Updated: May 29, 2011
కావలసిన పదార్ధాలు:
బొంబాయి రవ్వ: 1 కప్పు
కొబ్బరి తురుము: 2 టేబుల్ స్పూన్లు
లేత కొబ్బరి: 1/2 కప్పు
నెయ్యి: 3 టేబుల్ స్పూన్లు
పాలు: 2 కప్పులు
కోవా: 1/4 కప్పు
చక్కెర: తగినంత
తయారు చేసే విధానం:
రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి బాణలిలో వేసి కరిగి వేడి అయిన తరువాత రవ్వను వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి. అందులో కొబ్బరి తురుమును వేసి కాసేపు వేగనివ్వాలి. తర్వాత పాలు పోసి కలపాలి. పాలు అందులో బాగా కలిసిన తర్వాత కోవా వేసి బాగా కలపాలి. ఈ పదార్ధాలన్నీ కలిపిన తర్వాత చక్కెర వేసి బాగా కలియబెట్టాలి. ఆ పదార్ధమంతా హల్వా మాదిరిగా ఉడికేదాకా ఉడకబెట్టాలి. తర్వాత దానిపై మిగిలిన నెయ్యి పోయాలి. వీటిని కావాలనుకుంటే ఏదైనా అచ్చుల్లో పోసి తర్వాత సర్వ్ చేయవచ్చు. లేత కొబ్బరిని పలచని రేకుల్లా కత్తిరించి దీనిపై అలంకరించి సర్వ్ చేస్తే తినేందుకే కాదు చూసేందుకు కూడా బాగుంటాయి.
చాకొలేట్ యోగర్ట్
కావలసిన పదార్ధాలు:
పెరుగు: నాలుగున్నర కప్పులు
పంచదార : తగినంత
డార్క్ చాకొలెట్: 3/4 కప్పు (తురిమి)
తాజా మీగడ: 5 టేబుల్ స్పూన్లు
అక్రూట్లు: 15 (వేయించి, ముక్కలు చేసి)
తయారు చేసే విధానం:
పెరుగును ఒక సన్నని బట్టలో వేసి కింద ఒక బౌల్ ఉంచి రిఫ్రిజరేటర్‌లో పెట్టండి. అధికంగా ఉన్న నీరు పోయిన తర్వాత ఇంకా నీరు మిగిలి ఉన్నట్టు అనిపిస్తే దానిని పిండండి. తర్వాత ఆ పెరుగును వేరే బౌల్‌లో వేసి పక్కన పెట్టు కోవాలి. చాకొలేట్‌ను మైక్రోవేవ్‌లో వేసి ఒక నిమిషం పాటు కరిగించాలి. కరిగిన చాకొలెట్‌ను బాగా గిలకొట్టి కొంచెం తీసి పక్కన పెట్టుకొని మిగిలిన దానిలో మీగడ వేసి మళ్ళీ బాగా కలపాలి. పక్కన పెట్టుకున్న పెరుగులో పంచ దార వేసి బాగా కలపాలి. ఇందులో కరిగించిన చాకొ లెట్ పోసి ఫోర్క్‌తో కలపాలి. కాసిన ఆక్రూట్లు పక్కన పెట్టుకొని మిగిలినవన్నీ వేసి కలపాలి. సర్వ్ చేసే సమయంలో మిగిలిన ఆక్రూట్లు వేసి పైన మిగిలిన కరిగించిన చాకొలెట్‌ను చిలకరించాలి. చల్ల చల్లని డెజర్ట్ తయార్!
చాకొలేట్ కేక్
కావలసిన పదార్ధాలు:
మైైదాపిండి:
250 గ్రా.
బేకింగ్ పౌడర్: 2 టీ స్పూన్లు
సాల్ట్: 1 చిటికెడు
కొకోవా పౌడర్:
3-4 టేబుల్ స్పూన్లు
వెన్న: 250 గ్రా.
పొడిచేసిన చక్కెర: 250 గ్రా.
గుడ్లు: 4
మజ్జిగ: 1 కప్పు
వెనిల్లా ఎస్సెన్స్: 1 టీ స్పూన్
తయారు చేసే విధానం:
ఒవెన్‌ను ముందుగా 180 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకూ వేడి చేయండి. ఒక టిన్ తీసుకొని దాని చుట్టూ నెయ్యి పోయండి. మైదాలో బేకింగ్ పౌడర్, సాల్టు, కొకోవా పౌడర్ వేసి బాగా కలపండి. వెన్నలో ఎలాంటి గడ్డలూ లేకుండా చేసుకొని అందులో పొడి చేసిన చక్కెర కలిపి ఎగ్‌బీటర్‌తో కలిసేలా కొట్టాలి. నురగ వచ్చే దాకా దీనిని బీట్ చేయాలి. తర్వాత ఒక్కొక్క గుడ్డూ పగులకొట్టి ఇందులో కలపాలి. తర్వాత కొకోవా కలుపుకున్న మైదా పిండిని రెండు మూడు స్పూన్ల చొప్పున అందులో వేస్తూ కొద్దిగా మజ్జిగ కూడా పోస్తూ మెత్తగా అయ్యేలా చూసుకోవాలి. చివరగా వెనెల్లా ఎస్సెన్స్ కలుపుకొని కేక్ టిన్‌లో పోసి ఒవెన్‌లో 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌లో అరగంట, నలభై నిమిషాల పాటు ఉంచి తీసెయ్యాలి.
సపోటా, అక్రూట్ ఖీర్
కావలసిన పదార్ధాలు:
సపోటాలు: 3 బాగా పండినవి
అక్రూట్లు : 1/2 కప్పు వేయించి
దంపుడు బియ్యం: 1/2 కప్పు (నానబెట్టి)
పాలు: 4 కప్పులు
పంచదార: 1/3 కప్పు
తయారు చేసే విధానం:
నానబెట్టిన బియ్యాన్ని వడకట్టి ఒక మందపాటి గిన్నెలోకి తీసుకొని అందులో పాలు పోసి మీడియం మంట మీద ఉడకపెట్టాలి. ఉడికే సమయంలో బియ్యం గిన్నెకు అతుక్కోకుండా గరిటతో తిప్పుతూ ఉండాలి. పాలు తగ్గి బియ్యం మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి. తర్వాత అందులో పంచదార వేసి కరగనివ్వాలి. వేయించి పెట్టకున్న అక్రూట్లను నలగగొట్టి అందులో వేసి తిప్పాలి. తర్వాత ఈ పదార్ధాన్ని మొత్తం వేరే బౌల్‌లోకి తీసుకోవాలి. చల్లబడిన తర్వాత పండిన సపోటాలను తోలు వల్చి మెత్తగా చేసుకొని అందులో కలపాలి. సర్వ్ చేసే సమయంలో అందులో పైన అక్రూట్‌లు పెట్టి అలంకరిస్తే చూడటానికి కూడా ముచ్చటగా ఉంటుంది.
క్యారెట్-కాప్సికమ్ పచ్చడి
Updated: June 12, 2011
కావలసిన పదార్ధాలు:
క్యారెట్లు: 4 (మీడియం సైజువి)
కాప్సికమ్ - 1
పచ్చి మిర్చి - 5
కొత్తి మీర
కరివేపాకు
చింతపండు- పులుపు కోసం
ఉప్పు - తగినంత
శనగపప్పు: 3 టేబుల్ స్పూన్లు
మినపప్పు: 11/2 టేబుల్ స్పూన్లు
ధనియాలు 1/2 స్పూన్
జీలకర్ర- 1/2 స్పూన్
నూనె: సరిపడినంత
తయారు చేసే విధానం:
బాణలి పొయ్యి మీద పెట్టి పోపు గింజలన్నింటినీ నూనెలేకుండా దోరగా వేయించాలి. తర్వాత వాటిని గ్రైండర్‌లో వేసి మెత్తటి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. క్యారెట్‌ను, కాప్సికమ్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మిరపకాయలను చీల్చి పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద బాణలి పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె అందులో వేసి కరివేపాకు, పచ్చి మిర్చి వేసి ఒకనిమిషం అయిన తర్వాత క్యారెట్, కాప్సికమ్ ముక్కలు వేయాలి.
అందులో తగినంత ఉప్పు వేసి అవి మెత్తబడే దాకా మూత పెట్టి ఉంచాలి. పొయ్యి ఆపే ముందు కాస్త కొత్తిమీర ఆకులు చల్లి చింతపండును వేయాలి.తర్వాత దానిని ఒక గిన్నెలోకి తీసుకొని ముందుగా పొడి చేసి పెట్టుకున్న పొడి కలిపి కచ్చాపచ్చాగా మిక్సీలో వేసి రుబ్బుకోవాలి. మిక్సీ తిరగకపోతుంటే దానిలో కొంచెం నీటిని వేసుకోవచ్చు. తర్వాత వేరే గిన్నెలోకి తీసుకొని మళ్ళీ అందులో కొద్దిగా తాలింపు పెట్టాలి. ఇది చపాతీలలోకి, అన్నంలోకి కూడా అధరవుగా రుచికరంగా ఉంటుంది.
కొబ్బరి పచ్చడి
కావలసిన పదార్ధాలు:
కొబ్బరి కాయ-1
పచ్చి మిర్చి -4 లేదా 5
ఉల్లిపాయ- సగం
చింతపండు రసం- రెండు మూడు స్పూన్లు
కరివేపాకు
తయారు చేసే విధానం:
కొబ్బరికాయను రెండు సగాలుగా పగులకొట్టి, కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ ముక్కలలో పచ్చి మిరపకాయలు, చింతపండు వేసి కచ్చాపచ్చాగా నూరుకోవాలి. అందులో తరిగిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్సీని ఒకసారి గిర్రున తిప్పండి. పచ్చడిని తీసి పక్కన పెట్టుకొని ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి పోపు వేయించి అందులో కలుపుకోవాలి. కొబ్బరి పచ్చడి రెడీ.
దొండకాయ పచ్చడి
కావలసిన పదార్ధాలు:
దొండకాయలు: 25
పచ్చి మిర్చి: 8
ఆవాలు: 1/2 స్పూన్
వెల్లుల్లి రెబ్బలు: 2
్జచింతపండు రసం: 3 టీస్పూన్లు
పంచదార/ చక్కెర: 1/4 స్పూను
ఉప్పు: తగినంత తాలింపుకు అవసరమైన దినుసులు
తయారుచేసే విధానం:
దొండకాయలను కడుక్కొని చివర్లు కోసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. పచ్చి మిరపకాయలను చీల్చి పెట్టుకోవాలి. బాణలిలో జీలకర్ర కొద్దిగా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చి, కరివేపాకు వటేసి కొద్దిగా వేయించి ఈ దొండకాయముక్కలను వేయాలి. మూతపెట్టి ముక్క మెత్తబడే వరకూ ఉంచాలి. దించుకునే ముందు తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. ఇదంతా చల్లారే దాకా పక్కన పెట్టుకోవాలి. మిక్సీలో వేయించి పెట్టుకున్న జీలకర్ర వేసి పొడి చేసుకోవాలి. అందులో వేయించిన దొండ ముక్క లు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు రసం, ఉప్పు వేసి రుబ్బుకోవాలి. పచ్చడిని వేరే గిన్నెలోకి తీసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఇది అ న్నంలోకి, చపాతీలోకీ కూడా బాగుంటుంది.
బీరకాయ తొక్కు పచ్చడి
కావలసిన పదార్ధాలు:
బీరకాయ పొట్టు: 1 కప్పు
మినపపప్పు- 2 టీస్పూన్లు
జీలకర్ర -1/2 స్పూను
ధనియాలు- 1/2 స్పూను
ఎండుమిర్చి - 6 నుంచి 8వరకు
వెల్లుల్లి రెబ్బలు- 2
చింతపండు- కొద్దిగా నీళ్ళలో నానేసి
ఉప్పు- సరిపడినంత
తయారు చేసే విధానం:
బీరకాయలను బాగా కడిగి చివర్లు కోసేసి తొక్కు తీసి పెట్టుకోవాలి. బాణలిలో ఒక టీస్పూన్ నూనె వేసి మినపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి దోరగా వేయించుకోవాలి. అవి తీసి పక్కన పెట్టుకొని బాణలిలో మరో రెండు టీస్పూన్ల నూనె వేసి బీరకాయ తొక్కులను మెత్తబడే వరకూ వేయించాలి. మిక్సర్‌లో వేయించిపెట్టుకున్న పోపు గింజలను వేసి పొడి చేసుకోవాలి. ఆ పొడిలో వేయించిన బీర పొట్టునుచ చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి మెత్తగా చేసుకోవాలి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి తింటే రుచిగా ఉంటుంది.
మష్రూమ్ కట్లెట్స్
Updated: June 18, 2011
కావలసిన పదార్ధాలు:
మష్రూమ్స్- 400 గ్రా.
సన్నగా తరిగిన ఉల్లిపాయ - ఒక కప్పు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర- 1 టేబుల్ స్పూన్
అల్లం పేస్ట్ - 2 టీ స్పూన్లు
ఆలుగడ్డ (ఉడకబెట్టి చిదిమినది) - 1 కప్పు
ధనియాలపొడి - 2 టీ స్పూన్లు
ఆమ్‌చూర్ (ఎండబెట్టిన మామిడిపొడి) - 2 టీస్పూన్లు
ఉప్పు - 11/2 టీస్పూన్లు
తరిగిన పచ్చి మిర్చి - 2 టీస్పూన్లు
గుడ్లు - 2 (బాగా గిలకొట్టినవి)
మైదా - అరకప్పు, బ్రెడ్ అంచులు
తయారు చేసే విధానం:
ముందుగా బాణలిలో నూనె వేసి అందులో జీలకర్ర, అల్లం పేస్ట్ వేసి బాగా కలిపి వేగనివ్వాలి. దానిలో మష్రూమ్స్‌ను వేసి అదంతా దానికి పట్టి పొడిపొడిగా అయ్యేదాకా వేయించాలి. తర్వాత ధనియాల పొడి, ఆమ్‌చూర్, ఉప్పు, మిరపకాయ ముక్కలు వేసి దానిని 2, 3 సార్లు కలియబెట్టి స్టౌ ఆపేయాలి. చల్లారిన తర్వాత అం దులో ఉడకబెట్టి చిదిమిన ఆలు గడ్డను కలపాలి. తర్వాత ఒక కవర్‌పై గుండ్రంగా కానీ కోడిగుడ్డు ఆకారంలో కానీ చేసుకొని దానిని పిండిలో దొర్లించి తర్వాత గు డ్డు సొనలో ముంచి దానిని పొడి చేసుకున్న బ్రెడ్‌లో పొర్లించాలి. ఇలా రెండుసార్లు చేసిన తర్వాత వాటిని నూనెలో బంగారు రంగు వచ్చే దాకా వేయించి తీసివెయ్యాలి. దీనిలో సాస్ వేసి వే డి వేడిగా సర్వ్ చేస్తే రుచికరంగా ఉంటాయి.
చెక్కలు
కావలసిన పదార్ధాలు:
బియ్యం పిండి- అరకిలో
ఉప్పు- తగినంత
పచ్చిమిరపకాయలు - రుచికి తగినన్ని (నూరినవి)
వెన్న- కావాలనుకుంటే
పచ్చి శనగ పప్పు- ఒక టే బుల్ స్పూన్ (నానబెట్టినవి)
నూనె- వేయించడానికి తగినంత
కరివేపాకు- ఒక కట్టి (తరిగినది)
తయారు చేసే విధానం:
బియ్యపు పిండి, ఉప్పు, నూరిన పచ్చి మిరపకాయలు, వెన్న, శనగపప్పు, కరివేపాకు అ న్నింటినీ తగినంత నీళ్ళు వేసి కలపాలి. పిండి గట్టిగా ఉండాలి తప్ప జారుగా కాకూడదు. తర్వాత పిండిని ఒక అరగంట సేపు నా ననివ్వాలి. తర్వాత దానిని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని ఒక పాలిథిన్ కవర్‌పై కాస్త నూనె రాసి చెక్కలను చేతులతో వత్తాలి. పొయ్యి మీ ద బాణలిలో తగినంత నూనె పోసి చెక్కలను ముదురు గోధుమ రంగు వచ్చే వర కు వేగనివ్వాలి. వీటిని పిల్లలు ఇష్టంగా తిం టారు. ఇవి నెలరోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి.
వెజిటేబుల్ ఖిచిడీ
కావలసిన పదార్ధాలు:
బియ్యం - రెండు కప్పులు, కారెట్ -2, బీన్స్ -10
కాబేజీ తురుము- ఒక కప్పు
పెసరపప్పు- 1కప్పు, బఠాణీ - 1/2 కప్పు
దాల్చిన చెక్క - చిన్న ముక్క, ఉప్పు - తగినంత,
లవంగాలు- 5, పచ్చిమిర్చి -3,
నూనె - 1/3 కప్పు జీలకర్ర - 1 స్పూన్,
ఆవాలు - 1స్పూన్, ఉల్లిపాయలు -3, పసుపు - చిటికెడు,
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1 1/2 స్పూన్లు
గరం మసాల - 1 టీస్పూను
తయారు చేసే విధానం:
బియ్యం, పెసరపప్పు కలిపి క గంటసేపు నానబెట్టాలి. ఉల్లిపాయలు, కారె ట్, బీన్స్‌ను సన్నటి ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్‌లో కాస్త నూనె పోసి అందు లో జీలకర్ర, ఆవాలు వేసి వేగనివ్వాలి. అందులో దాల్చిన చెక్క, పచ్చి మిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా కలిపి వేయించాలి. తర్వాత అందులో కోసి పెట్టుకున్న కాయగూరలు, బఠాణీలు వేసి సన్న మంటపై ఉడికించాలి. సగం ఉడికిన వాటి లో బియ్యం, పెసలు వేసి కాసేపు వేయించాలి. తర్వా త అందులో నాలుగు కప్పుల నీళ్ళు పోసి ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే దాకా ఉండనివ్వాలి. వేడి వేడి వెజిటేబుల్ ఖిచడీ రెడీ. ఇందులో ఆలూ కూర్మా, సాంబర్ బాగుంటాయి.
టమాటా పలావ్
కావలసిన పదార్ధాలు:
బాస్మతి బియ్యం - 1 కప్పు
సోయా గింజలు - 1/2 కప్పు
జీలర్ర - 1 టీస్పూన్, బిర్యానీ ఆకు - 1
సన్నగా తరిగిన ఉల్లిముక్కలు - 1/2 కప్పు
అల్లం పేస్ట్ - 1 టీ స్పూన్
టమాటా గుజ్జు - 1/2 కప్పు
ఎండుమిర్చి - 3 (కచ్చాపచ్చాగా నూరి)
నీళ్ళు - 2 1/2 కప్పులు
జాజికాయ పొడి - 1/2 టీ స్పూను
ఉప్పు - తగినంత
గార్నిషింగ్‌కి: ఉడకబెట్టిన బఠాణీలు
తరిగిన అల్లం
తయారు చేసే విధానం:
బియ్యాన్ని బాగా కడిగి పావుగంట సేపు నానబెట్టాలి. సోయా గింజలను ఒక కప్పు నీటిలో నానబెట్టాలి. మందపాటి గిన్నెను తీసుకుని అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. అందు లో ఉల్లిపాయ, అల్లం, జాజికాయపొడి వేసి ఉల్లిపాయలు బంగారు రంగు వ చ్చే వరకూ వేయించాలి. తర్వాత అందులో నానబెట్టిన సోయా గిం జలు వేసి పొడి అయ్యేవరకూ ఉడికించాలి. తర్వాత ఒక కప్పు నీరు పోసి కారం, ఉప్పు వేసి పొంగురానివ్వాలి. అందులో బియ్యం వేసి రెండు నిమిషాలు ఉండికించాలి. తర్వాత మంట తగ్గించి బియ్యం సగంపైన ఉడికేదాకా ఉంచి అం దులో టమాటా గుజ్జు పోసి ఒకసారి కలిపి మూత పెట్టి పూర్తిగా ఉడకనివ్వాలి. తర్వాత పొయ్యి మీద నుంచి దించి ఒక ఐదు నిమిషాల పాటు మూత తియ్యకుండా ఉంచాలి. సర్వ్ చేసే సమయంలో దానిపై ఉడకబెట్టిన బఠాణీ, అల్లం ముక్కలు వేసి వడ్డించవచ్చు.
నవరతన్ కూర్మా
Updated: June 26, 2011
కావలసిన పదార్ధాలు:
ఉడకబెట్టిన కూరగాయ ముక్కలు - 3 కప్పులు
(ఆలూ, కారెట్, పచ్చి బఠాణీ, బీన్స్, కాలిఫ్లవర్, కాప్సికమ్, కాబేజ్, గోరు చిక్కుడు, సొరకాయ)
పనీర్ - 150 గ్రా. (తురిమినది)
టమాటాలు - 3
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగి)
అల్లం పేస్ట్ - 1 1/2 టీ స్పూన్లు
వెల్లుల్లి పేస్ట్ - 1 1/2 టీ స్పూన్లు
ఉప్పు - తగినంత
పసుపు - 1 టీ స్పూను
కారం - 1 1/2 టీ స్పూన్లు
ధనియాలపొడి - 1 టీ స్పూను
గరం మసాలా పొడి - 2 టీ స్పూన్లు
మీగడ - 2 టేబుల్ స్పూన్లు
నూనె - 6 టేబుల్ స్పూన్లు
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
పాలు/ నీళ్ళు - 1 కప్పు
డ్రై ఫ్రూట్స్ - 1/4 కప్పు
కొత్తిమీర - అలంకరణకి
తయారు చేసే విధానం:
టమాటాలను మృదువుగా అయ్యేవరకూ ఉడకించాలి. తర్వాత చల్లారనిచ్చి దాని తొక్కు తీసేసి దానితో గుజు తయారు చేసుకోవాలి. లేదా రెడీమేడ్‌గా దొరికే టమాటా ప్యూరీని కూడా వినియోగించవచ్చు. తర్వాత ఒక స్పూన్ నేతిని బాణలిలో వేసి డ్రైఫ్రూట్స్‌ను ఒక నిమిషం పాటు మీడియం మంట మీద వేయించాలి. వాటిని తీసేసి నూనె వేసి వేడి చేసి ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయిం చాలి. ఇందులో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి రెండు మూడు నిమిషాల పాటు వేగనివ్వాలి. తర్వా త అందులో టమాటా ప్యూరీని, డ్రై ఫ్రూట్స్‌ని వేయాలి. గరిటతో తిప్పుతూ దానిని నాలుగు నిమిషాల పాటు ఉడకించాలి. బాణలికి అంటుకోకుండా జాగ్రత్త పడాలి. ఇందులో పాలు, కాసిని నీళ్ళు పోస్తూ పొంగురానివ్వాలి. తర్వాత మంట తగ్గించి గ్రేవీ చిక్కగా అయ్యే వరకూ ఉంచాలి. తర్వాత అందులో పనీర్ వేసి గరిటతో తిప్పాలి. చివరగా ఉడకబెట్టుకున్న కూరగాయల ముక్కలను గ్రేవీలో వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించాలి. సర్వ్ చేసే మందు దానిపై మీగడ, కొత్తమీర ఆకులతో అలంకరించి సర్వ్ చేయాలి. ఇది చపాతీలలోకి, నాన్‌లలోకి అధరవుగా బాగుంటుంది.
స్టఫ్డ్ కాప్సికమ్
కావలసిన పదార్ధాలు:
కాప్సికమ్ (సిమ్లా మిర్చి) - 5-6
ఉడకబెట్టిన ఆలూ - 2
ఉడకబెట్టిన పచ్చి బఠాణి-2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినది)
పసుపు - 1/4 టీ స్పూను
కారం - తగినంత
గరం మసాలా - 1/4 స్పూను
ఆమ్‌చూర్ - 1/4 టీ స్పూను
ఉప్పు - తగినంత
నూనె - తగినంత
తయారు చేసే విధానం:
కాప్సికమ్‌ను శుభ్రంగా కడిగి మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి. తర్వాత అందులో నీటిని వంచేసి చల్లారనివ్వాలి. ఉడకబెట్టి ఉంచుకున్న ఆలుగడ్డను చిదమాలి. బాణలిలో రెండు టీ స్పూన్ల నెయ్యి లేదా నూనె వేసి అందులో తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి. ఇందులో మసాలా దినుసులు, ఆలుగడ్డ చిదుము, బఠాణీలు వేసి కొద్ది నిమిషాలు వేయించాలి. చాకుతో కాప్సికమ్ తొడిమను, లోపల ఉన్న గింజలను తొలిగించాలి. తర్వాత చేసి వేయించిన స్టఫిం గ్‌ను అందులో జాగ్రత్తగా పెట్టాలి. మరొక బాణలి పొయ్యి మీద పెట్టి తగినంత నూనె పోసి స్టఫ్ చేసుకున్న కాప్సికమ్‌ను అందులో వేసి అన్ని వైపుల నుంచి వేయిం చాలి. వేగిన కాప్సికమ్ మీద పనీర్ తురుము, కొత్తిమీర ఆకులు, గుండ్రంగా తరిగిన టమాటాలతో అలంకరించి వేడి వేడిగా సర్వ్ చేయాలి.
స్టఫ్డ్ టమాటా
కావలసిన పదార్ధాలు:
మీడియం సైజ్ టమాటాలు - 5-6
పనీరు తురుము - 100-150 గ్రా.
ఉల్లిపాయ - 1 సన్నగా తరిగి
కొత్తిమీర - సన్నగా తరిగి
పచ్చి మిర్చి - 2 సన్నగా తరగాలి
ఉప్పు - తగినంత
కారం - తగినంత
గరం మసాలా - తగినంత
పసుపు - 1/4 టీ స్పూన్
చీజ్ తురుము - 1 టేబుల్ స్పూన్
నూనె - 1 టేబుల్ స్పూన్
తయారు చేసే విధానం:
టమాటాలను శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి. తర్వాత టమాటా పై భాగంలో తొడిమ దగ్గర గుండ్రంగా కత్తిరించాలి. తర్వాత మధ్యలో ఉన్న పదార్ధాన్ని జాగ్రత్తగా బయటకు తీయాలి. దీనిని ఒక పక్కన పెట్టి పైన తీసేసిన భాగాన్ని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి కొద్ది నూనె వేసి వేడి చేసి అందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసుకొని మెత్తగా అయ్యే వరకూ వేయించాలి. ఇప్పుడు టమాటోలో తీసిన గుజ్జును, టమాటా ముక్కలను వేసి ఒక నిమిషం వేయించి అందులో మసాలాలు వేసి మరొక నిమిషం వేగనివ్వాలి. తర్వాత అందులో పనీర్ వేసి ఒక నిమిషం ఉడకనివ్వాలి. తర్వాత దానిని పక్కకి తీసి ఈ మిశ్రమాన్ని టమాటాల్లో నింపాలి. దానిపై తురిమి పెట్టుకున్న చీజ్, కొత్తిమీరను వేయాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్ ప్లేట్‌లో పెట్టి దాని పై వెన్న వేసి ఒక విజిల్ వచ్చే వరకూ ఉడకనివ్వాలి. లేకుంటే దానిని ఒవెన్‌లో 200 డిగ్రీల వేడితో ఒక ఇరవై నిమిషాల పాటు బేక్ చేసుకోవచ్చు. దీనిని వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది.
దమ్ ఆలూ
Updated: July 10, 2011
కావలసిన పదార్ధాలు:
ఆలూ : 900 గ్రా
అల్లం : 1 టేబుల్ స్పూన్ (సన్నగా తరిగినది)
నీళ్ళు : 3/4 కప్పు
నూనె/ నెయ్యి: వేయించడానికి తగినంత
నెయ్యి : 1 కప్పు
ఉల్లిపాయ : 1 పెద్దది (సన్నగా తరిగి)
టొమాటో ప్యూరీ: 4 టేబుల్ స్పూన్లు
పెరుగు : 1 పెద్ద కప్పు
వేడి నీళ్ళు : 4 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి : 1 (గింజలు తీసేసి
సన్నగా తరిగి)
జీలకర్ర : 1 టీ స్పూన్
గరం మసాలా: 1 టీ స్పూన్
ఉప్పు : తగినంత
మసాలా దినుసులు:
లవంగాలు : 4
బిర్యానీ ఆకులు: 4
మిరియాలు : 6
ఇలాచీ : 4
దాల్చిన చెక్: 1
మసాలా ముద్దకు:
ఉల్లిపాయ : 1 పెద్దది (సన్నగా తరిగి)
మిరియాలు : 6
గసాలు : 1 టీ స్పూన్
ధనియాలు : 1 టేబుల్ స్పూన్
జీలకర్ర : 1 టీ స్పూన్
ఎండు మిర్చి: 2
పసుపు : చిటికెడు
జాజికాయపొడి: 1 చిటికెడు
తయారు చేసే విధానం:
ఆలు గడ్డలకు తొక్కు తీసి ఫోర్క్‌తో దానిపై పొడిచి వాటిని కొద్దిగా ఉప్పు వేసిన నీటిలో రెండు గంటలపాటు ఉంచాలి. తర్వాత వాటి ని తీసి ఒక బట్టపై ఆరబెట్టాలి. బాణలిలో నూనె కానీ నెయ్యి కానీ పోసి వేడి అయిన తర్వాత ఈ ఆలుగడ్డలను బంగారు రంగు వ చ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా నెయ్యి వేసి అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, మసాలా ది నుసులు వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేయించుకోవాలి. ముద్దకోసం పెట్టుకున్న వా టన్నింటినీ మెత్తగా నూరి వేగిన ఉల్లిపాయలలో వేయాలి. ఈ మొత్తాన్ని 10 నిల పాటు ఉడకనివ్వాలి. అనంతరం దానిపై టొమాటో గుజ్జు, పెరుగు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో.. వేయించి పెట్టుకున్న ఆలూ, వేడినీటిని వేసి ఒక 5 నిల పాటు తక్కువ మంట మీద కలుపుతూ ఉంచాలి. దమ్ ఆలూపై మిరియాలపొడి, గరం మసాలా పొడి వేసి కొద్ది నిమిషాల పాటు ఉడకనిచ్చి దించేయాలి. వేడి వేడి దమ్ ఆలూ తయార్. ఇది చపాతీలలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది.
స్టఫ్ట్ ఆలూ
కావలసిన పదార్ధాలు:
ఆలు గడ్డలు: 8 (మీడియం సైజువి పీల్ చేసి)
కాలీఫ్లవర్ పూలు: 2 (సన్నగా తరిగి)
ఉల్లిపాయలు: 1 (సన్నగా తరిగి)
కాప్సికమ్ : 1 (గింజలు తీసేసి తరిగి)
బఠాణీలు : 1 టేబుల్ స్పూన్
పచ్చి మిర్చి : 2 (తరిగి)
టొమాటోలు: 4 (పెద్ద ముక్కలు తరిగి)
వెల్లుల్లి : 2 రెబ్బలు (తరిగి)
ఉప్పు : తగినంత
నీళ్ళు : 2/3 కప్పు
నెయ్యి : 1/4 కప్పు
కొత్తిమీర : 1 టీస్పూన్ తరిగిన ఆకులు
తయారు చేసే విధానం:
ఆలుగడ్డలను పై పావు భాగం తీసి వేసి పక్క న పెట్టుకోవాలి. తర్వాత ముప్పావు భాగం మధ్యలో జాగ్రత్తగా చిన్న గుంట ఏర్పడేలా తియ్యాలి. తర్వాత బాణలి తీసుకొని అందులో కాసిన నీరు పోసి తగినంత ఉప్పు వేసి కాలీఫ్లవర్, కాప్సికమ్, బఠాణీలు, ఉల్లిపాయ, పచ్చి మిర్చివేసి నీరంతా ఇంకిపోయే దాకా ఉంచాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మధ్యలో గుంటలా చేసిన ఆలుగడ్డలో నింపాలి. తర్వాత పక్కన పెట్టుకున్న దానిపై భాగాన్ని మూతలా పెట్టి విడిపోకుండా ఉండేందుకు ఒక టూత్‌ప్రిక్‌ను గుచ్చాలి. ఒక బాణలిలో నెయ్యి పోసి వేడి చేసి అందులో టొమాటో ముక్కలు వేసి కొద్దిగా ఉప్పు చేర్చి రెండు నిమిషాల పాటు ఉడకపెట్టాలి. తర్వాత మసాలా నింపిన ఆలుగడ్డలను ఈ టమాటా మిశ్రమంలోకి జాగ్రత్తగా వేసి, మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు అంటే అవి మృదువుగా అయ్యే వరకు ఉడికించాలి. దించిన తర్వాత దానిపై కొత్తిమీరతో అలంకరించి రోటీలోకి లేదా పరాటాలోకి తీసుకుంటే బాగుంటుంది.
పంజాబీ టిండా
కావలసిన పదార్ధాలు:
పెసరపప్పు - 1 కప్పు
సొరకాయ - 300 గ్రా.
పసుపు - 1/2 టీ స్పూను
కారం - తగినంత
జీలకర్ర - 1/2 స్పూను
ఉప్పు - తగినంత
నూనె - తగినంత
కరివేపాకు - గుప్పెడు
తయారు చేసే విధానం:
పెసరపప్పును ఒక పది నిమిషాల పాటు నీళ్ళ లో నాన బెట్టాలి. ఈ లోపల సొరకాయను సున్నితంగా చెక్కుతీసి ముక్కలు చేసుకోవాలి. తర్వాత పప్పును వాడ్చి నీళ్ళు లేకుండా పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి కాస్త నూనె వేసి పెసరపప్పును 2,3 నిమిషాల పా టు వేయించుకోవాలి. తర్వాత దానిలో సొరకాయ ముక్కలు, జీలకర్ర , కారం అన్నీ వేసి మరో రెండు నిమిషాల పాటు మీడియం మం ట మీద వేగనివ్వాలి. తర్వాత మంట తగ్గించి అందులో మూడు కప్పుల నీళ్ళు పోసి తగినం త ఉప్పు వేయాలి. దీనిని ప్రెషర్ కుక్కర్‌లో ఉ డికించాలి. దీనిలో పోపు పెట్టాలి. ఇది చపాతీలతో, అన్నంలో తినడానికి కూడా బాగుంటుంది.
మష్రూమ్ పనీర్ మసాలా
Updated: July 31, 2011
కావలసిన పదార్ధాలు...
మష్రూమ్స్ : 100 గ్రా.
పనీర్ : 100 గ్రా.
ఉల్లిపాయలు: 1 (సన్నగా తరిగి)
పసుపు : 1/2 టీ స్పూన్
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 1 టీ స్పూన్లు
పచ్చి మిర్చి : 4 (తరిగి)
ధనియాల పొడి : 1 టీస్పూన్
గరం మసాలా పొడి : 1/2 టీ స్పూన్
కొబ్బరి పొడి : 2 టీస్పూన్లు
ఉప్పు : తగినంత
జీలకర్ర : 1 టీస్పూన్
ఆవాలు : పోపుకు తగినన్ని
నూనె : 4 స్పూన్లు
కొత్తిమీర : అలంకరణకి
తయారు చేసే విధానం...
మష్రూమ్స్‌ను తీసుకొని శుభ్రం చేసి, ఉడికించి వాటిని మీడియం సైజు ముక్కలుగా చేసుకోవాలి. పనీర్‌ను తురుముకోవాలి. బాణలిని పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. అందులో జీలకర్ర, ఆవాలు, సన్నగా తరిగిన ఉల్లిపా య ముక్కలను వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి. అందులో పచ్చి మిర్చి, మష్రూమ్స్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాలు వేయించాలి. తర్వాత తురిమి పెట్టుకున్న పనీర్ వేసి కలపాలి. పనీర్ కరిగిన తర్వాత అది తక్కుపోతుంది కనుక బాగా తిప్పుతూ ఉండాలి. దానిలో ధనియాల పొడి, కొబ్బరి పొడి, ఉప్పు, గరం మసాలా పొడి వేసి కలియతిప్పాలి. పదార్ధాలన్నీ వేగిన తర్వాత దించి కొత్తిమీరతో అలంకరించి సాస్ వేసి సర్వ్ చేయాలి.
మలై మటర్ పనీర్
కావలసిన పదార్ధాలు...
పనీర్ : 250 గ్రా.
ఉడకబెట్టిన పచ్చి బఠాణీలు : 1/2 బౌల్
మీగడ : 1/2 బౌల్
పెరుగు : 4 టేబుల్ స్పూన్లు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ పేస్ట్ : 2 టేబుల్ స్పూన్లు
ధనియాల పొడి : 1 టేబుల్ స్పూన్
ఆవాల పొడి : 1/2 టీస్పూన్
కారం : 1/2 టీ స్పూన్
పసుపు : 1/2 టీ స్పూన్
నీళ్ళు : 1 కప్పు
నూనె : తగినంత
గరం మసాలా పొడి: చిటికెడు
ఉప్పు : తగినంత
కొత్తిమీర : అలంకరణకి
తయారు చేసే విధానం...
పనీర్‌ను పెద్ద పెద్ద ముక్కలుగా తరుక్కోవాలి. ఒక చిటికెడు ఉప్పు వేసి పెరుగును మిక్సీలో వేసి తిప్పి పక్కన పెట్టుకోవాలి. బాణలిని పొయ్యి మీద పెట్టి కొంచెం నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్‌ను ఒక నిమిషం పాటు వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాలు వేగనివ్వాలి. నూనె పక్కకి వచ్చిన తర్వాత ధనియాలపొడి, కారం పొడి, ఆవపొడి, పసుపు, ఉప్పు వేసి కలియబెట్టి ఐదు నిమిషాల సేపు బాగా వేగనివ్వాలి. ఇందులో మిక్సీలో వేసి పెట్టుకున్న పెరుగు పోసి ఒక నిమిషం పాటు తిప్పాలి. తర్వాత మీగడ వేసి పదార్ధాలన్నింటినీ మరొక ఐదు నిమిషాల పాటు వేయించాలి. తర్వాత తరిగి పెట్టుకున్న పనీర్ ముక్కలు, ఉడకబెట్టి బఠాణీలు వేసి కాస్త నీరు పోసి బాణలిపై మూత పెట్టాలి. ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఉడికించిన తర్వాత దానిని వేరొక గిన్నెలో వేసి గరం మసాలా పొడి వేసి కొత్తి మీరతో అలంకరించాలి. మటర్ పనీర్ సర్వింగ్‌కి రెడీ.
చిల్లీ పనీర్
కావలసిన పదార్ధాలు...
కాప్సికమ్ : 200 గ్రా.
పనీర్ : 250 గ్రా.
ఉల్లిపాయలు: 200 గ్రా.
పచ్చి మిర్చి : 4
టొమాటోలు: 2 (పెద్దవి)
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ పేస్ట్ : 2 టేబుల్ స్పూన్లు
టొమాటో ప్యూరీ : 2 టేబుల్ స్పూన్లు
సోయా సాస్ : 2 టేబుల్ స్పూన్లు
చిల్లీ సాస్ : 1 టీస్పూన్
మిరియాల పొడి: 1/2 టీ స్పూన్
నీళ్ళు : 1/2 కప్పు
నూనె : 2 కప్పులు
ఉప్పు : తగినంత
తయారు చేసే విధానం...
కాప్సికమ్‌ను, ఉల్లిపాయలను సన్నగా ముక్కలుగా తరుక్కోవాలి. పనీర్‌ను పెద్ద ముక్కలుగా చేసుకోవాలి. పచ్చి మిరపకాయలను చీల్చి పెట్టుకోవాలి. టొమాటోలను చిన్న ముక్కలుగా చేసి పక్కకు పెట్టుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి అందులో నూనె పోసి కాప్సికమ్, పనీర్, ఉల్లిపాయ ముక్క లు, టొమాటోలు ఒక దాని తర్వాత చిటికెడు ఉప్పు వేస్తూ వేసి వేయించి ఒక ప్లేట్‌లో తీసి పెట్టుకోవాలి. నూనెను తిరిగి వేడి చేసి, దానిలో ఉల్లిపాయ పేస్ట్ వేసి రెండు నిమిషాలు వేయించాలి. అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా రెండు నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత టొమాటో ప్యూరీ వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు అందులో కారం, మిరి యాల పొడి వేసి ఒక అర నిమిషం వేగనివ్వా లి. అందులోనే చిల్లీ సాస్, సోయా సాస్ వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి. తర్వాత తరిగి పెట్టుకున్న మిరపకాయలు వేసి ఒక నిమిషం తర్వాత కాప్సికమ్, పనీ ర్, ఉల్లిపాయ ముక్కలు వేసి నీళ్ళు పోసి మూత పెట్టి ఐదు నుంచి నిమిషాలు ఉడికించాలి. తర్వాత మూత తీసి ఒక నిమిషం ఉంచి దించేయాలి. చిల్లీ పనీర్ రెడీ.
వాహ్‌వా.. ఐస్‌క్రీం వర్శిటీ
Updated: August 7, 2011
ఏంటి వింటుంటేనే నోరూరిపోతోంది కదూ. అవునండీ ఇది నిజమే. ఐస్‌క్రీం తయారీలో శిక్షణనిచ్చేందుకూ కార్పిగ్యానీ గెలాటో పేరుతో ఓ యూనివర్శిటీ ఉందండోయ్. సెంట్రల్ ఇటలీలోని బొలొగ్నా సమీపంలో ఉన్నదిది. దీని స్పెషాలిటీ ఏంటంటారా? అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ ఐస్‌క్రీం తయారీలో శిక్షణ పొందుతున్నారు. ఐస్ క్రీం సెమినార్లు, కన్సల్టింగ్ బుక్స్, ఫ్లేవర్, ప్రొడక్ట్ రీసెర్చ్, డెవలప్‌మెంట్, ఎడ్యుకేషన్‌పై ఇందులో శిక్షణ ఇస్తారు.అంతేకాదండోయ్... అన్ని యూనివర్శిటీల్లోలాగే ఇక్కడా ప్రాక్టికల్, టెక్నికల్ కోర్సులతో పాటు ఐస్‌క్రీం తయారీలో సంప్రదాయ పద్ధతులు, మార్కెటింగ్, మేనేజ్‌మెంట్ విభాగాల్లో నిపుణులు తర్ఫీదునిస్తారు. ఒక వారం నుంచి నాలుగు వారాల పాటు కోర్సులను ఆఫర్ చేస్తున్న వీరు... గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత పట్టాలు కూడా ఇస్తారట.
ఒక్కొక్కటిగా....
- ఈ గెలాటో యూనివర్శిటీని ఇటలీలో 1995 సంవత్సరంలో మాల్కోల్మ్ స్టోగో అనే వ్యక్తి ప్రారంభించారు.
- ఈయన 25 ఏళ్ల నుంచి ఐస్‌క్రీం తయారీ బిజినెస్‌లో ఉన్నారు.
- ఐస్‌క్రీం తయారీపై పరిశోధనలు చేసి ఎన్నో పుస్తకాలు రాశారు. ఇటీవలే ‘ఇన్‌క్రెడిబుల్ ఐస్‌క్రీం’ అన్న పుస్తకాన్ని రచించారు.
- వివిధ రకాల ఫ్లేవర్లతో సంప్రదాయ పద్ధతుల్లో ఐస్‌క్రీం తయారీ ఇక్కడి స్పెషాలిటీ.
- సెంట్రల్ ఇటలీలోని బొలొగ్నా సమీపంలో ఈ వర్శిటీ ఉంది.
- రస్ప్‌బెర్రీ, హసెల్‌నట్, లెమన్, ఫెన్నెల్, మోర్టాడెల్లా ఫ్లేవర్స్ ఇక్కడి స్పెషాలిటీ.
- ప్రస్తుతం ఈ విశ్వవిద్యాలయంలో 12 వేల మంది శిక్షణ పొందుతున్నారు.
- చైనా, స్పెయిన్, యునైటెడ్ స్టేట్స్‌లో వీరి శాఖలున్నాయి. ఇందులో 400 మంది ఉద్యోగులున్నారు.
- అమెరికా సహా ప్రపంచంలోని అన్ని మూలల నుంచి విద్యార్థులు, గ్రాడ్యుయేట్స్, ఐస్‌క్రీం ప్రేమికులు ఇక్కడికి వస్తుంటారు.
- ఈ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఇటలీకి గెలాటో టూర్ నిర్వహిస్తారు.
- అన్ని కేటగిరీల్లో ఒక నెల కోర్సుకు 1,138 యూరోలు (ఇండియన్ కరెన్సీలో 18 లక్షలు) ఖర్చవుతాయి. దీనికి వ్యాట్ అదనం.
- ఒక వారం కోర్సుకు రూ.5.50 లక్షలు, రెండు వారాల కోర్సుకు రూ.9.50 లక్షలు తీసుకుంటారు.
- ఈ కోర్సుల్లో చేరిన వారికి వారే ఉచిత గృహ వసతి కల్పిస్తారు.
- వచ్చే ఏడాదిలో గెలాటో మ్యూజియం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు.
ఇవన్నీ చదివాక వెంటనే వెళ్లి ఆ యూనివర్శిటీలో చేరిపోవాలనుందా... కనీసం అక్కడికి వెళ్లి ఆ వెరైటీ ఐస్‌క్రీం ఫ్లేవర్లను రుచి చూడాలనైనా అనిపిస్తోంది కదూ. అయితే వెంటనే ఈ వెబ్‌సైట్ www.gelatouniversity.com కి లాగిన్ అవ్వండి.
దమ్‌కా బిర్యాని
Updated: August 14, 2011
కావలసిన పదార్థాలు:
చికెన్ - ఒక కిలో
బాస్మతి బియ్యం - ఒక కిలో
గరం మసాల - రెండు టీ స్పూన్లు
అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూను
పెరుగు - ఒక కప్పు
ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు
పచ్చి మిరపకాయలు - ఐదు
ఎండు మిరపకాయలు - ఆరు
పసుపు - చిటికెడు
కొత్తిమీర - ఒక కట్ట
ఉప్పు - తగినంత
నూనె - సరిపడా
తయారు చేసే విధానం:
ముందుగా మాసాన్ని శుభ్రంగా కడిగి కొద్ది గా పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు వేసి బాగా కలిపి రెండు గంటల సేపు నానబెట్టుకోవాలి. బియ్యాన్ని కడిగి ఆరబెటు కోవాలి. ఐదు నిమిషాల తర్వాత వంతుకు రెండొంతుల నీళ్లు పోసి పొయ్యి మీద ఉడికించాలి. పొయ్యి మీద మరో మందపాటి పాత్ర ఉంచి సరిపడా నూనె వేసి పచ్చి మిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు పెరు గులో నానబెట్టిన మాంసాన్ని కొద్దిగా పాత్ర లో వేసి దానిపై ఉడికించిన అన్నాన్ని వేయా లి. ఇలాగే ఇంకో పొరలా మిగలిన మాంసాన్ని, అన్నాన్ని వేసి మూత పెట్టాలి. పాత్ర నుంచి ఆవిరి బయ టకు పోకుండా ఉండటానికి మెత్తగా కలిపిన మైదాను మూత అంచుల చుట్టూ పెట్టాలి. మైదా పిండి మొత్తం ఆవిరైపోయి పెచ్చులుగా వచ్చే వరకూ ఉడికించి దించేయాలి. చివర్లో కొత్తిమీర, ఉల్లిపాయలను వేసి అలంకరించు కోవాలి. దీనికి సైడ్ డిష్‌గా గోంగూరను కానీ, వంకాయ కూరను కానీ వేసి సర్వ్ చేసుకోవచ్చు.
స్పెషల్ మటన్ ఫ్రై
కావలసిన పదార్థాలు:
బోన్‌లెస్ మటన్ - 650 గ్రాములు
తరిగిన ఉల్లిపాయలు - 100 గ్రాములు
కారం - ఒక టీ స్పూను
ఉప్పు - సరిపడా
పసుపు - పావు టీ స్పూన్
అల్లం వెల్లల్లి పేస్టు - రెండు టేబుల్ స్పూన్లు
బఘార్ కోసం కావలసినవి:
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్
కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి - నాలుగు
మిరియాల పొడి - అర టీ స్పూన్
గరం మసాల పౌడర్ - అర టీ స్పూన్
నిమ్మరసం - రెండు టీ స్పూన్లు
తయారు చేసే విధానం:
ఓ పాత్రలోకి మాంసం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపులను వేసి బాగా కలిపి సరపడా నీటిని పోసి ప్రెజర్ కుక్కర్‌లో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. మాంసం ముక్కలను తడి ఆరే వరకూ పక్కకు పెట్టుకోవాలి.ఇప్పుడు స్టౌ వెలిగించి దానిపై బాణలి ఉంచి అందులో సరిపడా నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి (మధ్యలో కత్తిరిం చినవి) లను వేసి వేయించాలి. ఇప్పు డు అందులోకి పక్కన పెట్టుకున్న మాంసంను కూడా వేసి బాగా కలియ బెట్టాలి. ఈ మిశ్రమంపై మిరియాల పొడి, గరం మసాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలిపి మరో ఐదు నుచి 10 నిమిషాల పాటు సన్నటి సెగ మీద ఉడికించాలి. ముక్కలు బాగా వేగాయ ని నిర్ధారించుకున్నాక దించేసుకోవాలి.
శనగపప్పు గోంగూర
కావలసిన పదార్థాలు:
గోంగూర - 5 కట్టలు
పచ్చి శెనగపప్పు - 20 గ్రాములు
తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి - 3
ఎండుమిర్చి - 2
మెంతి పొడి - 1 టేబుల్ స్పూన్
మినపప్పు - పోపుకు సరిపడా
జీలకర్ర - 1 టీ స్పూన్
ఆవాలు - 1 టీస్పూన్
పసుపు - పావు టీ స్పూన్
ఇంగువ - పావు టీ స్పూన్
వెల్లుల్లిపాయలు - ఐదు
నూనె, ఉప్పు, కారం - సరిపడా
తయారు చేసే విధానం:
ముందుగా గోంగూరను వలిచి శుభ్రం చేసుకోవాలి. శనగపప్పు విడిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. స్టౌపై బణలి పెట్టి అందులో నూనె వేసి మినప్పప్పు, జీల కర్ర, ఆవాలు, పసుపు, ఇంగువ, ఎండుమిర్చి, మెం తులు, వెల్లుల్లి వేసి వేయించాలి. ఆవాలు వేగిన తర్వా త ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత గోంగూర వేసి కొద్ది గా నీటిని పోసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. గోంగూర బాగా ఉడికిన తర్వాత ముం దుగా ఉడికించి పెట్టుకున్న శెనగపప్పు, ఉప్పు, కారం వేసి బాగా కలిపి మరో ఐదు నిమిషాల సన్నటి సెగపై ఉడికించి దించేయాలి. వేడి వేడి మటన్ బిర్యానీలోకి ఈ పుల్లటి గోంగూర వేసుకొని తింటే ఆ టేస్టే వేరు..!
హోలీ హలీమ్
Updated: August 21, 2011
కావలసిన పదార్థాలు:
గోధుమ రవ్వ : పావు కిలో
నెయ్యి : పావు కిలో
మటన్ (బోన్‌లెస్) : పావు కిలో
పుట్నాల పప్పు(తినే శెనగ పప్పు) : 50 గ్రాములు
గరం మసాలా : ఒక టీ స్పూను
తరిగిన ఉల్లిపాయల ముక్కలు : ఒక కప్పు
కొత్తిమీర : ఒక కట్ట
పుదీనా : ఒక కట్ట
నిమ్మకాయలు : రెండు
ఉప్పు : తగినంత
తయారు చేసే విధానం:
రంజాన్ నెలలో మనకు ముఖ్యంగా దర్శనమిచ్చే వంటకం హలీమ్. రోజా ఉండే ముస్లిం సోదరులకు ఇదో అద్భుతమైన, రుచికరమైన విందు. ఇది ఇంట్లో తయారు చేసుకోవడం కొంచెం కష్టమే అయినా ఎపుడైనా సరదాగా ప్రయత్నించాలనుకుంటే ఇలా చేయండి. ముందుగా మటన్‌ను శుభ్రం చేసుకొని, మందపాటి పాత్రలో ఐదు గంటల పాటు ఉడికించాలి. మటన్ బాగా ఉడికిన తర్వాత గోధుమ రవ్వ, పుట్నాల పొడి, గరం మసాల వేసి బాగా కలిపి మరో నాలుగు గంటల పాటు సన్నటి సెగపై (అడుగు అంటకుండా) ఉడికించాలి. బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఈ మిశ్రమానికి నెయ్యి కలిపి అది కరిగే వరకూ ఉంచి దించేయాలి. ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించుకోవాలి. ఒక ప్లేటులోకి వేడి వేడి హలీమ్‌ను తీసుకొని అందులో వేయించిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కొత్తమీర, పుదీనా ఆకులు వేసి వాటిపై నిమ్మరసం పిండి వడ్డించాలి.
షీర్ కుర్మా
కావలసిన పదార్థాలు:
సన్నని సేమియా - ముప్పావు కప్పు
పాలు - ఆరు కప్పులు
పంచదార - రుచికి సరిపడా
నెయ్యి - తగినంత
సన్నగా తరిగిన బాదంపప్పు - ఒక టేబుల్ స్పూన్
సన్నగా తరిగిన పిస్తాపప్పు - ఒక టేబుల్ స్పూన్
నానబెట్టి తొక్క తీసిన చిరోంజి గింజలు - ఒక టేబుల్ స్పూన్
మెలన్ సీడ్స్ - ఒక టేబుల్ స్పూన్
సన్నగా తరిగిన ఖర్జూరం - రెండు టేబుల్ స్పూన్లు
కుంకుమ పువ్వు - అర టీ స్పూన్
కిస్‌మిస్ - ఒక టేబుల్ స్పూన్
జాజికాయ పొడి - పావు టీ స్పూన్
యాలకుల పొడి - చిటికెడు
తయారు చేసే విధానం: ఒక కప్పు గోరువెచ్చని పాలలో కుంకుమ పువ్వు వేసి పక్కన ఉంచుకోవాలి. మిగిలిన పాలను బాణలిలో పోసి మరగనివ్వాలి, మరిగిన తర్వాత పంచదార, యాలకుల పొడి, జాజికాయ పొడి వేసి పాలు నాలుగో వంతు ఇంకే వరకూమరిగించాలి.
మరొక పాత్ర (అడుగు భాగం మందంగా ఉండేది) తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసి కిస్‌మిస్, బాదం, చిరోంజి, పిస్తా, మెలన్ గింజలను వేయిం చి పక్కకు పెట్టుకోవాలి. మిగిలి న నేతిలో సేమ్యాలను దోరగా వేయించుకొని ఇదివరకు మరింగించి పెట్టుకున్న పాలను పోసి ఉడకనివ్వాలి. ఇది ఉడుకుతుండగా కర్జూరం, కుంకు మపువ్వు కలిపిన పాలను పోసి మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఉడింకిం చాలి. సేమియా బాగా ఉడికిన తర్వాత దించేసుకోవాలి, దీనిని వేడిగా అయినా వడ్డించుకోవచ్చు లేదా ఫ్రిజ్‌లో పెట్టుకొని చల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చు.
కద్దూ కా ఖీర్
కావలసిన పదార్థాలు:
బూడిద గుమ్మడి తురుము: 1
పంచదార: 250 గ్రాములు
కోవా: 1
జీరపప్పు: 1
నెయ్యి: 50
యాలకులపొడి: 1/2
పాలు: 2
జీడిపప్పు: 10
ద్రాక్ష: 10
తయారు చేసే విధానం: బూడిద గుమ్మడికాయను శుభ్రంగా కడిగి, చెక్కు తీసి గింజలు లేకుండా సన్నగా తురుముకోవాలి. పాన్ లో నెయ్యివేసి జీర, ద్రాక్ష, జీడి పప్పులు వేయించి తీసుకోవాలి. అందులోనే గుమ్మడితురుము వేసి కాసేపు మగ్గనివ్వాలి. పాలు పోసి సన్నని మంటపై ఉడికించాలి. తరువాత (చిక్కబడ్డాక) పంచదార, కోవా, యాలకులపొడి వేసి బాగా ఉడికించాలి. దించేముందు పప్పులు కూడా వేసి దింపాలి.
తాలికల పాయసం
Updated: September 4, 2011
కావలసిన పదార్థాలు...
తాలికలు : 200 గ్రాములు
బెల్లం : 250 గ్రా
పాలు : 1/4 లీ.
యాలకుల పొడి : 1 టీస్ఫూన్
నెయ్యి : 5 గ్రాములు
జీడిపప్పు, బాదాం : 6
తాలికల తయారీ:
తాలికలంటే ఇప్పటి నూడుల్స్ లాంటివి. కొన్నేళ్ల క్రితం వరకు మంచి గోధుమలు మరపట్టించి ఇంట్లోనే తయారుచేసుకునే వారు. దీనికోసం ప్రత్యేకమైన మిషను ఉంటుంది. ఎండాకాలంలో వీటిని తయారు చేసుకుని బాగా ఎండబెట్టి సంవత్సరమంతా వాడుకునేవారు. ఇందులోనే జంతికలలాగా బిళ్లలు మార్చుకుని సన్నగా, లావుగా కూడా చేసుకోవచ్చు. మిగతావాటికి బజారులో దొరికే సేమ్యా, నూడుల్స్ కొనుక్కున్నా, వినాయక చవితికి మాత్రం ఇంట్లోనే చేసుకుంటారు. మిషన్ లేకున్నా గోధుమ పిండి చపాతీలకు మళ్లే తడుపుకుని చేత్తో చేసుకోవచ్చు. ఈ తాలికలు ఒకరోజు ముందే చేసి ఎండబెట్టి వాడుకోవాలి.
పాయసం తయారీ విధానం...
ముందుగా తాలికలు ఒకసారి నీళ్లతో కడిగి కుక్కర్లో రెండింతలు నీళ్లు పోసి, చెంచాడు నెయ్యి వేసి మరీ మెత్తగా కాకుండా ఉడికించాలి. ఇందులో పాలు, తురిమిన బెల్లం వేసి ఉడికించాలి. అడుగంట కుండా కలుపుతూ ఉండాలి. నెయ్యి, యాల కుల పొడి వేసి కలిపి దింపేయాలి. సన్నటి జీడిపప్పు, బాదాం ముక్కలు చల్లి నైవేద్యం సమర్పించాలి. తెలంగాణా ప్రాంతంలో వినాయక చవితికి ఈ తాలికల పాయసం, తుమ్మికూర పచ్చడి, పులిహోర, ఉండ్రాళ్లు తప్పనిసరిగా ఉండాల్సిందే.
ఉండ్రాళ్ళు
కావలసిన పదార్థాలు...
బియ్యం పిండి లేదా
బియ్యం రవ్వ : రెండు కప్పులు
బెల్లం : ఒక కప్పు
పచ్చి శెనగపప్పు : రెండు టీస్పూన్లు
నీరు : ఒక కప్పు
తయారీ విధానం...
తగినన్ని నీళ్లు మరిగించి అందులో బెల్లం వేసి కరిగిన తరువాత... శనగపిండి, బి య్యం పిండి లేదా రవ్వ వేసి దగ్గర పడేదాకా కలుపుతూ ఉండాలి. ఈ మిశ్ర మం కాస్తంత గట్టిపడిన తరువాత పెద్ద నిమ్మకాయంత సైజులో పిండిని తీసుకుని ఉండలు చేసుకోవాలి. అంతే... బొజ్జ గణపయ్యకు ప్రీతిపాత్రమైన తియ్యని, కమ్మనైన ఉండ్రాళ్లు సిద్ధమైనట్లే...!
పూర్ణం బూరెలు
కావలసిన పదార్థాలు...
శెనగపప్పు : 2 కప్పులు
బెల్లం : 2 కప్పులు
యాలకుల పొడి : 1/2 టీస్ఫూన్
మినప్పప్పు : 1 కప్పు
బియ్యం : 2 కప్పులు
నెయ్యి : 1/2 కప్పు
నూనె : వేయించడానికి
తయారీ విధానం...
మినప్పప్పు, బియ్యం కడిగి సరిపడా నీళ్లు పోసి కనీసం నాలుగైదు గంటలు నానబెట్టాలి. తరువాత మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. శెనగపప్పు కుక్కర్‌లో తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. ఇందులో తరిగిన బెల్లం వేసి కలిపి మళ్లీ ఉడికించాలి. ఈ మిశ్రమంలో తడి పూర్తిగా పోయేవరకు ఉడికించాలి. లేకుంటే వేయించేటప్పుడు విడిపోయి నూనెలో కలిసిపోతుంది. చివరలో యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి దింపేయాలి. చల్లారిన తర్వాత నిమ్మకాయంత ఉండలు చేసుకోవాలి. బాణలిలో నూనె వేడి చేయాలి. ఒక్కో ఉండను మినప్పప్పు, బియ్యం మిశ్రమంలో పూర్తిగా ముంచి నూనెలో వేయాలి. ఇలాగే మరికొన్ని చేసుకొని బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇవి రెండు మూడు రోజులు నిలువ ఉంటాయి.
తీపి కుడుములు
కావలసిన పదార్థాలు...
గోధుమ రవ్వ : అర కేజీ
బియ్యం పిండి : కప్పు
పొట్టు పెసరపప్పు : పావు కేజీ
బెల్లం తురుము : అర కేజీ
పచ్చిపాలు : పావు కేజీ
కొబ్బరికాయ : ఒకటి
నెయ్యి : వంద గ్రాములు
యాలకుల పొడి : ఒక టీస్ఫూన్
మంచినీళ్లు : తగినన్ని
తయారీ విధానం...
పెసరపప్పుని పొడి చేసి ఉంచాలి, కొబ్బరి తురమాలి. గోధుమరవ్వలో పెసరపప్పు పొడి, బియ్యం పిండి, బెల్లం తురుము, పాలు, కొబ్బరి తురుము, నెయ్యి, యాలకులపొడి వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లుకుని గట్టి ముద్దలాగా చేయాలి. దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి, ఒక్కో ముద్దను అరచేతిలో పెట్టి నాలుగువేళ్లతో కోలగా ఒత్తాలి. ఇప్పుడు వీటిని కుక్కర్‌లో 20 నిమిషాలపాటు ఆవిరిమీద ఉడికించి తీయాలి. చిన్నారులు ఇష్టంగా తినే తీపి కుడుములు రెఢీ!
స్వీట్ వెజిటబుల్ బాత్
Updated: September 11, 2011
కావలసిన పదార్థాలు...
కాలీఫ్లవర్ - 1 (చిన్నది)
బీన్స్ - 50 గ్రాములు
కాప్సికమ్ - 1
ఉల్లిపాయ - 2 ముక్కలు (చక్రాల్లా కట్ చేయాలి)
పైనాపిల్ - 5 ముక్కలు
కార్న్ ఫ్లోర్ - 3 టీ స్పూన్లు
ఆయిల్ - 50 గ్రా
ఉప్పు - రుచికి సరిపడా
క్యారెట్ - 2 (చిన్నవి)
టొమాటో కెచప్ - 2 టీ స్పూన్లు
చిల్లీ సాస్ - 2 టీ స్పూన్లు
చింత పండు రసం - ఒక టీ స్పూన్
ఆరెంజ్ జ్యూస్ - 2 టీ స్పూన్లు
తయారు చేసే విధానం...
కాలీఫ్లవర్‌ను కొద్దిగా... కాడతో కట్ చేసు కోవాలి. వాటిని ఉప్పు నీటిలో కాని వేడి నీటి లో కాని వేసుకుని ఒక పావు గంట ఉంచాలి. తర్వాత వాటిని బయటకు తీసి తడిపోయే వరకు ఆరబెట్టాలి. క్యారెట్‌ను చిన్న చిన్న ము క్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలను రౌండ్‌గా కట్ చేసుకోవాలి. కాప్సికమ్‌ను కూడా చిన్నవిగా, పొడువుగా కట్ చేసుకోవా లి. కార్న్‌ఫ్లోర్ మూడు టీస్పూన్లు కొంచెం వేడి నీటిలో కలుపుకుని పేస్టులా తయారుచేసు కోవాలి. స్వీట్ పేస్ట్ కొంచెం చేయాలి. స్టౌ మీద పాన్ వుంచి అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయాలి. వేడి అయిన తరువాత కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసి అందులో ఈ స్వీట్ పేస్ట్‌ని వేసి కలుపుకోవాలి.
కొంచెం ఉప్పు వేసుకోవాలి. అన్నింటిని సన్నని సెగ మీద వేగనివ్వాలి. పావు గంట తర్వాత దించుకుని చల్లారనివ్వాలి. అది ఈ మగ్గిన కూరగాయలలో, కార్న్ ఫ్లోర్ పేస్ట్ వేసి కలపాలి. మళ్లీ అన్నిటిని కలిపి ఒక గిన్నెలో వేసుకుని 2 లేదా 3 నిమిషాలు స్టౌ మీద మూతపెట్టి వుడకనివ్వాలి. ఉడికిన తర్వాత దించుకుని పైన చెప్పిన పేస్ట్ వేయాలి. రెండు స్పూన్ల టొమాటో కెచెప్, చిల్లీసాస్, ఆరెంజ్ జ్యూస్, పైనాపిల్ జ్యూస్, చింత పండు రసం వీటన్నిటినీ ఒక గిన్నెలో వేసుకుని బాగా కలుపుకోవాలి. కూరలు ఉడికిన తర్వాత దించుకుని అందులో కలుపున్న జ్యూస్ మిశ్రమాన్ని కొంత పక్కకు పెట్టుకుని మిగిలినది వేసి మళ్లీ రెండు నిమిషాలు స్టౌ మీద ఉంచాలి. దాన్ని దించుకుని ఆ మొత్తాన్ని ఒక వెడల్పాటి డిష్‌లోకి వంచుకుని పైన మిగిలిన జ్యూస్‌ని కూడా ఇందులో వేసుకుని కలుపుకోవాలి. ఇది తియ్యగా, కారంగా, పుల్లగా ఎంతో టేస్ట్‌గా వుంటుంది.
అరటి కబాబ్
కావలసిన పదార్థాలు...
పచ్చి అరటికాయలు - నాలుగు
ఉప్పు - తగినంత
గరం మసాలాపొడి - అరటీస్పూన్
జీలకర్ర - ఒక టీస్పూను
అల్లం ముద్ద - కొద్దిగా
పచ్చిమిరపకాయల పేస్ట్ - అర టీస్పూను
నెయ్యి - నాలుగు స్పూన్లు
కొత్తిమీర - ఒక స్పూను
కారం - ఒక స్పూను
స్టఫింగ్ కోసం...
ఎండు అత్తిపండ్ల ముక్కలు - 180 గ్రాములు
అల్లం - 20 గ్రాములు
పచ్చిమిరపకాయలు - 15 గ్రాములు
ఉల్లిపాయ ముక్కలు - కొద్దిగా
కొత్తిమీర - కొద్దిగా
కుంకుమ పువ్వు - కొద్దిగా
తయారు చేసే విధానం...
పచ్చి అరటి కాయల్ని ఉడికించి తోలు తీసివేయాలి. చల్లారేదాకా పక్కన వుంచుకోవాలి. చల్లారిన తరువాత అరటికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. స్టఫింగ్ పదార్థాలన్నిటినీ సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన అరటికాయ ముక్కలకు సన్నగా తరగిన స్టఫింగ్ ముక్కలను కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని అరచేతిలో చిన్న ఉండలుగా తీసుకుని వాటిని గుండ్రంగా నొక్కుకుని, పెనం మీద నెయ్యివేసి రెండువైపులా బాగా కాల్చాలి. అంతే వేడి వేడి అరటికాయ కబాబ్స్ రెడీ చిన్న పిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. టమాట సాస్‌తో తింటే ఇంకా ఎంతో రుచితో వుంటాయి.
బేబీకార్న్ మంచూరియా
కావలసిన పదార్థాలు...
బేబీకార్న్ - ఐదు
మొక్కజొన్న పిండి - అర కప్పు
బియ్యం పిండి - పావు కప్పు
కారం - కొద్దిగా
అల్లంవెల్లుల్లి ముద్ద - చెంచా
ఉప్పు - తగినంత
నూనె - వేయించడానికి సరిపడినంత
ఉల్లిపొరక - కట్ట (సన్నగా తరగాలి)
ఉల్లిపాయ - ఒకటి (సన్నగా తరగాలి)
వెల్లుల్లి పలుకులు, సోయా టొమాటో సాస్ - ఒక్కొక్కటి చెంచా చొప్పున తీసుకోవాలి
తయారు చేసే విధానం...
బేబీకార్న్‌ను ఒకే సైజులో తరిగి, ఉప్పు నీటిలో ఉడికించాలి. ఇప్పుడు మొక్కజొన్న, బియ్యం పిండి, కారం, అల్లం వెల్లుల్లి ము ద్ద, కొద్దిగా ఉప్పు వేసి మరో పాత్రలో బజ్జీలపిండిలా కలపాలి. ఇందులో ఉడికించిన బేబీకార్న్‌ను ముంచి బజ్జీల మాదిరి వేయిం చాలి. బాణలిలో కాస్త నూనె వేడిచేసి అందులో వెల్లుల్లి పలుకు లు, ఉల్లిపాయ, ఉల్లిపొరక ముక్కలు ఎర్రగా వేగనివ్వాలి. ఇందు లో వేయించి పెట్టుకున్న బేబీకార్న్ ముక్కల్లి ఒక్కోటి చొప్పున ఉంచాలి. పైన సోయా, చిల్లీసాస్, టొమాటో సాస్, ఇంకాస్త ఉప్పు చల్లితే వేడి వేడి బేబీకార్న్ మంచూరియా రెడీ...
పుదీనా పలావు
కావలసిన పదార్థాలు...
పుదీనా - 2 కట్టలు
బాస్మతి బియ్యం - 2 కప్పులు
తాజా కొబ్బరి తురుము - పావుకప్పు
పచ్చిమిర్చి - 3
ఉల్లిపాయ - ఒకటి ( సన్నగా తరగాలి)
అల్లం వెల్లుల్లి - 1 టీస్పూన్
లవంగాలు - 4
యాలకులు - 4
దాల్చిన చెక్క - 4
పలావు ఆకులు - 4
అనాసపువ్వు - ఒకటి
వేయించిన జీడిపప్పు - పావుకప్పు
నెయ్యి - 2 టీస్పూన్లు
ఉప్పు - సరిపడినంత
తయారు చేసే విధానం...
పుదీనా ఆకులన్నీ తుంచి బాగా కడగాలి. మిక్సీలో పుదీనా ఆకులు, కొబ్బరి, పచ్చిమిర్చి, అరటీస్పూను ఉప్పు వేసి మెత్తగా రుబ్బాలి. రెండు కప్పుల బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి నాలుగు కప్పుల నీళ్ళు పోసి నానబెట్టాలి. స్టవ్ మీద మందపాటి గిన్నె లేదా కుక్కర్ పెట్టి నెయ్యి వేసి కాగాక మసాలా దినుసులన్నీ వేయాలి. తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అవి వేగాక పుదీనా ముద్ద వేయాలి. ముదురాకుపచ్చ నుంచి లేతాకుపచ్చ రంగులోకి మారే వరకూ దీన్ని వేయించాలి. తర్వాత బియ్యం వేసి గరిటెతో బాగా కలపాలి. కుక్కరయితే వెయిట్ పెట్టకుండానూ, గిన్నె అయితే మూతపెట్టి అన్నం పొడిపొడిగా ఉడికించాలి. అన్నం ఉడికింది అనుకున్న తరువాత వేయించిన జీడిపప్పు వేసి తిప్పి వేడి వేడిగా వడ్డించాలి.
రంగీలా పూరీ
కావలసిన పదార్థాలు...
గోధుమ పిండి - 500 గ్రాములు
పసుపు - కొద్దిగా
ఆయిల్ - ఫ్రై చేసేందుకు సరిపడినంత
ఉప్పు - రుచికి తగినంత
టొమాటో జ్యూస్ - 100 గ్రాములు
పాలకూర గుజ్జు - 4 టేబుల్ స్పూన్లు
నెయ్యి - వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం...
గోధుమ పిండి జల్లించి మూడు ముద్దలుగా చేయాలి. ఒక్కో భాగంలో ఒక్కో రంగు వచ్చేలా... టొమాటో జ్యూస్, పసుపు, పాలకూర గుజ్జు కలపాలి. తరువాత ఒక్కో ముద్దకు తగినన్ని నీళ్లు కలిపి పూరీ పిండిలా చేయండి. పసుపు ముద్దను పొడవుగా, చూపుడు వేలు మందంలో తాడులా చేయండి. తరువాత పాలకూర కలిపిన పిండిని, దానికన్నా కొంచెం పెద్దగా చేసి, అట్టకర్రతో వత్తి పసుపు రంగు ఉన్న పిండి చుట్టూ పూర్తిగా చుట్టండి. వీటిపైన టోమాటో జ్యూస్ కలిపిన పిండిని పై రీతిలోనే చుట్టాలి. ఇలా చేసేటప్పుడు పూరీ పిండి మధ్యలో పసుపు రంగు వచ్చేలా చూసుకోవాలి. దీన్ని ముక్కలుగా చేసి పూరీల్లో వత్తి, నూనెలో పొంగేలా వేయించాలి. రంగు రంగు రంగీలా పూరీ సిద్ధం.
చైనీస్ సూప్
కావలసిన పదార్థాలు...
వెచ్చగా గొంతు దిగే సూప్ హాయిగా ఉండడంతో పాటు ఆరోగ్యాన్నీ ఇస్తుంది.
వెజిటబుల్ స్టాక్ - 4 కప్పులు
పుట్టగొడుగులు - 1/2 కప్పు
బేబీకార్న్ ముక్కలు - 1 కప్పు
ఉప్పు- తగినంత
నూనె - 1 స్పూన్
సోయాసాస్ - 2 చెంచాలు
వెనిగర్ - 2 చెంచాలు
తయారు చేసే విధానం...
ముందుగా దళసరి గిన్నెలో వెజిటబుల్ స్టాక్‌లో పుట్టగొడుగులు, బేబీకార్న్, క్యారెట్ ముక్కలు వేసి కాసేపు మరగబెట్టాలి. తరువాత ఉప్పు వేసి కలపాలి. చివరగా సోయాసాస్, వెనిగర్ కలిపి సర్వ్ చేయాలి. ఇది వెరైటీగా ఉంటుంది.
శనగపప్పు కేసరి
ఇది పోషకాల మయం. చేయడం ఎంతో సులువు. హల్వా రుచితో ఎంతో బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు.
కావలసిన పదార్థాలు...
పచ్చి శనగపప్పు - రెండు కప్పులు
పంచదార - రెండు కప్పులు
పాలు - లీటరు
నూనె - కొద్దిగా
నెయ్యి - టేబుల్ స్పూన్
జీడిపప్పు, పలుకులు, ఎండుద్రాక్ష - కొద్దిగా
తయారు చేసే విధానం...
శనగపప్పును మరీ మెత్తగా కాకుండా పలుకుగా ఉండేలా ఉడికించాలి. చల్లారాక మిక్సీలో వేయాలి. బాణలీలో నూనె వేడి చేసి, ముందుగా సిద్ధం చేసుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేయించాలి. ఇప్పుడు పాలను సగం అయ్యే దాకా బాగా మరిగించాలి. ఆ తరువాత శనగపప్పు మిశ్రమం, పంచదార, జీడిపప్పు, ఎండుద్రాక్ష పలుకులు ఒక్కొక్కటిగా వేస్తూ బాగా కలపాలి. సన్నటి మంటపై ఉంచి ఐదు నిమిషాలయ్యాక తీసేస్తే సరిపోతుంది.కొంచెం ఘాటుగా ఉండాలని కోరుకుంటే ముద్ద కర్పూరం చాలా కొద్దిగా చల్లుకోవచ్చు.
అలూ బహార్
కావలసిన వస్తువులు:
250 గ్రాములు చిన్న పుట్ట గొడుగులు, 250 గ్రా. ఉడకబెట్టి తొక్కతీసిన బంగళా దుంపలు 150 గ్రా. చిన్న ఉల్లిపాయలు, 1 పెద్ద చెంచా అల్లంవెల్లుల్లి ముద్ద, 2 పెద్ద చెంచలానూనె, 2 కప్పుల టమాట గుజ్జు, ఈ చిన్న చెమ్చా జీలకర్ర, ధనియాలు గరం మసాలపొడి, 2 చిన్న చెమ్చాల పుదీనా పేస్ట్, తగినంత ఉప్పు, కారప్పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర.
తయారు చేసే విధానం:
బాణలిలో నూనె పోసి వేడిచేయాలి. ముందుగా ఒక నిమిషం వెల్లుల్లి, అల్లం ముద్దను నూనెలో వేసి వేయించాలి. ఇందులో టమాట గుజ్జు, మసాల వేయాలి. దీనిని 4-5 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. తరువాత ఈ గ్రేవిలో పుట్టగొడుగులు, బంగాళా దుంపలు, ఉల్లిపాయలు వేసి 5ని ఉంచాలి. దీనిపైన తరిగి ఉంచుకున్న కొత్తిమీర చల్లాలి.
ఎగ్జోటిక్ వెజిటెబుల్ సలాడ్
కావలసిన వస్తువులు:
250గ్రా. ఉడికించిన కూరగాయలు, (గాజర్, బీన్స్,బేబీ కార్న్), 1/2 కప్పు సన్నగా తరిగిన కాలీఫ్లవర్, పచ్చిమిర్చి, మిర్చిపొడి రెండు చెంచాలు, ఒక కప్పు తాజాగా మొలకెత్తిన పప్పు ధాన్యాలు.
తయారు చేసే విధానం:
ఒక పెద్ద చెంచాడు నూనెను మూకుడులో వేయండి. ఇందులో చిన్న చెంచా ఎండు మిరపకాయల పొడిని వేయండి. ఇందులో ఒక పెద్ద చెంచాడు వెల్లుల్లి, అల్లం పేస్ట్ వేసి, ఒక నిమిషం వేయించాలి. ఇప్పుడు ఇందులో ఒక చెంచా (బ్రౌన్ పంచదార వేఇస 1/2 కప్పు కొబ్బరి పాలు వేయాలి. ఇందులో కూరగాయలు ముక్కలన్నీంంటినీ వేయాలి. వడ్డించే ముందు సలాడ్‌లో 2 పెద్ద చెంచాలు వేయించిన వేరు శనగపప్పును, మొలకెత్తిన పప్పు ధాన్యాలను వేసి నిమ్మరసం కలపాలి.
మిక్సిడ్ వెజిటేబుల్ శోర్జా
కావలసిన వస్తువులు:
100 గ్రా. ఉడికిన అన్నం, 100గ్రా.గాజర్, 100గ్రా. సిమ్లా మిర్చి, 100గ్రా. పన్నీర్, 100గ్రా. పుట్టగొడుగులు, 20గ్రా. కార్న్‌ఫ్లోర్, 2 పెద్ద చెంచాలు, సన్నగా తరిగిన కాలిఫ్లవర్ ముక్కలు, తగినంత నూనె, తగినంత ఉప్పు, మిర్చిపొడి, 1/2 పెద్ద చెంచా పంచదార, 1 పెద్ద చెంచా తరిగిన కొత్తిమీర,
తయారుచేసే విధానం:
ఉడికిన అన్నాన్ని నూనెలో బాగా వేయిం చాలి. కూరలన్నింటినీ సన్నగా తరుగు కో వాలి. ఒక బాణలిలో 50గ్రా. నూనె వేసి వేడి చేయాలి.ఇందులో సన్నగా తరిగిన కూరమొక్కలు వేయాలి. దీనిలో బాటు పన్నీర్, పుట్టగొడుగులు కూడా వేయాలి. అన్నింటినీ కలిపి 3 ని వేయించాలి. ఇం దులో ఉప్పు, మిర్చిపొడి, పంచదార వేసి 2 ని ఉడనివ్వాలి. తరువాత కార్న్‌ఫ్లోర్ వేసి సూప్ చల్లబడేలా చూడాలి. వడ్డించే ముందు నూనెలో వేయించిన అన్నాన్ని సూప్‌లో వేసి దీనిపై తరిగిపెట్టుకున్న కొత్తిమీర చల్లాలి.
చిక్కుడు గింజలతో బియ్యపు రొట్టె
కావలసిన వస్తువులు:
ఒక కప్పు బియ్యం పిండి, చిక్కుడు కాయగింజలు ఉడికినవి ఒక కప్పు, కొత్తిమీర, కారం, ఉప్పు.
తయారు చేసే విధానం:
ముందుగా ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని దా నిలో బియ్యం పిండి వేసుకొని దానిలో ఉడికిం చిన చిక్కుడు గింజలు, కారం, ఉప్పు, కొత్తిమీర వేసుకొని ఉడికించిన నీళ్ళలో కలుపు కోవాలి.
స్టౌవ్ పై పెనం ఉంచి అది బాగా కాగిన తర్వాత కొంచెం నూనెపోసి పిండిని కొంచెం తీసుకొని పెనం పైన వెడల్పుగా ఒత్తుకోవాలి. తర్వాత పైన కొంచెం నూనె పోసి మూత పెట్టి 8-10 నిలు మీడియం మంటలో కాల్చాలి. తరువాత ఆ రొట్టెను ఇంకొక వైపు తిప్పి కొంచెం నూనె పోసి మూతపెట్టి రెండు నిమిషాలు కాల్చాలి. ఇక చిక్కుడు బియ్యం రొట్టె రెడి. దీనిని చెట్నిలో గాని వెన్నపూసలో గాని వేడి వేడిగా తినొచ్చు.
మసాలా రోటి
కావలసిన వస్తువులు:
250 గ్రా. గోధుమ పిండి, తగినంత ఉప్పు, 4 సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక చిన్న చెంచాడు దానిమ్మ గింజలపొడి.
తయారు చేసే విధానం:
పిండిలో ఉప్పు, నెయ్యి వేసి బాగా కలపాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరప కాయలు, కొత్తిమీర, దానిమ్మ గింజల పొడి వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి ఒత్తుకొని పరాటాలు తయారు చేసుకోవాలి.
‘ఓట్స్’ తో కొన్ని వంటలు
ఓట్స్ వాడకం ఇటీవలి కాలంలో అధికమైపోయింది. ఓట్స్‌ను ఒకప్పుడు బరువు తగ్గాలనే ప్రయత్నాలు చేసే వారే ఎక్కువగా ఉపయోగించినప్పటికీ, ఇప్పుడు ఇదో సాధారణ దినుసుగా మారిపోయింది. బరువుతో నిమిత్తం లేకుండా ప్రతీ ఒక్కరూ ఓట్స్‌తో చేసిన వంటకాలను ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓట్స్‌తో తయారు చేసుకునే వంటకాలివి...మీరూ ప్రయత్నించి చూడండి.
ఆవిల్ ఖీర్ కావలసిన వస్తువులు:
ఓట్స్ - 250గ్రాములు,
చక్కెర -2 టేబుల్‌స్పూన్స్
ఆవిల్ -1
తేనె 50గ్రాములు- కాజు-బాదంపలుకులు 25 గ్రాములు, పాలు - 1/2 లీటరు నెయ్యి 1టేబుల్ స్పూన్ ఇలాయిచి పొడి - చిటికెడు
తయారు చేసే విధానం:
ముందుగా ఓట్స్ నెయ్యివేసి వేయించి ఫ్రై చేసి, మిక్సిలో వేసి పొడిచేసుకోవాలి. స్టవ్ మీద పాత్ర పెట్టి పాలు బాగా మరగ నివ్వాలి. అందులో ఈ ఓట్స్ మిశ్రమం వేసి తిప్పుతూ ఆవిల్ కడిగి ముక్కలు చేసుకుని అందు లో కలపాలి. ఇవి కూడ బాగ కలియ తిప్పుతూ చక్కెర, తేనే వేసి చివర్న బాదామ్ - జీడి పలుకులు వేసి దించాలి.ఇలాయిచిపొడి వేసి కలియ తివ్పి కొద్దిగా చల్లారాక సర్వ్ చేసుకోవాలి. వెరైటీగా రుచిగా ఉంటుందీ ఖీర్. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు.
శెనగపప్పు లడ్డు కావలసిన వస్తువులు:
ఓట్స్ - 250 గ్రాములు,
శెనగపపప్పు- 250 గ్రాములు,
నెయ్యి- 25 గ్రాములు,
ఇలాచిపొడి - 1/2 టీస్పూన్
చక్కెర - 2 చిన్న కప్పులు,
కొబ్బరికోరు - 50 గ్రాములు.
తయారు చేసే విధానం:
ముందుగా ఓట్స్ కొద్దిగా నెయ్యి చిలకరించి వేయించుకోవాలి. మిక్సీ డ్రై జార్ తీసుకొని ముందుగా ఈ ఓట్స్ కాస్త గరకగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత శెనగపప్పు పొడి చేసుకోవాలి. చక్కెరలో ఇలాయిచి కలివి పొడి చేసుకోవాలి. పెద్ద బౌల్ తీసు కొని అందులో ఈ మిశ్రమం అంతా వేసి బాగా కలియ తివ్పి అందులో కరి గించిన నెయ్యి వేసి, బాగ కలివి లడ్డు కావాల్సిన సైజులో చుటువకుని ఒక ీస్టీల్ బాక్స్‌లో భద్రపరుచుచుకుంటే ఒక వారం, పదిరోజులు నిల్వ ఉంటుంది. ఇందులో జీడిపప్పు సన్న ముక్కలు చేసి కలపు కుంటే అదనపు రుచి వస్తుంది.
రాగి పిండి బిస్కెట్స్ కావలసిన వస్తువులు:
ఓట్స్- 100గ్రాములు,
రాగివిండి- 50గ్రాములు,
వాము - కొద్దిగా,
చక్కెర - 2 టేబుల్ స్పన్,
ఉప్పు - 1/2 టీస్పూన్
వెన్న - 1 టీస్పూన్
తయారుచేసే విధానం:
ఓట్స్ కాస్త్త వెన్న వేసి వేయించి పొడి చేసుకుని, అందులో రాగి విండి వాము, ఉప్పు, చక్కెర వేసి కాస్తనీరు చిలకరించి విండి కలివి చపాతి లాగా రుద్ది షేప్‌లో కట్ చేసుకుని ఓవెన్లో 15ని పాటు 45 డిగ్రీల వద్ద బేక్ చేసుకుంటే మంచి కరకరలాడే టేీస్టీ ఓట్స్ - రాగివిండి బిస్కెట్స్ తరవుతాయి. ఇవి చాల రుచిగా ఉంటాయి. ఓవెన్ లేనివారు కుక్కర్‌లో ఇసుక వేసి అందులో ఒక ేవ్లట్ మీద బిస్కెట్స్ పెట్టి గ్యాస్‌కెట్ లేకుండ మూత పెట్టి సన్నని మంటమీద
15 నిలు వేడిచేసుకోవాలి. బిస్కెట్స్ రెడీ అవుతాయి.
కొబ్బరి హల్వా కావలసిన వస్తువులు:
ఓట్స్ - 250 గ్రాములు,
పచ్చికొబ్బరి కోరు - 100 గ్రాములు,
చక్కెర - 1 ెవద్దకవ్పు,
నెయ్యి-50గ్రాములు,
జీడిపప్పు,ద్రాక్ష - 25గ్రాములు,
సాఫ్రాన్ కలర్ - చిటికడు,
పాలు - 1 చెంచా.
తయారు చేసే విధానం:
ఓట్స్ కొద్దిగా నెయ్యి వేసి వేయించి పొడి చేసుకోవాలి, పచ్చికొబ్బరి కోరు రెడీగా పెట్టుకొని స్టవ్ వెలిగించి కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి జీడి - ద్రాక్ష వేయించి పక్కన పెట్టుకోవాలి. చక్కెర వేసి కొద్దిగా నీరు వేసి పాకం లేతగా రాగానే కొబ్బరి కోరు, ఓట్స్ పొడి వేసి తివ్పుత పాలల్లో కలివిన సాఫ్రాన్ వేసి తివ్పి నెయ్యి వేయాలి. ఒక్క ఐదునిమిషాల తర్వాత నెయ్యి తేలుతుంది. వేయించిన జీడి - ద్రాక్ష వేసి దించుకుంటే ఓట్స్- కొబ్బరి హల్వా రెడీ.
స్టఫ్‌ద్ క్యాప్సికమ్...
కావలసినవి:
క్యాప్సికమ్‌లు : 5-6
ఉడక బెట్టిన ఆలుగడ్డలు : 2
ఉడక బెట్టిన బఠానీలు: 2 చెంచాలు
ఉల్లిపాయముక్కలు: తగినంత
పసుపు : తగినంత
కారంపొడి: సరిపడినంతగా
ఆమ్‌చూర్: చెంచాలో నాలుగవ వంతు
గరమ్ మసాలా: చెంచాలో నాలుగవ వంతు
ఉప్పు: రుచికి తగినట్టుగా
వేపుడుకు నెయ్యి లేక మంచి నూనె.
తయారు చేయడం:
ముందుగా కాప్సికమ్‌ను చక్కగా డగాలి.తర్వాత వేడినీళ్ళలో వేసి ఉడికించాలి. కొంత సమయం తరువాత నీటిని పడేసి క్యాప్సికమ్‌ను చల్లారనివ్వాలి.ఉడకబెట్టిన ఆలూని గుజ్జుగా చేయాలి.పెనంపై ప్యాన్(పాత్ర) పెట్టి అందులో నెయ్యి వేసి ఇదివరకే కత్తిరించి పెట్టుకున్న ఉల్లి ముక్కలను బంగారం వర్ణంలోకి వచ్చేవరకు వేయించాలి. ఇప్పుడు కారంపొడి, గరమ్ మసాలా, ఉప్పు, పసుపు,ఆమ్‌చూర్, ఉడక బెట్టిన బఠానీలు వేసి కొంత సమయం వేయించాలి.క్యాప్సికమ్‌ని తీసుకుని వాటి పైభాగాన్ని కత్తితో జాగ్రత్తగా తొలగించాలి. అందులోని విత్తనాలను కూడా తొలగించాలి. పైన తయారు చేసిన మిశ్రమాన్ని క్యాప్సికమ్ లోపలి భాగంలో పూర్తిగా నింపాలి. ఇప్పుడు నెయ్యివేసిన ప్యాన్‌లో క్యాప్సికమ్‌ని వేయించాలి. ఆ ముక్కలను తీసి చక్కగా ప్లేట్‌లో పెట్టి, పైన పనీర్ ముక్కలతో గార్నిష్ చేసుకుని, తగిన విధంగా అలంకరించుకోవాలి.ఇప్పుడు స్టఫ్‌డ్ క్యాప్సికమ్ రెడీ.
బీట్‌రూట్ హల్వా...
కావాల్సినవి..
బీట్‌రూట్ ముక్కలు- నాలుగు కప్పులు, కొబ్బరి కోరు-ఐదు చెంచాలు, కోవా, పంచదార- కప్పు చొప్పున, బెల్లం-ఆరకప్పు, నెయ్యి-రెండు కప్పులు, బాదం పప్పుల పొడి-అరకప్పు, జీడిపప్పు-మూడు, వేరు సెనగపప్పు- పన్నెండు, చెర్రీ- ఒకటి
తయారుచేసే పద్ధతి:
నెయ్యిని వేడిచేసి బీట్‌రూట్ ముక్కల్ని వేయించాలి. ఇందులో బెల్లం, పంచదార,కొబ్బరికోరు, కోవా వేసి బాగా కలియబెట్టాలి. బాదంపప్పుల పొడిని కూడా వేయించాలి.హల్వా పూర్తిగా తయరై...గిన్నె నుంచి వేరవుతుండగా నెయ్యి రాసిన పళ్లెంలోకి మార్చుకోవాలి. కొద్దిగా చల్లారాక ముక్కలుగా కోసుకోవాలి. చెర్రీ, వేరు సెనగపప్పు, బాదంతో అలంకరిస్తే సరిపోతుంది.కమ్మని బీట్‌రూట్ హల్వా సిద్ధం.
‘మీల్ మేకర్’ తో కొన్ని వంటలు
మీల్ మేకర్ గురించిన ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తక్కువ సమయంలో వంట చేయాల్సి వచ్చినప్పుడు వంటింట్లో గృహిణిని ఆదుకునేది ఇదే. దీంతో చేసిన వంటకాలను పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. నాన్‌వెజ్‌కు దూరంగా ఉండేవారు దీన్ని మరింత ఇష్టంగా భుజిస్తారు. ఇందులో పోషక విలువలు కూడా ఎక్కువేనని పాకశాస్త్ర నిపుణులు చెబుతుంటారు. మీల్‌మేకర్‌తో కొన్ని రుచికరమైన వంటలు మీ కోసం....
ఖీమా హల్వా
కావలసిన వస్తువులు:
మీల్ మేకర్ ఖీమా : 1/2 కిలో
చక్కెర: ఒక కప్పు
క్యారెట్ లేదా బీట్‌రూట్ తురుము: ఒక కప్పు
నెయ్యి: 100 గ్రాములు
ఇలాయిచీ పొడి: చిటికెడు
జీడీపప్పు, ద్రాక్ష: 25 గ్రాములు
పాలు: 2 కప్పులు
తయారు చేసే విధానం:
ముందుగా మీల్ మేకర్‌లో కొద్దిగా ఉప్పు వేసి 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించి జార్‌లో ఖీమా బ్లేడ్ పెట్టి ఖీమాలాగా చేసిపెట్టుకోవాలి. స్టవ్ మీద బాణలి పెట్టి నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్ వేయించి పక్కనబెట్టు కోవాలి. క్యారెట్ తురుము వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో పాలు పోసి బాగా వేడి చేసి అందులో వేయించిన క్యారెట్, ఉడికించిన సోయా ఖీమా వేసి తిప్పుతూ బాగా మెత్తగా ఉడకనిచ్చి ఇలాయిచి పొడి వేసి నెయ్యి తేలేలాగా దగ్గర కానివ్వాలి. దించే ముందు వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి దించాలి. ఇది కొద్దిగా చల్లారాక సర్వ్ చేసుకోవాలి. వెరైటీగా, రుచిగా ఉంటుంది.
పులావ్
కావలసిన వస్తువులు:
మీల్‌మేకర్ : 250 గ్రాములు
బాస్మతి బియ్యం: 250 గ్రా
నెయ్యి, నూనె: 100 గ్రాములు
ఉప్పు: ఒక టేబుల్ స్పూన్
దాల్చిన చెక్క: ఒక ముక్క
అల్లం: 25 గ్రాములు
వెల్లుల్లి రెబ్బలు: ఒక గుప్పెడు
యాలకులు: 3
లవంగాలు -15
బిర్యానీ ఆకులు -2
పుదీనా- 4 రెబ్బలు
కొత్తిమీర- 4 రెబ్బలు
పచ్చిమిర్చీ-4
ఉడికించిన గ్రీన్‌పీస్ - 50 గ్రాములు
ఆలుముక్కలు - 1 చిన్న కప్పు
ఉల్లి తరుగు: ఒక చిన్న కప్పు
తయారు చేసే విధానం:
ముందుగా ఆలు ముక్కలు, గ్రీన్‌పీస్, సోయా (మీల్‌మేకర్) విడివిడిగా ఉడికించుకోవాలి. స్టవ్‌పై చిన్న కుక్కర్ పెట్టి నెయ్యి, నూనె వేసి కొద్దిగా వేడి చేయాలి. ఇలాయిచి, దాల్చిన,సగం అల్లం, సగం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. అందులోనే బిర్యానీ ఆకులు, కొత్తిమీర, పుదీనా, ఉల్లితరుగు వేసి వేయించాలి. ఆ తర్వాత మిగతా అల్లం, వెల్లు ల్లి పేస్ట్ వేసి మంచి వాసన, రం గు, రుచి వచ్చేదాకా వేయించి, గ్రీన్ పీస్, ఆలు ముక్కలు, సోయా ముక్కలు ఉడికించినవి వేసి వేయించి తగినంత నీరు (2 కప్పులు), ఉప్పు వేసి కడిగిన బియ్యం వేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. మంచి సోయా పులావ్ రెడీ. దీన్ని సోయా ఖుర్మా లేదా బఠానీ ఖూర్మా లేదా పుదీనా చట్నీతో తినవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. చాలా త్వరగా అయిపోతుంది.
దాల్చా
కావలసిన వస్తువులు:
మీల్ మేకర్ - 100 గ్రాములు
కందిపప్పు - 50 గ్రాములు
కొబ్బరి- చిన్న ముక్క
కొత్తిమీర - నాలుగు రెమ్మలు
టమాటలు - 4
చింతపండు రసం - ఒక కప్పు
ఉల్లి తరుగు - 1/2 ఉల్లిపాయ
ఉప్పు - అర టీస్పూన్
కారం- ఒక టీ స్పూన్
ధనియాల పొడి - 3 టీ స్పూన్లు
పసుపు - చిటికెడు
తయారుచేసే విధానం:
ముందుగా సోయా ఉడికించి పెట్టుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ చిన్నగా పెట్టి ఉడికించిన సోయా, ఉప్పు, పసుపు, 2 రెమ్మల కొత్తిమీర తరుగు వేసి 1 నిమిషం సన్నని సెగ మీద తిప్పాలి. ఆ తరువాత టమాట ముక్కలు వేసి మెత్తగా ఉడకనివ్వాలి. కొబ్బరి మిశ్రమం, కంది బేడల మిశ్రమం, చింతపండు రసం వేసి బాగా 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. కమ్మని సోయా మీల్‌మేకర్ దాల్చా రెడీ. ఇది అన్నం రోటీ, పూరీ ఎందులోకైనా రుచిగా ఉంటుంది. ఆయిల్ లేకుండా కూడా దీన్ని వండవచ్చు.
కజ్జికాయలు
కావలసిన వస్తువులు:
మైదా- 500గ్రా., నెయ్యి- 100గ్రా., ఉప్పు-చిటికెడు, చక్కెర-350గ్రా., కొబ్బరికాయలు-2, గసగసాలు-100గ్రా., పుట్నాల పప్పు- 150గ్రా., యాలకులు-5గ్రా., ఆయిల్-తగినంత
తయారు చేసే విధానం:
మైదావిండిని జల్లించి దీనికి ఉప్పు, నెయ్యి కలివి నీళ్ళతో పూరీల విండిలా కలపండి. ఒక బాణలిలో తురిమిన కొబ్బరికోరు వేసి సన్నని మంటమీద వేయిం చిన తర్వాత అందులో పుట్నాల పప్పుపొడి, గసాలు, చక్కెర కూడా వేసి బాగా వేయించి స్టౌ మీది నుంచి దింపి, యాలకుల పొడి కలివి పక్కన ఉంచండి. ముందుగా కలివి సిద్ధం చేసు కున్న మైదాను చిన్న, చిన్న ముద్దలుగా చేసుకొని వాటిని పూ రీల్లా వత్తి, దాని మధ్యలో బాణలి లో తయారు చేసిన కొబ్బరి తురుము, పుట్నాల పప్పు విండి మిశ్ర మాన్ని రెండు స్పూనులు వేసి పూరీని మధ్యకు మడవండి. అర్ధ చంద్రాకారంలో వస్తుంది. తర్వా త వాటి చివరలను తడి చేసి మడత మీద మడత వేసి వేళ్లతో గట్టిగా అదమండి. ఈ విధంగా చేయడం వల్ల మడత లోపలి మిశ్రమం బయటకు రాదు. ఇలా తయారయిన కజ్జికాయ లను కాగిన నూనెలో ఎర్రగా వేయించండి.
గవ్వలు కావలసిన వస్తువులు:
మైదా-500గ్రా., బొంబాయిరవ్వ-100గ్రా. నెయ్యి-120గ్రా., చక్కెర-150గ్రా., గుడ్డు-1, యాలకులు-5గ్రా, బేకింగ్ పౌడర్- చిటికెడు, రిఫైన్డ్ ఆయిల్- వేయించడానికి తగినంత.
తయారు చేసే విధానం:
కోడిగుడ్డు సొనను ఒక గిన్నెలో పోసి స్పూన్‌తో బాగా కలియతిప్పి అందులో చక్కెర కూడా వేసి పూర్తిగా కరగనివ్వాలి. అవసరమైతే ఒక కప్పు నీళ్లు కూడా చేర్చండి. అందులో యాలకుల పొడిని కూడా కలివి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు మైదాలో బేకింగ్ సొడా కలివి జల్లించి బొంబాయి రవ్వ, నెయ్యి కూడా చేర్చి చేత్తో మెత్తగా కలపండి. దీనికి కోడిగుడ్డు మిశ్రమాన్ని చేర్చి గట్టిగా పూరీల విండిలా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి ఉంచండి. గవ్వల చెక్కెపై బొటన వేలితో విండిని గట్టిగా అదుముతూ వేలును కిందికి జరపాలి. విండి చుట్టుకొని - గవ్వ తయారవుతుంది. తయా రైన గవ్వలను స్టౌమీద కాగుతు న్న ననెలో బంగారు రంగు వచ్చే వరకు వేయించండి.
బాదుషాలు కావలసిన వస్తువులు:
మైదా - 500గ్రా., సోడా-1/2 టీ స్పూను, పెరుగు- గరిటెడు
తయారు చేసే విధానం:
ముందుగా మైదాపిండి, వంట సోడాలను కలివి జల్లెడలో జల్లించి, అందులో గడ్డగా కాకుండా వేడిచేసి చల్లార్చిన నెయ్యి కలపాలి. మొత్తం విండిలో నెయ్యి అంతా కలిసేలా చూడాలి. తర్వాత అందులో పెరుగు కూడా కలివి, కొంచెం కొంచెం నీళ్లు చల్లుతూ గట్టి విండి ముద్దలా చేసి 10 నిమిషాలు నాననివ్వాలి. ఆ పిం డిని గులాబ్‌జామ్‌లంత సైజులో ముద్దలుగా చేయాలి. వాటిని రెండు అరచేతుల మధ్య గట్టిగా రుద్దుతూ, గుండ్రని ముద్దలుగా చేయడం వల్ల, గుల్లపడి బాదూ షాలా తయారు చేయడానికి వీలవుతుంది. ఇలా చేసిన విండి ముద్దల మధ్యలో రెండు పక్కలా బొటనవేలు చివ రతో నొక్కాలి. ఇపుడు సన్నని మంట మీదున్న ఒక బాణలిలో నెయ్యి పోసి, దానిలో పిండిముద్ద లను లేత బంగారురంగు వచ్చే వరకూ చేయించి, వాటిని ఒక ట్రేలో వరసగా అమర్చాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో చక్కెర వేసి, దానికి మూడు కప్పుల నీళ్లు కలిపి వేడిచేసి లేతపాకంలా తయార య్యాక దానిని అమర్చి ఉంచు కున్న బాదుషాల మీద పోస్తే పాకం అంతా ఇంకిపోతుంది.
నమక్ పారా కావలసిన వస్తువులు:
మైదా - 500గ్రా., నెయ్యి-75గ్రా.,
ఉప్పు- తగినంత,
రిఫైన్డ్ ఆయిల్-వేయించ
డానికి తగినంత
తయారు చేసే విధానం:
మైదాను జల్లించి ఉప్పు, నెయ్యి కలివి కొంచెం నీళ్లతో మెత్తగా కలపండి. ఈ పిండి ముద్దను రెండు భాగాలుగా చేసి ఒక్కో ముద్దను తీసుకొని రొట్టెల కర్ర తో పల్చగా చపా తీలా చేయం డి. చేసేట ప్పుడు రొట్టెల వీట మీద విండి చల్లాలి. చపాతీ చే యడం అయిన తర్వాత దాన్ని చాకు తో అర్ధ అంగుళం వెడ ల్పుండే రిబ్బన్‌లా నిలువుగా కోసి తిరిగి వాటిని డైమండ్స్‌లా కట్ చేయండి. ఇలా కట్ చేసిన ముక్క లను రిఫైన్డ్ ఆయిల్‌లో కరకరలా డేలా వేయించి రుచి చూడండి.
రాయలసీమ రుచులు
మన రాష్ట్రం నోరూరించే భిన్న రుచులకు కేంద్రం. రాష్ట్రంలోని రాయలసీమ, తెలంగాణా, ఆంధ్ర ప్రాంతాలు రుచికరమైన పలు రకాల వంటకాలు దేశవిదేశాల్లో ప్రసిద్ధిగాంచాయి. ఇంకా చెప్పాలంటే సై్పసీగా ఉండే రాయలసీమ రుచులు వేటికవే ఎంతో ప్రత్యేకంగా వుంటాయి. వాటిలో పల్లీల పచ్చడి, నాటుకోడి పులుసు, రాగిముద్ద, పొట్టేలు తలకూర ప్రసిద్ధమైన వంటకాలు., ఈ వంటకాలు భోజనప్రియులను ఆనంద పరుచుస్తాయి.. మైమరపిస్తాయి.. మరి వాటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా!
పొట్టేలు తలకూర కావలసిన పదార్ధాలు:
పొట్టేలు తలకాయ మాంసం : 1 కేజి
నూనె : 50 గ్రా.
ఉల్లిపాయలు : 50 గ్రా.
పచ్చిమిర్చి : 50 గ్రా.
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 50 గ్రా.
కొబ్బరిపొడి : ఒక స్పూన్
మిర్యాల పొడి : కొద్దిగా
కారంపొడి : సరిపడినంత
ఉప్పు : సరిపడినంత
ధనియాల పొడి : ఒక స్పూన్
తయారు చేసే విధానం:
ముందుగా పొట్టేలు తలకాయ మాంసంను, ఉప్పు కలిపి కుక్కర్‌లో వేసి అందులో లీటర్ నీరు పోసి స్టౌ మీద పెట్టాలి. ఆరేడు విజిల్స్ వచ్చాక కుక్కర్‌ను స్టౌ మీద నుండి దించేయాలి. కొంత మంది కుక్కర్ కాకుండా పెద్దగిన్నెలోకి మాంసంను తీసుకొని కట్టెల పొయ్యి మీద బాగా ఉడికిస్తారు. అలా ఉడికించిన కూర చాలా రుచిగా ఉంటుందని సీమగ్రామాల్లో పెద్దలు చెప్తారు. అలా ఉడికించిన మాంసాన్ని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో నూనె పోయాలి. ఆ తర్వాత నూనె వేడెక్కాక అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పొట్టేలు మెదడు (బ్రెయిన్) వేసి ఉడికించుకోవాలి. కుక్కర్‌లో ఉడికించిన మాంసంలోకి అల్లం, వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొబ్బరిపొడి, మిర్యాలపొడి, ధనియాల పొడి, కారంపొడి వేసి బాగా ఇగరనిచ్చి దించేయాలి. ఇప్పుడు పొట్టేలు తలకూర రెడీ.
రాగి ముద్ద
రాయలసీమ వంటకాల్లో రాగిముద్ద ఎంతో పేరు గాంచింది. రోజువారీగా ఒక్కపూటైనా ఈ రాగిముద్ద తినకుండా సీమ వాసులు ఉండలేరంటే అతిశయోక్తి కాదేమో. రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే ఈ రాగిముద్ద ఐటమ్ సీమవాసులకు చాలా ఇష్టం.
కావలసిన పదార్ధాలు:
బియ్యం నూకలు : 500 గ్రా.
రాగి పిండి : 400 గ్రా.
ఉప్పు : తగినంత
తయారు చేసే విధానం:
రాత్రి నూకలను నీళ్లలో వేసి నానపెట్టుకోవా లి. ఉదయం నానిన నూకలకు నీరు బాగా చేర్చి స్టౌ పై పెట్టి బాగా ఉడికించాలి. నూకలు బాగా ఉడికి జావలా అవుతాయి. తరువాత స్టౌ మీద నుండి గిన్నె దించి రాగి పిండిని బాగా కలపాలి. ఈ కలిపేటప్పుడు పిండి ముద్దలుముద్దలుగా ఉండకూడదు. మొత్తం రాగిపిండి జావలో కలిసిపోయి ముద్దగా అవతుంది. ఇపుడు రాగిముద్ద తయారైనట్లే. ఈ రాగి ముద్దను రాయల సీమవాసులు రుచికరమైన నాటుకోడి పులు సు, పొట్టేలు తలకాయమాంసం, మటన్ పులుసు, గుత్తి వంకాయ కూర, ముద్దపప్పు. పల్లీల చట్నీలతో కలిపి తింటే ఆ రుచే వేరని సీమవాసులు ఆనందంతో చెప్తారు.
నాటుకోడి పులుసు
రుచికరమైన నాటు కోడి పులుసు రాయల సీమవాసులకు ఎంతో ఇష్టం. దీనిని వేడివేడి గా తినాలని సీమ వాసులు కోరుకుంటారు.
కావలసిన పదార్ధాలు:
నాటుకోడి మాంసం - 1 కేజి
నూనె - 50 గ్రా.
ఉల్లిపాయలు - 150 గ్రా.
పచ్చిమిరపకాయలు - ఆరు
అల్లం వెల్లుల్లి ముద్ద - సుమారు 100 గ్రా.
ఉప్పు - తగినంత
పసుపు - 1 స్పూను
పెరుగు - 1 కప్పు
కొబ్బరి పొడి - 2 టీ స్పూన్లు
కారంపొడి - 1 స్పూను
ధనియాలపొడి - 1 స్పూను
కొత్తిమీర - 1 కట్ట
పెరుగు - 1 కప్పు
తయారు చేసే విధానం:
ముందుగా కోడి మాంసాన్ని కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పెద్ద గిన్నెలో నూనె వేసి, ఆ నూనెలో తరిగిన ఉల్లిపాయలు, మధ్యగా కోసిన పచ్చిమిర్చీ, అల్లం వెల్లుల్లి పేస్టు, రెండు రెబ్బలు కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి. ఈ మొత్తం ముద్దను దోరగా వేగాక ఈ మొత్తం మిశ్రమంలో కప్పు పెరుగు వేసి ఉడికించాలి. తరువాత కోడిమాంసం వేసి మాంసంలో నీరు ఇగిరిపోయేదాకా ఉడికించాలి. తరువాత సరిపడా నీరు పోసి బాగా ఉడికించాలి. ఇప్పుడు మళ్లీ కారం, ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసి కొద్దిగా ఉడికించాలి. ఇక ఘుమఘుమలాడే కోడి పులుసు రెడీ అవుతుంది. స్టౌమీద నుంచి పులుసును దించి తరిగిన కొత్తమీరను చల్లాలి. ఇక ఇప్పుడు సీమ వంటకం రుచికరమైన నాటు కోడి పులుసు సిద్ధం.
పల్లీల చట్నీ
పల్లీల చట్నీ కావలసిన పదార్ధాలు:
వేరుశనగ గుళ్లు - 2 కప్పులు
కొబ్బరి పొడి - 1 కప్పు
పుట్నాల పప్పు - 1 కప్పు (వేయించినవి)
పచ్చిమిరపకాయలు - 12
నూనె - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర, ఆవాలు - 1 టేబుల్ స్పూను
ఎండుమిర్చి - 3
పచ్చిశనగపప్పు - 1 టేబుల్‌స్పూన్
మినపపప్పు - 1 టేబుల్‌స్పూన్
వెల్లుల్లి - 3 రెబ్బలు
కరివేపాకు - 2 రెబ్బలు
చింతపండు - కొద్దిగా
ఉప్పు - సరిపడినంత
తయారు చేసే విధానం:
వేరుశనగగుళ్లు వేయించి ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టకోవాలి. ఒక గిన్నెలో కొద్దిగా నూనెవేసి అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేయించి పెట్టకోవాలి. ఈ మొత్తానికి వేయించిన శనగగుళ్లు, పుట్నాల పప్పు, కొబ్బరిపొడి, ఉప్పు, చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి దాన్లో ఎండుమిర్చి, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, దోరగా వేగాక కరివేపాకు వేయాలి. తరువాత ఆ పోపులో గ్రైండ్ చేసి ఉంచుకున్న పల్లీల చట్నీని వేయాలి. ఈ పల్లీల చట్నీని రాగిముద్దలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. రాయలసీమ వాసులు రాగిముద్దలోకి ఈ పల్లీల చట్నీని ఇష్టంగా తింటారు.
మలై కోఫ్తా కర్రీ కావలసిన పదార్ధాలు:
పెరుగు మీద మీగడ : 100 గ్రా.
క్యారెట్ : 100 గ్రా.
ఆనపకాయ : 200 గ్రా.
బంగాళాదుంపలు : 100 గ్రా.
శనగపిండి : 50 గ్రా.
పచ్చిమిరపకాయలు : 20 గ్రా.
కొత్తిమీర : రెండు కట్టలు
నిమ్మకాయ : సగం చెక్క
రిఫైన్డ్ ఆయిల్ : వేయించడానికి సరిపడా
ఉప్పు : తగినంత
గ్రేవీ కోసం...
జీడిపప్పు : 25 గ్రా.
గసగసాలు : 25 గ్రా.
కారంపొడి : ఒక టీ స్పూన్
పెరుగు : 1/2 టీ స్పూను
క్రీమ్ : 50 మి.లీ.
అల్లం వెల్లుల్లి : ఒక టీస్పూన్
ఉల్లిపాయలు : 100 గ్రా.
గరం మసాలా : చిటెకెడు
తయారు చేసే విధానం:
క్యారెట్, ఆనపకాయల చెక్కుతీసి తురిమి పెట్టుకోవాలి. ఆనపకాయ నుంచి నీళ్ళు పూర్తిగా పిండేయాలి. ఉడక బెట్టిన బంగాళాదుంపలను కూడా తురిమి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం నూనె తీసుకొని దానిలో పచ్చి మిరపకాయలు వేయించి అందులో శనగపిండి కూడా దోరగా వేయించి ఆ తర్వా త తురిమి పెట్టుకున్న క్యారెట్, ఆనపకాయల ను వేసి బాగా కలిపి స్టౌమీద నుంచి కిందకు దింపేయండి. దానిలో తురిమిన బంగాళా దుంపలు, పెరుగుమీగడ, కొత్తిమీర, నిమ్మకాయ, తగినంత చేర్చి, పిరమిడ్లలాంటి కోఫ్తాలుగా చేయండి. ఆ తర్వాత వీటిని కార్న్‌ఫ్లోర్‌లో దొర్లించి, కాగిన నూనెలో దోరగా వేయించి, ఒక డిష్‌లో అమర్చండి. వీటిమీద తయారుచేసి ఉంచుకున్న గ్రేవిని పోసి పైన కొత్తిమీర, క్రీమ్‌తో వడ్డించండి.
గ్రేవీకోసం:జీడిపప్పు, గసగసాలు మెత్తగా రుబ్బి పక్కన ఉంచుకోండి ఒక గిన్నెలో వందగ్రాముల నూనెపోసి, సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేయించి, అందులో అల్లం వెల్లుల్లి ముద్ద, కారంపొడి, వేశాక నూరిన మసాలను కలిపి నూనె తేలేవరకూ ఫ్రై చేయండి. అందులో పెరుగు, గరం మసాలా, తగినన్ని నీళ్ళు పోసి మరగనివ్వాలి.
మెంతి పులావు కావలసిన పదార్ధాలు:
బాసుమతి రైస్ - 1/2 కేజీ
మెంతికూర - 8 కట్టలు
టమాటాలు - 2
పెరుగు - 1 కప్పు
జీర - 10 గ్రా.
పచ్చిమిరపకాయలు - 4
పసుపు - 1 టీ స్పూను
నెయ్యి - 50 గ్రా.
ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం:
బియ్యాన్ని శుభ్రం చేసుకొని కడిగి ఉంచుకోవాలి. అలాగే మెంతి కూరను కూడా ఆకు కోసి కడిగి ఉంచుకోవాలి. అరకిలో బియ్యం ఉడికే గిన్నెను స్టౌమీద పెట్టి నెయ్యి వేసి వేడి అయిన తర్వాత జీర వెయ్యాలి. అది వేగిన తర్వాత మెంతి కూరను వేసి రెండు నిమిషాలు వేయించి దానికి టమాటా ముక్కలు, పెరుగు, పసుపు చేర్చాలి. ఇవి కూడా కాస్త వేగిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి అవి మరుగుతున్నప్పుడు బియ్యాన్ని పోసి కలపాలి. అప్పుడే ఉప్పును కూడా చేర్చాలి. బియ్యం 3/4 వంతు ఉడికిన తర్వాత మంటను తగ్గించి స్టౌవ్‌ను సిమ్ మీద ఉంచి పూర్తిగా ఉడకనివ్వాలి. వేడి వేడి మెంతి పులావ్ చాలా బాగుంటుంది.
రసవాంగి కూటు
కావలసిన పదార్థాలు:
వంకాయలు లేదా తెల్లగుమ్మడి ముక్కలు : 8 కప్పులు
కందిపప్పు : ఒక కప్పు
చింతపండు : 2 నిమ్మకాయలంత
పుట్నాల పప్పు : 8 టీ స్పూను
ఉప్పు : సరిపడా
ఇంగువ : కాస్తంత
పసుపు : చిటికెడు
రసంపొడి : రెండు టీ స్పూను
బెల్లం : చిన్న ముక్క
మసాలా కోసం...
ధనియాలు : 8 టీ స్పూన్లు
కొబ్బరి తురుము : 8 టీ స్పూన్లు
ఎండుమిర్చి : నాలుగు
బియ్యం : 2 టీ స్పూన్లు
తాలింపు కోసం...
ఆవాలు : 2 టీ స్పూన్లు
కరివేపాకు : 8 రెమ్మలు
నూనె : 4 టీ స్పూన్లు
తయారు చేసే విధానం:
మసాలా కోసం తీసుకున్న దినుసులన్నింటినీ వేయించి చల్లార్చి పొడి చేయాలి. కడాయిలో నూనె వేసి సెనగ పప్పు వేసి వేగాక ఆవాలు కరివేపాకు వేయాలి. తరువాత వంకాయ ము క్కలు వేయాలి. కాసేపు ముక్కలు వేగాక పసు పు, ఇంగువ, ఉప్పు, చింతపం డుగుజ్జు, రసం పొడి, వేయిం చిన శెనగపప్పు వేసి, ముక్కలు మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి. ఆపై మ సాలా పొడి చల్లి ఉడికించిన కందిపప్పు, బెల్లం తురుము కూడా వేసి అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి కాసేపు ఉడికించి దించేయాలి. అంతే రసవాంగి కూటు తయారైనట్లే..!
కాకరకాయ మసాలా
కావలసిన పదార్ధాలు:
కాకరకాయలు : ఎనిమిది
ఉల్లిపాయలు : మూడు
కారం : రెండు టీ స్పూన్లు
ధనియాలపొడి : ఒక టీ స్పూను
జీలకర్ర : ఒక టీ స్పూను
పసుపు : ఒక టీ స్పూను
ఉప్పు, నూనె : తగినంత
తయారు చేసే విధానం: పీలర్‌తో కాక రకాయలకు తొ క్కు కొద్దిగా తీసి వేయాలి. మరీ లోతుగా చెక్క కుం డా పైపైనే తీసివేయాలి. కాకరకాయ ల మధ్యలో పొడవుగా గాటు పెట్టి, లోపలి గింజలను తీయాలి. వీటికి ఉప్పు, పసుపు పట్టించి.. ఓ గంట పాటు ఊర బెట్టాలి. ఉల్లిపాయలను ముక్కలుగా కో సి.. కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కాస్తంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్ర మాన్ని కాకర కా యల మధ్యలో కూరి బాగా కాగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి తీసేయాలి. అంతే కాకరకాయ మసాలా సిద్ధమైనట్లే..!
ఎగ్ పరోటా
కావలసిన పదార్థాలు:
పరోటా : రెండు
జీరా, ఉప్పు, మిర్చిపొడి : సరిపడా
రిఫైండ్ ఆయిల్ : సరిపడా
గుడ్లు : 2
సన్నగా తరిగిన ఉల్లిపాయ
ముక్కలు : అరకప్పు
టమోటా ముక్కలు : అరకప్పు
మిరియాల పొడి : అర టీ స్పూను
ధనియాల పొడి : అర టీ స్పూను
పసుపు : పావు టీ స్పూను
కొత్తిమీర తురుము : రెండు టేబుల్ స్పూన్లు
తయారు చేసే విధానం:
ముందుగా కడాయిలో నూనె వేడి చేసి జీరా, ఉల్లిపాయ, టమోటా ముక్కలు వేసి దోరగా వేగ నివ్వాలి. తర్వాత రెండు పరోటాల ముక్కలను వేసి వేయించాలి. మిర్చిపొడి, ఉప్పు, పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి వరుసగా వే సి సన్నని సెగపై ఉడికించాలి. గుడ్ల సొనను చిలి కి కడాయిలో పోసి కలపాలి. గుడ్లు పూర్తిగా ఉడకనిచ్చి పైన కొత్తిమీర తురుము చల్లి వేడి వేడిగా సర్వ్ చేయొచ్చు. ఎగ్ పరోటాకు చి ల్లీ సాస్ లేదా టమోటా సాస్‌ను సైడ్ డిష్‌గా సర్వ్ చేసుకోవచ్చు.
కుర్ కుర్ ఆలూ
కావలసిన పదార్థాలు:
బియ్యం పిండి : 250గ్రా
బంగాళా దుంపలు : 125 గ్రా
వనస్పతి : 25 గ్రా
తెల్లనువ్వులు : ఒక టీ స్పూను
కారం : ఒక టీస్పూను
ఉప్పు : ఒక టీ స్పూను
నూనె : తగినంత
తయారు చేసే విధానం:
బంగాళాదుంపలను మెత్తగా ఉడికించి, తోలుతీసి మెత్తగా మెదిపి ఉంచాలి. ఒక లో తైన పళ్లెంలో నూనె తప్ప పైన చెప్పుకున్న ఇతర పదా ర్థాలన్నింటినీ, బంగాళాదుంప గుజ్జునీ కలిపి తగినంత నీరు పోస్తూ గట్టిగా ముద్దలా కలుపుకోవాలి. జంతికల గొ ట్టంలో రిబ్బన్ ఆకారంలో ఉండే ప్లేట్ను అమర్చి ఈ మిశ్ర మాన్ని నింపాలి. నూనె బాగా కాగుతుండగా జంతికల గొట్టాన్ని అదుముతూ పిండిని నూనెలో వదలాలి. అలా వేసిన మురుకులు దోరగా వేగిన తరువాత న్యూస్ పేపర్‌పై వేయాలి. అంతే కుర్ కుర్ ఆలూ తయారైనట్లే..! బాగా ఆరిన తరువాత గాలిదూరని డబ్బాలో భద్రపరచినట్లయితే, 15 రోజులదాకా నిల్వ ఉంటాయి.
రష్యన్ సలాడ్
కావలసిన పదార్థాలు...
పచ్చి బఠాణీలు : ఒక కప్పు
బీన్స్, క్యారెట్ ముక్కలు : చెరో కప్పు బొప్పాయి, చెర్రీ,
ఫైనాఫిల్ ముక్కలు : అన్నీ కలిపి 2 కప్పులు
పాలు : ఒక కప్పు
మైదా, వెన్న. : అర టీస్పూన్ చొప్పున
మిరియాల పొడి : ఒక టీస్పూన్
ఉప్పు : అర టీస్పూన్
తయారీ విధానం...
ముందుగా పచ్చిబఠాణీ, బీన్స్, క్యారెట్ ముక్కలను ఉడికించి పెట్టుకోవాలి. పాలల్లో వెన్న, మైదాపిండి కలిపి సన్నటి మంటపై వేడి చేయాలి. ఈ పదార్థం ఉడు కు తుండగా గట్టిపడి క్రీంలాగా తయారవుతుంది. ఇ ప్పుడు దాంట్లో ఉడికించి ఉంచుకున్న కూరగాయ ముక్కలను, పండ్ల ముక్కలను వేసి బాగా కలియ బెట్టాలి. పైన మిరి యాలపొడి, ఉప్ప చల్లి తే పోషకాల రష్యన్ సలాడ్ తయారైనట్లే..! ఈ పదార్థం పూర్తిగా పండ్లు, కూరగాయలు, పాలతో తయారైనది కాబట్టి పోషకాలు మెండుగా లభిస్తాయి.
స్వస్‌రోల్ కేక్
కావలసిన పదార్థాలు...
మైదాపిండి : 80 గ్రా
కోడిగుడ్లు : మూడు
బేకింగ్ పౌడర్: పావు చెంచా
వేడినీరు : ఒక
వెనిల్లా ఎసెన్స్: కాసిన్ని చుక్కలు
చక్కెర : 85 గ్రా
జామ్ : 55 గ్రా
తయారీ విధానం...
మైదాపిండిని, బేకింగ్ పౌడర్‌ను జల్లెడలో జల్లించుకుని, రెండింటిని కలిపి వేడి నీరు పోసి ముద్దలా చేసుకోవాలి. కోడిగుడ్డు సొనను తీసుకుని బాగా కలియ బెట్టాలి. ఇందులో పంచదార వేసి బాగా కరిగేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో పోసి నీరు మరుగు తున్న పాత్రలో ఉంచాలి, ఆవిరి వల్ల కోడిగు డ్డు సొన వేడెక్కి, సొనంతా చిక్కగా అయి గట్టి పడినట్లవు తుంది. దీనిని చెంచాతో కలిపి క్రీమ్‌లా చేయాలి.
ఈ క్రీమ్‌కు మైదా, బేకింగ్ పౌడర్ మిశ్రమా న్ని కూడా జత చేసి, కాస్త ఎసెన్స్ కలపాలి.
స్వస్‌రోల్ డబ్బా తీసు కుని దాని లోపలి గోడ లకు నెయ్యి గానీ, నూనె గానీ రాయాలి. దాంట్లో పైన కలిపి ఉంచుకున్న పదార్ధం అంతటిని పోయాలి.ఈ డబ్బాను ఓవెన్‌లో ఉంచి 200 సెంటీగ్రేడ్ వద్ద 15 నిమిషాలు ఉంచాలి.ఒక పేపర్ తీసుకుని పంచదార పోసి, దా నిపైన ఓవెన్‌లో ఉడికించిన పదార్థాన్ని వేడి చల్లారకుండా వేయాలి. పదార్ధం వేడిగా ఉన్న ప్పుడే స్పూన్ సాయంతో కేక్ మీద జామ్ రాయాలి. ఈ కే్ పై ఐసింగ్ షుగర్, కోకో మొ దలైన వాటితో అలం రించి సర్వ్ చేస్తే సరి..!
జాక్‌ఫ్రూట్ మసాలా బాల్స్
కావలసిన పదార్థాలు...
ఉడికించి నలిపించు కున్న పనస (జాక్‌ఫ్రూ ట్) ముక్కలు : అర కప్పు
ఉడికించి నలిపి ఉంచిన బంగాళాదుంప ముక్కలు : అర కప్పు
బరకగా నూరిన వేరుశెనగ గింజల పొడి : 1 టీస్పూన్
ఉల్లిపాయ తరుగు : అర కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ : ఒక టీస్పూన్
స్కిమ్‌డ్ మిల్క్ : అర కప్పు
పసుపుపొడి : ఒక టీస్పూన్
బ్లాక్ పెప్పర్ పొడి : ఒక టీస్పూన్
జీలకర్ర పొడి : ఒక టీస్పూన్
ధనియాలపొడి : ఒక టీస్పూన్
కొత్తిమీర తరుగు : ఒక టీస్పూన్
నూనె : ఒక టీస్పూన్
పచ్చిమిర్చి తరుగు : ఒక టీస్పూన్
ఉప్పు : ఒక టీస్పూన్
తయారీ విధానం...
ఒక నాన్‌స్టిక్ పెనం తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. అందులో బ్లాక్ పెప్పర్, ధనియాల పొ డి, జీలకర్ర పొడులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగులను వేసి వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలియబెట్టాలి. ఇందు లోనే వేరుశెనగ గింజల పొడి, పసు పుపొ డి, తగినంత ఉప్పువేసి బాగా కలిపి వేయించాలి. తరువాత దానికి పనస, బంగాళా దుంపల మిశ్రమాలను చేర్చి బాగా కలిపి వేయించాలి.
చివరగా స్కిమ్‌డ్ మిల్క్ చేర్చి బాగా కలిపి అవి ఇగిరేంతదాకా సన్నటి మంట పై ఉడికించాలి. మిశ్రమం అంతా దగ్గర ప డ్డాక కొత్తిమీర తరుగును వేసి బాగా కలిపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కిందికి దించి చల్లారి న తరువాత ఉండలుగా చుట్టి, టొమోటో చ ట్నీ లేదా జామ్‌తో కలిసి సర్వ్ చేయాలి. అంతే రుచికరమైన జాక్‌ఫ్రూట్ పొటాటో బాల్స్ రెడీ. తక్కువ నూనెతో తయారయ్యే ఇవి తక్కువ కొవ్వును కలిగి ఉంటాయి. ముఖ్యంగా డైటిం గ్ చేసేవారికి ఇవి బాగా తోడ్పడతాయి.
దోసెపిండి బోండాలు
కావల్సిన పదార్థాలు : దోసె పిండి - కప్పు, బియ్యం పిండి - అరకప్పు, ఉల్లిపాయ - అరకప్పు (సన్నగా తరిగినవి), పచ్చిమిర్చి - 2 (చిన్న ముక్కలుగా కట్ చేసినవి), మిరియాల పొడి- అర టీ స్పూను, కొబ్బరి - టేబుల్ స్పూను (తురిమినది), కరివేపాకు - నాలుగు రెమ్మలు, కొత్తిమీర - రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు- రుచికి తగినంత, నూనె - ఫ్రై చేయడానికి సరిపడా.
తయారుచేసే విధానం : ముందుగా నూనె మినహాయించి మిగిలిన పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో వేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి. కడాయిలో నూనె పోసి కాగనివ్వాలి. నూనె వేడయ్యాక గరిట నిండా పిండి తీసుకొని కొద్దికొద్దిగా కాగే నూనెలో వేసుకోవాలి. చేత్తో కూడా పిండిని నూనెలో బోండాల్లా వేసుకోవచ్చు. బోండాలు బంగారు వర్ణం వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. బోండాలు క్రిస్పిగా వేగిన తర్వాత వాటిని తీసి సర్వింగ్ బౌల్లోకి మార్చుకోవాలి. అంతే కమ్మని దోసెపిండి బోండాలు రెడీ...వీటికి టమాటా సాన్ గానీ, టమాటా రోటి పచ్చడి మంచి కాంబినేషన్.
కరకరలాడే కార్న్ ఫింగర్స్
కావల్సిన పదార్థాలు : కార్న్ కెర్నలు - కప్పు (ఉడికించి, గుజ్జులా తయారుచేసినవి), పాలు - కప్పు, బంగాళదుంపలు - 2(ఉడికించి, పొట్టు తీసి చిదిమి పెట్టుకోవాలి), చీజ్ తురుము - రెండు స్పూన్లు, మైదా - రెండు స్పూన్లు, కార్న్ ఫ్లోర్ (మొక్కజొన్న పిండి) - స్పూను, పచ్చిమిరపకాయలు - రెండు (చిన్న ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి), మిరియాల పొడి - టేబుల్ స్పూను, జీలకర్ర పొడి - టేబుల్ స్పూను, ఉప్పు- రుచికి సరిపడా, కొత్తిమీర - రెండు టేబుల్ స్పూన్లు (సన్నగా తరిగి పెట్టుకోవాలి) నీళ్లు - అరకప్పు, బ్రెడ్ ముక్కలు - అరకప్పు, వెన్న - స్పూను, నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా.
తయారుచేసే విధానం : ముందుగా పాన్లో కొద్దిగా వెన్న వేసి వేడి చేయాలి. తర్వాత అందులో ముందుగా ఉడికించి, చిదిమి పెట్టుకొన్న మొక్కజొన్న గుజ్జును అందులో వేసి, వెంటనే ఉప్పు, పాలు కూడా వేసి 6-7 నిముషాలు మీడియం మంట మీద పాలు మొక్కజొన్న గుజ్జుకు బాగా పట్టి ఇంకిపోయే వరకూ ఉడికించుకోవాలి. పాలు బాగా ఇంకిపోయిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి, ఈ మిశ్రమాన్ని మరో గిన్నెలోకి మార్చి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అందులో ఉడికించి పెట్టుకొన్న బంగాళదుంప, మిరియాల పొడి, పచ్చిమిర్చి, చీజ్, కొత్తిమీర తరుగు, జీలకర్ర పొడి వేసి చేత్తోనే మృదువుగా కలుపుకోవాలి. ఈ పిండిని కొద్దికొద్దిగా తీసుకొని ఫింగర్స్లా పొడవుగా చేసుకోవాలి. వాటిని రిఫ్రిజరేటర్లో 15 నిముషాలు పెట్టాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైదాపిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, సరిపడా నీళ్లు పోసి, చిక్కగా జారుగా కలుపుకోవాలి. ఒక ప్లేట్లో బ్రెడ్ను పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిజ్లో నుండి కార్న్ ఫింగర్స్ బయటకు తీసి మైదా, కార్న్ఫ్లోర్ పిండిలో, తర్వాత బ్రెడ్ పొడిలో అంటుకొనే దొర్లించాలి. ఇప్పుడు స్టౌపై డీప్ ఫ్రైయింగ్ పాన్లో నూనె వేసి కాగనివ్వాలి. కాగే నూనెలో ముందుగా సిద్ధంచేసుకున్న కార్న్ ఫింగర్స్ని వేసి, మీడియం మంట మీద డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఐదు నిముషాలు బంగారు వర్ణం వచ్చే వరకూ వేగించి పెట్టుకోవాలి. ఇలా అన్నింటిని తయారుచేసుకొన్న తర్వాత వీటిని టిష్యూపేపర్ మీద పర్చి, ఆయిల్ ఇంకిపోయే వరకూ ఉంచాలి. ఆ తర్వాత, కార్న్ ఫింగర్స్ని ప్లేట్లోకి మార్చుకొని, సర్వ్ చేయాలి. వీటిపై ఉల్లిపాయ, కొత్తిమీర తరుగు, టమాటా ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి. అంతే సాయంత్రం టీతో నోరూరించే ఈ కార్న్ ఫింగర్స్ రెడీ! వీటికి టమాటా సాస్ మంచి కాంబినేషన్.
బెండకాయ మటన్
కావలసిన పదార్థాలు
బెండకాయలు-అర కిలో
మటన్-అరకిలో, నెయ్యి-2 టేబుల్ స్పూన్లు,
జీలకర్ర- టీ స్పూను, దాల్చిన చెక్క-2 అంగుళాల ముక్క, నల్ల యాలకులు-నాలుగు
మిరియాలు-పది, ఉల్లిపాయలు-రెండు
పచ్చి మిర్చి-నాలుగు, అల్లం వెల్లుల్లి-2 టీ స్పూన్లు, పసుపు-అర టీ స్పూను, ఉప్పు-రుచికి సరిపడా, ధనియాల పొడి-2 టీ స్పూన్లు
కొత్తిమీర తురుము-4 టేబుల్ స్పూన్లు
టొమాటోలు- రెండు,నూనె-2 టేబుల్ స్పూన్లు
కారం- టీ స్పూను, గరం మసాల పొడి-టీ స్పూన్లు, కొత్తిమీర తురుము- 4 టేబుల్ స్పూను
తయారు చేయి విధానం
బెండకాయలు కడిగి తొడిమలూ, చివర్లూ తీసేసి ఒకవైపున చీల్చినట్లుగా గాటు పెట్టాలి. ఓ బాణలిలో నూనె వేసి మిగిలిన జీలకర్ర వేసి వేగాక బెండకాయలు వేసి వేయించి ఉంచాలి. ప్రెషర్ కుక్కర్‌లో నెయ్యి వేసి కాగాక అర టీ స్పూను జీలకర్ర దాల్చిన చెక్క, నల్ల యాలకులు, మిరియాలు, ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరువాత చీల్చిన పచ్చిమిర్చి, మటన్ ముక్కలు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి ,ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి. మంచినీళ్ళు పోసి ఓ సారి కలిపి ఓ పది నిమిషాలు ఉడికించాలి. తరువాత టొమాటో గుజ్జు, కారం, గరం మసాలా వేసి కలపాలి. ఇప్పుడు కొత్తిమీర తురుము వేసి ఉప్పు సరిచూసి కుక్కర్ మూత పెట్టి ఓ విజిల్ రానివ్వాలి. మంట తగ్గించి సిమ్‌లో ఇరవై నిమిషాల పాటు ఉడికించి దించాలి.
చైనీస్ మటన్ బాల్స్
కావలసిన పదార్థాలు
బోన్‌లెస్ మటన్ కీమా- అరకిలో
కోడిగుడ్లు-రెండు, సోయా సాస్-టేబుల్ స్పూను, పంచదార-టీ స్పూను
ఉప్పు-టీ స్పూను, పచ్చి మిర్చి-ఆరు
చైనీస్ క్యాబేజీ తురుము- అర కప్పు
మైదా పిండి-పావు కప్పు,
చైనీస్ సాల్ట్-పావు టీ స్పూను
తయారు చేయి విధానం
కీమాను ఉడికించి ఉంచాలి. కోడిగుడ్ల సొనను బాగా గిలకొట్టాలి. అందులో సోయా సాస్, పంచదార వేసి బాగా కలపాలి. తరువాత ఉడికించిన కీమా, పచ్చిమిర్చి తురుము, క్యాబేజీ తురుము వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఉప్పు చైనీస్ సాల్ట్, మైదాపిండి వేసి కలిపి ఉండలుగా చేయాలి. బాణలిలో నూనె పోసి కాగాక ఈ ఉండల్ని వేసి వేయించి తీయాలి. వీటిల్లోకి కాస్త గ్రేవీ కావాలనుకుంటే విడిగా బాణలిలో కొద్దిగా నూనె వేసి ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరువాత చిల్లీ సాస్, కొత్తిమీర తురుము వేసి అందులోమటన్ బాల్స్ కలిపి అందించాలి.
కొల్హాపురీ మటన్ తంబడా రస్సా
కావల్సిన పదార్థాలు
మటన్-కేజీ, కారం- టేబుల్ స్పూను, నూనె-కప్పు,
టొమాటోలు-రెండు, ఉల్లిపాయలు- నాలుగు
కొత్తిమీర-కట్ట,అల్లం వెల్లుల్లి పేస్టు-రెండు చెంచాలు
పసుపు-పావు టేబుల్ స్పూను
ఉప్పు-తగినంత, నువ్వులు-రెండు టేబుల్ స్పూను
యాలకులు-నాలుగు, కొబ్బరి తురుమ - రెండు టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి-టేబుల్ స్పూను
జీలకర్ర పొడి- టేబుల్ స్పూను,మిరియాలు-ముప్పావు చెంచా, దాల్చిన చెక్క-పెద్ద ముక్క,
లవంగాలు -నాలుగైదు,గసగసాలు-టేబుల్ స్పూను
నెయ్యి-రెండు టీబుల్ స్పూన్లు
తయారు చేయి విధానం
బాణలిలో నూనె లేకుండా నువ్వులు, యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలూ, గసగసాలు వేయించుకోవాలి. తరువాత మెత్తగా పొడిచేసి పెట్టుకోవాలి. అలాగే టొమాటోలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, తాజా కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుము మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి అల్లం వెల్లుల్లి పేస్టు వేయించుకోవాలి. అందులో ముందుగా వేసుకున్న మసాలా పొడి వేయాలి. తరువాత కొబ్బరి మిశ్రమం వేయాలి. పచ్చి వాసన పోయాక మటన్ ముక్కలు తగినంత ఉప్పు వేసి మూత పెట్టేయాలి. మటన్ మెత్తగా ఉడికాక ధనియాల పొడి జీలకర్ర పొడి, కారం వేసి కలిపి దింపేస్తే సరిపోతుంది. ఇది బిర్యానీ, రొట్టెల్లోకి చాలా బాగుంటుంది.
చింత చిగురు మాంసం
కావాల్సినపదార్థాలు
చింతచిగురు-అరకిలో మాంసం ( చికెన్ లేదా మటన్) ,అరకిలో కొబ్బరి తురుము: 2 టీ స్పూను, కొత్తిమీర- కట్ట,ధనియాల పొడి-టీ స్పూన్లు
అల్లంవెల్లుల్లిముద్ద- టీ స్పూను, జీలకర్ర- టీ స్పూను, పుదీనా-కట్ట ,ఆవాలు-టీ స్పూను
నూనె-టేబుల్ స్పూను, ఉల్లిపాయ- ఒకటి
కారం -2 టేబుల్ స్పూను, ఉప్పు-రుచికి సరిపడా
పసుపు-చిటికెడు, గరం మసాలా-టీ స్పూను
తయారు చేయి విధానం
నాన్‌స్టిక్ పాన్ తీసుకుని నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఉల్లిముక్కలు కూడా వేసి అవి వేగాక, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. తరువాత కొబ్బరి తురుము వేసి ఓ నిమిషం వేయించాలి. ఇప్పుడు మటన్ లేదా చికెన్ ముక్కలు వేసి ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు పోసి కలపాలి. తరువాత ధనియాల పొడి, కారం కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి మాంసం ఉడికే వరకూ ఉంచాలి. ఉడికిన తరువాత చింత చిగురు వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. చివరగా గరం మసాలా వేసి ఓ నిమిషం ఉంచి దించాలి.
కావల్సిన పదార్థాలు : ఆపిల్ - ఒకటి, కొబ్బరి తురుము - కప్పు, డ్రై ఫ్రూట్స్ - 20 గ్రాములు, నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు, పంచదార - కప్పు, పాలు - కప్పు, యాలకుల పొడి - కొద్దిగా...
తయారుచేసే విధానం : ఒక పాన్ తీసుకొని అందులో నీళ్లు, పాలు, పంచదార, ఆపిల్ తురుము వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇప్పుడు ఈ పాన్‌ను స్టౌ మీద పెట్టి మీడియం మంట మీద కొన్ని నిముషాలు ఉడికించాలి. మెత్తగా పేస్ట్ అయ్యే వరకూ ఉడికించుకోవాలి. మొత్తం మిశ్రమం చిక్కబడే సమయంలో అందులో డ్రైఫ్రూట్స్ పలుకులుగా (రఫ్‌గా పొడి చేసుకొని లేదా అలాగే) వేసుకొని, బాగా మిక్స్ చేయాలి. చివరగా కొద్దిగా నెయ్యి వేసి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి తురుము, యాలకులపొడి వేసి మరోసారి కలపాలి. అలాగే కొద్దిగా నెయ్యి మిక్స్ వేసి, తర్వాత మరికొన్ని నిముషాలు ఉడికించుకోవాలి. చివరగా కొద్దిగా ఫుడ్ కలర్ అవసరం అనిపిస్తే జోడించుకోవచ్చు. అంతే ఆపిల్ హల్వా రెడీ! ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసి, చెర్రీస్‌తో గార్నిష్ చేసి వేడిగా లేదా చల్లగా సర్వ్ చేయాలి. దీన్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.
- బఠాణీ మష్రూమ్స్
కావలసిన పదార్థాలు
పచ్చిబఠాణీలు-ఒకటిన్నర కప్పు, పుట్టగొడుగులు-200 గ్రాములు, ఉల్లిపాయలు-రెండు, టొమా టోలు-నాలుగు, కారం-టేబుల్ స్పూను, ధనియాల పొడి-టేబుల్ స్పూను, పసుపు-టీ స్పూను, గరం మసాలా-టీ స్పూను, జీడిపప్పు ముద్ద-అర కప్పు, యాలకులు-నాలుగు, దాల్చిన చెక్క-అంగుళం ముక్క, అల్లం వెల్లుల్లి-2 టేబుల్ స్పూన్లు, నూనె-4 టేబుల్ స్పూన్లు, ఉప్పు- రుచికి సరిపడా.
తయారు చేయు విధానం
పుట్టగొడుగుల్ని కడిగి ముక్కలుగా కోయాలి. బాణలిలో నూనె వేసి యాలకులు, దాల్చిన చెక్క, ఉల్లి ముక్కలు వేసి వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి వేసి ఓ నిమిషం వేయించాలి. టొమాటో ముక్కలు కూడా వేసి ఉడికించాలి. తరువాత కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, ఉప్పు వేసి ఓ రెండు నిమిషాలు ఉడికించాలి. జీడిపప్పు ముద్దని ఓ కప్పు నీళ్లలో కలిపి బాణలిలో పోయాలి. తరువాత మరో కప్పు నీళ్ళు పోసి మరిగించాలి. ఇప్పుడు బఠాణీలు, పుట్టగొడుగులు వేసి ఉడికిన తరువాత దించాలి.
చిల్లీ మష్రూమ్
కావలసిన పదార్థాలు
బటన్ మష్రూమ్స్-200 గ్రా, క్యాప్సికమ్-రెండు, ఉల్లిపాయ -ఒకటి, అల్లం-అంగుళం ముక్క, వెల్లుల్లి-6 రెబ్బలు, నూనె-2 టేబుల్ స్పూన్లు, కారం- టీ స్పూను, సోయాసాస్-2 టీ స్పూన్లు, కార్న్‌ఫ్లోర్-టేబుల్ స్పూను, వినెగర్-టీ స్పూను, మంచి నీళ్ళు-కప్పు, ఉప్పు- రుచికి సరిపడా.
తయారు చేయు విధానం
పుట్టగొడుగుల్ని రెండు ముక్కలుగా కోయాలి. క్యాప్సికమ్ లోపల గింజలు తీసేసి ముక్కలుగా కోయాలి. ఉల్లి ముక్కలు, అల్లం, వెల్లుల్లి కలిపి మెత్తని ముద్దలా రుబ్బాలి. బాణలిలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఉల్లిముద్ద వేసి బాగా వేయించాలి. తరువాత కారంవేసి, అరకప్పు నీళ్ళు పోసి సిమ్‌లో పెట్టి ఉడికించాలి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు, పుట్టగొడుగుల ముక్కలు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి తక్కువ మంట మీద ముక్కలు ఉడికేవరకూ ఉంచాలి. తరువాత సోయా సాస్, వినెగర్ వేసి కలపాలి. కాసిని నీళ్లలో కలిపిన కార్న్‌ఫ్లోర్ కూడా వేసి కలిపి సిమ్‌లో ఓ రెండు నిమిషాలు ఉడికించి దించాలి.
ఆంధ్రా మష్రూమ్ కర్రీ
కావలసిన పదార్థాలు
పుట్ట గొడుగులు- పావు కిలో, ఉల్లిపాయలు- మూడు, పచ్చిమిర్చి-మూడు, కారం-టీ స్పూను, పసుపు-పావు టీ స్పూను, కొత్తిమీర-కట్ట, నూనె-వేయించడానికి సరిపడా, ఉప్పు- తగినంత.
మసాలా ముద్ద కోసం
అల్లం తురుము- టీ స్పూను, వెల్లుల్లి-రెండు రెబ్బలు, జీలకర్ర- టీ స్పూను, గసగసాలు-టీ స్పూను, ధనితయాలు-టీ స్పూను
తయారు చేయు విధానం
పుట్టగొడుగుల్ని కడిగి ముక్కలుగా కోయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా పొడవుగా తరగాలి. మసాలా ముద్ద కోసం తీసుకున్న దినుసులన్నీ ముద్దలా రుబ్బుకోవాలి. బాణలిలో నూనె వేసి ఉల్లిముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. తరువాత ఉప్పు వేసి ఐదు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు కప్పు నీళ్లు పోసి మీడియం మంట మీద రెండు నిమిషాలు ఉడికించాలి. ముక్కలు బాగా ఉడికిన తరువాత మసాలా ముద్ద వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి దించి కొత్తిమీర చల్లితే సరి.
చెట్టినాడ్ మష్రూమ్ కర్రీ
కావలసిన పదార్థాలు
మష్రూమ్స్ ముక్కలు-2 కప్పులు, చింతపండు-నిమ్మకాయంత ( అర కప్పు నీళ్లలో నానబెట్టాలి), ఉప్పు-సరిపడా, గరం మసాలా-టీ స్పూను, సెనగపప్పు-టేబుల్ స్పూను, మిరియాల పొడి-టీ స్పూను, నూనె-2 టీ స్పూన్లు, ఆవాలు-అర టీ స్పూను, ఎండు మిర్చి-2, కరివేపాకు-2 రెమ్మలు.
తయారు చేయు విధానం
చింతపండుని మెత్తగా గుజ్జులా చేయాలి, సెనగపప్పుని విడిగా చిన్న బాణలిలో వేసి వేయించి పొడి చేయాలి. ఈ పొడిలోనే గరం మసాలా, మిరియాల పొడి కలపాలి. స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి నూనె వేసి కాగాక ఆవాలు వేసి వేయించాలి. కరివేపాకు, ఎండు మిర్చి కూడా వేసి వేగాక పుట్టగొడుగుల ముక్కలు వేసి వేయించాలి. ఇప్పుడు ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించాలి. ఉడికాక మూత తీసి చింతపండు గుజ్జు వేసి పది నిమిషాలు సిమ్‌లో ఉడికించాలి. చివరగా గరం మసాలా మిశ్రమం వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించి ఉప్పు సరి చూసి దించాలి.
కొత్తిమీర రైస్
కావలసిన పదార్థాలు
కొత్తిమీర కట్టలు-3, బియ్యం-అరకిలో
జీలకర్ర, ఆవాలు-రెండు టీ స్పూన్స్
పచ్చిమిరపకాయలు-6, అల్లంముక్కలు -1 టేబుల్ స్పూన్, వేరుశేనగ గుళ్ళు- 1 టేబుల్ స్పూన్
జీడిపప్పు-1 టేబుల్ స్పూన్, ఉప్పు- తగినంత
తయారు చేయి విధానం
ముందుగా అన్నం వండి పక్కన ఉంచుకోవాలి. ఆ తరువాత పొయ్యి మీద మూకుడు ఉంచి నూనె కాగిన తర్వాత కొత్తి మీర వేయించి దానిలో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయల ముక్కలు , అల్లం ముక్కలు, వేరుశనగ గుళ్లు, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత పసుపు ,ఉప్పు, వండిపెట్టుకున్న అన్నం వేసి బాగా కలియబెట్టాలి. ఇంకేముంది కొత్తిమీర రైస్ రెడీ.
పులగం
కావలసిన పదార్థాలు
బియ్యం-ఒకటిన్నర కప్పు
పెసరపప్పు-అరకప్పు
నెయ్యి- టీ స్పూన్
జీలకర్ర- టీ స్పూన్
మిరియాలపొడి-పావుటీ స్పూన్, ఉప్పు- తగినంత
నీళ్ళు- మూడున్నర కప్పులు
జీడిపప్పు- 10
తయారు చేయు విధానం
బియ్యం, పప్పు కడిగి 20 నిమిషాలు నానబెట్టాలి. గిన్నె లో నెయ్యి వేడయ్యాక జీలకర్ర, మిరియాలు వేసి వేయించాలి, నీళ్ళు పోసి మరుగుతుండగా నానబెట్టిన బియ్యం, పప్పు, ఉప్పు వేసి ఉడికించాలి. అన్నం అయ్యాక జీడిపప్పు పలుకులు వేసి కలపాలి.
కొబ్బరి రైస్
కావలసిన పదార్థాలు
కొబ్బరి చిప్పలు-2
బియ్యం-అరకిలో
జీలకర్ర, ఆవాలు- రెండు టీ స్పూన్స్, పచ్చిమిరపకాయలు-6
ఎండు మిర్చి- 4 కాయలు
అల్లం ముక్కలు-1 టేబుల్ స్పూన్, కరివేపాకు-రెండు రెబ్బలు, వేరుశనగ గుళ్ళు- 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు-1 టేబుల్ స్పూన్, నిమ్మకాయ-1
ఉప్పు-తగినంత
తయారు చేయి విధానం
ముందుగా అన్నం వండి పక్కన ఉంచుకోవాలి. తరువాత కొబ్బరి చిప్పలను కోరుకోవాలి. ఆ తర్వాత స్టౌమీద మూకుడు ఉంచి నూనె పోసి కాగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, కరివేపాకు, వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు. ఎండు మిర్చి కలిపి వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత కోరి ఉంచుకున్న కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత అన్నం వేసి దానిలో కొంచెం ఉప్పు కలిపి బాగా కలియబెట్టాలి. దించే ముందు నిమ్మకాయ పిండుకుంటే పుల్లపుల్లగా రుచిగా ఉంటుంది.
పులిహోర
కావలసిన పదార్థాలు
బియ్యం-అరకిలో
శనగపప్పు-రెండు టీ స్పూన్లు
వేరుశనగ పప్పు-50 గ్రాములు
పసుపు-1 టీ స్పూను
ఆవాలు-1 టీ స్పూను
జీలకర్ర-1 టీ స్పూను
కరివేపాకు-రెండు రెమ్మలు
ఎండు మిరపకాయలు-4
పచ్చి మిరపకాయలు-6
నిమ్మకాయలు-2 (పెద్దవి)
ఉప్పు-తగినంత
నూనె- 4 టీ స్పూన్లు
తయారు చేయి విధానం
ముందుగా అన్నంను కొంచెం పలు కుగా వండి వార్చి ఒక పళ్లెంలో పక్కన పెట్టుకోవాలి. తర్వాత పళ్లెంలో ఉన్న అన్నానికి కొంచెం నూనె, పసుపు, ఉప్పు వేసి అన్నం మొత్తం కలిసేటట్టు కలియ బెట్టాలి. ఆ తరువాత మూకుడు తీసుకుని దానిలో నూనె వేసి శనగపప్పు, వేరుశెనగ గుళ్ళు, జీలకర్ర , పచ్చి మిరపకాయలు, ఎండు మిర్చి కలిపి వేయించాలి. ఇలా వేయించిన తాలిం పును ముందుగా కలిపి పెట్టుకున్న అన్నంలో వేసి కలిసేటట్టు అటూ ఇటూ తిప్పాలి. అంతా బాగా కలిశాక నిమ్మకాయ రసం పిండుకుంటే పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది.
కొబ్బరికోరుతో..
మామిడి ముక్కలు - 5 కప్పులు
కొబ్బరి ముక్కలు - 1 కప్పు
ఇంగువ - కొంచెం
ఎండుమిర్చి - 12
ఆవాలు - 2 చెంచాలు
జీలకఱ్ఱ - 1 చెంచా
మినప్పప్పు - 5 చెంచాలు
శనగపప్పు - 5 చెంచాలు
మెంతులు - 1 చెంచా
పచ్చిమిర్చి - 5
ఉప్పు - 4 చెంచాలు
నూనె - 5 చెంచాలు
పసుపు - 1 చెంచా
మామిడికాయలకు తొక్క తీసి ముక్కలుగా తరగాలి. ఆ తర్వాత పసుపు, ఉప్పు వేసి ముక్కలను మెత్తగా మిక్సీ పట్టాలి. వేపిన పోపు, కొబ్బరి కోరును మిక్సీపట్టి మామిడి ముద్దలో కలపాలి. దీనికి బెల్లం కలిపితే మరింత రుచిగా ఉంటుంది.
పులిహోర
ఎండుమిర్చి - 6
పచ్చిమిర్చి -6
మామిడికోరు - 2 కప్పులు
ఉడికించిన అన్నం -6 కప్పులు
పసుపు - 1 చెంచా
కొబ్బరి కోరు - 2 చెంచాలు
శనగపప్పు, మినప్పప్పు -5 చెంచాలు
నూనె - 5 చెంచాలు
ఉప్పు - 4 చెంచాలు
కరివేపాకు - కొంచెం
వేయంచిన పోపు, మామిడి కోరు, కొబ్బరి కోరు, పసుపు అన్నంలో కలపాలి. తర్వాత అందులో ఉప్పు, కరివేపాకు కలిపి అరగంట మూత పెట్టి ఉంచాలి. పుల్లటి మామిడికాయలతో చేసే పులిహోరలో ప్రత్యేకంగా పులుపు కలపాల్సిన అవసరం
మెంతి మాగాయ
మామిడికాయలు- 25
కారం - ఒకటిన్నర కేజీ
మెంతులు - ఒకటిన్నర కప్పు
ఆవాలు - ఒకటిన్నర కప్పు
ఉప్పు - 400 గ్రా.
నూనె - 1/2 కేజీ
ఇంగువ - చింతగింజంత
వెల్లుల్లి - 25 రెబ్బలు
మామిడికాయలను నీటిలో శుభ్రం చేసి పలుచని ముక్కలుగా చేసుకోవాలి. ఈ ముక్కల్ని మధ్యాహ్నం ఎండలో చాపమీద పోసి ఆరనివ్వాలి. సాయంత్రం వేళ మెంతులు, ఆవాలు దోరగా వేయించి మిక్సీ పట్టాలి. బాణలిలో ఇంగువ నూనె కాచి అందులో కారం పోసి బాగా కలపాలి. ఎండిన మామిడి ముక్కల్ని పెద్ద బేసిన్‌లో వేసి ఉప్పు, పసుపు, వేయించిన వెల్లుల్ని కలిపి మూత పెట్టాలి. మూడవ రోజున మామిడి ముక్కలను బాగా కలిపి జాడీలో పెట్టాలి. తీపి కావాలని కోరుకునే వారు ఇంగువ, వెల్లుల్లికి బదులు అరకిలో బెల్లం కోరు కలుపుకోవాలి.
చాట్
మామిడి కోరు - 2 కప్పులు
ఉడికించిన బఠాణీలు - 2 కప్పులు
క్యారెట్ కోరు -1 కప్పు
ఉడికించి బంగాళా దుంపల ముక్కలు - 1 కప్పు
కొబ్బరి కోరు - 2 చెంచాలు
ఉప్పు - 1 చెంచా
కొత్తిమీర - కొంచెం
చాట్ మసాలా - 2 చెంచాలు
బంగాళాదుంపల ముక్కలు, మామిడి కోరు, చాట్ మసాలా కలిపి ఒక బౌల్‌లో సర్ది కాసేపయ్యాక పళ్ళెంలో వేయాలి. ఇది ఒక గడ్డలా వస్తుంది. దీనిపై కొత్తిమీరతో అలంకరించి కప్పులోకి తీసిపెట్టాలి.
రూబీ-రెడ్ గ్రేప్‌ఫ్రూట్ కాక్‌టెయిల్ | |
|
వేసవిలో దాహం తీర్చుకోవడానికి రకరకాల డ్రింక్స్ తాగుతుంటారు. అయితే అలాంటి డ్రింక్స్‌కు బదులుగా ఫ్రూట్ జ్యూస్ తాగితే దాహం తీరడంతో పాటు పోషకాలు లభిస్తాయి. అలాంటి వాటిలో ముఖ్యమైనది రూబీ-రెడ్ గ్రేప్‌ఫ్రూట్ కాక్‌టెయిల్. ఒంటికి సి-విటమిన్ ఇస్తుంది. దీన్ని ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
ఒకటిన్నర కప్పు - రెడ్ లేక పింక్ గ్రేప్‌ఫ్రూట్ జ్యూస్
ఒకటిన్నర కప్పు - సాదా సోడా
అరకప్పు - జిన్
రెండు టేబుల్‌స్పూన్ల - కాంపరి
ఐస్‌క్యూబ్స్ - తగినన్ని
కొన్ని గ్రేప్‌ఫ్రూట్ ముక్కలు - గార్నిష్ కోసం.
తయారుచేయు విధానం
గ్రేప్‌ఫ్రూట్ జ్యూస్ తీసుకుని అందులో జిన్, సోడా, కాంపరి కలుపుకోవాలి. తరువాత గ్లాసుల్లో పోసుకుని ఐస్‌క్యూబ్స్ వేసుకోవాలి. పండ్ల ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. వేసవిలో ఈ డ్రింక్ చల్లదనాన్ని ఇస్తుంది. శరీరానికి కావలసిన విటమిన్-సి లభిస్తుంది.
|
సోపు గింజలతో షర్భత్ | |
|
నోటిని శుభ్రం చేసుకోవటానికి సోపు గింజలను వాడుతూ ఉంటారు. దీని వల్ల జీర్ణశక్తి బాగా పెరుగుతుందని ఆయిర్వేద నిపుణులు పేర్కొంటూ ఉంటారు.
జీర్ణశక్తిని పెంచటంతో పాటుగా, వేసవిలో వేడికి ఇది మందులా పనిచేస్తుందని చాలా మంది భావిస్తారు. ముఖ్యంగా గుజరాత్‌లో సొపుతో చేసి షర్భత్‌కు వేసవిలో చాలా డిమాండ్ ఉంటుంది. ఈ షర్భత్‌ను ఎలా చేయాలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు : సొపు గింజలు- పావుకప్పు, పటిక బెల్లం- రెండున్నర చెంచాలు, నీళ్లు- రెండున్నర కప్పులు, లవంగం- ఒకటి.
చేసే విధానం : సోపు గింజలను, లవంగాన్ని పొడి చేయాలి. ఈ పొడిని కనీసం రెండు గంటలు నీటిలో నానపెట్టాలి. ఆ మిశ్రమాన్ని వడబోసి, సోపుగింజల పొడి ముద్దను వేరు చేయాలి. మిశ్రమంలో పటిక బెల్లం పొడిని కలపాలి. దీనిని ఐస్ క్యూబ్స్‌తో కలిపి సర్వ్ చేయాలి. దీనిలో నిమ్మరసం వేసుకుంటే చాలా బావుంటుంది. కొందరు మిరియాల పొడిని కూడా ఈ మిశ్రమంలో కొద్దిగా కలుపుతారు.
|
పుదీనా షర్బత్ | |
No comments:
Post a Comment