Pages

Sunday, 1 February 2015

Brain in Spines..

వెన్నులో చిన్న మెదడు

ఏ పని చేయాలన్నా.. తినాలన్నా.. నడవాలన్నా.. చదవాలన్నా.. నిద్రపోవాలన్నా.. మెదడే కీలకం! ఆ మెదడే మన శరీరాన్ని నియంత్రిస్తుంటుంది. మరి మన శరీరాన్ని నడిపించే.. నియంత్రించే.. సమతుల్యంగా ఉంచే ఓ ‘మినీ-బ్రెయిన్‌’ వ్యవస్థ మనశరీరంలో ఉంది తెలుసా? అదేదో కాదు.. మనం నిటారుగా నిలవడానికి వెన్ను ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఆ వెన్నులో ఉండే కొన్ని న్యూరాన్ల (నాడుల) వ్యవస్థే ఈ మినీ బ్రెయిన్‌ అన్నమాట! మనకు తెలియకుండా జరిగిన పరిణామాలు, హఠాత్పరిణామాల్లో మన శరీరాన్ని నియంత్రించే ఆ నాడుల వ్యవస్థేనని అమెరికాలోని సాల్క్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బయాలాజికల్‌ స్టడీస్‌ పరిశోధకులు వెల్లడించారు. ఎలుకల్లో చేసిన అధ్యయనం ఆధారంగా వారు దీనిని వివరించారు. మెదడు నుంచి వచ్చే సమాచారాన్ని, శరీరంలోని అవయవాల నుంచి వచ్చే సమాచారాన్ని క్రోఢీకరించడంలో వెన్నుపూస నియంత్రిత కేంద్రంగా పనిచేస్తుందని వివరించారు. మనం నిలబడినప్పుడు లేదా నడిచినపుడు మన మడమల్లో ఉండే సెన్సర్లు.. లోలోపల జరిగే ఒత్తిడి, స్పర్శ మార్పులను గుర్తించి వెన్నుకు పంపిస్తాయని.. ఆ తర్వాత సిగ్నళ్లు మెదడుకు వెళ్తాయని వివరించారు. ఈ ముందడుగు.. భవిష్యత్తులో తీవ్రమైన వెన్ను గాయాలు, వ్యాధులకు చికిత్సను గుర్తించేందుకు ఎంతో దోహదపడుతుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment