Monday, 27 April 2015

take care about your feet - for your beauty


NewsListandDetails

హస్తపాదాల వేళ్ల గోళ్లు ఎక్కువగా ఫంగల్‌ ఇన్ఫెక్షన్లకు లోనవుతుంటాయి. దీనిని వైద్యపరిభాషలో ఆనైకోమైకోసిస్‌ అంటారు ఇన్ఫెక్షన్‌ ముందుగా చిన్న సైజు తెల్లని లేదా పసుపు పచ్చని మచ్చగా మొదలవుతుంది. ఇన్ఫెక్షన్‌ లోపలకు వ్యాపించే కొద్దీ గోళ్ల రంగు మారటం, మందంగా తయారవటం, అంచులు పగుళ్లుబారి విరిగిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చేతుల గోళ్లు పాదాల గోళ్లు ముందుగా ఎదుటివారి దృష్టిలో పడతాయి కనుక ఈ సమస్యతో ఇబ్బంది ఎక్కువ. కొన్ని సందర్భాల్లో నొప్పి, అసౌకర్యం వంటివి కూడా ఉంటాయి.
ఉక్కపోత వాతావరణంలోనూ, గాలిలో నీటి తేమ ఎక్కువగా ఉండే సంద ర్భాల్లోనూ ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. పాదరక్షల లోపలచెమట పట్టడం, తడి నేలమీద నడవటం, పాత్రలను శుభ్రపర చటం, బట్టలు ఉత కటం, నీటి కుళాయి వద్ద ఎక్కువ సేపు గడపటం ఇలాంటి పనుల వల్ల గోళ్ల మీద ఫంగస్‌ పెరగడానికి అవకాశం ఏర్పడు తుంది. ఇన్ఫెక్షన్‌ ఒకసారి వచ్చిన తరువాత ఒక పట్టాన లొంగదు. పూర్తిస్థా యిలో జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. తగిన సూచనలు పాటించటం ముఖ్యం. లేకపోతే దీర్ఘవ్యాధిగా పరిణమిస్తుంది.
లక్షణాలు: ఆనైకోమైకోసిస్‌ వ్యాధిలో కొన్ని ప్రత్యేక మైన లక్షణాలు కనిపిస్తాయి. గోళ్లలో ఒకటిగాని అంతకంటే ఎక్కువగాని వ్యాధి లక్షణా లను ప్రదర్శిస్తాయి. గోళ్లు మందంగా తయారవుతాయి. బిరుసుగా మారతాయి. పగుళ్లు బారి, గరుకుగా తయారవుతాయి. గోళ్ల ఆకారం కూడా దెబ్బతింటుంది. కాంతిరహితంగా, జీవరహితంగా కనిపిస్తాయి. గోళ్ల క్రింద వ్యర్ధాలు పేరుకుపోవటం వల్ల నల్లని రంగులో మచ్చలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్‌కి గురైన గోరు ఉపరితలం (నెయిల్‌బెడ్‌) నుంచి విడిపోవచ్చు. ఇలా జరగటాన్ని ఆంకిలోసిస్‌ అంటారు. హస్తపాదాల వేళ్ల గోళ్ళలో నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపి స్తాయి. వేళ్ల నుంచి ఒక రకమైన చేపలవాసన లాంటిది వస్తుంటుంది.
కారణాలు: ఫంగై అనేవి సూక్షజీవులు. బూజు జాతికి చెందినవి. వీటి మనుగడకు వెలుతురు అవసరం ఉండదు. వీటిల్లో కొన్ని రకాలు మనకు ఉపయోగపడితే మరికొన్ని వ్యాధులను కలిగించి ఇబ్బందులకు గురిచేస్తాయి. డర్మటోఫైట్స్‌ అనే వర్గానికి చెందిన ఫంగస్‌ జాతుల వల్ల గోళ్లు వ్యాధిగ్రస్తమవుతాయి.   

No comments:

Post a Comment