మనచుట్టూనే కాలుష్యం
బయటకు వెళ్తే దుమ్మూ,ధూళి చెప్పలేనంత కాలుష్యం. అదే మన ఇంట్లో మనం ఉన్నప్పుడు ఎటువంటి కాలుష్యాలూ, రసాయనాలు మన జోలికి రానే రావు. ఇది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికీ ఉండే అభిప్రాయం. అయితే గోడల నుంచి ఫ్లోరింగ్ దాకా, లైట్ల నుంచి కర్టెన్ల దాకా, ఇంట్లో మనం వాడే ప్రతి వస్తువ్ఞలోనూ మన ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. మనం పీల్చేగాలి, తాగేనీరు, తినే తిండి, వాడే వ్యక్తిగత ఉత్పత్తులూ అన్నీ కొద్దికొద్దిగా టాక్సిక్ కెమికల్స్ కలిగి ఉంటుంటాయి. ఇంటిని శుభ్రంగా, అందంగా, నాగరికంగా తీర్చిదిద్దుకున్నాం కాబట్టి ఏరకంగానూ ఇబ్బంది ఉండదు అని అనుకోవడం పొరపాటు. ఆస్తమా, ఎలర్జీలు ఉన్నవారికి ఇంట్లోనూ ఆరోగ్య సమస్యలు ఉత్పన్న మవ్ఞతుంటాయి. ఇంట్లో అనేక రకాల వాతావరణ సంబంధిత పదార్థాలు కంటికి కనిపించకుండా గాలిలో కలిసి ఉంటాయి. ఈ విషయాన్ని చాలా మంది గుర్తించకపోయినా, అంగీకరించకపోయినా ఇది నిజం.ఇల్లు మురికి గా, జిడ్డుగా, క్రిమికీటకాలతో ఉన్నప్పుడు కదా సమస్య. ఇంటిని అద్దంలా ఉంచుకున్నప్పుడు కాదు కదా అనుకుంటారు. కాని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా కొన్ని రకాల ఆరోగ్యసమస్యలకు కారణం అవుతుంటాయి. ఒక్కోగదిని పరిగణనలోని తీసుకుంటే ఎక్కడెక్కడ హాని ఉందో తెలుస్తుంది. ఎటువంటి చర్యలు అవసరమో నిర్ణయించుకోవచ్చు. ఫ్యామిలీరూమ్ ఎక్కువసేపు కుటుంబ సభ్యులందరూ కలిసి గడిపే గది ఇది. అనేక రకాలుగా ఈ గదిని ఉపయోగిస్తుంటాం. అన్ని గదుల్లోనూ టెలివిజన్ సెట్లు ఉంటున్నా ఎక్కువ సమయం అంటే రోజుకు నాలుగు నుంచి ఆరుగంటల పాటు టెలివిజన్ చూసేది ఈ గదిలోనే.స్క్రీన్ సమీపంలో ఎక్స్-రే బ్యాండ్‌లో అయోనైజింగ్ రేడియేషన్ కొద్దిగా ఉంటుంది. పవర్‌ఫ్రీక్వెన్సీలు, రేడియో ఫ్రీక్వెన్సీలు, లైట్ ఫ్రీక్వెన్సీలు ఉంటాయి. కాబట్టి టీవిని రక్షితమైన దూరంలో కూర్చుని చూడాలి. ఆరోగ్యానికి ఎలక్ట్రోబయాలజీ లింక్ అవుతుందంటే అదేమిటో అర్థం కాదు. ఎలక్ట్రిసిటీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందనే పరిశోధనలు ఉన్నాయి. ఇ.ఎం.ఎఫ్ అంటే ఎలక్ట్రోమేగ్నేటిక్ ఫీల్డ్స్‌కు సంబంధించినది. ఎలక్ట్రోమేగ్నేటిక్ రేడియేషన్ లేదా ఇఎంఆర్ అనేది ఈచర్యకు ఖచ్చితమైన పదం. ఇ.ఎం.ఎఫ్ అనేది ఎ.సి,మాగ్నెటిక్ ఫీల్డ్స్‌కు సంబంధించినదైతే ఇ.ఎం.ఆర్.ఎ.సి.మాగ్నెటిక్, ఎ.సి,ఎలక్ట్రిక్ ఫీల్డులకు సంబంధించినది. ఈ రెండూ కూడా ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేవే. |
Pages
▼
No comments:
Post a Comment