదు. కానీ నా జీతం, హోదా నచ్చాయి. నన్ను ఓ ‘ఆప్షన్’లా పెట్టుకొని ఇంకో కుర్రాడితో ప్రేమాయణం నడుపుతోంది. ఈవిషయం వాళ్ల దూరపు బంధువులే చెప్పారు. ఇది చాలదన్నట్టు మ్యాట్రిమోనీ సంబంధాలూ వెతుకుతోంది. ఇవేం తెలియని నేను పిచ్చివాడిలా తనపై ఆశలు పెంచుకున్నా. ఇంత జరిగినా తనపై ప్రేమ చంపుకోలేకపోతున్నా. ఈమధ్యే ఆమె పుట్టినరోజు గుర్తొచ్చి ఓ ఖరీదైన గడియారం పంపా. ‘ఫ్రెండ్‌గా నీ గిఫ్ట్ తీసుకుంటున్నా’ అని చెప్పి డబ్బుపై వ్యామోహాన్ని మరోసారి చాటుకుంది.
పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఆస్తిపరుడై ఉండాలనుకోవడం తప్పు కాదు. అత్యాశతో మనసులతో ఆడుకోవడమే నేరం. ఇప్పటికైనా తను తన ఆశకు హద్దులు గీసుకొని ఇంకొకరికి గుండెకోత మిగల్చొద్దని ఆశిస్తున్నా.
భ్రమల్లో పడి.. జీవితం చేజారి!
‘రేయ్.. రేపైనా వస్తున్నావా? లేదా?’ పొద్దునే సాయిగాడి గోల. నాలుగు వారాలుగా చిలుకూరు బాలాజీ టెంపుల్‌కి వెళ్దాం రమ్మనడం.. నేను రాననడం. ఈసారి వదిలేలా లేడు. సరేనన్నా.
ఎనిమిదింటికల్లా దర్శనం చేసుకొని బయటికొచ్చి ఓ చెట్టుకింద కూర్చొని కొబ్బరిముక్కలు తింటున్నాం. ‘అబ్బా.. ఆ అమ్మాయి భలే ఉందిరా. అచ్చం దేవకన్యలా’ సాయి అనడంతో ఆసక్తిగా అటువైపు చూశా. పట్టు పరికిణీలో.. జడ నిండా మల్లెలతో.. ముంగురులను సవరిస్తూ తను అచ్చం దేవకన్యలాగే ఉంది. వెళ్లిపోతుంటే బైక్‌పై అనుసరించాం. రెండు బస్సులు మారి దిల్‌సుఖ్‌నగర్‌లో దిగింది. తనకి తెలియకుండా వెనకాలే వెళ్లి అడ్రస్సు కనుక్కోగలిగాం.
సాయితో నాది స్నేహాన్ని మించిన అనుబంధం. పక్కపక్క ఇళ్లు. ఒకే బడి, కాలేజీ. చదువులో నేను సగటు.. వాడు టాపర్. ఏ అమ్మాయినీ కన్నెత్తి చూసేవాడు కాదు. అలాంటిది మొదటిసారి ఒకర్ని పొగడటం విన్నా.
పరధ్యానం.. వూహల్లో విహరించడం.. ట్రాన్స్‌లోకి వెళ్లిపోవడం.. అంటారే ఈ లక్షణాలన్నీ సాయికి సోకాయి. ఆదివారమైతే ఆ అమ్మాయి ఇంటివైపు బైక్‌ని ఉరికించేవాడు. ఆమె కనిపిస్తే మొహం వెలిగిపోయేది. లేదంటే మాడిపోయేది. ఓసారి పేరూ, కాలేజ్ వివరాలడిగితే వార్నింగ్ ఇచ్చిందట. అయినా మావాడొదిలితేగా! నాలుగైదుసార్లు చీవాట్లు పెట్టాక జాలి పడి వివరాలు చెప్పిందట. వాడు అల్లుకుపోయాడు. నెల తిరక్కముందే ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు.. చాటింగ్.. ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకోవడం అయ్యాయి. నాలుగైదుసార్లు స్పీకర్ ఆన్ చేసి నాముందే మాట్లాడాడు. ‘తిన్నావా?’, ‘ఫైనల్ సెమ్ ఎప్పుడు?’, ‘ఆ సినిమాలో ఈ సీన్ బాగుంది కదా’ ఇవే మాట్లాడేది తను. జస్ట్ ఫ్రెండ్లీగానే మాట్లాడుతుంది కదరా అంటే ‘ప్రేమ ఉంటేనే ఇవన్నీ మాట్లాడతార’ని సమర్థించుకునేవాడు. ఓరోజు ఆమె పేరులోని మొదటి అక్షరం భుజం మీద టాట్టూ వేయించుకున్నాడు. అతిగా వూహించుకుంటున్నావని హెచ్చరించా.
నా మాట వాడికి నచ్చలేదు. మాది ప్రేమేనని నిరూపిస్తానంటూ ఆ అమ్మాయి ఇంటికి లాక్కెళ్లాడు. వీధి చివర బండి ఆపి తనకి ఫోన్ చేశాడు. ఆమె దగ్గరకి వచ్చీ రాగానే ‘నువ్వంటే నాకిష్టం. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? లేదా?’ అన్నాడు. ‘నీకేమైనా పిచ్చా? కొంచెం చనువుగా మాట్లాడితే ప్రేమా? ఇంకోసారలా మాట్లాడితే బాగుండదు’ అంది కోపంగా. సాయి అక్కడే కూలబడిపోయాడు. ఎలాగో సముదాయించి వాడ్ని ఇంటికి తీసుకొచ్చా. ఆ సాయంత్రమే తను మళ్లీ ఫోన్ చేసి ‘నేను ప్రేమించినవాడితో రెణ్నెళ్ల కిందటే ఎంగేజ్‌మెంట్ అయింది. ఇంకోసారి నాతో మాట్లాడకు ప్లీజ్’ అని బతిమాలిందట.
అప్పట్నుంచి వాడు మనిషిలా లేడు. మందు తాగడం.. గదినిండా ఆ అమ్మాయి ఫొటోలు అతికించి వాటిపై ఐలవ్యూ, ఐ హేట్ యూ అని రాయడం. ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు కూడా రాయలేదు. ఎవరైనా మంచి మాట చెబితే ఉరేసుకుంటానని బెదిరించేవాడు. వాడింత దారుణంగా తయారవుతాడనుకోలేదు. నాలుగైదు నెలలు పిచ్చివాడిలా ప్రవర్తించాడు. వాడ్ని మామూలు మనిషిని చేయడానికి వాడి పేరెంట్స్ పడని కష్టం లేదు. చిన్నపిల్లాడిలా బుజ్జగించారు.. బతిమాలారు.. ఆఖరికి సైకాలజిస్టుతో కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు. వాళ్లమ్మ చేస్తున్న ఉద్యోగం కూడా మానేసింది.
సాయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. కానీ చదువు, జీవితం పాడైపోయింది. దీనికి ఎవర్ని నిందించడం? తను చొరవగా మాట్లాడింది. వీడు దాన్నే ప్రేమని భ్రమ పడ్డాడు. పరిస్థితి కొంచెం అర్థమవుతున్నపుడే నేను గట్టిగా మందలించాల్సింది. ఏదేమైనా నష్టం జరిగిపోయింది. అందమైన అమ్మాయిని చూడగానే హీరో ప్రేమలో పడిపోవడం.. డ్యూయెట్లు పాడుకోవడం, పెళ్లి.. ఇవన్నీ సినిమాలోనే జరుగుతాయి. జీవితం వేరేగా ఉంటుంది. భ్రమల్లో పడి నా స్నేహితుడిలా జీవితం చేజార్చుకోవద్దు.
ప్రేమల్ని వదిలేయండి... పెద్దల్ని కాదు!
లేత ప్రాయంలో ఓ అమ్మాయి ప్రేమలో పడింది. కన్నవాళ్లను ఎదిరించి గడప దాటింది. ఇప్పుడు తన పరిస్థితేంటి?
పొగడ్తలు తేనె పూసిన కత్తుల్లాంటివి. నొప్పి తెలియకుండానే గుండెల్లోకి దిగబడతాయి. ‘నీ అందం ముందు హీరోయిన్లూ దిగదుడుపే. నీ అంత తెలివి, ధైర్యం ఉన్న అమ్మాయిని నేనింతవరకు చూడలేదు’ శ్రీకాంత్ చెప్పినపుడు ముచ్చటేసింది. అలాంటి పొగడ్తలకే నేనూ పడిపోయా. తన మాట వింటే నాకు పూనకమొచ్చేది. అతడి చూపు సోకితే తనువు పులకించేది. ఇంటర్, డిగ్రీల్లో తరగతులకి హాజరైన రోజులకన్నా అతడి వెంట షికార్లకు వెళ్లిన రోజులే ఎక్కువ.
పెళ్లైన మూడేళ్లకే నాన్న వదిలేస్తే నన్ను చంకనేసుకొని పుట్టింటికొచ్చేసింది అమ్మ. నేనే సర్వస్వం అనుకుంది. కానీ ఎంతైనా ఒంటరిది కదా.. మగాళ్ల వేధింపులు మొదలయ్యాయి. ఈ సమాజంలో ఒంటరిగా బతకలేవని అమ్మని కష్టపడి ఒప్పించి రెండోపెళ్లి చేశారు తాతయ్య. మారుతండ్రి పిల్లల్ని చిత్రహింసలు పెడతాడు.. ఏమాత్రం ప్రేమ చూపరు.. బాధ్యతలుండవు.. ఇలా అనుకునేదాన్ని. నేనూహించినట్టు ఆయనేం లేరు. నన్ను సొంత కూతురిలానే చూసుకునేవారు. అయినా ఎందుకో ఆయన్ని తండ్రిగా అంగీకరించలేకపోయా.
‘నువ్వొకర్ని ఇష్టపడటం నేను కాదనను తల్లీ.. కానీ నువ్వు ఎంచుకున్న వ్యక్తి సరైనోడు కాదు. తనకి బాధ్యతలు తెలియవు. అందుకే అతడ్ని మర్చిపో’ అందోసారి అమ్మ. ఎప్పుడు పసిగట్టిందోమరి నా ప్రేమని. అప్పటికే పీకల్దాకా శ్రీకాంత్ మైకంలో ఉన్న నాకు తల్లిదండ్రుల మాటలు చెవికెక్కలేదు. మా మధ్య మాటల యుద్ధం జరిగింది. ‘నీ సుఖం నువ్వు చూసుకొని రెండోపెళ్లి చేసుకున్నావ్. నాకు నచ్చిన వ్యక్తిని నేను పెళ్లాడ్డం తప్పా?’ అనాలోచితంగా అనేశా. కన్నీళ్ల పర్యంతం అయ్యింది అమ్మ. నేనేం పట్టించుకోకుండా గడప దాటేశా.
‘కులం కట్టుబాట్లు తెంచుకొని వచ్చేశావ్ సెభాష్’ అన్నారు స్నేహితులు. వాళ్లే మా పెళ్లికి పెద్దలయ్యారు. ఏడాది నా కొంగు వదల్లేదు శ్రీకాంత్. కానీ ప్రేమ కడుపు నింపదుగా! తనది చిన్న ఉద్యోగం.. పైగా బద్ధకం. అద్దె కట్టడానికే నానా అగచాట్లు పడాల్సి వచ్చేది. ఇంట్లో ప్రతి సరుక్కీ కొరతే. తప్పనిసరై నేనూ చిన్న కొలువులో చేరా. అప్పట్నుంచి మొదలైంది నాకు టార్చర్. పచారీ కొట్టు.. కూరలబ్బాయి.. ఆఫీసు.. ఏ మగాడితో మాట్లాడినా తప్పే. ఈ బాధల్లోనే నాకో పాప పుట్టింది. బంధువులు రారు. బాధలొస్తే కన్నీళ్లు తుడవడానికి ఎవరూ లేరు. ఆయనకైతే నాపై పూర్తిగా మోజు తీరింది. పనిచేయడానికి బద్ధకించేవాడు. పొద్దంతా పాత స్నేహితురాళ్లతో కాలక్షేపమే.
నేను పనిచేస్తేనే నాకు, పాపకి తిండి. చంకన పాపతో రోజు పదిగంటలు కష్టపడుతున్నా. నాకీ శాస్తి జరగాల్సిందే. చిన్నప్పుడు నాన్న వదిలేస్తే పొత్తిళ్లలో పెట్టుకొని పుట్టింటికి చేరింది అమ్మ. మగాళ్ల వంకర చూపులు.. బంధువుల హేళనలు భరించింది. చిరిగిన చీరలు కట్టుకొని నాకు అడక్కముందే అన్నీ కొనిపెట్టింది. నేనేం చేశాను? అమ్మ గుండెలమీద తన్ని బయటికొచ్చేశాను. ప్రేమ మైకంలో కుటుంబం పరువు తీశాను. నేనీ శిక్ష అనుభవించాల్సిందే.
ప్రేమించడం.. పెద్దల్ని ఎదిరించడం.. మొదట్లో హీరోయిజంలాగే ఉంటుంది. కానీ జీవితం సినిమా కాదు. కష్టసుఖాల్లో ఒకరి తోడు లేకుండా, పెద్దవాళ్ల ప్రేమాప్యాయతలు పొందకుండా బతకడం చాలా కష్టం. ప్రేమికులారా.. వీలైతే పెద్దల్ని ఒప్పించే పెళ్లిపీటలెక్కండి. లేదంటే ప్రేమనే వదిలేయండి.
ప్రేమ ఆటకు ‘నో’ పెళ్లి బాటకి ‘సై’
ఏదో పనుండి చాలారోజుల తర్వాత మామయ్యకి ఫోన్ చేశా. ‘హాయ్ బావా.. నాన్న వూరెళ్లారు. మీరంతా ఎలా ఉన్నారు?’ అవతలి వైపు చిన్ని. నా మరదలు. మళ్లీమళ్లీ వినాలనిపించేంత తీయని గొంతు. చూసి ఏళ్లైంది. కొద్దిరోజులకే బంధువుల ఫంక్షన్‌లో కలిసింది. తన రూపం కూడా గొంతులాగే ఉంది.
బీటెక్ అయిపోగానే ఉద్యోగం కోసం సిటీకొచ్చా. చిన్ని కూడా ఏదో కోర్సు చేయడానికొచ్చిందట. ఓసారి బస్‌లో కనపడింది. పలకరింపులయ్యాక ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం. ఆపై మా సెల్‌ఫోన్లకు నిద్ర కరువైంది. రూపంలోనే కాదు.. ఆప్యాయత చూపడంలోనూ తను చక్కనమ్మే. వాట్సాప్‌లోనే ప్రపోజ్ చేశా. కొన్నాళ్లు నాన్చి నా ప్రేమకు పచ్చజెండా వూపింది. ఓసారి వాళ్లింటికెళ్లా. నాకోసం కష్టపడి ఎగ్ కర్రీ చేసింది. నచ్చకపోయినా ‘సూపర్బ్‌గా ఉంద’ని పొగిడేశా. ఆరోజైతే నాకు పండగే. రోజంతా తన పక్కనే ఉండి జాలీగా గడిపా. ఏదో వంకతో మరోసారెళ్తే వాళ్లక్క మధ్యలో చేరింది. కళ్లతోనే వూసులాడుకున్నాం. సిటీలో ఉన్నపుడైతే వీలున్నప్పుడో, వీలు చేస్కొనో కలుస్తూనే ఉండేవాళ్లం. ‘బావా... నన్నొకడు వేధిస్తున్నాడు’ అందోరోజు. వివరాలు చెప్పమంటే నా ఎక్స్ లవరంది. గుండె కలుక్కుమంది. ‘వయసు ఆకర్షణలో తనపై మోజుపడ్డా. అది గతం. ఇప్పుడు నా మనసంతా నువ్వే ఉన్నావ్’ అంది. చిన్ని నిజాయతీ నచ్చి తనపై ప్రేమ రెట్టింపైంది. జంటపక్షుల్లా తిరిగేవాళ్లం.
మా ప్రేమ విషయం బావకి చెప్పా. మా అమ్మానాన్నల్ని పెళ్లికి ఒప్పిస్తానన్నాడు. జరగబోయే పెళ్లి, మరదలితో జీవితం వూహించుకుంటూ కలల్లో తేలిపోయా. సరిగ్గా ఈ సమయంలోనే బాంబ్ పేల్చింది చిన్ని. ‘నువ్వు నాకు వద్దు బావా. మనిద్దరికీ సెట్ కాదు’ అంటూ ఫోన్, చాట్ కట్ చేసింది. వూపిరి ఆగినంత పనైంది. మీవాళ్లని నేనొప్పిస్తా అని ఎన్నిసార్లు బతిమాలినా వినదే! నా ఓపిక, విచక్షణ నశించాయి. ‘ఒకడ్ని మర్చిపోయావ్. ఇంకొకడ్ని మోసగించడం నీకు తేలికే’ అని తిట్టా. ఏడుస్తూ వెళ్లింది.
మరదలి బాధ నుంచి తేరుకోవడానికి చాన్నాళ్లే పట్టింది. తర్వాతేంటి? నేనేంటో నిరూపించుకోవడానికి మంచి ఉద్యోగమే ఏకైక దారిగా కనిపించింది. మూణ్నెళ్లు తీవ్రంగా కష్టపడ్డా. నా శ్రమ ఫలించి ఓ ఎమెన్సీ కంపెనీలో కొలువు దక్కింది. నేను హ్యాపీ. నెల తిరక్కముందే మామయ్య వూడిపడ్డాడు. ‘చిన్నీని పెళ్లి చేసుకుంటావా?’ అనడిగాడు. నవ్వుతోపాటు ఆపుకోలేనంత కోపమొచ్చింది. ‘ఇంతకీ నీ కూతురు ఒప్పుకుందా?’ అంటే ‘చిన్నికి నువ్వంటే ఇష్టం అని చెబితేనే వచ్చాన్రా’ అన్నాడు. ఓసారి తనని కలవాలన్నా.
‘హాయ్ బావా?’ అంటూ ఏమీ ఎరగనట్టే పలకరించింది. చాచి కొట్టాలనిపించింది. ‘నన్ను పెళ్లి చేస్కోవడం ఇష్టమే అన్నావట. నా ఉద్యోగం చూసి మళ్లీ ప్రేమ పుట్టిందా?’ అనడిగా ఎకసెక్కంగా. ‘కొత్తగా పుట్టుకు రావడం ఏంటి? ఎప్పట్నుంచో ఉంది. ఉంటుంది కూడా’ అంది. అయినా నా కోపం చల్లారలేదు. అలాంటపుడు మనిద్దరికి సెట్ కాదని ఎందుకు చెప్పావని నిలదీశా. మరదలు ఇచ్చిన సమాధానంతో నా మతి పోయింది. మేమిద్దరం కలిసి ఉండటం మామయ్య చూశారట. పరువు తీయొ.ద్దని బాధ పడ్డారట. ‘నీ దృష్టిలో నాన్నను విలన్‌ని చేయలేను. అలాగే మా నాన్నని బాధ పెట్టడం నాకిష్టం లేదు. తప్పనిసరై అలా ప్రవర్తించా’ అని సంజాయషీ ఇచ్చుకుంది. నా కళ్లముందు అపార్థాల మబ్బులు తేలిపోయాయి. సారీ చెప్పి ప్రేమగా తనని కౌగిలించుకున్నా.
తర్వాత షరామామూలే. మేం గాఢమైన ప్రేమలో మునిగిపోయాం. మా పెద్దలు పెళ్లి ముహూర్తాలు పెట్టేశారు. నవంబరులోనే మేం భార్యాభర్తలవబోతున్నాం. మామధ్య ఎలాంటి ఎడబాట్లు రాకుండా మా జీవితం సాఫీగా సాగిపోవాలని మీరూ దీవించండి.
నమ్మొద్దు గురూ మిస్‌కాల్ ప్రేమల్ని
మిస్‌కాల్ పరిచయం... ఫోన్ చాటింగ్... బయట మీటింగ్... ఆపై ప్రేమ బాట. ఇలాంటివి చాలా కథలే వింటాం. ఓ కుర్రాడికి అంతకుమించిన అనుభవం ఎదురైంది. ఏంటది? అతడి మాటల్లోనే.
ఓసారి బంధువుకి ఫోన్ చేయబోయి పొరపాటున వేరొకరికి చేశా. అవతలివైపు అమ్మాయి. నరాల్లో ఉత్తేజం. ‘ఎక్కడుంటావ్?’, ‘ఏం చేస్తావ్?’ సంభాషణ పొడిగించా. ఐదు నిమిషాల్లో ఆప్తులమయ్యాం. ‘ఇంకోసారి ఈ నెంబర్‌కు ఫోన్ చేయొద్దు. వేరే నెంబర్ ఇస్తా’నంది. ఫోన్ పెట్టిన నిమిషంలోపే మెసేజొచ్చింది.
మా భావాలు కుదిరాయి. నా మాటలు తనకు నచ్చేవి. తనేం చెప్పినా నాకు కిక్కొచ్చేది. ప్రేమ, పెళ్లి, చదువు, స్నేహం... మేం ముచ్చటించని విషయం లేదు. అర్థరాత్రి, అపరాత్రి వేళలుండేవి కావు. సినిమాలో హీరోయిన్, అందమైన అమ్మాయి... ఎవర్ని చూసినా తనిలాగే ఉంటుందని వూహించుకునేవాణ్ని.
మమ్మల్ని మరింత దగ్గర చేయడానికా అన్నట్టు ఇద్దరిమధ్య గ్యాప్ వచ్చిందోసారి. ఒకటి.. రెండు.. వారం గడిచినా తననుంచి సమాచారం లేదు. విలవిల్లాడిపోయా. పిచ్చిపట్టినట్టు రోడ్లమీద తిరిగా. పదిహేనురోజులయ్యాక తన ఫోన్ మోగింది. ఒలింపిక్ పతకం గెలిచినంత సంతోషం. ‘ఇన్ని రోజులు ఏమైపోయావ్? నా మనసుతో ఆడుకుంటున్నావ్. నీకసలు బుద్ధుందా?’ దులిపేశా. ‘సారీ నా ఫోన్ అన్నయ్య దగ్గర ఉండిపోయిందిరా’ ఆ మాటతో నా కోపం ఎగిరిపోయింది. ‘నేను నీతో మాట్లాడకుండా ఒక్కరోజైనా ఉండలేను. ఐలవ్యూ’ అదే వూపుతో చెప్పేశా. ఫోన్ కట్ చేసింది. నా మనసు శూన్యమైంది. కాసేపయ్యాక మిస్‌కాల్ ఇచ్చింది. కాల్‌బ్యాక్ చేశా. ఏం చెబుతుందో అని వూపిరి బిగబట్టా. ‘ఐ లవ్యూ టూ రా’ అంది. చొక్కా విప్పి తీన్మార్ ఆడేశా.
కలవాలనుందన్నా. వారం నాన్చింది. ‘నాకూ నిన్ను చూడాలనుంది. ఈ ఆదివారమే ఆ శుభదినం’ మెసేజ్ పెట్టింది. ‘చార్మినార్ నుంచి అఫ్జల్‌గంజ్‌కెళ్లే దారిలో మూడో వీధి మన స్పాట్’ చిరునామా చెప్పింది. అదేదో పాటలో చెప్పినట్టు... చైనావాల్ ఎక్కి చంద్రుణ్ని తాకినట్టు... ఎవరెస్ట్ ఎక్కి సెల్ఫీలు తీసుకున్నట్టు రకరకాల భావాలు కలిగాయ్ నాలో. పొద్దునే లేచి నీట్‌గా తయారై, అలవాటు లేకపోయినా టక్ చేసుకొని, షూ వేసుకొని బాడీకి స్ప్రేకొట్టి వెళ్లా. ‘బయల్దేరావా?’, ‘ఎంతదూరం వచ్చావ్?’, ‘నాకేం గిఫ్ట్ తెస్తున్నావ్?’ ఫోన్లతో ఉక్కిరిబిక్కిరి చేసింది. నాలాగే ఎగ్జైటింగ్‌గా ఉందునుకున్నా. జరుగుతోందంతా ఓ స్నేహితుడికి చెబుతూనే ఉన్నా. ‘రేయ్... ఇదేదో తేడా వ్యవహారంలా కనపడుతోంది. అదసలే పాతబస్తీ. తేడా వస్తే నరికేస్తారు’ జాగ్రత్త చెప్పాడు. లవర్‌ని కలవబోతున్న ఆనందంలో పట్టించుకోలేదు. చివరికి తను చెప్పినట్టే ఓ వీధిలోకి వెళ్లా. పెద్దగా జనం లేరు. ఎండగా ఉందని పక్కనే ఉన్న గోడ వారగా నిల్చున్నా. దూరం నుంచి ఇద్దరు వస్తాదుల్లాంటి వ్యక్తులు రావడం గమనించా. వాళ్లలో ఒకడు ఫోన్ చేస్తుంటే నా ఫోన్ మోగింది. ఎత్తగానే ‘హలో ఎక్కడున్నావ్?’ అన్నాడు. డౌటొచ్చి ఫోన్ కట్ చేసి నేను చేశా. వాడే ఎత్తాడు. అది నా లవర్ నెంబర్. క్షణం ఆలస్యం చేయకుండా అక్కణ్నుంచి జారుకున్నా. ఏదో దురుద్దేశంతోనే నన్నక్కడికి రప్పించిందని అర్థమైంది. ఫ్రెండ్ గదికెళ్లాక ఫోన్ చేస్తే ‘నీకోసం చాలాసేపు ఎదురుచూశా రాలేదేంటి?’ అని బుకాయించింది. ఇంకేం వినదల్చుకోకుండా కట్ చేశా. తనతో బంధాన్ని కూడా. ఆ ఇద్దరి చేతుల్లో పడితే నా పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచిస్తుంటేనే ఒళ్లు జలదరిస్తోంది. ప్రేమ పేరుతో ఇలా దోపిడీ చేసేవాళ్లూ ఉంటారని అర్థమైంది. మిస్‌కాల్ పరిచయాలు, ప్రేమల్ని నమ్మకండి.
మనసు పెట్టిన పని... అవకాశాల గని!
‘అటెండర్ అయినా ఫర్వాలేదు... నువ్వు ప్రభుత్వ ఉద్యోగమే చేయాలి కన్నా’ చిన్నప్పట్నుంచి అమ్మానాన్నలు ఎన్నిసార్లు ఈ మాటన్నారో! దానికి తగ్గట్టే సర్కారీ కొలువుపై నాకూ మోజు పెరుగుతూ వచ్చేది.
నా కలకు, ఇష్టానికి అనుగుణంగా డిగ్రీ తర్వాత బీఈడీ ఎంచుకున్నా. కోర్సు పూర్తయ్యేలోపే అర్థమైంది టీచరవడం అంత ఆషామాషీ కాదని. పట్టా అందుకొని పోటీలో దిగేసరికే ఏళ్లనుంచి దండయాత్ర చేస్తున్న లక్షల మంది కనిపించారు. తీవ్రమైన పోటీకితోడు ఉద్యోగ ప్రకటన ఎప్పుడు వస్తుందో తెలియదు. కష్టపడి చదివి మూడు డీఎస్సీలు రాసినా పోస్టు దక్కలేదు.
వయసు ముదురుతున్నా కొలువు దక్కే మార్గం కనపడట్లేదు. ‘రేయ్.. నీ పొట్ట, పట్టా (బట్టతల) పెరుగుతోందిగానీ ఉద్యోగం వచ్చేలా లేదురా’ మొహం మీదే వేళాకోళమాడేవారు ఫ్రెండ్స్. ‘ఏం చేస్తున్నావ్?’ ‘పెళ్లైందా?’ బంధువుల ఆరాలు. ‘అబ్బాయి మంచివాడే.. పాపం సరైన ఉద్యోగమే లేదు’ సన్నిహితుల జాలి. వినీవినీ విసిగిపోయేవాణ్ని.
అమ్మానాన్నలు ముసలివాళ్లైపోతున్నారు. ఎన్నాళ్లని నన్ను భరించగలరు? ఇక లాభం లేదనుకొని ప్రైవేటు ఉద్యోగాల బాట పట్టా. ‘ఇన్నాళ్లేం చేశావ్?’, ‘నీలో టాలెంట్ ఉంటే ఈపాటికి ఏదో ఉద్యోగంలో స్థిరపడేవాడివిగా?’ ఈరకం ప్రశ్నలతో మనసు గాయపడేది. కానీ బాధ పడుతూ కూర్చుంటే పాపం అని ఆదుకునేవాళ్లుండరుగా! మనసు చంపుకొని రెండేళ్లు కూలి పనులకెళ్లా. ‘బాగా చదువుకున్న కుర్రాడు. పాపం ఉద్యోగంలేక ఈ పని చేస్తున్నాడు’ అక్కడా జాలి మాటలే. ఏడుపొచ్చేది.
ముప్ఫైఅయిదేళ్లు నిండాయి. నాలుగు పెళ్లి సంబంధాలు చూశా. అన్నీచోట్లా పెదవి విరుపులే. వయసు ముదురుతోంది.. అసలు నాకు పెళ్లవుతుందా? నాలో కొత్త అనుమానాలు, బాధలు మొదలయ్యాయి. ఒకానొకదశలో జీవితంలో అసలు పెళ్లి జోలికే వెళ్లొద్దనుకున్నా. ‘నీలాగే ఒకమ్మాయి ఉద్యోగాలకు ప్రయత్నిస్తూ ఉండిపోయిందట. వయసు ముప్పై. నీకు ఓకేనా?’ ఓ దూరపు బంధువు సంబంధం తెచ్చాడు. అంతకన్నా ఏం కావాలి? ఏమీ ఆలోచించకుండా ఓకే చెప్పేశా. నా ప్రభుత్వ ఉద్యోగం కల.. పడ్డ కష్టాలు.. మానసిక వ్యధ.. మనసులోని బాధంతా తన ముందుంచా.
మా ఇద్దరిదీ ఉపాధ్యాయ నేపథ్యమే. ప్రభుత్వ కొలువు కోసం ఎదురుచూసి విసిగిపోయినవాళ్లమే. బాగా ఆలోచించి ఓ నిర్ణయానికొచ్చాం. సంసారం నడవడానికి ముందుగా ఇద్దరం ప్రైవేటు పాఠశాలలో టీచర్లుగా చేరాం. సంపాదన కోసం కాకుండా మనసుపెట్టి పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నాం. అనుకున్నట్టే ఆ వృత్తిపై ప్రాణం పెట్టాం. అందరితో కలుపుగోలుగా ఉన్నాం. శ్రమ అనుకోకుండా స్కూళ్లొ అన్ని పనులూ చేశాం. విద్యార్థులు, సహోద్యోగుల్లో మంచి పేరొచ్చింది. మూడేళ్లలో ప్రమోషన్ల నిచ్చెనలు ఎక్కాం. ఓ కార్పొరేట్ స్కూల్ మా పనితనం గుర్తించింది. మంచి జీతంతో మమ్మల్ని చేర్చుకుంది.
ఇప్పుడు ఇంచుమించు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సంపాదిస్తున్నాం. ఇంకొకరికి సాయం చేసే స్థితిలో ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగంతోనే సంపాదన, గౌరవం దక్కుతుందనే నా అపోహ పటాపంచలైంది. చేసేది ఎలాంటి ఉద్యోగమైనా మనసుపెట్టి చేస్తే ఫలితాలు ఎప్పుడూ అనుకూలంగానే వస్తాయని తెలియజెప్పడానికే మీ ముందుకొచ్చాం.
పల్లవించవా...నా గుండెలో!
‘ఫేస్‌బుక్ ప్రేమలు, స్నేహాలన్నీ అబద్ధం. అదొక హా ప్రపంచం. అందులో మంచి కన్నా చెడే ఎక్కువ’...-మొదట్లో నేనూ ఇలాగే అనుకునేవాణ్ని. ఒకమ్మాయి నా అభిప్రాయం మార్చేసింది.
ఓరోజు ఫేస్‌బుక్ తెరవగానే పల్లవి పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఓకే చేశా. ‘చదువుకుంటూనే ఓ స్వచ్ఛందసంస్థ తరపున పనిచేస్తున్నా. ఛాటింగ్ చేస్తూ విరాళాలు సేకరిస్తుంటా. మీ క్లాస్‌మేట్స్‌లో ఇద్దరు నా ఫ్రెండ్స్’ వివరాలందించింది. ‘తనది ఫేక్ అకౌంట్‌రా. తీపి మాటలు చెప్పి డబ్బులు గుంజే రకం’ అన్నారు సహాధ్యాయులు. ఎవరి మాట నమ్మాలో తెలీలేదు. ఛాటింగ్ మాత్రం కొనసాగేది.
వారం తిరక్కముందే నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నాం. మాటలు వ్యక్తిగతంవైపు మళ్లాయి. ఇంజినీరింగ్ ఫైనలియర్. ఐదు సబ్జెక్టులు మిగిలాయన్నా. ‘వ్వాట్... ఆ మాట చెప్పడానికి సిగ్గనిపించడం లేదా? కంప్లీట్ చేయకపోతే నీతో కట్’ అని బెదిరించింది. రోజూ కాలేజీకి వెళ్లు. కష్టపడి చదువు అనేది. పరీక్షలపుడు తెల్లవారుజామునే ఫోన్ చేసి నిద్ర లేపేది. పుస్తకం పట్టేదాకా వదిలేది కాదు. తన సొంత విషయాలూ పంచుకునేది.పల్లవి ప్రోద్బలంతో ఫైనలియర్‌తోపాటు సప్పీలు ఒకేసారి పూర్తి చేశా. తను డిగ్రీ పాసైంది. రెణ్నెళ్లు తిరక్కముందే తిరుపతిలో ఉద్యోగం వచ్చిందనే తీపి కబురు చెప్పింది. నేనూ ప్రయత్నాలు మొదలుపెట్టా. ఎక్కడ ఏ ఉద్యోగం ఉన్నా చెప్పేది. కొన్నింటికి తనే స్వయంగా దరఖాస్తు చేసేది. మేం సుదూరాన ఉన్నా మనసులు మాత్రం ఒకేలా ఆలోచించేవి.
తర్వాతేంటి? ఒకర్నొకరం చూసుకోవడం... సరదాలు... షికార్లు... ప్రేమ. ఇవన్నీ ముందే హించాం. పరిణతిగా ఆలోచించి ‘మనం అందరిలా కావొద్దు. ఇద్దరం బాగా స్థిరపడ్డాకే కలుద్దాం’ అని ఒట్టేసుకున్నాం.
ఏమైందో తెలియదు సడెన్‌గా తన నెంబర్ పనిచేయలేదు. నాలో ఆందోళన ఎక్కువైంది. పదకొండోరోజు ఫోన్ చేసి ‘మా పేరెంట్స్ యాక్సిడెంట్‌లో పోయారు. నేను అనాథనయ్యా’ ఏడుస్తూ చెప్పింది. నా గుండె తరుక్కుపోయింది. అంత బాధలో పల్లవి పక్కన లేనందుకు కుమిలిపోయా. ‘ఏకాకినయ్యానని బాధగా ఉంది రఫీ. నాకూ అమ్మానాన్నల దగ్గరికి వెళ్లాలనిపిస్తోంది’ అని ఏడ్చేది. పిరికి మాటలు మాట్లాడొద్దని ధైర్యం చెప్పేవాణ్ని. నాకుద్యోగం రాగానే వచ్చి కలుస్తానని చెప్పా. కానీ ఈలోపే వాళ్ల బాబాయ్ సలహాతో బెంగళూరు వెళ్తానంది. జాగ్రత్తలు చెప్పా. తర్వాత మా చెల్లి పెళ్లి కుదిరింది. తనతో చెబితే ఆర్థికసాయం చేస్తానంది. మీ బాబాయి ఒప్పుకుంటేనే వీలైనంత సర్దుబాటు చేయమన్నా. సరేనంది. ఆపై ఏ సమాధానం లేదు. ‘మా బాబాయి నీతో మాట్లాడొద్దు అన్నారు’ కొద్దిరోజుల తర్వాత ఓ మెసేజ్ పెట్టింది. పెళ్లి పనుల హడావుడిలో ఉండటంతో తర్వాత మాట్లాడొచ్చులే అనుకున్నా.
చెల్లి పెళ్లిలో నా ఫోన్ పోయింది. పల్లవి నెంబర్ అందులో మాత్రమే ఉంది. తన ఫేస్‌బుక్, మెయిల్‌కి మెసేజ్‌లు పెట్టా. జవాబు లేదు. ఫేస్‌బుక్‌లో మ్యూచువల్ ఫ్రెండ్స్‌ని అడిగితే వివరాలేం తెలియవన్నారు. తను చదివానని చెప్పిన కాలేజీకెళ్తే ఆ పేరుతో ఏ అమ్మాయి చదువుకోలేదన్నారు. నాకు షాక్. మోసపోయావ్ అన్నారు స్నేహితులు. నాకు మాత్రం తనవల్ల జరిగిన మంచే గుర్తొస్తోంది. తన వివరాలు తప్పు చెప్పి ఉండొచ్చుగాక. నా పట్ల చూపిన ప్రేమాభిమానాలు నకిలీవి కాదని ఇప్పటికీ నమ్ముతున్నా. ఆ ప్రేమతోనే ఏడాది దాటినా పల్లవినింకా వెతుకుతూనే ఉన్నా. అన్నట్టు... నేనిపుడు ఉద్యోగం సంపాదించి మంచి స్థానంలో ఉన్నా. తను నా ముందుకొస్తే గుండెలో పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా.
దూరమైంది ప్రియనేస్తం.. చేరువైంది విజయం
‘ప్రేమలో గెలిస్తే ఏమొస్తుంది? మహా అయితే పెళ్లవుతుంది. ఓడిపోతే... ఏదో సాధించి చూపించాలనే కసి పుడుతుంది’ అంటున్నాడో కుర్రాడు.
2014లో డిగ్రీ పూర్తైంది. కన్నవాళ్లకు ఇంకా భారంగా ఉండటం నాకిష్టం లేదు. ఏదైనా ఉద్యోగం సాధించాలనే ఉద్దేశంతో ఓ శిక్షణాసంస్థలో చేరా. గ్రూప్స్, బ్యాంకు, రైల్వే ఉద్యోగాలతోపాటు పలు ప్రవేశపరీక్షలకు శిక్షణ ఇచ్చేవారక్కడ. క్లాసులో కొత్తగా చేరిన ఒకమ్మాయిని చూడగానే నా గుండె లయ తప్పింది. చాలాసార్లు మాట కలపాలని ప్రయత్నించినా ధైర్యం చాల్లేదు. ఓరోజు అనుకోకుండా ఎదురుపడితే ‘హాయ్’ చెప్పా. కనీసం మొహం చూడకుండానే వెళ్లిపోయింది. అవమానంగా ఫీలయ్యా. ఎలాగైనా తనతో ఫ్రెండ్షిప్ చేయాలనే పంతం పెరిగింది. తను రోజూ మా హాస్టల్ ముందు నుంచే క్లాసుకెళ్లేది. ఆమె ఏ రంగు డ్రెస్ వేసుకుందో చూసి నేనూ అదే రంగు వేసుకొని వెళ్లేవాణ్ని. అయినా పట్టించుకుంటేగా!
ఓరోజు నోటీసుబోర్డులో మార్కుల జాబితా చూస్తోంది. మంచి ఛాన్స్ అనుకుంటూ వెళ్లి ‘క్లాస్ ఫస్టా? సెకండా?’ చొరవగా పలకరించా. ఎప్పట్లాగే మొహం చిట్లించింది. ఇక లాభం లేదని అక్కణ్నుంచి కదులుతుంటే ‘నేను వేసుకునే కలర్ డ్రెస్సే నువ్వూ వేసుకుంటున్నావ్. ఏంటి సంగతి?’ అంది. అక్కడే గెంతులేయాలన్నంత సంతోషం. అయినా ఏం మాట్లాడకుండా అక్కణ్నుంచి జారుకున్నా. స్కూటీపై తన నిక్‌నేమ్ రాసుండేది. ఆ ముద్దుపేరుతోనే సంబోధించానోసారి. ‘ఫర్లేదు.. తెలివైనవాడివే. నాకోసం చాలానే కష్టపడుతున్నావ్’ అని మెచ్చుకుంది. ఇక నేను రెచ్చిపోవడానికి లైసెన్స్ దొరికినట్టే అనుకున్నా. కానీ నా దురదృష్టంకొద్దీ అప్పుడే ఓ పరీక్ష కోసం వేరే వూరెళ్లాల్సి వచ్చింది. పదిరోజులు క్లాసుకు హాజరు కాలేకపోయా. అదీ నా మంచికేనని తర్వాత అర్థమైంది.
‘ఏంటి ఎక్కడికెళ్లావ్? చెప్పి వెళ్లాలనే కామన్‌సెన్స్ లేదా?’ రాగానే నన్ను వూపేస్తూ అడిగింది. గాల్లో తేలిపోయా. ఆరోజే మా ఫోన్ నెంబర్లు తర్జుమా అయ్యాయి. ఆపై చాటింగ్‌లు.. మీటింగ్‌లు.. సినిమాలు.. షికార్లు.. కామనయ్యాయి. కోర్సు పూర్తికాకముందే మనసులూ ఇచ్చిపుచ్చుకున్నాం. స్థిరపడ్డాక పెళ్లి చేసుకోవాలని బాసలు చేసుకున్నాం. ‘మనం జీవితాంతం ఇలాగే ఉంటాంగా? నువ్వు నన్ను మోసం చేయవుగా’ అనేది బేలగా. ‘నిన్నొదిలితే నా ప్రాణం వదిలినట్టే’ అభయమిచ్చేవాణ్ని. ఆ ప్రేమ అలాగే కొనసాగితే మేం ఈపాటికే భార్యాభర్తలయ్యేవాళ్లం. జరిగింది వేరు.
ఏమైందో తెలియదుగానీ కోర్సు పూర్తై ఇంటికెళ్లాక మాట్లాడ్డం మానేసింది. నేనది తట్టుకోగలనా? ఫోన్లు చేశా. ‘ఎందుకు మా అమ్మాయి వెంటపడుతున్నావ్?’ వాళ్ల నాన్న నిలదీశారు. ఇంటిచుట్టూ తిరిగా. ‘ఇంకోసారి కనపడితే జైళ్లొ ఉంటావ్’ బెదిరించారు. అయినా ప్రియసఖిని మర్చిపోవడం నావల్ల కాలేదు. దీంతో చదువుపై ఏకాగ్రత తగ్గింది. మరోవైపు ఉద్యోగం సంగతి ఏమైందని ఇంట్లోవాళ్ల ఒత్తిడి. ఎంజాయ్ చేయడానికే కోర్సులో చేరావంటూ సన్నిహితుల వెక్కిరింపులు. వెరసి తనపై పీకల్దాకా కోపం పెరిగింది.
ఆమెది మోసమో, ఇంట్లోవాళ్ల ఒత్తిడితో అలా చేస్తుందో అర్థం కాకపోయేది. కానీ నా ప్రేమ విలువ తెలియాలంటే.. తనే నా దగ్గరికి పరుగెత్తుకు రావాలంటే ఏదైనా సాధించి చూపించాలనే కసి మొదలైంది. అందుకు ఏకైక మార్గం జాబ్ కొట్టడం. వెంటనే పుస్తకం అందుకున్నా. రాత్రీపగలు మరచి ఐదునెలలు చదివా. నా కష్టం ఫలించింది. కేంద్రప్రభుత్వ ఉద్యోగం దక్కింది. ఇప్పుడు నేను వూహించనంత గుర్తింపు, గౌరవం, ప్రశంసలు దక్కుతున్నాయి. నన్ను దూరం పెట్టి పరోక్షంగా నా విజయానికి కారణమైంది తనే. ఇప్పటికీ ఆమెకు దగ్గరవ్వాలనే కోరుకుంటున్నా.
బైక్ కలిపింది మా ఇద్దరినీ!
క్లాస్‌మేట్ పెళ్లి కోసం వూరెళ్తున్నా. సిటీ దాటుతుండగా పార్కింగ్ చేసిన బండికి తాళం వేయలేదనే సంగతి గుర్తొచ్చి గుండె జల్లుమంది. అసలే మోజు పడి కొన్న కొత్త పల్సర్. ఇన్సూరెన్స్ కూడా లేదు. వెంటనే ఫ్రెండ్‌కి ఫోన్ చేశా. ‘నిన్ననే వూరెళ్లాన్రా’ వాడి మాటతో డీలా పడిపోయా. ‘ఓసారి నా ఫ్రెండ్‌కి కాల్ చెయ్. హెల్ప్ చేస్తాడు’ అంటూ ఓ నెంబరిచ్చాడు. ప్రాణం లేచొచ్చింది.
క్షణం ఆలస్యం చేయకుండా ఫోన్ కలిపా. ‘హలో.. ఎవరు?’ అందో అమ్మాయి గొంతు. ఫ్రెండ్ ఫ్రెండ్ భార్యో, చెల్లినో అనుకొని విషయం చెప్పా. ఇక్కడ అలాంటి పేరుతో ఎవరూ లేరంది. ఏదో వంకతో మాటలు కలిపే ఇడియట్స్ ఎక్కువయ్యారంటూ తిట్టింది. అసలే బాధలో ఉన్న నాకు తన మాటలు చిరాకు తెప్పించాయి. బండి నెంబర్ చెప్పి ‘నీతో సోది మాట్లాడ్డానికి ఫోన్ చేయలేదు. డౌట్ ఉంటే వెళ్లి చెక్ చేస్కో. ముందు మర్యాదగా మాట్లాడ్డం నేర్చుకో’ అంటూ దులిపేశా. తప్పుడు నెంబర్ ఇచ్చిన ఫ్రెండ్‌నీ వాయించా.
‘మా ఇల్లు బస్టేషన్ దగ్గరే. తమ్ముడు వెళ్లి బైక్‌కి తాళం వేశాడు. వూరొచ్చాక కీ తీస్కెళ్లొచ్చు’ ఓ గంటయ్యాక మెసేజ్ పంపిందా అమ్మాయి. థాంక్స్‌తోపాటు ముందు జరిగిందానికి సారీ చెప్పా. మర్నాడు స్నేహితుడి పెళ్లి ఘనంగా జరిగింది. సాయంత్రం ఆలస్యం కావడంతో ఆ రాత్రే తిరిగొద్దాం అనుకున్నా కుదరలేదు. తర్వాతరోజు ఉదయం బస్సు దిగగానే నేరుగా ఆఫీసుకెళ్లిపోయా. మర్నాడు నా వీక్లీ ఆఫ్. కొన్ని పండ్లు కొనుక్కొని అమ్మాయి చెప్పిన అడ్రెస్‌కి వెళ్లా. గుమ్మంలోనే ఎదురొచ్చింది. సమంతలా అందంగా లేకపోయినా కాజల్‌లా పెద్దకళ్లతో ఆకట్టుకునేలా ఉంది. అప్పుడప్పుడు బుగ్గల్లో సొట్టలుపడి ఆకర్షణీయంగా కనపడుతోంది. ‘ఇంకాస్త ముందొస్తే బాగుండు. మావాళ్లతో కలిసి గుడికెళ్లేదాన్ని’ మొహం చిట్లిస్తూ చెప్పింది. సారీ చెప్పి పండ్ల కవర్ చేతికిస్తుంటే ‘ఇలాంటి ఫార్మలిటీసేం అక్కర్లేదు. మీరు దయచేస్తే నేను బయటికెళ్తా’ కొట్టినట్టే చెప్పింది.
గదికొచ్చాక రోజంతా తన ఆలోచనలే. ఆపై అప్పుడప్పుడు ఫోన్లు, మెసేజ్‌లు చేసేవాణ్ని. ఎప్పుడో ఓసారి బదులిచ్చేది. ఓసారి ప్రేమ, పెళ్లిపై అభిప్రాయం అడిగా. ‘అమ్మానాన్నల్ని కష్టపెట్టే ప్రేమ నాకు నచ్చదు. వాళ్లు చెప్పిన అబ్బాయినే పెళ్లాడతా’ అంది. ఆ మాటతో ఆమెపై మరింత ప్రేమ పెరిగిపోయింది. తర్వాత ఏమైందో తెలియదుగానీ కొద్దిరోజులకే నాతో మాట్లాడ్డం మానేసింది. తట్టుకోలేకపోయా. ఓరోజు నేరుగా వాళ్లింటికెళ్లా. బైక్ హారన్ కొడితే బయటికొచ్చింది. సంతోషంతో చేతులూపుతూ హాయ్ చెప్పా. కొరకొరా చూసి ‘గెటౌట్’ అనేసి లోపలికెళ్లిపోయింది. నా మొహం మాడిపోయింది.
ఆ రాత్రే ఫోన్ చేసింది. నీకు సాయం చేయడమే తప్పైందంటూ మొదలుపెట్టింది. ‘ఆరోజు నువ్వు మా ఇంటికొచ్చినపుడు పక్కింటివాళ్లు చూసి నాన్నకి చెప్పారట. తర్వాత మనం అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకోవడం గమనించి తప్పుగా అర్థం చేసుకున్నారు. పరువు తీస్తున్నావ్ అని నాన్న బాధ పడ్డారు’ అని ఏడుస్తూ చెప్పింది. ఏం మాట్లాడాలో తెలియలేదు. తర్వాత బాగా ఆలోచించాక ఓ నిర్ణయానికొచ్చా.
‘ఈరోజే నాకు పెళ్లిచూపులు. దయచేసి ఇంకోసారి ఫోన్ చేయొద్దు. మా ఇంటి వైపు రావొద్దు’ ఓ పొద్దునే తన సందేశం. నవ్వుతూ సరేనన్నా. ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ పెళ్లిచూపుల కుర్రాడ్ని నేనేనని. తను నాకిష్టమైన అమ్మాయి. పెద్దలంటే గౌరవం. సాయం చేసే గుణముంది. ఎవరికైనా ఇంతకన్నా ఏం కావాలి? పైగా మా సామాజికవర్గమే. అమ్మానాన్నల్ని ఒప్పించి వాళ్లతో మాట్లాడించా. నా గురించి ఆరా తీసి ఓ వారమయ్యాక వాళ్లూ ఓకే అన్నారు. ఈ ఎపిసోడ్‌లో అందరికన్నా ఆశ్చర్యపోయింది మాత్రం ఆ అమ్మాయే. పెళ్లిచూపులు సక్సెస్ అయ్యాయి. ఈనెల చివరి వారంలో మా పెళ్లి. మీరంతా ఆశీర్వదించండి. అన్నట్టు నా జీవితాన్ని ప్రేమ తీగలా అల్లుకోబోతున్న అమ్మాయి పేరు లత.
నేనే నానీనే.. నీకై వేచి ఉన్నానే!
కళ్లు మూస్తే గతం.. అదో తీపి జ్ఞాపకం.. కళ్లు తెరిస్తే వర్తమానం.. అంతా బాధలమయం.
నచ్చిన అమ్మాయితో బైక్‌పై షికార్లు.. పార్కుల్లో ప్రేమ వూసులు.. కౌమారం నుంచే ఇలాంటి వూహలు ఉక్కిరిబిక్కిరి చేసేవి. పెళ్లంటూ చేసుకుంటే ప్రేమించే చేసుకోవాలనిపించేది.
నచ్చిన అమ్మాయితో బైక్‌పై షికార్లు.. పార్కుల్లో ప్రేమ వూసులు.. కౌమారం నుంచే ఇలాంటి వూహలు ఉక్కిరిబిక్కిరి చేసేవి. పెళ్లంటూ చేసుకుంటే ప్రేమించే చేసుకోవాలనిపించేది.
డిగ్రీలో ఒకమ్మాయి పరిచయమైంది. మా పక్క వూరే. మెసేజ్‌లతో మొదలైన పరిచయం చాటింగ్‌తో తెల్లారేదాకా కొనసాగేది. తనని ముద్దుగా ‘బుజ్జీ’ అని పిలిచే వాణ్ని. నన్ను ‘నానీ’ అనేది.
చదువైపోయింది. ఆరోజు గది ఖాళీ చేసి ఇంటికెళ్తున్నా. ‘నేనూ నీతో రావొచ్చా?’ అంది. లడ్డూ కావాలా నాయనా.. అంటే ఎవరైనా వద్దంటారా? ఆరుగంటల ప్రయాణంలో అరనిమిషం వృథా చేయలేదు. ‘మా అన్నయ్య, అమ్మే నా లోకం. నువ్వన్నా అంతే ఇష్టం’ బస్సు దిగుతుంటే చెప్పింది. తననక్కడే గుండెలకు హత్తుకున్నా.
మా కులాలు వేరు. నీకు ప్రభుత్వ ఉద్యోగం ఉంటే మావాళ్లు పెళ్లికి ఒప్పుకుంటారంది. సిటీకొచ్చా. తినీ తినక.. పగలూరాత్రీ మర్చి చదివా. ఎంత కష్టమైనా ఓర్చుకున్నా. ఎస్.ఐ.ఉద్యోగం కొద్దిలో తప్పినా కానిస్టేబుల్‌గా ఎంపికయ్యా. వూరంతా పొగుడుతున్నా బుజ్జికి దగ్గరవుతున్నాననే సంతోషమే ఎక్కువ కిక్ ఇచ్చేది. కొన్నాళ్లకి తనూ టీచర్‌గా ఎంపికైందనే శుభవార్త. ఇద్దరం సెటిలయ్యామని పెద్దల ముందుకె’ళ్లాం. ‘ఠాఠ్.. మేం ఒప్పుకోం’ అన్నారు. కట్నం ఆశ చూపి తనని చదువు లేని ఒకబ్బాయికి కట్టబెట్టాలనుకున్నారు. అసలు దారుణం ఏంటంటే ‘మావాళ్లు నా మాట వినట్లేదు. నువ్వు నన్ను మర్చిపోవాలి’ అంటూ నన్నే మార్చడానికి ప్రయత్నించింది బుజ్జి. ఆపై మాటల్లేవ్. ప్రాణం పోతున్నట్టుండేది.
పెళ్లికింకా పదిహేనురోజులుంది. ‘నిన్ను వదులుకోవడం నావల్ల కావట్లేదు నానీ. నేను నీ దగ్గరికొచ్చేస్తా’ అందోరోజు. ప్రాణం లేచొచ్చింది. మా అదృష్టం బాగుండి ఆ అబ్బాయి మంచివాడు కాదని తెలియడంతో పెద్దవాళ్లే సంబంధం రద్దు చేశారు. ‘ఇక నువ్వే నా భర్తవి. నువ్వు నా మెడలో తాళి కట్టినపుడు నీ మొహంలో కలిగే ఆనందం చూడాలని ఉంది’ అంది. మూణ్నెళ్లయ్యాక గట్టిగా ప్రయత్నిద్దామని చెప్పింది. కుదిరినప్పుడల్లా మేం కలుసుకుంటూనే ఉన్నాం.
రోజులు లెక్కిస్తున్నా. ఈలోపే తనకి బ్యాంకు ఉద్యోగితో పెళ్లి కుదిరిందనే చెడు వార్త విన్నా. వెంటనే వెళ్లి నిలదీశా. ‘చనిపోతానని అమ్మ బెదిరించింది. ఒప్పుకోక తప్పలేదు. ఇష్టంలేని పెళ్లి చేసుకోలేను. నేను చనిపోతా. నువ్వైనా బాగుండు’ అంటూ ఏడ్చింది. ఏం చేయాలో తెలియని అయోమయం. గుండెలు మండుతుంటే వెళ్లి ఆ అబ్బాయిని కలిశా. మేం సన్నిహితంగా ఉన్న ఫొటోల్ని చూపించా. పెళ్లాగింది. కొత్త ట్విస్టు మొదలైంది. నాకు అండగా ఉంటుందనుకున్న బుజ్జి పోలీస్‌స్టేషన్‌లో నాపైనే ఫిర్యాదు చేసింది. ‘తనతో నాకేం సంబంధం లేదు. చదువుకునేటపుడు కొంచెం సన్నిహితంగా ఉంటే ఫొటోల్ని మార్ఫింగ్ చేశాడు. మమ్మల్ని చంపుతానని బెదిరిస్తున్నాడు’ అని. పోలీసులు నా గోడు విన్లేదు.
ప్రాణంలా ప్రేమించి, భార్యలా కలిసి ఉన్న అమ్మాయే ఇలా చేసిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. కేసులు.. కోర్టులు.. చిరాకేస్తోంది. ‘పెళ్లి ఆగిపోయి రూ.ఏడు లక్షలు నష్టపోయాం. ఆ డబ్బులిస్తే కేసు వాపసు తీసుకుంటా’ రాయబారం పంపింది. నావల్ల కాదని తేల్చి చెప్పా. ఇప్పుడు నా జీవిత గమ్యం ఎటెళ్తుందో నాకే అర్థం కావడం లేదు. ఇంత జరిగినా ఇప్పటికీ నాకు తనపై ప్రేమే ఉంది తప్ప ద్వేషం లేదు. నన్ను అర్థం చేసుకుంటే పెళ్లాడి గుండెల్లో పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా.
ఆదుకున్న మనసులకు ఆయువు నేనవుతా
రైలు వేగంగా వెళ్తొంది. ఆ వేగాన్ని మించి నా మదిలో ఆలోచనలు.
గుంటూరు జిల్లాలోని ఓ పల్లెటూరు మాది. కూలి దొరికితేనే ఇంట్లో పొయ్యి వెలిగే కుటుంబం. ‘నేనింక నిన్ను సదివించలేనయ్యా. ఆడపిల్ల పెళ్లికి ఎదుగుతావుంది. నువ్వూ బాజ్జత తెలుసుకోవాల’ నాయన మాటతో పది పాసయ్యాననే సంతోషం ఆవిరైంది. పెళ్లీడుకొచ్చిన అక్క, నా వెనక చెల్లి... ఆయన మాత్రం ఏం చేస్తారు? వేసవి సెలవుల్లో కూలికెళ్లడం మొదలెట్టా.
ఆరోజు పొద్దునే ఒకాయన మా ఇంటికొచ్చారు. ‘లారీలో సామాను దింపాలి. ఇంకో ఇద్దర్ని ఎగేసుకొనిరా’ అన్నారు. నేనూ వెళ్లా. వాళ్లది నెల్లూరట. మా పక్కవీధిలోనే ఇల్లు కొనుక్కొని దిగారు. నాయనకి సాయం చేస్తుంటే నా వివరాలడిగారు. ‘పది ఫస్ట్‌క్లాస్‌లో ప్యాసైన కుర్రాడు కూలీగా మారడం ఏం బాగోలా. నేను సాయం చేస్తా. ఈడ్ని సదివించు’ నాయనకి ఆర్డరేశారు.
వారి పెద్దమనసుతో కాలేజీలో చేరా. ఆ కృతజ్ఞతతో అడక్కముందే చిన్నచిన్న పనులు చేసిపెట్టేవాణ్ని. టిఫిన్లు, కాఫీలు ఇచ్చి నన్ను బాగానే చూస్కునేవారు. అన్నట్టు వాళ్లకో కూతురుంది. పేరు శిరీష. నాకన్నా ఏడాది పెద్ద. తనూ ఇంటరే. క్లాసులో అర్థంకాని పాఠాలు విడమర్చి చెప్పేది. పిండివంటలు చేస్తే నాకిష్టమని దాచి మరీ ఇచ్చేది. తనని ‘చిన్నమ్మగారూ’ అనేవాణ్ని. ‘అమ్మగారేంట్రా అక్కా అని పిలు’ అన్నారోసారి పెద్దాయన. అప్పట్నుంచి నాకింకో అక్క దొరికింది. టాపర్‌గా ఇంటర్ పూర్తి చేశా. అయినా చదువు ముందుకు సాగదనే భయం. శిరీషక్కే దేవతలా ఆదుకుంది. ‘సురేశ్ చదువాపేస్తానంటే కుదరదు. వాడు ఇంజినీరింగ్ చేస్తాడు. ఇదుంచండి’ అంటూ నాన్న చేతిలో ఐదువేలు పెట్టింది. తన అభిమానానికి కళ్లు చెమర్చాయి. ఎంసెట్‌లో మంచి ర్యాంకూ రావడంతో హైదరాబాద్‌లో పేరున్న కాలేజీలో సీటొచ్చింది. నేను వూరొచ్చినప్పుడల్లా ఖర్చులకని వెయ్యి, రెండువేలిచ్చేది. బీటెక్ సెకండియర్‌లో మా సొంతక్క పెళ్లి చేశాం.
‘ఏరా మీ పక్కింటి శిరీషకి, నీకూ లవ్వంటగా. నీ ఖర్చులన్నీ తనవేనటగా. భలే పట్టావురా’ కారుకూతలు కూశాడో ఫ్రెండ్. మనసు చివుక్కుమంది. లాగి వాడి చెంప మీద కొట్టా. పెద్ద గొడవైంది. ‘కుక్కలు మొరిగితే మనం పట్టించుకోవద్దు. నువ్వు నా తమ్ముడివిరా’ అంది శిరీషక్క. తర్వాత తనకే ఇబ్బంది కలగొద్దని నేనే వాళ్లింటికెళ్లడం తగ్గించా. కానీ వాళ్ల సాయం మాత్రం ఆగలేదు.
చూస్తుండగానే నా బీటెక్ పూర్తైంది. ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ సాధించడం నా కల. కోచింగ్ కోసం దిల్లీకి వెళ్లాలనుకున్నా. డబ్బులెలా? శిరీషక్క గుర్తొచ్చింది. మొదటిసారి నోరు తెరిచి అడిగా. ఐదురోజుల్లో నా ఖాతాలో నలభైవేలు వేయించింది. ఆర్నెళ్లు కోచింగ్ తీసుకున్నా. ధ్యాసంతా క్లాసులు, చదువు మీదే. నా అదృష్టంకొద్దీ కోచింగ్ అయిపోగానే నోటిఫికేషన్ వచ్చింది. బాగా రాశా. ఫలితం సానుకూలంగా వచ్చింది.
మొదటి ఫోన్ శిరీషక్కకే చేశా. చాలా సంతోషించింది. ‘కంగ్రాట్స్‌రా.. నాన్న కూడా ఉంటే హ్యాపీగా ఫీలయ్యేవారు’ అంటుంటే నా గుండెల్లో పిడుగు పడ్డట్టైంది. ‘ఔన్రా మూణ్నెళ్ల కిందే నాన్న నెల్లూరు వెళ్లి వస్తుంటే యాక్సిడెంటై చనిపోయారు’ అని బావురుమంది. అక్కడే కూలబడిపోయి గుండెలవిసేలా ఏడ్చా. నా చదువుకు ఆటంకం కలగొద్దనే అక్క నాకా విషయం చెప్పొద్దందట. ఇంకా పెద్దాయన వ్యాపారంలో చాలా నష్టపోయారనీ, ఇల్లు అమ్మేసి శిరీషక్క పెళ్లి చేయాలనుకుంటున్నారనీ నాయన చెప్పాడు. ఎంత దయగల కుటుంబం! వారికి ఆ పరిస్థితి రావడం తట్టుకోలేకపోయా.
రైలు కుదుపుతో ఆలోచనల్లోంచి బయటికొచ్చా. నా ఉద్యోగం, హోదా వాళ్లు పెట్టిన భిక్ష. వాళ్లిపుడు కష్టాల్లో ఉన్నారు. ఆదుకోవాలంటే నేనేం చేయాలి? శిరీషక్క పెళ్లి చేయాలి... వాళ్లింటిని అమ్మకుండా చూడాలి. నా దృఢ నిశ్చయంతో గుండె భారం తేలికైంది. సంతోషంగా రైలు దిగా.
No comments:
Post a Comment