Pages

Tuesday, 12 May 2015

Zunk food create - great problems - be careful


ఫుడ్డు అదిరె.. పొట్టకు బెదురే..

సరదాగా బయట తిందాం అనుకుంటున్నారా? కాస్త జాగ్రత్త.. బయటి నీళ్ళను నేరుగా తాగినపుడు వాటిలోని అనేక సూక్ష్మజీవులతో ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది. అందులోని బ్యాక్టీరియా, ఏక కణజీవులు, వైరస్ కారక క్రిములు, నులిపురుగుల వంటి జీవులవల్ల కడుపు దెబ్బతినే అవకాశాలున్నాయి. ఇటీవల కొన్ని దేశాల ఆహార పదార్థాల వల్ల ‘ఈ-కోలై’ పరాన్నజీవులు వ్యాపిస్తున్నాయనే కారణంతో మరికొన్ని దేశాల ఆహార దిగుమతులను నిషేధించడంతో ఇది ఒక అంతర్జాతీయ సమస్యగా మారడం కూడా తెలిసిందే. మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కేవలం ఆహారం కలుషితం కావడంవల్ల ఏటా 22 లక్షల మంది మృతి చెందుతున్నారంటే ఈ సమస్య తీవ్రత ఏమిటో అర్థమవుతుంది. ఇందులో కనీసం 18 లక్షల మంది ఐదేళ్ళలోపు చిన్నారులే. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెరుగుతున్న పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, ఒకసారి జనాభా పెరగడంతో వ్యర్థాల నిర్మూలన సమర్థంగా జరగకపోవటం వంటివి దీనికి కారణాలు.
వ్యాధులెన్నో...
ఆహారం కలుషితం కావడంవల్ల వచ్చే జబ్బులు వ్యాధి కారకాన్ని బట్టి చాలా రకాలుగా ఉంటాయి.
బ్యాక్టీరియావల్ల... సాల్మోనెల్లాటైఫీ అనే రకం బ్యాక్టీరియమ్‌తో టైఫాయిడ్, క్లాస్ట్రేడియమ్ అనే బ్యాక్టీరియమ్‌వల్ల ఫుడ్ పాయిజనింగ్‌తోపాటు బోట్యులిజం అనే ప్రమాదకరమైన వ్యాధి, విబ్రియో అనే బ్యాక్టీరియమ్‌తో నీళ్ళ విరేచనాలు, జ్వరం; షిజెల్లా అనే బ్యాక్టీరియమ్‌వల్ల షిజెల్లోసిస్ అనే ఒకరకం ఇన్‌ఫెక్షన్ వస్తాయి.
ఏక కణజీవులవల్ల...
జియార్డియా అనే ఏకకణ జీవులవల్ల జియార్డియా, ఎంటమిబా హిస్టలిటికా అనే తరహా ఏకకణజీవులతో అమీబియాసిస్, క్రిప్టోస్పోరిడియమ్, మైక్రోస్పోరిడియమ్ అనే క్రిములవల్ల క్రిప్టోస్పోరిడియాసిస్, మైక్రోస్పోరిడియాసిస్ వంటి వ్యాధులు సోకుతాయి.
నులిపురుగులు.. నులిపురుగుల్లో అనేక రకాలైన రౌండ్ వార్మ్, థ్రెడ్‌వార్మ్, హుక్‌వార్మ్ వంటివి పేగులో ఉండి ఆహారాన్ని శరీరానికి అందకుండా చేస్తాయి.
ఇక రకరకాల వైరస్‌లవల్ల హెపటైటిస్-ఎ, హెపటైటిస్-ఈ వంటి కామెర్లు తరహా వ్యాధులు చాలా సాధారణంగా కనిపిస్తాయి. రొటావైరస్‌వల్ల పిల్లలలో నీళ్ళ విరేచనాలు మామూలే.
చికిత్స... ఆహారం కలుషితం కావడంవల్ల వచ్చే సమస్యలు చాలామట్టుకు నివారించదగినవే. పిల్లలు, వృద్ధుల్లో ఆహార కాలుష్యం వల్ల డీహైడ్రేషన్ రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో శరీరానికి అవసరమైన ద్రవాలను సమకూర్చడం తప్పనిసరి. అందుకే శరీరానికి అవసరమైన ద్రవాలు అందేలా నీళ్ళు, ద్రవాహారం ఎక్కువగా ఇవ్వాలి. విరేచనాలతోపాటు కడుపునొప్పి, జ్వరం ఉంటే డాక్టర్ల పర్యవేక్షణలో యాంటిబయాటిక్స్ వాడాలి. అయితే ఆహారం కలుషితం కావడంవల్ల వచ్చే సమస్యల్లో చాలామట్టుకు వాటంతట అవే తగ్గిపోతాయి. ప్రమాదానికి దారితీసే సందర్భాలు చాలా తక్కువే. అయినా అదేపనిగా విరేచనాలు, వాంతులు, జ్వరం ఉంటే డాక్టర్‌ను కలిసి అవసరమైన పరీక్షలు చేయించాలి.
లక్షణాలు.. కారణం ఏదైనప్పటికీ సాధారణంగా ఆహారం కలుషితం కావడంవల్ల కనిపించే లక్షణాలు ఇవి.
నీళ్ళ విరేచనాలు వాంతులు పొట్టనొప్పి
కడుపులో గ్యాస్ కడుపులో ఇబ్బందిగా ఉండటం
కొన్నిసార్లు జ్వరం రావడం
నీరసం
బరువు తగ్గడం
ఈ లక్షణాలు దీర్ఘకాలికంగా ఉండడంవల్ల క్రమంగా శరీరంలో ద్రవాలు తగ్గడం, శరీరానికి అవసరమైన పోషకాలు సరిగ్గా అందకపోవడం జరగవచ్చు. వైరస్ ఇన్‌ఫెక్షన్స్‌వల్ల ముందుగా పై లక్షణాలే కనిపించి ఆ తర్వాత కామెర్లు రావచ్చు. కామెర్ల వ్యాధిలో కొన్నిసార్లు అరుదుగా అది కాలేయం పనిచేయకపోవడానికి దారితీయవచ్చు.
పరీక్షలు..
విరేచనాలు, కడుపునొప్పితోపాటు మలవిసర్జన సమయంలో రక్తంపడుతుంటే అవసరాన్ని బట్టి మల పరీక్ష, స్టూల్ కల్చర్ పరీక్ష చేయించాలి. మూత్రపిండాలు, కాలేయం పనితీరును తెలుసుకునే పరీక్షలు చేయించాలి.
నివారణ.. ఆహారం కలుషితం అయ్యే వ్యాధుల్లో చాలామటుకు నీళ్ళవల్లనే రావచ్చు. అందుకే పరిశుభ్రమైన నీళ్ళు తాగాలి. నీళ్ళు కాచి వడపోసి తాగాలి.
పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
ఆహారాన్ని వండేప్పుడు, తినేప్పుడు పరిశుభ్రత పాటించాలి.
స్థానికంగా ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవచ్చు, కానీ బయటి ఊళ్ళకు వెళ్లినపుడు అక్కడ ఆహారం తీసుకోవడం తప్పనిసరి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మాత్రం వేడిగా ఉన్న పదార్థాలు తినడం శ్రేయస్కరం, వీలైనపుడు మాత్రం పై జాగ్రత్తలు పాటించాలి.
చేయాల్సినవి.. టాయిలెట్‌కు వెళ్లి వచ్చాక చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
తినే ముందు కూడా చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి.
పరిసరాలు పూర్తిగా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
పదార్థాలు వేడిగా ఉన్నప్పుడు తినేయాలి.
ఈగలు రాకుండా కిటికీలకు నెట్ వాడటం మంచిది.
బయటి నీళ్ళు తాగేప్పుడు నేరుగా కుళాయి నీళ్ళు తాగవద్దు. బయట ఐస్‌క్యూబ్స్ వాడొద్దు. చెరుకురసం ఆరోగ్యదాయకం అయినప్పటికీ అందులో వేసే ఐస్ కలుషితమైనది కావచ్చు.
బయటి పదార్థాలు సాధ్యమైనంత వరకు తినకండి.
ఒకవేళ బయటి పదార్థాలు తినాల్సి వచ్చినపుడు అందులో ఉడికించడానికి వీల్లేని సలాడ్స్, కడగకుండా తినే పండ్లు, అపరిశుభ్రంగా ఉండే పళ్ళరసాలు, చట్నీస్ వంటివి సాధ్యమైనంతమట్టుకు తీసుకోకుండా చూసుకోండి.
ఆరుబయట మల విసర్జన ఎప్పుడూ చేయవద్దు.
పాత్రలు కేవలం సబ్బుతో లేదా డిటర్జెంట్‌తో కడగటం మంచిది. వాటిని శుభ్రం చేయడానికి మట్టి వాడొద్దు

No comments:

Post a Comment