పచ్చకర్పూరం
హారతి కర్పూరంలో మరికొన్ని సుగంధ ద్రవ్యాలు కలిపి ప్రత్యేకమైన పద్ధతిలో పచ్చకర్పూరాన్ని తయారు చేస్తారు. చాలా తీక్షణమైన ద్రవ్యం ఇది. ఘాటుగానూ, చిరుచేదుగానూ, రుచికరంగానూ ఉంటుంది. తీపి పదార్థాలలో, తాంబూలంలో దీన్ని కలుపుకుని తినే అలవాటు మనవారికుంది. బాగా చలవ చేస్తుంది. రక్తస్రావం అరికడుతుంది. నోటికి అన్నం హితవును కలిగిస్తుంది. కంటికి మంచిది. దగ్గు, క్షయ, ఆయాసాలను అణిచేందుకు తోడ్పడుతుంది. బుద్ధిని, తెలివితేటల్ని పెంచుతుంది. మెదడుకు ఉత్తేజం ఇస్తుంది. విషదోషాలకు మంచిది. కడుపులో పాముల్ని చంపుతుంది. కఫదోషాన్ని అరికడుతుంది. చర్మరోగాలన్నింటికి పథ్యం. మూర్చలు మాటిమాటికీ రావడం, హిస్టీరియా, మానసిక దౌర్భగ్యాలన్నింటిలో ఇది నాడీమండలాన్ని ఉత్తేజితం చేసేందుకు తోడ్పడుతుంది. దంతరోగాలకు మంచిది. దాహాన్ని తగ్గించి, జ్వరతీవ్రతను మందగింపచేస్తుంది. మోతాదు తక్కువగా వాడుకోవాలి. |
Pages
▼
No comments:
Post a Comment