Pages

Monday, 2 February 2015

Madam Cury...

మేరీ క్యూరీ

రేడియమ్‌ను కనుగొన్న మేరీ క్యూరీ స్వదేశం పోలాండ్. ఆమె ఫ్రాన్స్‌లో తన పరిశోధనలు కొనసాగించింది. ఆమె భర్త పియర్రీ ఫ్రాన్సు దేశానికి చెందినవాడు. పారిస్‌లోని ఎడారి ప్రాంతంలో ఆమె రేడియంను తవ్వి వెలికి తీసింది. ఆమె పరిశోధనలు చేస్తున్న సమయంలో పారిస్ ప్రాంతంలో కరవు ఏర్పడింది. ఆయినా మేరీ క్యూరీ పరిశోధనలు కొనసాగాయి. 1898లో మేరీ క్యూరీ రేడియమ్‌ను ఉత్పత్తి చేసే పద్ధతిని పూర్తిగావించింది. రేడియంతోపాటు మరో రేడియో యాక్టివ్ పదార్ధాన్ని కూడా మేరీ క్యూరీ కనుగొంది. దీనికి తన స్వదేశం పేరు వచ్చేలా పొలోనియమ్ అని నామకరణం చేసింది. 1934లో మేరీ క్యూరీ లుకేమియా వ్యాధితో మరణించింది. అణ్వస్త్ర తయారీలో మొదట్లో రేడియమ్, పొలోనియమ్‌లను ఉపయోగించేవారు.

Sunday, 1 February 2015

Brain in Spines..

వెన్నులో చిన్న మెదడు

ఏ పని చేయాలన్నా.. తినాలన్నా.. నడవాలన్నా.. చదవాలన్నా.. నిద్రపోవాలన్నా.. మెదడే కీలకం! ఆ మెదడే మన శరీరాన్ని నియంత్రిస్తుంటుంది. మరి మన శరీరాన్ని నడిపించే.. నియంత్రించే.. సమతుల్యంగా ఉంచే ఓ ‘మినీ-బ్రెయిన్‌’ వ్యవస్థ మనశరీరంలో ఉంది తెలుసా? అదేదో కాదు.. మనం నిటారుగా నిలవడానికి వెన్ను ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఆ వెన్నులో ఉండే కొన్ని న్యూరాన్ల (నాడుల) వ్యవస్థే ఈ మినీ బ్రెయిన్‌ అన్నమాట! మనకు తెలియకుండా జరిగిన పరిణామాలు, హఠాత్పరిణామాల్లో మన శరీరాన్ని నియంత్రించే ఆ నాడుల వ్యవస్థేనని అమెరికాలోని సాల్క్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బయాలాజికల్‌ స్టడీస్‌ పరిశోధకులు వెల్లడించారు. ఎలుకల్లో చేసిన అధ్యయనం ఆధారంగా వారు దీనిని వివరించారు. మెదడు నుంచి వచ్చే సమాచారాన్ని, శరీరంలోని అవయవాల నుంచి వచ్చే సమాచారాన్ని క్రోఢీకరించడంలో వెన్నుపూస నియంత్రిత కేంద్రంగా పనిచేస్తుందని వివరించారు. మనం నిలబడినప్పుడు లేదా నడిచినపుడు మన మడమల్లో ఉండే సెన్సర్లు.. లోలోపల జరిగే ఒత్తిడి, స్పర్శ మార్పులను గుర్తించి వెన్నుకు పంపిస్తాయని.. ఆ తర్వాత సిగ్నళ్లు మెదడుకు వెళ్తాయని వివరించారు. ఈ ముందడుగు.. భవిష్యత్తులో తీవ్రమైన వెన్ను గాయాలు, వ్యాధులకు చికిత్సను గుర్తించేందుకు ఎంతో దోహదపడుతుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

How to prepare Balanced slim diet

తక్కువ క్యాలరీల ఆహారం ఇలా చేయండి

మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు పెరగకుండా ఉండాలన్నా తక్కువ కాలరీలున్న ఆహారాన్ని తీసుకోవాలి. తక్కువ కాలరీలతో ఎక్కువ పోషకాలను అందించే ఆహారాన్ని తయారుచేసుకునేందుకు న్యూట్రిషనిస్టులు కొన్ని సూచనలు చేశారు. అవేంటంటే...
 స్మార్ట్‌ కుకింగ్‌ అలవాటు చేసుకోవాలి. మీ ఆహారాన్ని గ్రిల్‌ చేయటం, ఉడకబెట్టడం, బేక్‌ చేయటం చాలా మంచిది. నాన్‌స్టిక్‌ తవా, పాన్‌లో ఆహారాన్ని తయారు చేసుకోండి. అలాంటి ఆహారం తినటం వల్ల తక్కువ క్యాలరీలతో పాటు ఆరోగ్యం కూడా.
 కాలీఫ్లవర్‌, మిరియాలు, తోటకూరలు, బీరకాయల్లాంటి పదార్థాల్లో విటమిన్లు, మినరల్స్‌, యాంటీఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు ఇవన్నీ లో క్యాలరీ పదార్థాలు.
 ప్రొటీన్‌ ఆహారాన్ని తీసుకుంటేనే సంతృప్తిగా ఉంటుంది. అందుకే ప్రొటీన్లు ఎక్కువగా ఉండే చేపలు, చికెన్‌, సోయా లాంటివి తింటే బావుంటుంది.
 జొన్నలు, రాగులు, గోధుమలతో చేసిన రొట్టెలు తినాలి, ఓట్స్‌, బార్లీ, డ్రై ఫ్రూట్స్‌, అవిసె గింజల్లో పీచు పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది.
 వంటనూనెల్ని నెలకోసారి మారుస్తుండాలి. రైస్‌బ్రాన్‌, ఆవ నూనెల్ని వాడుతుండాలి.
 పళ్లు, కూరగాయల ముక్కలు ఆహారంలో ఎక్కువగా చేర్చాలి. అన్నం, కూర దాదాపుగా సరిసమానంగా ఉండాలి. అంటే కూర ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి.
 స్నాక్స్‌ టైంలో నూనెతో తయారైన సమోసాలు, బజ్జీల్లాంటి వాటికి దూరంగా ఉండాలి.
 టీలు, కాఫీలు తాగే రోజులో ఒకటి రెండుసార్లకంటే ఎక్కువగా తాగకూడదు.

Orange.....better fruit for health

కమలా పండే బెటర్‌

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అలాగే కమలాపండు జ్యూసు చేసే మేలు ఏదీ చేయదంటున్నారు శాస్త్రవేత్తలు. ఆ రసంలోని యాంటాక్సిడెంట్‌ యాక్టివిటీని పరిశీలించిన అధ్యయనకారులు అందులో యాంటాక్సిడెంట్‌ యాక్టివిటీ బాగా ఉండడాన్ని వెల్లడించారు. ఈ స్టడీని యూనివర్సిటీ ఆఫ్‌ గ్రెనడా శాస్త్రవేత్తలు చేశారు. పెద్దప్రేగు ఆరోగ్యంగా ఉండడానికి ఇందులోని యాంటాక్సిడెంట్లు ఎంతగానో ఉపయోగపడతాయని వారు తెలిపారు. గ్రెనడా యూనివర్సిటీకి చెందిన జోస్‌ యాంజిల్‌ రఫ్లాన్‌ హెన్‌రెస్‌ బృందం ‘గ్లోబల్‌ యాంటాక్సిడెంట్‌ రెస్పాన్స్‌’ అనే టెక్నిక్‌ని కనుగొన్నారు. ఇందులో గాసో్ట్రఇంటస్టైనల్‌ డైజిషన్‌కు సంబంధించిన ఇన్‌ విట్రో సిమ్యులేషన్‌ కూడా ఉంది. దీన్నిబట్టి కమలాపండు జ్యూసులో ఉన్న యాంటాక్సిడెంట్‌ యాక్టివిటీ తొలుత ఊహించినదాని కన్నా కూడా పది రెట్లు ఎక్కువ ఉందని తేలింది. కమలాపండే కాదు అన్ని రకాల జ్యూసుల్లో, ఫుడ్స్‌లో ఉండే యాంటాక్సిడెంట్‌ విలువను ఈ పద్ధతి ద్వారా కనుక్కోవచ్చు. డైటీషియన్స్‌ కూడా తమ దగ్గరకు వచ్చేవారికి వారు తీసుకునే ఆహారంలో యాంటాక్సిడెంట్స్‌ విలువలు ఎంత ఉన్నాయో ఈ టెక్నిక్‌ సహాయంతో నిర్థారించి చెప్పవచ్చు.

thyroid symtoms

ఈ లక్షణాలు ఉంటే.. థైరాయిడ్‌ కావచ్చు

తలనొప్పి, కడుపులో ఇబ్బందిగా అనిపించడం, నీరసం... ఇలాంటి లక్షణాలు రోజూ ఉంటున్నాయా? పని ఒత్తిడి మూలంగా ఇవన్నీ వస్తున్నాయని తేలిగ్గా తీసిపారేయకండి. ఈ లక్షణాలు థైరాయిడ్‌ సమస్యకు సంకేతాలు కావచ్చు. ఒకవేళ మీలో అలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? చెక్‌ చేసుకోండి.
నీరసం : పని చేయకపోయినా రోజూ మధ్యాహ్నం వేళ నీరసంగా ఉంటోందా? అయితే అనుమానించాల్సిందే. థైరాయిడ్‌ సమస్య ఉన్న వారిలో కనిపించే ప్రధాన లక్షణం నీరసం.
జీర్ణసమస్యలు : డయేరియా లేక మలబద్ధకం థైరాయిడ్‌లో కనిపించే మరో లక్షణం. కడుపు ఉబ్బరం కూడా ఉంటుంది.
బరువులో తేడా : థైరాయిడ్‌ గ్రంధి జీవక్రియలను నియంత్రిస్తుంది. బరువు తగ్గుతున్నట్లయితే హైపర్‌థైరాయిడిజం, బరువు పెరుగుతున్నట్లయితే హైపోథైరాయిడిజంగా భావించాలి. మెటబాలిజం లెవెల్స్‌ పెరగడం, తగ్గడం వల్ల ఇలా జరుగుతుంది.
శ్వాసకోశ సమస్యలు : సోయా, నట్స్‌, క్యాబేజి వంటి ఆహారపదార్థాలు థైరాయిడ్‌ పనితీరును తగ్గిస్తాయి. ఈసారి మీరు ఇవి తిన్నప్పుడు శ్వాస సమస్యలు తలెత్తినట్లయితే ఒకసారి చెక్‌ చేయించుకోండి.
డిప్రెషన్‌ : శరీర పనితీరుపైనే కాకుండా మానసిక పనితీరుపై కూడా హార్మోన్ల ప్రభావం ఉంటుంది. ఎటువంటి కారణం లేకుండా మూడ్‌ బాగా లేదని అంటున్నారంటే థైరాయిడ్‌ గురించి ఆలోచించాల్సిందే.
గాయిటర్‌ : థైరాయిడ్‌ గ్రంధి పెరగటాన్ని గాయిటర్‌ అంటారు. ఎటువంటి చికిత్స తీసుకోని వారిలో థైరాయిడ్‌ గ్రంధి బాగా పెరిగి గొంతు దగ్గర స్పష్టంగా వాపు కనిపిస్తుంది.
హార్ట్‌రేట్‌ : ఉద్వేగభరితమైన సంఘటనలు ఏమీ లేకపోయినా హార్ట్‌బీట్‌ పెరిగిపోతుంటే కనుక థైరాయిడ్‌ సమస్య ఉందేమో చెక్‌ చేసుకోవాలి.
ఆకలి లేకపోవడం : థైరాయిడ్‌ సమస్య ప్రారంభదశలో కనిపించే లక్షణం ఆకలి లేకపోవడం. బరువు తగ్గుతున్నా, పెరుగుతున్నా ఏమీ తినాలనిపించదు. ఆకలి లేకుండా పోతుంది. ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే థైరాయిడ్‌ చెకప్‌ చేసుకుని సందేహాలను నివృత్తి చేసుకోవడం ఉత్తమం.