Pages

Monday, 27 April 2015

Weight loss Indian spices

వెయిట్‌ లాస్‌ గ్యారెంటీ

బరువు తగ్గేందుకు రకరకాల పద్ధతులు ఉన్నాయి. అయితే ఇంట్లో దొరికే వంట దినుసులతోనే ఆ పని చేయొచ్చు. ఒక్కో దినుసులో ఒక్కో ప్రయోజనం ఉంది..
 
దాల్చినచెక్క: బరువును తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు లేకుండా చూస్తుంది. కొవ్వును కరిగిస్తుంది. జీర్ణక్రియల్ని చురుగ్గా ఉంచడం వల్ల అతిగా ఆకలి వేయడం కాని, ఆకలి మందగించడం కాని ఉండదు.
 
పసుపు: బరువును తగ్గించే ఔషధాలకు పెట్టింది పేరు పసుపు. ఇందులోని ఔషధాలు ఫ్యాట్‌ టిస్యూలు ఏర్పడకుండా అడ్డుకుంటాయి. నిరంతరం ఈ ప్రక్రియ జరగడం వల్ల శరీరంలో కొవ్వు పెరగదు.
 
అల్లం: శరీరాన్ని ఒక రకంగా శుభ్రపరిచే సుగుణం అల్లానికి ఉంది. జీర్ణవ్యవస్థను సక్రమంగా ఉంచడం దీని ప్రత్యేకత. ఆహారంలో తరచూ అల్లం వాడటం వల్ల అరుగుదల శక్తి పెరుగుతుంది.
 
యాలకలు: జీర్ణప్రక్రియల్ని చురుగ్గా ఉంచగలిగే దినుసుల్లో యాలకులు ముఖ్యమైనవి. ఎప్పుడైతే జీర్ణవ్యవస్థకు సమస్యలు రావో అప్పుడు చెడుకొవ్వు శరీరంలో పేరుకుపోదు.
 
రేగుట ఆకు: అత్యధిక పోషకవిలువులతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ సి, విటమిన్‌ ఎ ఇందులో ఉన్నాయి. రేగుట ఆకుకు రక్తాన్ని శుద్ధి చేసే శక్తి ఉంది.
 
ఆవాలు: మెటాబాలిక్‌ యాక్టివిటీ పెరిగేందుకు ఆవాలు ఎంతగానో తోడ్పడతాయి. భారతీయ వంటకాల్లో మసాలాలు, నూనెల వాడకం అధికంగా ఉన్నప్పటికీ.. ఆవాలు తప్పక తింటారు కనక.. కొంత ముప్పు తగ్గుతోంది.
 
జీలకర్ర: కొన్ని రకాల వంటకాల్లోకి మాత్రమే జీలకర్రను వాడుతుంటాము. అయితే దీన్ని ఇంకాస్త పెంచడం మంచిది. ప్రొడక్షన్‌ ఎనర్జీ పెరగడమే కాకుండా.. రోగనిరోధక శక్తి వృద్ధి అవుతుంది.

No comments:

Post a Comment