Pages

what is osteoporosis? telugu health for bones

ఎముకలను గుల్లబార్చే ‘ఆస్టియోపొరోసిస్‌’ 

చెద పట్టిన చెట్టు కొమ్మ పెళుసుగా మారి ఎలా విరిగిపోతుందో గుల్లబారిన ఎముకలు కూడా అంతే తేలికగా విరిగిపోతాయి. ఇలా ఎముకలు బోలుగా తయారయ్యే రుగ్మతే ‘ఆస్టియోపొరోసిస్‌’.  పురుషులతో పోల్చుకుంటే స్త్రీలను ఎక్కువగా బాధించే ఈ సమస్యను ముందుగానే గుర్తించి తగిన చికిత్స తీసుకోగలిగితే ఎముకలు విరిగిపోకుండా కాపాడుకోవచ్చంటున్నారు ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డా.జి.శశికాంత్‌.

మగవారితో పోలిస్తే ఆడవాళ్ల ఎముకలు చిన్నవిగా, పలుచగా ఉంటాయి. మెనోపాజ్‌ దశకు చేరుకున్న స్త్రీలలో ఎముకలకు బలాన్నిచ్చే ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గుతుంది. దాంతో ఎముకలు నాణ్యత కోల్పోయి గుల్లబారటం మొదలుపెడతాయి. అవి క్రమంగా బలాన్ని కోల్పోయి పెళుసుగా మారతాయి. దాంతో చిన్న తాకిడికే విరిగిపోతూ ఉంటాయి. అయితే ఆస్టియోపొరోసిస్‌లో రెండు రకాలున్నాయి. మెనోపాజ్‌కు చేరుకున్న మహిళల ఎముకలు గుల్లబారే సమస్య ‘పోస్ట్‌ మెనోపాజల్‌ ఆస్టియోపొరోసిస్‌’ అయితే 65 - 70 ఏళ్ల వయసుకి చేరుకున్న వృద్ధుల్లో ఎముకలు గుల్లబారే సమస్య ‘సెనైల్‌ ఆస్టియోపొరోసిస్‌. అయితే ఈ రెండు రకాల సమస్యలు ఆడవాళ్లలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇందుకు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే....
 
- కాల్షియం తగు మోతాదులో శరీరానికి అందకపోవటం.
 
- వ్యాయామం చేయకపోవటం
 
- ఎక్కువగా స్టిరాయిడ్స్‌ వాడటం.
 
- వంశపారంపర్యంగా సంక్రమించటం.
 
- థైరాయిడ్‌ హార్మోన్‌లో అవకతవకలు.
 
ఆస్టియోపొరోసిస్‌ అంటే?
పుట్టింది మొదలు 20 - 22 ఏళ్ల వయసుకి చేరుకునేసరికి ఎముకలు పూర్తి సాంద్రతకు చేరుకుంటాయి. దాన్నే ‘పీక్‌ బోన్‌ మాస్‌’ అంటారు. ఈ దశలో ఎముక నాణ్యత, పరిమాణం అత్యధికంగా ఉంటుంది. ఈ పీక్‌ బోన్‌ మాస్‌ని ఎంత బాగా వృద్ధి చేసుకోగలిగితే అంతగా ఆస్టియోపొరోసిస్‌కు గురయ్యే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి చిన్నప్పటి నుంచి ఎముకలకు బలాన్నిచ్చే చర్యలు చేపట్టాలి. అలాగే ఎముక నాణ్యత కూడా రెండు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. తాజా పొరలు తయారై కొత్త ఎముక తయారవుతూ ఉంటే పాత ఎముక శరీరంలో కలిసిపోతూ ఉంటుంది. ఈ రెండు అంశాల మధ్య సమతౌల్యం ఉన్నప్పుడే ఎముక నాణ్యంగా ఉంటుంది. ఒకవేళ కొత్త ఎముక తయారీ తగ్గినా, పాత ఎముక క్షీణత పెరిగినా ఎముక నాణ్యత దెబ్బతింటుంది. ఆస్టియోపొరోసిస్‌లో ఎముక నాణ్యత, బలం రెండూ తగ్గుతాయి. మరి ముఖ్యంగా వెన్నెముక, తుంటి ఎముకలు, మణికట్టు ఎముకలు ఆస్టియోపొరోసిస్‌కు గురవుతూ ఉంటాయి.

ఆస్టియోపొరోసిస్‌ లక్షణాలు
ఆస్టియోపొరోసిస్‌ను ‘సైలెంట్‌ డిసీస్‌’ అని అంటూ ఉంటారు. ఎముకలు గుల్లబారటం అనేది శరీరంలో అంతర్గతంగా జరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఈ సమస్యను కనిపెట్టటం కష్టం. కాబట్టే ఎముకలు గుల్లబారి విరిగే వరకూ తమకు ఆ సమస్య ఉందని రోగులు కనిపెట్టలేకపోతూ ఉంటారు. అయితే ఈ సమస్య కొన్ని లక్షణాలతో బహిర్గతమవుతూ ఉంటుంది. అవేంటంటే...
 
- వెన్నుపూసల మధ్య దూరం తగ్గి ఎత్తు తగ్గటం.
 
- వెన్నెముక వంగిపోవటం.
 
- వెన్ను నొప్పి
 
- ఎముకల నొప్పులు
 
- చిన్న దెబ్బలకే ఎముకలు చిట్లడం, విరగటం
 
బోన్‌ డెన్సిటీ టెస్ట్‌ ‘డెక్సా స్కాన్‌’
ఎముకలకు సంబంధించిన స్వల్ప అవగాహనతో ఆస్టియోపొరోసిస్‌ను ముందుగానే కనిపెట్టే వీలుంది. ఇలా ముందుగానే కనిపెట్టగలిగితే ఎముకల నాణ్యతను పెంచి విరిగే అవకాశాల్ని నియంత్రించవచ్చు. ఇది వంశపారం పర్యంగా సంక్రమించే సమస్య కాబట్టి తల్లిదండ్రులకు ఈ సమస్య ఉందని తెలిసినప్పుడు ఎముకల దారుఢ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే వైద్యుల్ని కలిసి ఎముకల సాంద్రతను తెలిపే డెక్సా స్కాన్‌ పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్ష ద్వారా ఎముక నాణ్యత తెలుసుకోవచ్చు. ఒకవేళ ఆస్టియోపొరోసిస్‌ ఉన్నట్టు రుజువై చికిత్స తీసుకునే పక్షంలో ఆ చికిత్సకు స్పందిస్తున్నారో లేదో కూడా ఈ స్కాన్‌ ద్వారా తెలుసుకునే వీలుంది. డెక్సా స్కాన్‌ పరీక్షలో ఆస్టియోపొరోసిస్‌కు గురయిన ఎముకను ఆరోగ్యమైన ఎముకతో పోల్చిచూసి స్కోరింగ్‌ ఇవ్వటం జరుగుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆస్టియోపొరోసిస్‌ వ్యాధి నిర్ధారణ కోసం కొన్ని ప్రమాణాలను సూచించింది. వాటి సహాయంతో ఎముక నార్మల్‌గా ఉందా, ఆస్టోపీనియా అనే ఆస్టియోపొరోసిస్‌ ముందరి దశలో ఉందా, ఆస్టియోపోరోసిస్‌కు చేరుకుందా అనేది వైద్యులు నిర్థారిస్తారు. ఒకవేళ డెక్సా స్కాన్‌లో ఆక్సోపీనియా దశలో ఉన్నారని తెలిస్తే చికిత్సతో ఆస్టియోపొరోసిస్‌కు గురికాకుండా నియంత్రించవచ్చు.

చికిత్సా పద్ధతులు
ముందుగానే డెక్సా స్కాన్‌లో ఆస్టియోపొరోసిస్‌ ఉందని రుజువైన పక్షంలో ఆహారం లేదా సప్లిమెంట్స్‌ ద్వారా క్యాల్షియం తీసుకోవటం, వ్యాయామం చేయటం, విటమిన్‌ డి తీసుకోవటంలాంటివి వైద్యులు సూచిస్తారు. వీటితోపాటు ఎముక క్షీణత తగ్గించే మందులు, ఎముక నాణ్యత పెంచే మందులను కూడా చికిత్సలో భాగంగా తీసుకోవలసి ఉంటుంది. ఆస్టియోపొరోసిస్‌లో ఎముకలు గుల్లబారతాయి కాబట్టి బరువైన వ్యాయామాలు చేయటం ప్రమాదమని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది ఒట్టి అపోహ మాత్రమే! బరువులెత్తే వ్యాయామాలు చేయటం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి. అలాగే నడక, జాగింగ్‌లాంటి వ్యాయామాలు కూడా క్రమం తప్పక చేస్తూ ఉండాలి. ఒకవేళ ఆస్టియోపొరోసిస్‌ కారణంగా ఎముకలు చిట్లితే ఇందుకు ప్రత్యేక చికిత్సలున్నాయి.

వర్టిబ్రొప్లాస్టీ
గుల్లబారిన ఎముకలు విరిగినప్పుడు సర్జరీ చేసి వాటిని అతికించటం ఒక ఎత్తైతే ఎముక నాణ్యతను పెంచటం మరో ఎత్తు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఆస్టియొపొరోసిస్‌కు గురయిన వ్యక్తుల ఎముకలు అతుక్కునే సమయం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రుగ్మతతో ఎముకలు విరిగినప్పుడు వాటిని అతికించటంతోపాటు అదే సమయంలో ఎముక నాణ్యత పెంచే చికిత్సను కూడా వైద్యులు మొదలుపెడతారు. దాంతో కొంత ఆలస్యమైనా ఎముకలు చక్కగా అతుక్కోవటంతోపాటు బలంగా కూడా తయారవుతాయి. సాధారణంగా వెన్నెముక, తుంటి, మణికట్టు ఎముకలు ఆస్టియొపొరోసిస్‌కు గురవుతూ ఉంటాయి. అయితే వీటిలో వెన్నెముక ఎముకలే ఎక్కువగా చిట్లుతూ ఉంటాయి. ఇలా చిట్లినప్పుడు బెడ్‌రెస్ట్‌తోపాటు, పెయిన్‌ కిల్లర్స్‌, ఎముక బలాన్ని పెంచే మందులు వైద్యులు సూచిస్తారు. అయినా నొప్పి తగ్గకపోతే ‘వర్టిబ్రొప్లాస్టీ’ అనే చికిత్స చేయవలసి ఉంటుంది. ఈ చికిత్సలో ఒత్తుకుపోయిన ఎముకకు చిన్న రంథ్రం చేసి ఎముకను బోన్‌ సిమెంట్‌తో నింపుతారు. దాంతో ఎముక దృఢంగా తయారవుతుంది. అలాగే మణికట్టు, తుంటి ఎముకలు విరిగినప్పుడు వాటిని అతికించటం కోసం ఉపయోగించే ఇంప్లాంట్స్‌ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. సాధారణ వ్యక్తులకు ఉపయోగించే ప్లేట్స్‌, స్ర్కూల బదులుగా ఆస్టియొపొరోసిస్‌ పేషెంట్స్‌కు ఎముకల్లో రాడ్స్‌, లాకింగ్‌ ప్లేట్స్‌ అనే ప్రత్యేక ఇంప్లాంట్స్‌ అమరుస్తారు.
 
గర్భిణుల్లో ఎముకల బలహీనత ‘ఆస్టియోమలేసియా’...
సాధారణ సీ్త్రలకు రోజుకి 800 నుంచి 1200 మి.గ్రా క్యాల్షియం అవసరమైతే గర్భిణిలకు రోజుకి 12000 మి.గ్రా క్యాల్షియం అవసరమవుతుంది. ఈ మోతాదు తగ్గితే గర్భంలోని పిండం తల్లి నుంచి తనకు కావలసినంత క్యాల్షియం గ్రహించటం వల్ల గర్భిణి ఎముకలు బలహీనపడతాయి. ఈ పరిస్థితినే ఆస్టియోమలేసియా అంటారు. ఇలా జరగకుండా ఉండాలంటే క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడంతోపాటు విటమిన్‌ డి కూడా గర్భిణులు అదనంగా తీసుకుంటూ ఉండాలి.
 
పురుషుల్లో ఆస్టియోపొరోసిస్‌..
పురుషుల్లో కూడా ఎముకలు గుల్లబారతాయి. ఇందుకు వయసు పైబడటం ప్రధాన కారణమైతే పొగతాగటం, ఆల్కహాల్‌ తీసుకోవటం, వ్యాయామం చేయకపోవటంలాంటి కారణాల వల్ల వయసుతో పనిలేకుండానే పురుషుల్లో ఎముకలు గుల్లబారతాయి. ఇలాంటప్పుడు ఆహార నియమాలు పాటిస్తూ, దురలవాట్లకు దూరంగా ఉంటూ క్రమం తప్పక వ్యాయామం చేస్తూ ఉండాలి. వైద్యుల సూచన మేరకు అవసరమైన చికిత్స తీసుకోవాలి.
 

Gujarathi style butter milk

చల్లచల్లటి చాస్‌.. 

ఉష్టోగ్రతలు పెరిగేకొద్దీ శరీరం తల్లడిల్లిపోతుంది. ఎన్ని చల్లటి పానీయాలు తాగినా దప్పిక తీరదు. అలాంటప్పుడు కూల్‌డ్రింకులు, జ్యూస్‌ల జోలికి వెళ్లకూడదు. గుజరాతీ స్టయిల్‌ చాస్‌ (బటర్‌మిల్క్‌) తయారుచేసుకుని తాగితే కడుపులో చల్లగా ఉంటుంది. వేడిని తగ్గిస్తుంది.
 
కావాల్సిన పదార్థాలు: రెండు కప్పుల గడ్డ పెరుగు, జిలకర, ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, మిరియాలపొడి, అల్లంపేస్టు, బ్లాక్‌సాల్ట్‌, చక్కెర.
 
తయారుచేసే విధానం: ముందుగా రెండు టేబుల్‌ స్పూన్ల ఆయిల్‌ను పాన్‌లోకి వేసి ఆవాలు, జిలకర, కరివేపాకు వేసి పల్చగా వేయించాలి. అందులోకి కాస్త అల్లంపేస్టు, చిటికెడు బ్లాక్‌సాల్ట్‌, అరస్పూనుకంటే తక్కువ చక్కెర, పచ్చిమిర్చి పేస్టు తగినంత, అరస్పూను మిరియాలపొడి వేయాలి. కొంచెం వేగిన తరువాత దించేయాలి. బాగా చల్లారాక.. ముందుగానే చిలక్కొట్టిన పెరుగును ఇందులోకి వేసి.. చల్లటి నీళ్లు పోయాలి. మజ్జిగ పల్చగా అయ్యే వరకు కలియబెట్టి.. తాగితే రుచికి రుచి. ఆరోగ్యానికి ఆరోగ్యం. తక్షణమే వేడిని తగ్గిస్తుంది. దప్పిక తీరుతుంది.

Weight loss Indian spices

వెయిట్‌ లాస్‌ గ్యారెంటీ

బరువు తగ్గేందుకు రకరకాల పద్ధతులు ఉన్నాయి. అయితే ఇంట్లో దొరికే వంట దినుసులతోనే ఆ పని చేయొచ్చు. ఒక్కో దినుసులో ఒక్కో ప్రయోజనం ఉంది..
 
దాల్చినచెక్క: బరువును తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు లేకుండా చూస్తుంది. కొవ్వును కరిగిస్తుంది. జీర్ణక్రియల్ని చురుగ్గా ఉంచడం వల్ల అతిగా ఆకలి వేయడం కాని, ఆకలి మందగించడం కాని ఉండదు.
 
పసుపు: బరువును తగ్గించే ఔషధాలకు పెట్టింది పేరు పసుపు. ఇందులోని ఔషధాలు ఫ్యాట్‌ టిస్యూలు ఏర్పడకుండా అడ్డుకుంటాయి. నిరంతరం ఈ ప్రక్రియ జరగడం వల్ల శరీరంలో కొవ్వు పెరగదు.
 
అల్లం: శరీరాన్ని ఒక రకంగా శుభ్రపరిచే సుగుణం అల్లానికి ఉంది. జీర్ణవ్యవస్థను సక్రమంగా ఉంచడం దీని ప్రత్యేకత. ఆహారంలో తరచూ అల్లం వాడటం వల్ల అరుగుదల శక్తి పెరుగుతుంది.
 
యాలకలు: జీర్ణప్రక్రియల్ని చురుగ్గా ఉంచగలిగే దినుసుల్లో యాలకులు ముఖ్యమైనవి. ఎప్పుడైతే జీర్ణవ్యవస్థకు సమస్యలు రావో అప్పుడు చెడుకొవ్వు శరీరంలో పేరుకుపోదు.
 
రేగుట ఆకు: అత్యధిక పోషకవిలువులతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ సి, విటమిన్‌ ఎ ఇందులో ఉన్నాయి. రేగుట ఆకుకు రక్తాన్ని శుద్ధి చేసే శక్తి ఉంది.
 
ఆవాలు: మెటాబాలిక్‌ యాక్టివిటీ పెరిగేందుకు ఆవాలు ఎంతగానో తోడ్పడతాయి. భారతీయ వంటకాల్లో మసాలాలు, నూనెల వాడకం అధికంగా ఉన్నప్పటికీ.. ఆవాలు తప్పక తింటారు కనక.. కొంత ముప్పు తగ్గుతోంది.
 
జీలకర్ర: కొన్ని రకాల వంటకాల్లోకి మాత్రమే జీలకర్రను వాడుతుంటాము. అయితే దీన్ని ఇంకాస్త పెంచడం మంచిది. ప్రొడక్షన్‌ ఎనర్జీ పెరగడమే కాకుండా.. రోగనిరోధక శక్తి వృద్ధి అవుతుంది.

Pachha karpuram - uses


NewsListandDetails
పచ్చకర్పూరం
హారతి కర్పూరంలో మరికొన్ని సుగంధ ద్రవ్యాలు కలిపి ప్రత్యేకమైన పద్ధతిలో పచ్చకర్పూరాన్ని తయారు చేస్తారు. చాలా తీక్షణమైన ద్రవ్యం ఇది. ఘాటుగానూ, చిరుచేదుగానూ, రుచికరంగానూ ఉంటుంది. తీపి పదార్థాలలో, తాంబూలంలో దీన్ని కలుపుకుని తినే అలవాటు మనవారికుంది. బాగా చలవ చేస్తుంది. రక్తస్రావం అరికడుతుంది. నోటికి అన్నం హితవును కలిగిస్తుంది. కంటికి మంచిది. దగ్గు, క్షయ, ఆయాసాలను అణిచేందుకు తోడ్పడుతుంది. బుద్ధిని, తెలివితేటల్ని పెంచుతుంది. మెదడుకు ఉత్తేజం ఇస్తుంది. విషదోషాలకు మంచిది. కడుపులో పాముల్ని చంపుతుంది. కఫదోషాన్ని అరికడుతుంది. చర్మరోగాలన్నింటికి పథ్యం. మూర్చలు మాటిమాటికీ రావడం, హిస్టీరియా, మానసిక దౌర్భగ్యాలన్నింటిలో ఇది నాడీమండలాన్ని ఉత్తేజితం చేసేందుకు తోడ్పడుతుంది. దంతరోగాలకు మంచిది. దాహాన్ని తగ్గించి, జ్వరతీవ్రతను మందగింపచేస్తుంది. మోతాదు తక్కువగా వాడుకోవాలి.

For better health - vitamins


NewsListandDetails
ఆహారంలో విటమిన్లు తప్పనిసరి
విటమిన్ల గురించి పూర్తి సమాచారం తెలుసుకుంటే మనం తీసుకునే ఆహారంలో వాటినెలా తినాలో ప్లాన్‌ చేసుకోవచ్చు. వివిధ వ్యాధుల్లో ఉపయోగపడే రకరకాల విటమిన్ల సమాచారం మీకోసం...

-  విటమిన్‌ ఎ, బి2 వంటివి కంటి వ్యాధులు రాకుండా నివారిస్తుంది.
-   ఊపిరితిత్తులను సంరక్షిం చేందుకు ఉపయోగపడే విటమిన్లు ఎ, ఇ
-  పళ్ల,చిగుళ్లకు సంబంధించిన వ్యాధుల్ని ఎదుర్కొనేందుకు ఉపయోగపడేవి విటమిన్‌ సి, డి, ఎ విటమిన్‌.   జీర్ణశక్తికి ఉపయోగపడేవి విటమిన్‌ బి3, బి6
-   ఎముకల వ్యాధులు వచ్చినప్పుడు గానీ, రాకుండా నివారించేందుకు గానీ, ఉపయోగపడే చర్మవ్యాధులను నివారించేవి, ఏ వ్యాధి వచ్చినా తప్పనిసరిగా వాడవలసినవి నియాసిన్‌, విటమిన్‌ బి6, విటమిన్‌ వి.
-   రక్తవృద్ధికి తోడ్పడే విటమిన్లు ఫోలిక్‌ యాసిడ్‌ విటమిన్‌ బి3, విటమిన్‌ బి6, బి12, ఇ, కె.
-  రక్తస్రావానికి తోడ్పడేది విటమిన్‌ కె. కండరాలను బలసంపన్నం చేసేందు కు తోడ్పడే విటమిన్లు బి, బి1, బి6, ఇ.  పిల్లల పెరుగుదలకు తోడ్పడే విటమిన్లు ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ ఎ, బి 12, ఆయా పరిస్థితులకు మందులు వాడుతు న్నప్పుడు ఈ విటమిన్లు కల్గిన మందులు మీరు సరిగ్గా తెలుసుకుని వాడుకోవచ్చు.
-   మెదడు, నాడీవ్యవస్థకు సంబంధించిన శక్తిని కలిగించేందుకు ఉపయోగపడేవి, నరాల జబ్బుల్లో నివారణకు తోడ్పడేవి ఫోలిక్‌ యాసిడ్‌, పాంటో థెనిక్‌ యాసిడ్‌ బి3, పైరిడాక్సిన్‌ బి6, విటమిన్‌ సి.
-  గుండెపైన పనిచేసే వాటిలో ముఖ్యమైనవి విటమిన్‌ బి1, విటమిన్‌ ఇ. 

Pollution around us -- within walls of our home


NewsListandDetails
మనచుట్టూనే కాలుష్యం
 బయటకు వెళ్తే దుమ్మూ,ధూళి చెప్పలేనంత కాలుష్యం. అదే మన ఇంట్లో మనం ఉన్నప్పుడు ఎటువంటి కాలుష్యాలూ, రసాయనాలు మన జోలికి రానే రావు. ఇది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికీ ఉండే అభిప్రాయం. అయితే గోడల నుంచి ఫ్లోరింగ్‌ దాకా, లైట్ల నుంచి కర్టెన్ల దాకా, ఇంట్లో మనం వాడే ప్రతి వస్తువ్ఞలోనూ మన ఆరోగ్యం ముడిపడి ఉంటుంది.

మనం పీల్చేగాలి, తాగేనీరు, తినే తిండి, వాడే వ్యక్తిగత ఉత్పత్తులూ అన్నీ కొద్దికొద్దిగా టాక్సిక్‌ కెమికల్స్‌ కలిగి ఉంటుంటాయి. ఇంటిని శుభ్రంగా, అందంగా, నాగరికంగా తీర్చిదిద్దుకున్నాం కాబట్టి ఏరకంగానూ ఇబ్బంది ఉండదు అని అనుకోవడం పొరపాటు.
ఆస్తమా, ఎలర్జీలు ఉన్నవారికి ఇంట్లోనూ ఆరోగ్య సమస్యలు ఉత్పన్న మవ్ఞతుంటాయి. ఇంట్లో అనేక రకాల వాతావరణ సంబంధిత పదార్థాలు కంటికి కనిపించకుండా గాలిలో కలిసి ఉంటాయి. ఈ విషయాన్ని చాలా మంది గుర్తించకపోయినా, అంగీకరించకపోయినా ఇది నిజం.ఇల్లు మురికి గా, జిడ్డుగా, క్రిమికీటకాలతో ఉన్నప్పుడు కదా సమస్య. ఇంటిని అద్దంలా ఉంచుకున్నప్పుడు కాదు కదా అనుకుంటారు. కాని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా కొన్ని రకాల ఆరోగ్యసమస్యలకు కారణం అవుతుంటాయి. ఒక్కోగదిని పరిగణనలోని తీసుకుంటే ఎక్కడెక్కడ హాని ఉందో తెలుస్తుంది. ఎటువంటి చర్యలు అవసరమో నిర్ణయించుకోవచ్చు.
ఫ్యామిలీరూమ్‌
ఎక్కువసేపు కుటుంబ సభ్యులందరూ కలిసి గడిపే గది ఇది. అనేక రకాలుగా ఈ గదిని ఉపయోగిస్తుంటాం. అన్ని గదుల్లోనూ టెలివిజన్‌ సెట్లు ఉంటున్నా ఎక్కువ సమయం అంటే రోజుకు నాలుగు నుంచి ఆరుగంటల పాటు టెలివిజన్‌ చూసేది ఈ గదిలోనే.స్క్రీన్‌ సమీపంలో ఎక్స్‌-రే బ్యాండ్‌లో అయోనైజింగ్‌ రేడియేషన్‌ కొద్దిగా ఉంటుంది. పవర్‌ఫ్రీక్వెన్సీలు, రేడియో ఫ్రీక్వెన్సీలు, లైట్‌ ఫ్రీక్వెన్సీలు ఉంటాయి. కాబట్టి టీవిని రక్షితమైన దూరంలో కూర్చుని చూడాలి.
 ఆరోగ్యానికి ఎలక్ట్రోబయాలజీ లింక్‌ అవుతుందంటే అదేమిటో అర్థం కాదు. ఎలక్ట్రిసిటీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందనే పరిశోధనలు ఉన్నాయి. ఇ.ఎం.ఎఫ్‌ అంటే ఎలక్ట్రోమేగ్నేటిక్‌ ఫీల్డ్స్‌కు సంబంధించినది. ఎలక్ట్రోమేగ్నేటిక్‌  రేడియేషన్‌ లేదా ఇఎంఆర్‌ అనేది ఈచర్యకు ఖచ్చితమైన పదం. ఇ.ఎం.ఎఫ్‌ అనేది ఎ.సి,మాగ్నెటిక్‌ ఫీల్డ్స్‌కు సంబంధించినదైతే ఇ.ఎం.ఆర్‌.ఎ.సి.మాగ్నెటిక్‌, ఎ.సి,ఎలక్ట్రిక్‌ ఫీల్డులకు సంబంధించినది. ఈ రెండూ కూడా ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేవే.

Many uses with lemon peel...


NewsListandDetails
నిమ్మతొక్కలతో...
-  తుప్పు పట్టిన తీగల మీద బట్టలను ఆరవేసినప్పుడు లేదంటే బట్టలకు ఉన్న హుక్స్‌ తుప్పుపట్టినప్పుడు బట్టలకు తుప్పు అంటుకుంటుంది. ఆ తుప్పు మరకలు పోవాలంటే మరకల మీద నిమ్మతొక్కలతో గాని ఉప్పు కలిపిన రసంతో కాని రుద్ది ఎండలో వేయాలి.
- నిమ్మకాయ చెక్కలతో తలరుద్దుకుని వేడినీళ్లతో స్నానం చేస్తే చుండ్రుపోతుంది.
- దంతసామాగ్రి, కత్తిపిడి బొమ్మలు వంటివి పసుపు రంగుకి మారితే నిమ్మతొక్కలతో రుద్దాలి.
- రసము తీసేసిన నిమ్మతొక్కలను నానవేసిన నీళ్లతో స్నానం చేస్తే శరీరము కాంతివంతముగా ఉంటుంది. గజ్జి,తామర వంటి చీడలు, చర్మవ్యాధులు దరిచేరవు.
- నిమ్మతొక్కలని చిన్నచిన్న ముక్కలుగా చేసి అడుగంటిన పాత్రల్లో వేసి నీరుపోసి మరిగించి చల్లారాక శుభ్రంగా కడిగితే మరకలు పోతాయి.
- నిమ్మచెక్కలతో రాగి వస్తువులను శుభ్రపరచుకోవచ్చును. ఉప్పులో ముంచిన నిమ్మచెక్కతో రుద్ది, వేడినీటితో కడిగి ఆపై పొడిబట్టలతో తుడవాలి.
- రసం తీసేసిన నిమ్మచెక్కలతో డైనింగ్‌ టేబుల్‌ను తుడిస్తే జిడ్డుపోయి క్లీన్‌గా ఉంటుంది.
- అరటికాయలు తరిగాక చేతులు మరకలుగా, జిగురుగా చిరాగ్గా ఉంటాయి. అప్పుడు నిమ్మ తొక్కలతో చేతులు బాగా రుద్దుకుంటే సరిపోతుంది.
- నిమ్మతొక్కలతో రుద్దితే బట్టలపై పడిన గోరింటాకు మరకలు పోతాయి.
- రసం పిండేసిన నిమ్మతొక్కల్ని పారేయకుండా ఏదైనా జాడీలో వేసి సరిపడా ఉప్పువేసి ఉంచండి. అలా జాడీ నిండేదాకా నిమ్మతొక్కల్ని వేసి, ఆఖరికి కాసిని మెంతులు, ఆవాలుపొడి, సరిపడా కారం, ఇంగువ వేసి నూనె కాచి పోసి పోపు పెడితే నిమ్మతొక్కలతో నిమ్మపచ్చడి రెడీ.
- రసం పిండేసిన నిమ్మతొక్కలతో వాష్‌ బేసిన్‌ రుద్దితే తెల్లగా ఉంటుంది.
- కొంతమంది మోచేతులు, మోకాళ్లు బాగా నల్లగా ఉండి గరుకుగా ఉంటాయి. అలాంటి వాళ్లు నిమ్మతొక్కలతో మోచేతులను మోకాళ్లను బాగా రుద్దితే చర్మం నునుపుగా, మృదువుగా ఉంటుంది.
- నిమ్మతొక్కలతో గోళ్లను బాగా రుద్దితే,గోళ్లు అందంగా, పుచ్చిపోకుండా ఉంటాయి.

take care about your feet - for your beauty


NewsListandDetails

హస్తపాదాల వేళ్ల గోళ్లు ఎక్కువగా ఫంగల్‌ ఇన్ఫెక్షన్లకు లోనవుతుంటాయి. దీనిని వైద్యపరిభాషలో ఆనైకోమైకోసిస్‌ అంటారు ఇన్ఫెక్షన్‌ ముందుగా చిన్న సైజు తెల్లని లేదా పసుపు పచ్చని మచ్చగా మొదలవుతుంది. ఇన్ఫెక్షన్‌ లోపలకు వ్యాపించే కొద్దీ గోళ్ల రంగు మారటం, మందంగా తయారవటం, అంచులు పగుళ్లుబారి విరిగిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చేతుల గోళ్లు పాదాల గోళ్లు ముందుగా ఎదుటివారి దృష్టిలో పడతాయి కనుక ఈ సమస్యతో ఇబ్బంది ఎక్కువ. కొన్ని సందర్భాల్లో నొప్పి, అసౌకర్యం వంటివి కూడా ఉంటాయి.
ఉక్కపోత వాతావరణంలోనూ, గాలిలో నీటి తేమ ఎక్కువగా ఉండే సంద ర్భాల్లోనూ ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. పాదరక్షల లోపలచెమట పట్టడం, తడి నేలమీద నడవటం, పాత్రలను శుభ్రపర చటం, బట్టలు ఉత కటం, నీటి కుళాయి వద్ద ఎక్కువ సేపు గడపటం ఇలాంటి పనుల వల్ల గోళ్ల మీద ఫంగస్‌ పెరగడానికి అవకాశం ఏర్పడు తుంది. ఇన్ఫెక్షన్‌ ఒకసారి వచ్చిన తరువాత ఒక పట్టాన లొంగదు. పూర్తిస్థా యిలో జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. తగిన సూచనలు పాటించటం ముఖ్యం. లేకపోతే దీర్ఘవ్యాధిగా పరిణమిస్తుంది.
లక్షణాలు: ఆనైకోమైకోసిస్‌ వ్యాధిలో కొన్ని ప్రత్యేక మైన లక్షణాలు కనిపిస్తాయి. గోళ్లలో ఒకటిగాని అంతకంటే ఎక్కువగాని వ్యాధి లక్షణా లను ప్రదర్శిస్తాయి. గోళ్లు మందంగా తయారవుతాయి. బిరుసుగా మారతాయి. పగుళ్లు బారి, గరుకుగా తయారవుతాయి. గోళ్ల ఆకారం కూడా దెబ్బతింటుంది. కాంతిరహితంగా, జీవరహితంగా కనిపిస్తాయి. గోళ్ల క్రింద వ్యర్ధాలు పేరుకుపోవటం వల్ల నల్లని రంగులో మచ్చలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్‌కి గురైన గోరు ఉపరితలం (నెయిల్‌బెడ్‌) నుంచి విడిపోవచ్చు. ఇలా జరగటాన్ని ఆంకిలోసిస్‌ అంటారు. హస్తపాదాల వేళ్ల గోళ్ళలో నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపి స్తాయి. వేళ్ల నుంచి ఒక రకమైన చేపలవాసన లాంటిది వస్తుంటుంది.
కారణాలు: ఫంగై అనేవి సూక్షజీవులు. బూజు జాతికి చెందినవి. వీటి మనుగడకు వెలుతురు అవసరం ఉండదు. వీటిల్లో కొన్ని రకాలు మనకు ఉపయోగపడితే మరికొన్ని వ్యాధులను కలిగించి ఇబ్బందులకు గురిచేస్తాయి. డర్మటోఫైట్స్‌ అనే వర్గానికి చెందిన ఫంగస్‌ జాతుల వల్ల గోళ్లు వ్యాధిగ్రస్తమవుతాయి.